For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రకృతి విపత్తులు సంభవిస్తున్న సమయంలో తీసిన అమేజింగ్ ఫోటోస్..!!

By Swathi
|

ప్రకృతి విపత్తులు జరగకుండా.. ఆపడం ఎవరి తరమూ కాదు. ఈ భూమ్మీద ఎదురవుతున్న విపత్తులకు మనం చేసిన తప్పులే ముఖ్యకారణాలని మనకు తెలుసు. కానీ.. ఇప్పుడు ఆ తప్పులను సరిదిద్దుకోలేం. అయితే.. ప్రకృతి వైపరిత్యాలు జరిగేటప్పుడు పరిస్థితులు ఎంత భయంకరంగా మారుతాయో తెలిస్తే.. ఇకపై అలాంటి తప్పులు చేయకుండా అయినా జాగ్రత్త పడవచ్చు.

గతంలో సంభవించిన అత్యంత దారుణమైన ప్రకృతి విపత్తులు

ప్రకృతి విపత్తులు జరుగున్న క్షణంలోని తీసిన ఫోటోలు చాలా ఆశ్చర్యకరంగా, ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. సరిగ్గా సహజ విపత్తులు చోటు చేసుకుంటున్న సమయంలోనే ఫోటోలు తీయడం విషయం. అవి ఎలా ఉన్నాయంటే.. అచ్చం మన కళ్ల ముందు న్యాచురల్ డిజాస్టర్ జరుగుతుందని తెలిపేలా ఉన్నాయి.

ఇండియాను భయపెట్టిన అత్యంత భయంకరమైన సంఘటనలు

కొన్ని ఫోటోలు చూస్తే.. వావ్ అనిపించేలా ఉంటే.. మరికొన్ని.. చాలా భయంకర సన్నివేశాలను చూపిస్తాయి. మరికొన్ని దేవుడా.. ఆ సమయంలో అక్కడ మనం ఉంటే అంతే సంగతి అనిపించేలా ఉంటాయి. మరి న్యాచురల్ డిజాస్టర్ జరుగుతున్నప్పుడు తీసిన ఫోటోలను మీకూ చూడాలని ఆసక్తిగా ఉంది కదూ..

దీవుల్లో వాల్కనో

దీవుల్లో వాల్కనో

2010లో దీవుల్లో సంభవించిన వాల్కనో ఇది. లావా, మేఘాలు, రాళ్లు అన్నీ ఒకేసారి మెరుస్తుండగా తీసిన ఫోటో ఇది. దీన్ని హాలిడే ట్రావెలర్స్.. ఎయిర్ లైన్స్ నుంచి తీశారు.

Image Courtesy

క్యాలిఫోర్నియా హైవే

క్యాలిఫోర్నియా హైవే

క్యాలిఫోర్నియాలోని సౌత్ బాండ్ లేన్ హైవే.. 2011 మార్చ్ 17న ఇలా చీలిపోయింది. రోడ్ పై ఇలా పెద్ద గుంత పడటానికి కారణమైంది. లక్కీగా.. ఈ సమయంలో ఈ రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఇలా హైవేపై ప్రకృతి క్రియేట్ చేసిన భీభత్సానికి రోడ్ పై ప్రయాణాలకు ఆటంకం ఏర్పడింది.

Image Courtesy

సముద్రంలోకి పొంగుతున్న లావా

సముద్రంలోకి పొంగుతున్న లావా

పోట్లాండ్ లో ఒక నది నుంచి లావా పొంగుతూ వస్తూ.. సముద్రంలో కలుస్తున్న చిత్రం ఇది. గత కొన్నేళ్లుగా.. వాల్కనోలను.. క్యాప్చర్ చేస్తూ వచ్చిన వ్యక్తి.. ఇప్పుడు ఇలా సముద్రంలోకి వెళ్తున్న రెడ్ హాట్ లావాని తన కెమెరాలో బంధించాడు.

Image Courtesy

సముద్రంలోపలి నుంచి పొంగుతున్న వాల్కనో

సముద్రంలోపలి నుంచి పొంగుతున్న వాల్కనో

టోంగా సముద్రగర్భం నుంచి వాల్కనో 2009 మార్చి 16న జరిగింది. ఇది హుంగా టోంగా అనే దీవుల దగ్గర జరిగింది. ఇది జరిగిన 4 రోజులకు పెద్ద భూకంపం వచ్చినప్పుడు రిపోర్ట్స్ చెబుతున్నాయి.

Image Courtesy

సునామీ నుంచి పారిపోతున్న ఫోటో

సునామీ నుంచి పారిపోతున్న ఫోటో

ఈ ఫోటో చూస్తుంటేనే.. వెన్నులో వణుకు పుడుతోంది కదూ. సినిమాల్లో ఫోటో లా ఉంది. కానీ.. ఇది నిజమైనది. సునామీ నుంచి తప్పించుకోవడానికి మనుషులంతా పరుగుపెడుతున్నారు. 14 దేశాల్లో వచ్చిన ఈ సునామీలో 2 లక్షల 30 వేల మంది చనిపోయారు. ఈ ఫోటో ఇండినేషియాలోని సునామీది.

Image Courtesy

జమ్మూ నదిలో వర్షం

జమ్మూ నదిలో వర్షం

12 మంది కంటే ఎక్కువ మంది.. ఇలా నిర్విరామంగా పడిన వర్షంలో చనిపోయారు. ఇది ఉత్తరాఖండ్ లో సంభవించింది. వర్షాకాలంలో నిర్విరామంగా పడిన వర్షం పడుతున్నప్పుడు జమ్ము నది దగ్గర తీసిన ఫోటో ఇది. 2006లో ఈ వరదలు వచ్చాయి.

Image Courtesy

డబుల్ సైక్లోన్

డబుల్ సైక్లోన్

2010 లో దీవుల్లో సంభవించిన సైక్లోన్ ని.. ఏరియల్ వ్యూ ద్వారా ఫోటో తీశారు. ఇది ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందనేది.. ఈ ఫోటోనే చూపిస్తోంది.

Image Courtesy

English summary

Amazing Photos Of Natural Disasters

Amazing Photos Of Natural Disasters. Natural calamities are something that no man can stop from occuring. Now there's very less time for us to undo our mistakes in order to save mother Earth.
Story first published:Friday, July 8, 2016, 16:46 [IST]
Desktop Bottom Promotion