For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  మూడు రోజుల పాటు చిక్కుకున్న అమ్మాయి చివరి క్షణాలు గురించి తెలిస్తే కన్నీరు ఆగదు

  By R Vishnu Vardhan Reddy
  |

  అగ్నిపర్వత శిధిలాల్లో నడుము భాగం నుండి క్రింది వరకు చిక్కుకున్న ఓ పన్నెండు సంవత్సరాల అమ్మాయి నిజ జీవిత కథ ఇది. ఆమె చిక్కుకున్న కూడా అరవై గంటల పాటు బ్రతికి ఉన్నింది, నిశ్శబ్దంగా అలానే ఉండిపోయింది. ఆమెను కాపాడటానికి శతవిధాలా ప్రయత్నించారు. చాలా మందికి తెలుసు అది కష్టంతో కూడుకున్న పని అని. ఆ అమ్మాయి బ్రతికే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయని అందరికి తెలుసు. కానీ ఆమె ప్రాణాన్ని కాపాడటానికి మాత్రం ప్రయత్నించడం ఆపలేదు.

  ఆ కోరిక తీర్చుకోవడం కోసం కర్ర పెండలం ఉపయోగించి ఆస్పత్రి పాలైంది..

  ఈ చిన్న అమ్మాయి తన చివరి క్షణాల్లో ఎంతగా పోరాడింది అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆ అమ్మాయికి తెలుసు తన చావు ముంచుకొస్తోందని, అయినప్పటికీ బాధనంతా పంటి బిగువనే ఆపింది. ఆమెను కాపాడటానికి కొంతమంది సహాయక సిబ్బంది ప్రయత్నిస్తున్నప్పుడు అంత బాధలో కూడా పాట పాడింది.

  ఆ పాప చివరి క్షణాల్లో జరిగిన కొన్ని గుండెలను పిండేసే సంఘటనలను కొంత మంది రికార్డు చేశారు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

  వావ్ ! కుర్రకారు హార్ట్ బీట్ పెంచేస్తున్న కింగ్ ఫిషర్ క్యాలెండర్ గర్ల్

  ఆమె యొక్క చిత్రం సంచలనంగా మారింది :

  ఆమె యొక్క చిత్రం సంచలనంగా మారింది :

  ఆ అమ్మాయి అగ్నిపర్వతం నుండి చిమ్మిన బురద ప్రవాహంలో చిక్కుకుపోయి ఉంది. ఆమె బ్రతికే ఉంది కానీ నిస్సహాయ స్థితిలో ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న చిత్రాన్ని ఒకరు కెమెరా లో బంధించారు. ఇది చుసిన ఎవరికైనా హృదయం ద్రవించకమానదు. ఎందుకంటే మీరు ఈ చిత్రంలో చూస్తున్న క్షణంలో ఆ అమ్మాయి బ్రతికే ఉంది.

  ఆ అమ్మాయి మోనంగా అలా చూస్తూ ఉండిపోయింది :

  ఆ అమ్మాయి మోనంగా అలా చూస్తూ ఉండిపోయింది :

  ఆ అమ్మాయి భరించలేనంత నొప్పిని అనుభవిస్తున్నా, అది ఆమె పై అంతగా ప్రభావం చూపలేదు. ఎందుకంటే సహాయక సిబ్బంది ఆమెను ఆ అగ్ని పర్వత శిధిలాల నుండి బయటకు తీయడానికి సాధ్యమైనన్ని దారుల్లో ప్రయత్నించారు. కానీ ఆ సమయంలో ఆ అమ్మాయి కాళ్ళు క్రింద బాగా చిక్కుకుపోయి ఉన్నాయి. అయినప్పటికీ ఆమె ముఖంలో ఎటువంటి బాధను బయటపడనీయకుండా మౌనంగా ఉండిపోయింది.

  చనిపోయిన బంధువు ఈ అమ్మాయిని పట్టుకొని ఉంది :

  చనిపోయిన బంధువు ఈ అమ్మాయిని పట్టుకొని ఉంది :

  ఈ అమ్మాయి యొక్క కాలుని ఆమె బంధువు ఒక ఆమె పట్టుకొని ఉంది అనే విషయాన్ని సహాయ సిబ్బంది గుర్తించారు. ఆ బంధువు కూడా బురదలో మునిగిపోయి ఎప్పుడో మరణించింది. ఈ చిన్న అమ్మాయి మోకాళ్ల మీద నిలుచొని ఉందని గుర్తించారు సహాయక సిబ్బంది. ఇక ఆమెని ప్రాణాలతో బయటకు తీసే అవకాశమే లేదని భావించారు.

