వీరప్పన్ తన సొంత కూతురిని ఎందుకు చంపాడో తెలుసా?

By: Y. Bharath Kumar Reddy
Subscribe to Boldsky

వీరప్పన్ ఈ పేరు ఒకప్పుడు మారుమోగిపోయింది. పోలీసులకు నిద్ర లేకుండా చేసింది ఈ పేరు. గంధపుచెట్ల స్మగ్లింగ్, ఏనుగుల దంతాల అక్రమ రవాణాలో పేరుగాంచిన ఇతను చాలా అరాచకాలే చేశాడు. తమిళనాడు, కర్ణాటకు ప్రభుత్వాలను హడలెత్తించాడు. మరి ఎంత క్రూర స్వభావం ఉన్నా కన్న కూతురిని చంపుకునే స్వభావం మాత్రం ఎవరికీ ఉండదు కదా. అయితే వీరప్పన్ కొన్ని పరిస్థితుల వల్ల తన కన్న కూతురినే చంపాల్సి వచ్చింది. వీరప్పన్ గురించి ఎన్నో సినిమాలు వచ్చాయి. పుస్తకాలు వచ్చాయి. పేపర్లలో ఎన్నో వ్యాసాలు ప్రచురితమయ్యాయి. కానీ సమాజానికి తెలియని ఎన్నో నిజాలు దాగి ఉన్నాయి. వాటిని ఇంత వరకు ఎవరూ బయటపెట్టడం లేదు. బయపెట్టే ప్రయత్నం చేశారు కానీ అసలు వాస్తవం ఏమిటో చెప్పలేదు చాలామంది. అతన్ని ఆరాధించే జనాలు కూడా చాలామందే ఉన్నారు. ఇప్పటికీ అతని ఫొటో పెట్టుకుని పూజించే అడవిలో నివాసం ఉండే జనాలు ఉన్నారు. వీరప్పన్ లోనూ కొన్ని మంచి కోణాలున్నాయి. పరిస్థితులను బట్టే ఆయన తప్పటడుగులు వేయాల్సి వచ్చింది. క్రూరుడిగా మారాల్సి వచ్చింది. మరి కన్నకూతురిని చంపాల్సిన అవసరం వీరప్పన్ కు ఎందుకు వచ్చిందో తెలుసుకునే ముందు అతని గురించి కాస్త క్లుప్తంగా కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

1. వీరప్పన్ పుట్టిన ప్రాంతం ఇదే

1. వీరప్పన్ పుట్టిన ప్రాంతం ఇదే

కర్నాటక- తమిళనాడు సరిహద్దులోని గోపినత్తం గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టాడు మునుస్వామి వీరప్పన్. ఇతడు ఒక సాధారణ వ్యక్తి. చిన్నప్పుడు ఆవులను మేపేవాడు. ఆ తర్వాత అంతర్జాతీయ గంధపు చెక్కల స్మగ్లర్‌గా మారాడు. అయితే దీనికి చాలా కారణాలున్నాయి.

2. వీరప్పన్ వివాహం ఎలా అయ్యిందో తెలుసా?

2. వీరప్పన్ వివాహం ఎలా అయ్యిందో తెలుసా?

ముత్తులక్ష్మిది ధర్మపురి జిల్లాలోని సింగాపురం. ఆమె మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆమెను వీరప్పన్ చూసి పెళ్లి కోసం ఆమె తండ్రి దగ్గరకు వెళ్లాడు. అయితే ఆయన పెళ్లికి ఒప్పుకోలేదు. వీరప్పన్ అప్పటికే వయస్సులో ముత్తులక్ష్మి కన్నా చాలా పెద్దవాడు. ఆయన ఆవులు మేపేవాడు. ఐదెకరాల పొలం ఉండేది. వీరప్పన్ నేపథ్యం కూడా సరిగా ఉండేదికాదు. దీంతో వారి పెళ్లికి ముత్తులక్ష్మి తండ్రి ఒప్పుకోలేదు. అయితే వీరప్పన్ ఆమెను పెళ్లి చేసుకోవడానికి అన్నిరకాలుగా ప్రయత్నించాడు. కొన్నిసార్లు బెదిరింపులకు కూడా దిగాడు. చివరకు ముత్తులక్ష్మి తండ్రి వారి పెళ్లికి ఓకే అన్నాడు. ఇలా వారిద్దరి పెళ్లి పూర్తయింది.

