మీ జీవితంలో ఇవి ఉంటే మీరు చాలా అదృష్టవంతులు

By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

చాలామంది తమ జీవితంలో ఎప్పుడోకప్పుడు తాము ఎందుకు బ్రతికున్నామా అని తమని తామే నిందించుకున్న సందర్భాలు చాలానే ఉంటాయి. మనుష్యులుగా మనకు ఆ దేవుడు ఇచ్చిన వాటితో ఆనందంగా బ్రతకడానికి చాలా కష్టంగా అనిపిస్తుంటుంది. ఆనందంగా జీవించడానికి బదులుగా ఎక్కువ ఆందోళనకు లోనవుతూ, పశ్చాత్తాప పడుతూ, మన జీవితంలో లేని వాటి గురించి, మనం చేయని వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ బాధపడుతుంటాం.

అసలు నిజం ఏంటంటే, మీకు గనుక సమయం ఉంటే శాంతంగా, ఆహ్లాదకర వాతావరణంలో ఈ క్రింద రాస్తున్న వ్యాసాన్ని ఖచ్చితంగా చదవండి. అప్పుడు మీకు ఈ ప్రపంచంలో బ్రతికి ఉన్న చాలా మంది మనుష్యుల జీవితాలకంటే, తమ జీవితాలు చాలా బాగున్నాయి అని అనిపిస్తుంది.

ఈరోజుటికి కూడా చాలామంది ప్రజలు తమ నిత్యావసర వస్తువుల కోసం ఎన్నో కష్టాలు పడుతున్నారు. దానితో పాటు వాళ్ళు వాళ్ళ జీవితాల్లో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు.

ఏంటి? మీది వన్ సైడ్ లవ్ నా?

కానీ, మనుష్యులు స్వభావరీత్యా తమకు ఉన్న వాటితో సంతృప్తి చెందరు, లేని వాటి కోసం తాపత్రయపడుతూ ఎప్పుడు ఏడుస్తుంటారు.

ఈ విషయం నిజం అని రుజువు చేయడానికి ఈ క్రింద కొన్ని విషయాలు చెప్పబడి ఉన్నాయి. ఇవి గనుక మీ జీవితం లో ఉంటే మిమల్ని మీరు చాలా అదృష్టవంతులుగా భావించండి. దానితో పాటు అడగకుండానే ఇవన్నీ ఇచ్చి ఆశీర్వదించిన ఆ దేవుడికి ధన్యవాదాలు తెలపండి.

మీరు నివసిస్తున్న స్థలాన్ని ఇల్లుగా పిలువ వచ్చా ? :

మీరు నివసిస్తున్న స్థలాన్ని ఇల్లుగా పిలువ వచ్చా ? :

ఈ ప్రపంచంలో ఎంతో మంది ఈరోజుకి ఇల్లు లేక దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు. మీకు గనుక ఉండటానికి ఒక ఇల్లు ఉంటే ఈ భూమిపై ఉన్న అతికొద్ది మంది అదృష్టవంతులో మీరు ఒకరు. మీకు ఒక పెద్ద భవంతి ఉండకపోయి ఉండొచ్చు లేదా మీది అంత పెద్ద ఇల్లు కాకపోవచ్చు, మీరు అద్దె ఇంట్లోనే ఉంటూ ఉండొచ్చు లేదా మీరు చాలా చిన్న ఇంట్లో నివసిస్తూ ఉండొచ్చు, అయినా కూడా మిమ్మల్ని మీరు అదృష్టవంతులుగా భావించండి. ఎందుకంటే మీరు నివసిస్తున్న స్థలాన్ని ఇల్లుగా పిలుచుకోవచ్చు కాబట్టి.

మీరు ఆకలితో ఉన్నారా :

మీరు ఆకలితో ఉన్నారా :

ప్రతిరోజూ ఖరీదైన హోటల్స్ కు వెళ్లి రుచికరమైన భోజనం ఆనందిస్తూ తినకపోయి ఉండొచ్చు. మీరు ఎంతో విలాసవంతంగా, ఆహ్లాదకరమైన వాతావరణంలో రకరకాల వంటలను రుచి చూడకపోయి ఉండొచ్చు. కానీ, ఖాళీ కడుపుతో మీరు బయటికి వెళ్లడం లేదు అంటే మీరు అదృష్టవంతులే. మీరు తినే ఆహారం అంత రుచిగా ఉండకపోయి ఉండొచ్చు, కానీ అది మిమ్మల్ని ఆకలి నుండి కాపాడుతుందని మర్చిపోకండి.

