Latest Updates
-
కండలను ఉక్కును మార్చే రాగితో హెల్తీ బన్ దోశ.. బరువు తగ్గాలంటే పక్కా తినాల్సిందే.! -
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.!
సామాజిక మాధ్యమాల్లో కనపడే మహాత్మా గాంధీ నకిలీ చిత్రాలు ఇవే !
సోషియల్ మీడియాలో కనబడే మహాత్మా గాంధీ నకిలీ చిత్రాలు
" అంతర్జాలంలో కనపడే ప్రతి చిత్రం ప్రక్కన కొన్ని వ్యాఖ్యలు ఉటంకించి ఉంటాయి. అంత మాత్రం చేత వాటన్నింటిని నమ్మకండి. " ఈ వ్యాఖ్యలను ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన అబ్రహం లింకన్ చెప్పారు.

పైన చెప్పబడిన వ్యాఖ్యలు అంతర్జాలంలో కనపడే చాలా విషయాలకు వర్తిస్తాయి. మనం అక్కడ చూసే ప్రతి విషయం నిజమని నమ్మనవసరం లేదు. ఉదాహరణకు, మహాత్మా గాంధీజీ గురించి కొన్ని విషయాలను నిజమని, ప్రజలను భ్రమింపచేయడానికి కొన్ని ప్రసిద్ధి చెందిన చిత్రాలను తరచుగా కొంతమంది అంతర్జాలం లో పెడుతుంటారు. కానీ ఆ చిత్రాలన్నీ నిజమని అనిపించేలా ఉంటాయి, కానీ నిజం కాదు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రకృతి విపత్తులు సంభవిస్తున్న సమయంలో తీసిన అమేజింగ్ ఫోటోస్..!!
ఈ చిత్రాల వెనుక దాగి ఉన్న అసలు రహస్యం ఏమిటంటే, ఎవరో కావాలనే ఆ చిత్రాలను వారి నైపుణ్యాన్ని ఉపయోగించి మార్చరు. అంతే కాకుండా చాలా మంది నటులు సాధకరూపమైన చిత్రాలలో నటిస్తున్న చిత్రాలను తీసుకువచ్చి అంతర్జాలంలో పెట్టేస్తుంటారు.

గాంధీ నాట్యమాడుతున్నట్లు కనపడే నకిలీ చిత్రం :
ఈ చిత్రం చూడటానికి ఎంతో నిజమైనదిగా అనిపిస్తుంది. కానీ ఆ చిత్రాన్ని కొద్దిగా తరచి నెమ్మదిగా చూస్తే అసలు విషయం బయటపడుతుంది. ఆ చిత్రంలో నాట్యం చేస్తూ కాళ్లు కదుపుతున్నది గాంధీ కాదు అని మనకు స్పష్టంగా అర్ధమవుతుంది.
ఆ చిత్రం తప్పు అని నిరూపించే రెండు విషయాలు ఏమిటంటే:
1 . ఆ చిత్రం లో ఉన్న మనిషి చెయ్యి కండలు తిరిగి ఉంటుంది.
2 . ఆ చిత్రంలో ఆ మనిషి వేసుకున్న పాదరక్షలు, గాంధీజీ వేసుకునే వాటికి పూర్తి భిన్నంగా ఉంటాయి.

నాథురాం గాడ్సే, మహాత్మా గాంధీని హత్య చేయు చిత్రం :
ఈ చిత్రం చూసిన వెంటనే ఎవ్వరికైనా అనుమానంతో పాటు ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే, గాంధీజీ హత్యచేయబడిన ఆ గందరగోళంలో అంత స్పష్టమైన చిత్రాన్ని ఎవరు, ఎలా అంత ఖచ్చితంగా తీయగలిగారు అని అనిపించకమానదు. మనకు కనపడే ఆ చిత్రం " 9 అవర్స్ టు రామ " అనే సినిమా లోనిది. ఈ సినిమాలో గాడ్సే పాత్రలో జెర్మనీ దేశానికి చెందిన హోర్స్ట్ బచ్చోల్స్ అనే నటుడు నటించాడు.