3. ఆర్థిక సమస్యలే కారణం

3. ఆర్థిక సమస్యలే కారణం

పెళ్లయిన కొన్నాళ్లు వీరిద్దరూ బాగానే ఉన్నారు. తర్వాత ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోవడంతో వీరప్పన్ తన రూట్ మార్చాడు. సత్యమంగళం అడవి గురించి అంతా తెలిసిన ఒక వ్యక్తితో కలిసి గంధపు చెక్కల వ్యాపారానికి దిగాడు. గంధపు చెట్ల స్మగ్లింగ్ మొదలుపెట్టాడు. అయితే ఈ విషయంలో ముత్తులక్ష్మి వీరప్పన్ కు ఎన్నోసార్లు నచ్చజెప్పింది. కానీ వీరప్పన్ వినలేదు. కాస్త ఆర్థికంగా సెటిలయ్యాక వేరో చోటుకు వెళ్లి బతుకుదాం అంతవరకు తాను ఈ పనే చేస్తానని వీరప్పన్ నిర్ణయించుకున్నాడు.

4. స్మగ్లర్‌గా స్థిరపడి పోయేలా చేశారు

4. స్మగ్లర్‌గా స్థిరపడి పోయేలా చేశారు

స్మగ్లింగ్ జీవితానికి స్వస్తి చెప్పాలనుకున్న వీరప్పన్‌ ఒక సంఘటనతో స్మగ్లర్ గా స్థిరపడిపోయాడు. తన టీంలోని ఒక సభ్యుడు ఫారెస్టు బస్సు తగులబెట్టడంతో అంతటా కలకలం రేగింది. దీంతో కర్నాటక, తమిళనాడు ప్రభుత్వాలు వీరప్పన్‌ను వేటాడటానికి ఎస్‌టీఎఫ్ బృందాలను అడవుల్లోకి పంపాయి. వీరప్పన్ అడవుల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. కొంతమందితో కలిసి అడవుల్లోనే స్థిరపడిపోవాల్సి వచ్చింది.

5. భార్య కోసం ప్రారంభమైన కిడ్నాప్

5. భార్య కోసం ప్రారంభమైన కిడ్నాప్

వీరప్పన్ ఎక్కడున్నాడో చెప్పమంటూ 1993లో ఎస్‌టీఎఫ్ పోలీసులు ముత్తులక్ష్మిని బంధించారు. కర్నాటక పరిధిలోని బన్నారి అటవీ ప్రాంతంలోని ఎస్‌టీఎఫ్ బేస్ క్యాంపులో ఉంచి చిత్రహింసలు పెట్టారు. తర్వాత వీరప్పన్ భార్యను విడుపించుకోవడానికి కోయంబత్తూరు డీఎస్‌పీని కిడ్నాప్ చేశాడు. ఇదే ఆయన చేసిన మొదటి కిడ్నాప్.

6. లెక్కలేనంత మందిని చంపాడు

6. లెక్కలేనంత మందిని చంపాడు

వీరప్పన్ తర్వాత పోలీసులకు సవాలుగా మారాడు. అతని ఆచూకీ చెప్పాలని పోలీసులు సత్యమంగళం అటవీ గ్రామాల్లో విరుచుకుపడ్డారు. దొరికిన వారిని దొరికనట్లు చంపారు. దీంతో వీరప్పన్ సినీనటుడు రాజ్‌కుమార్‌ను కిడ్నాప్ చేశాడు. ఆయన్ను విడుదల చేయడానికి, అటవీ గ్రామాల్లో పోలీసులు చంపిన కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని కర్నాటక ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు.