త్రాగటానికి స్వచ్ఛమైన నీరు దొరుకుతుందా :

త్రాగటానికి స్వచ్ఛమైన నీరు దొరుకుతుందా :

సంవత్సారాలు గడిచే కొద్దీ త్రాగేనీరు దొరకడమే కష్టమైపోతుంది. ఇలాంటి సమయంలో స్వచ్ఛమైన, సురక్షితమైన నీరు మీరు త్రాగ గలుగుతున్నారంటే మీరు అదృష్టవంతులే. ఈ భూ ప్రపంచంలో కోట్లమంది ప్రజలు ఒక్క చుక్క స్వచ్ఛమైన నీటి కోసం పరితపిస్తున్న. మీరు మంచి నీరు త్రాగటానికి అవస్థలు పడనవసరంలేదు కాబట్టి మీరు ధనవంతులతో సమానం.

సెక్స్ పై ఆసక్తి లేకుంటే ప్రేమ లేదు? ఎంత వరకూ నిజం? మానసిక నిపుణులు ఏమంటున్నారు?

మీ చుట్టూ మిమ్మల్ని ప్రేమించే వారు, సంరక్షించే వారు ఉన్నారా :

మీ చుట్టూ మిమ్మల్ని ప్రేమించే వారు, సంరక్షించే వారు ఉన్నారా :

మీరు ఎంతో ధనవంతులు అయి ఉండొచ్చు, కానీ మీ చుట్టూ మిమ్మల్ని ప్రేమించే వారు లేకపోతే మీ జీవితం ఎంతో బాధాకరంగా మారుతుంది. మిమ్మల్ని సంరక్షించే ఓ కుటుంబం, మిమ్మల్ని అమితంగా ప్రేమించే స్నేహితులు మీ చుట్టూ గనుక ఉంటే అది మీరు ఎప్పుడో చేసుకున్న అదృష్టం. కొన్ని సార్లు వాళ్లతో ఉండటం మీకు విసుగు అనిపించొచ్చు, మరి కొన్ని సార్లు వాళ్ళతో గడపడం చాలా కష్టంగా మారవచ్చు. కానీ వాళ్ళే కనుక లేకపోతే మీ జీవితం మరింత దుర్భరమవుతుంది. మీరు ఎవరితోను కలహించేలా వ్యవహరించకుండా మీ చుట్టూ ఉన్న మనుష్యులు మిమ్మల్ని వెనక్కి లాగుతున్నారంటే, మీ జీవితం నిజంగా అదృష్టమైనది.

మీకు చెడ్డ అలవాట్లు లేకపోతే :

మీకు చెడ్డ అలవాట్లు లేకపోతే :

ఇప్పుడున్న ఈ ఆధునిక ప్రపంచంలో ఉన్న ఎన్నో రకాల చెడ్డ అలవాట్లకు ఆకర్షితులై, బానిసలై వ్యసనపరులుగా మారుతున్నారు చాలా మంది. కొంతమంది ధూమపానాన్ని,మద్యపానాన్ని ఇష్టపడతారు. మరి కొంత మంది మాదక ద్రవ్యాలను ఇష్టపడతారు. ఒక మనిషి జీవితాన్ని నరకప్రాయం చేయడానికి ఎన్నో రకాల వ్యసనాలు అందుబాటులో ఉన్నాయి.

మిమ్మల్ని మీరు ఇలాంటి చెడ్డ అలవాట్ల భారీన పడకుండా నిగ్రహించుకోగలిగితే, మీరు చాలా అదృష్టవంతులు

మీరు చాలా ఆరోగ్యంగా ఉన్నారా :

మీరు చాలా ఆరోగ్యంగా ఉన్నారా :

ఎవరైనా మనిషి అనారోగ్యానికి గురైతే అతను తన జీవితంలో ఎంతో నష్టపోతాడు, ఎన్నో బాధలను అనుభవిస్తాడు. బాగా ఆరోగ్యంగా జీవితాన్ని గడపడం కూడా ఒక దీవేనే. ఆరోగ్య విశిష్టతను వివరిస్తూ, ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందిన సామెత ఏంటంటే, ఎవరైతే ఆరోగ్యాన్ని కోల్పోతారో అలాంటి వాళ్ళు, వాళ్ళ జీవితాల్లో అన్ని కోల్పోయినట్లే లెక్క. ఎందుకంటే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు వాళ్ళ జీవితంలో దేనినైనా సాధించగలరు. వాళ్ళు గతంలో కోల్పోయినది కూడా తిరిగి చేజిక్కించుకుంటారు.

ఉన్నదానితో సంతృప్తి గా జీవించండి, లేని దాని కోసం తాపత్రయపడకండి.

English summary

Signs Which Show That You Are Lucky In Life

Do you know that these signs show that you are loved? Check them out…
Story first published: Wednesday, August 23, 2017, 20:00 [IST]
Subscribe Newsletter