  ఈ విషాదం జరిగినప్పుడు తాను తన ఇంట్లో ఉన్నానని ఈ అమ్మాయి చెప్పుకొచ్చింది :

  ఈ విషాదం జరిగినప్పుడు తాను తన ఇంట్లో ఉన్నానని ఈ అమ్మాయి చెప్పుకొచ్చింది :

  ఈమె విలేకరులకు కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చింది. ఎప్పుడైతే ఆ అగ్నిపర్వతం బద్దలైందో ఆ సమయంలో తల్లిదండ్రులు, సోదరుడు, బంధువు మరియు ఈ అమ్మాయి ఇంట్లోనే ఉన్నారట. అగ్ని పర్వతం నుండి విడుదలవుతున్న బూడిదను చూసి అందరూ ఒక్కసారిగా తీవ్ర ఆందోళనకు గురైయ్యారట. క్షణాల్లోనే ఈమెను కాంక్రీట్ చుట్టుముట్టేసింది. అయినప్పటికీ అందులో నుండి బయటపడటానికి తీవ్రంగా ప్రయత్నించింది. కానీ ఈమె బంధువు ఒక ఆమె ఈమె కాలుని పట్టుకొని ఉన్నట్లు తర్వాత గుర్తించింది. ఆ తర్వాత కాంక్రీట్ డోర్ ఆమె పై పడిపోయింది.

  సహాయక సిబ్బంది ఏమని చెప్పారంటే :

  సహాయక సిబ్బంది ఏమని చెప్పారంటే :

  సహాయక సిబ్బంది ఈ అమ్మాయి యొక్క చేతిని గమనించారు. ఆ తర్వాత శిథిలాల్లో చిక్కుకున్న ఆ అమ్మాయి యొక్క నడుము నుండి పై భాగాన్ని మొదట రక్షించడానికి పనిచేయడం ప్రారంభించారు. ఆమె యొక్క కాళ్లు విరగకుండా బయటకు తీద్దామని విపరీతంగా ప్రయత్నించారు. కానీ, అది అసాధ్యం అనే విషయాన్ని సహాయక సిబ్బంది గుర్తించారు. దీంతో ఆమె శరీరం చుట్టూ ఒక టైర్ ట్యూబ్ ని అమర్చారు.ఇలా చేయడం వల్ల ఆ అమ్మాయి మరింత మునిగిపోకుండా ఉంటుందని.

  ఆ అమ్మాయి యొక్క సంక్షిప్త క్షణాలు:

  ఆ అమ్మాయి యొక్క సంక్షిప్త క్షణాలు:

  ఈ అమ్మాయి అరవై గంటల పాటు పోరాడింది. చాలా సమయం వరకు సానుకూల దృక్పధంతోనే వ్యవహరించింది, బాధను దిగ మింగి ధైర్యంగా వ్యవహరించింది. కానీ కొన్ని క్షణాల పాటు మాత్రం ఆ దేవుడిని ప్రార్ధించింది మరియు ఎక్కువగా భయపడిపోయి విపరీతంగా ఏడ్చింది. కొన్ని క్షణాలు మాత్రం చాలా ఆత్మ విశ్వాసంతో వ్యవహరించింది ఆ సమయంలో పాట కూడా పాడింది.

  స్వీట్లు కావాలని అడిగింది :

  స్వీట్లు కావాలని అడిగింది :

  ఆమె యొక్క చివరి ఘడియల్లో తనకు స్వీట్లు కావాలని చెప్పి అడిగింది, అంతే కాకుండా సోడా కూడా త్రాగింది. ఆ అమ్మాయి ఎంత దయా హృదయం కలిగినదంటే, ఒకానొక సమయంలో సహాయక సిబ్బందికి ఇక తనను వదిలేసి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోమని చెప్పింది.

  చివరి రోజు మాత్రం ఒక విధమైన భ్రాంతికి లోనైంది :

  చివరి రోజు మాత్రం ఒక విధమైన భ్రాంతికి లోనైంది :

  చివరి రోజు మరియు చివరి రాత్రి మాత్రం ఈ అమ్మాయి కొద్దిగా భ్రాంతికి లోనైంది. తాను స్కూల్ కి వెళ్లడం ఆలస్యం అవుతుందని చెప్పుకొచ్చింది. ఆ అమ్మాయి ముఖం అప్పటికే బాగా ఉబ్బిపోయి ఉంది, చేతులు బాగా పాలిపోయి ఉన్నాయి మరియు కళ్లన్నీ కూడా ఎరుపెక్కి పోయాయని సహాయక సిబ్బంది వెల్లడించారు.

  అరవై గంటల పాటు పోరాడి చివరికి ఆ అమ్మాయి మరణించింది :

  అరవై గంటల పాటు పోరాడి చివరికి ఆ అమ్మాయి మరణించింది :

  అరవై గంటలపాటు సుదీర్ఘంగా మృత్యువుతో పోరాడింది ఈ అమ్మాయి. ఆ అమ్మాయి స్థితి మరింత దిగజారిపోయి చివరి శ్వాసని విడిచి మరణించింది. మాంసమును కుళ్ళు చేసే పుండు మరియు అల్పోష్ణస్థితి ఆ అమ్మాయి మరణానికి కారణాలుగా తెలిపారు. ఆమెని కాపాడలేమని గుర్తించిన సహాయక సిబ్బంది మానవత్వంతో ఆమె అలా మరణించడమే భావ్యమని భావించి ఆమెను అక్కడే అలానే వదిలేశారు.

  English summary

  Final Moments Of The Girl Who Was Trapped For 3 Days!

  This is a true story of a young 12-year-old girl who was trapped in a volcanic debris from her waist below. She was alive and calm for the next 60 hours when the rescuers were trying their best to revive her and knew it that she would not make it, yet they tried to save her life.
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more