7. అక్కడ వీరప్పన్ హీరో

7. అక్కడ వీరప్పన్ హీరో

సత్యమంగళం అటవీ గ్రామాల ప్రజలకు వీరప్పన్ ఒక హీరో. వారి బాగోగులు చూసిన దేవుడు. అందుకే ఆ గ్రామాల్లోని చాలా ఇళ్లలో ఇప్పటికీ వీరప్పన్ ఫొటోలు ఉంటాయి. అక్కడి ప్రజలకు ఆయనంటే ఎంత అభిమానమో మనకు దీని ద్వారే అర్థం అవుతుంది.

8. వాస్తవానికి ముగ్గురు కూతుర్లు

8. వాస్తవానికి ముగ్గురు కూతుర్లు

వీరప్పన్ కు వాస్తవానికి ముగ్గురు కూతుర్లు. ఆయన పెద్ద కూతురు విద్యారాణి, చిన్న కూతురు ప్రభ. వీరు కాకుండా వీరప్పన్ కు మరో కూతురు ఉంది. పెద్దమ్మాయికి పెళ్లయ్యింది. చిన్నమ్మాయి చదువుతోంది.

9. మరి మూడో కూతురి పరిస్థితి ఏమిటి ?

9. మరి మూడో కూతురి పరిస్థితి ఏమిటి ?

వీరప్పన్ చేతుల్లోనే అతడి సొంత కూతురు చనిపోయే సన్నివేశం ఒక సినిమాలో ఉంటుంది. పోలీస్ యాంగిల్లో వీరప్పనే తాను పోలీసుల నుంచి తప్పించుకునేందుకు పాపను బండరాయికేసి గుద్ది చంపేసినట్లు చూపిస్తారు. వీరప్పన్ భార్య యాంగిల్లో.. వీరప్పన్ కాలికి రాయి అడ్డం పడ్డపుడు కింద పడటం వల్ల పాప చనిపోయిందని చూపిస్తారు.

10 వాస్తవం ఏమిటి ?

10 వాస్తవం ఏమిటి ?

వీరప్పన్ భార్య మత్తు లక్ష్మీ 1990లో పెళ్లైన తర్వాత 94 వరకే అతనితో కలిసి ఉంది. వీరి రెండో కూతురు అడవిలోనే పుట్టింది. ఇద్దరి పిల్లలను చాలా రహస్యంగా పెంచారు. వారిద్దరినీ వేర్వేరుగా ఉంచేవారు. వారిద్దరూ ఎప్పుడో తప్ప కలిసేవారు కాదు. కానీ వీరికి మూడో కూతురు కూడా ఉంది. వీరప్పన్ అనేక హత్యలు చేశాడనే విషయం అందరికీ తెలుసు. కానీ తన కూతురుని ఎందుకు చంపాడనే విషయం మాత్రం చాలా మందికి తెలియదు. వీరప్పన్ భార్యాపిల్లల్ని ఎంతో బాగా చూసుకునేవారు. వారికి ఏమైనా అయితే తట్టుకునేవారు కాదు. వీరప్పన్ ముత్తులక్ష్మిలకు విద్యా రాణి, ప్రభ అనే అమ్మాయిలున్నారు. ప్రభ జన్మించిన సంవత్సరం తరువాత మరొక అమ్మాయి జన్మించింది. అయితే ఈ బిడ్డ జన్మించినప్పటి నుంచి వీరప్పన్ దళం మొత్తం నిస్సత్తువుగా మారిపోయింది. అలాగే ఆ అమ్మాయి కూడా అంతగా ఆరోగ్యంగా ఉండేది కాదు. బోదమలైలో ఉండే వీరప్పన్ స్థావరాన్ని ఎస్టీ ఎఫ్ బలగాలు చుట్టుముట్టాయి. దీంతో వీరప్పన్ ఎక్కడికి పోలేని పరిస్థితి ఏర్పడింది. అడవి మొత్తం పోలీసుల ఆధీనంలోకి వెళ్లి పోయింది. ఆ సమయంలో వీరప్పన్ కు అప్పుడే పుట్టిన కూతురి ఏడుపు మొదలైంది. 110 డెసిబెల్స్ సౌండ్ తో ఆ అమ్మాయి ఏడుస్తుంది. ఆ ఏడుపుతో ఈజీగా వీరిని కనుక్కోనే అవకాశం ఏర్పడింది. ఏం చేసినా ఏడుపు ఆపడం లేదు. దీంతో వీరప్పన్ ఆ అమ్మాయిని చంపేయాలని భావించాడు. ఎరుక్కంపూ (కాలోట్రోపిస్) గన్నేరు పూల పాలను పాపకు ఇచ్చి చంపమన్నాడు. వీరప్పన్ చెప్పిన మాటకు తిరుగు ఉండకూడదు. అందుకే ముత్తులక్ష్మీ కన్నీళ్ల పర్యంతం అవుతూనే అలా చేయాల్సి వచ్చింది.