విదేశీ మహిళ కు గాంధీ జీ ముక్కు రాయడం :
ఈ చిత్రాన్ని ఫోటోషాప్ ఉపయోగించి మార్పులు చేయడం జరిగింది. ఆ మార్పు చేసిన విధానం ఆశ్చర్యానికి లోను చేస్తుంది. ఎందుకంటే, ఆ చిత్రాన్ని చూసిన ఎవ్వరైనా అది నిజమైన చిత్రం అని నమ్మేలా ఉంటుంది. కానీ నిజమైన చిత్రాన్ని గనుక మనం చూస్తే, గాంధీ నెహ్రూతో మాట్లాడే సందర్భం అది. కానీ ఫోటోషాప్ ను ఉపయోగించి గాంధీ, విదేశీ మహిళతో మాట్లాడుతున్నట్లు మార్పులు చేసి తప్పుదోవ పట్టిస్తున్నారు.

మొదటి నకిలీ వ్యాఖ్య :
" మొదట నిన్ను విస్మరిస్తారు, ఆ తర్వాత నిన్ను చూసి నవ్వుతారు, ఆ తర్వాత నీతో కొట్లాటకు దిగుతారు, ఆ తర్వాత నీ పై గెలుస్తారు . " ఇది వినడానికి ఎంతో బాగుంటుంది, ఇందులో ఎంతో అర్ధం కూడా ఉంది. కానీ ఇది గాంధీజీ చెప్పినది కాదు, అయినప్పటికీ ఆయనే చెప్పారని ప్రచారంలో ఉంది. ఈ వ్యాఖ్యలు గాంధీజీ చెప్పబడినట్లు చరిత్రలో ఎక్కడ లిఖించబడలేదు . కానీ 1918 లో అమెరికా వాణిజ్య సమావేశాలను ఉద్దేశించి మాట్లాడుతున్న సమయంలో నికోలస్ క్లీన్ అనే వ్యక్తి చెప్పిన వ్యాఖ్యలు పైన చెప్పిన వ్యాఖ్యలకు దగ్గరగా ఉంటాయి.

రెండవ నకిలీ వ్యాఖ్య :
ఓ ముఖా ముఖి సమావేశం లో, పాత్రికేయుడు " పాశ్చాత్య నాగరికత గురించి మీరు ఏమంటారు ? " అని గాంధీజీ ని అడగగా, అందుకు గాంధీ " నాకు తెలిసి అది చాలా మంచి విధానం " అని బదులు ఇచ్చినట్లు ప్రచారంలో ఉంది. కానీ గాంధీజీ ఇలా చెప్పినట్లు ఖచ్చితమైన ఆధారం ఎక్కడా లేదు. మహాత్ముడు ఇలా చేసారు అనే వ్యాఖ్యలు ఆయన మరణించిన 20 సంవత్సరాల తర్వాత బయటికి వచ్చాయి. అది కూడా ఎవరో పరోక్షంగా చెప్పిన సమాచారం ఆధారంగా ఈ వ్యాఖ్యలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. అమెరికాకు చెందిన ప్రముఖ ఛానల్ లో వచ్చిన సాధకరూపమైన చిత్రంలో ఈ విషయాలు చూపించబడ్డాయని సీటెల్ టైమ్స్ న్యూస్ పేపర్ ప్రచురించింది. ఆ తర్వాత ఎన్నో సార్లు ఇదే విషయాన్ని అలానే ప్రచురించి, ప్రచారం చేయసాగారు కానీ గాంధీజీ అలా చెప్పినట్లు ఒక నిర్దిష్టమైన, ఖచ్చితమైన ఆధారం ఎక్కడా దొరకలేదు.



Click it and Unblock the Notifications