చనిపోయిన శిశువును అక్కడే పాతిపెట్టారు. ఈ సంఘటన జులై 13, 1993న జరిగింది. మర్రి మాదువ అనే ప్రదేశంలో తర్వాత పోలీసులు తవ్వితే చిన్నారి మృతదేహం బయటపడింది. శవపరీక్ష నిర్వహించినా శరీరం బాగాకుళ్ళిపోవడంతో మరణానికి కారణం తెలుసుకోలేకపోయారు.

11. మత్తు మందు ఇచ్చారా?

11. మత్తు మందు ఇచ్చారా?

కొందరు వ్యక్తుల ద్వారా పోలీసులు వీరప్పన్‌కు అన్నంలో మత్తు మందు కలిపి తినిపించారు. అన్నం తిన్న ఆయన మత్తులో ఉన్నప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత చిత్ర హింసలు పెట్టి ఆయన వెనుక ఎవరెవరు ఉన్నారో తెలుసుకున్నారు. ఆయన్ను చెన్నయ్‌లోనో, బెంగుళూరులోనో కోర్టులో హాజరు పరిచేందుకు ప్రభుత్వాలతో మాట్లాడారు. ఆయన కోర్టుకొచ్చి నోరు విప్పితే అనేకమంది రాజకీయ నాయకుల పేర్లు బయటకు వస్తాయనే భయంతో ఆ రెండు ప్రభుత్వాలు వీరప్పన్‌ను కాల్చి చంపాలని సూచించాయి. దీంతో పోలీసులు ఆయన్ను అక్టోబర్ 18, 2004 కాల్చి చంపారని ప్రచారంలో ఉంది.

12. పక్కా ప్లాన్ తో చంపారు

12. పక్కా ప్లాన్ తో చంపారు

వీరప్పన్ ను మట్టుపెట్టిననాటి తన అనుభవాలపై మాజీ ఐపీఎస్‌ అధికారి విజయకుమార్‌ ఒక పుస్తకాన్ని రాశారు. దీని ప్రకారం వీరప్పన్ ను చంపడంలో చెన్నైకి చెందిన ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రముఖ పాత్ర పోషించాడు. చెన్నైకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తకు వీరప్పన్ తో ఎంతోకాలంగా సన్నిహిత పరిచయం ఉండేది. దీంతో ఆ పారిశ్రామిక వేత్తపై పోలీసులు ఓ కన్నేసి ఉంచారు. వీరప్పన్ వర్గంలోని రహస్య గూఢచారి ఒకరు పారిశ్రామికవేత్తను కలుసుకునేందుకు ఒక హోటల్‌కు వచ్చాడు. ఆ గూఢచారి వెళ్లిపోగానే కమెండో దళాలు పారిశ్రామికవేత్తను చుట్టుముట్టాయి. తనకు అదనంగా మారణాయుధాలు అవసరమని, చూపు మందగించినందున కంటి ఆపరేషన్ కు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా వీరప్పన్ కోరినట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఈ సమాచారంతో వీరప్పన్ ను పట్టుకునేందుకు ప్లాన్ వేశారు. చెన్నైలో పేరుమోసిన రౌడీ ఆయోధ్యకుప్పం వీరమణిని ఎన్ కౌంటర్‌ చేసిన ఎస్‌ఐ వెల్లదురైని.. వీరప్పన్ వద్దకు మారువేషంలో పంపాలని విజయకుమార్‌ నిర్ణయించారు. పారిశ్రామికవేత్త ఇచ్చిన సమాచారం మేరకు వీరప్పన్ తన గూఢచారిని పంపాడు. ఆ గూఢచారి ధర్మపురికి చేరుకుని ఒక టీ దుకాణంలో పారిశ్రామికవేత్తను కలిశాడు. తాను ఒక మనిషిని పంపుతానని.. అతనితోపాటుగా వస్తే మదురై లేదా తిరుచ్చిలో వీరప్పన్ కు కంటి ఆపరేషన్ చేయిస్తానని గూఢచారికి చెప్పాడు. దీంతో వీరప్పన్ మనిషి ఒక లాటరీ చీటీని కొని దాన్ని సగం చించి ఒక ముక్కను తన వద్ద ఉంచుకుని రెండో ముక్కను పారిశ్రామికవేత్తకు ఇచ్చాడు. రెండో ముక్కను తెచ్చే వ్యక్తితోనే వీరప్పన్ వస్తారన్నాడు. విజయకుమార్‌ ఆదేశాల మేరకు ఎస్‌ఐ వెల్లదురై ఆ రెండో ముక్కను తీసుకుని అడవుల్లో వీరప్పన్ ను కలుసుకున్నాడు. తనవద్దనున్న తొలిసగంతో సరిపోల్చుకున్నాక ఎస్సైని వీరప్పన్ నమ్మకస్తుడిగా భావించాడు. వెల్లదురై చెప్పినట్లుగానే వైద్యం చేయించుకునేందుకు బయలుదేరాడు. పోలీసులు ముందుగానే ఏర్పాటు చేసిన అంబులెన్స్ లోకి వీరప్పన్ ను అతని సహచరులను ఎస్‌ఐ వెల్లదురై ఎక్కించాడు. ధర్మపురి వద్ద సిద్ధంగా ఉన్న కమాండో పోలీసులు వీరప్పన్ పై కాల్పులు జరిపి హత మార్చారు. వీరప్పన్ ను హతమార్చేందుకు సహకరించడంతో సదరు పారిశ్రామికవేత్తపై కేసులు పెట్టలేదు. ఆ వ్యాపారి ఎవరనేది కుమార్‌ బయట పెట్టలేదు.

13. ముత్తులక్ష్మి కోణంలో అతడు చాలా మంచివాడు

13. ముత్తులక్ష్మి కోణంలో అతడు చాలా మంచివాడు

వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి కోణంలో తన భర్త కన్నా ప్రపంచంలో మంచివాడు ఎవరూ లేరు. ఆమెతో నువ్వంటే నాకు ఇష్టం, పెళ్లి చేసుకుందాం అని వీరప్పన్ చెప్పాడంట. పరిస్థితుల ప్రభావం వల్లే వీరప్పన్ క్రిమినల్‌గా మారాడని ముత్తులక్ష్మి నమ్మకం. వీరప్పన్ గంధపు చెక్కల స్మగ్లింగ్‌తో వందల కోట్లు సంపాదించారనే ప్రచారం వుంది. అదే నిజమైతే ముత్తులక్ష్మి ప్రస్తుత జీవితం ఇంకోలా ఉండాలి. కాని ఆమె ధర్మపురి జిల్లా మేటూరు డ్యామ్‌కు సమీపంలోని గ్రామంలో ఒక అద్దె ఇంట్లో ఉంటున్నారు.

Read more about: pulse, india, insync, life
English summary

the dark side veerappan badass dad who killed his own daughter

Veerappan turned towards the midwife. Chinnapullai took great pride in delivering babies safely even under the most harrowing circumstances, but this time, Veerappan had a different job in mind for her.The midwife began to say something, but changed her mind when she understood Veerappan’s intention. ‘Some juice of erukkampoo will make her choke,’ she said. Erukkampoo, or Calotropis, is revered as Lord Ganesha’s favourite flower. Practitioners of Ayurveda use it regularly for medicinal purposes.‘Do it,’ Veerappan said shortly. Muthulakshmi was the only one to shed tears for the baby.
Subscribe Newsletter