For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చిత్రాలు ఏమి బహిర్గత పరుస్తున్నాయి : చూసిన వెంటనే మీరు గమనించింది ఏమిటి ?

మన అసంకల్పిత స్థితిలో ఏమి జరుగుతుంది అనే విషయమై ఎప్పటికప్పుడు సంజ్ఞలను మనిషి శరీరంలో ని మెదడు పంపిస్తుంది అనే విషయం మీకు తెలుసా ? ఇలా చేయడం వల్ల మన వ్యక్తిత్వంలోని విలక్షణతలను తెలుసుకోవడానికి అది ఎంతగ

By R Vishnu Vardhan Reddy
|

మన అసంకల్పిత స్థితిలో ఏమి జరుగుతుంది అనే విషయమై ఎప్పటికప్పుడు సంజ్ఞలను మనిషి శరీరంలో ని మెదడు పంపిస్తుంది అనే విషయం మీకు తెలుసా ? ఇలా చేయడం వల్ల మన వ్యక్తిత్వంలోని విలక్షణతలను తెలుసుకోవడానికి అది ఎంతగానో సహాయపడుతుంది.

వివిధ అధ్యయనాల ద్వారా చాలా మంది పరిశోధకులు ఈ చిట్కాలను ఉపయోగించి వ్యక్తుల యొక్క గుణగణాలను అర్ధం చేసుకోవడమే కాకుండా, మొదట చిత్రాన్ని చూడగానే స్త్రీ లేదా పురుషుడు ఏమనుకుంటున్నారు అనే విషయానికి సంబంధించి వివిధరకాల వ్యక్తిత్వ పరీక్షలను కూడా చేసారు.

personality tests

ఇప్పుడు మీరు చదవబోయే వ్యాసమంతా మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందుకోసం మీరు చేయవలసింది ఏమిటంటే, క్రింద ఒక చిత్రం ఉంది. ఆ చిత్రాన్ని చూసిన వెంటనే ఎలాంటి వ్యక్తిత్వ విలక్షణతలు మీలో ఉన్నాయి అనే విషయానికి సంబంధించి వివిధ అంశాలను తెలుసుకోబోతున్నాం.

ఆ చిత్రంలో మీరు గమనించే మొదటి అంశాన్ని బట్టి మీ వ్యక్తిత్వం గురించి ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు.

ఇప్పుడు మరిన్ని విషయాలను తెలుసుకుందాం...

మీరు గనుక మొదట చెట్టుని చూసినట్లయితే, అప్పుడు

మీరు గనుక మొదట చెట్టుని చూసినట్లయితే, అప్పుడు

మీరు గనుక మొదట చెట్టుని చూసినట్లతే, మీరు ఎంతో నిజాయితో కూడిన హేతుబద్దమైన వ్యక్తి అని అర్ధం. మీలో సానుకూల దృక్పధం ఉంది అనే విషయాన్ని ఎక్కువగా తెలియజేస్తుంది. అందుచేత ఇతరులు మీ వద్ద సలహాలు తీసుకోవడానికి వస్తుంటారు. సాధారణంగానే మీలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. మీ యొక్క సృజనాత్మక సామర్ధ్యానికి పరిధులు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అనే విషయం మీరు గుర్తుంచుకుంటే మంచిది. మరో వైపు యాదృచ్చికంగా వ్యవహరించడానికి ప్రయత్నించాలి మరియు మీ యొక్క దైనందిక జీవితంలో సమయానికి, సందర్భానికి అనువుగా వ్యవహరించడం కూడా అలవర్చుకోవాలి.

మీరు మొదట సింహాన్ని చూసినట్లయితే, అప్పుడు

మీరు మొదట సింహాన్ని చూసినట్లయితే, అప్పుడు

మీరు మొదట సింహాన్ని గనుక చూసినట్లతే, మీరు ప్రభావవంతమైన వ్యక్తులు అని అర్ధం. మీ జీవితంలో మీకు ఏమి కావాలి అనే విషయమై మీకు ఒక అవగాహన ఉంది. మీరు చాలా బలమైన వ్యక్తిత్వం కలవారు. మిమ్మల్ని మీరు ఎప్పుడు ఉత్సాహ పరుచుకుంటూ మరియు మీ చుట్టూ ఉన్న వారిని కూడా ఉత్సాహవంతులను చేస్తూ మీతో పాటు అందరినీ లక్ష్యాలను చేరుకునే విధంగా ఎంతగానో ప్రయత్నిస్తుంటారు. మరో వైపు మీ యొక్క బలమైన ఆశయాలు మీకు ప్రత్యేకతను తెచ్చిపెడతాయి. ఇవే కాకుండా మీరు చేసే తప్పుల నుండి మీరు ఎన్నో పాఠాలను నేర్చుకుంటారు. దీంతో మీరు ఎలా అయితే జీవితాన్ని జీవించాలని భావిస్తున్నారో అందుకు అనుగుణంగా మీ దృష్టిని అంతా కేంద్రీకరిస్తారు.

మీరు గనుక గొరిల్లాని మొదట చూసినట్లయితే, అప్పుడు

మీరు గనుక గొరిల్లాని మొదట చూసినట్లయితే, అప్పుడు

మీరు గనుక గొరిల్లా చిత్రాన్ని కనుక మొదట చుస్తే, మీరు ఎంతో విశ్లేషణాత్మకంగా వ్యవహరిస్తూ ప్రతి ఒక్క విషయంలో దాగి ఉన్న నిఘాడ అర్ధం కోసం వెతికే వ్యక్తులని అర్ధం. మీరు ఎప్పుడూ మీ విషయంలో మరొక్క అవకాశం కోసం వెతుకుతూ ఉంటారు. దీనికి తోడు మిగతా విషయాల పై కూడా ఎక్కువ శ్రద్ద కనపరుస్తుంటారు మరియు ఇతరుల కంటే కూడా ఎప్పుడూ ముందు చూపుతో ఆలోచిస్తుంటారు. మీరు ఎప్పుడూ దీర్ఘమైన ఆలోచనలలో ఉన్నారని వ్యక్తులు భావిస్తూ ఉంటారు. ఎందుచేతనంటే, మీ యొక్క జీవిత సమస్యల పై ఎప్పుడూ మీరు ఎదో ఒకటి ఆలోచిస్తూ, అందుకు కావాల్సిన సమాధానాల కోసం వెతుకుతూ మీ తలలో మీతో మీరే ఘర్షణ పడుతూ ఉంటారు. మరో పక్క, ఇతరుల యొక్క అభిప్రాయాన్ని మీరు ఒప్పుకోవాలంటే వారు ఎంతో కృషి చేయాల్సిన అవసరం ఉంది.

మీరు గనుక మొదట చేపని చూసినట్లయితే, అప్పుడు

మీరు గనుక మొదట చేపని చూసినట్లయితే, అప్పుడు

మీరు గనుక మొదట చేపను గనుక చుస్తే శాశ్వతమైన ఆశావాది అని అర్ధం. మీరు జీవితాన్ని ఎంతో అందంగా గడపాలని భావిస్తారు. మీది ఎంతో అదృష్టవంతమైన వ్యక్తిత్వం. మీ జీవితాన్ని, మీరు ఎప్పుడూ సానుకూల దృక్పధంతో చూస్తారు. మీరు ఒక కలలు కనే వ్యక్తి అని లేదా ఆదర్శవాదిగా ఇతరుల చేత పిలవబడతారు. సానుకూల దృక్పధంతో వ్యవహరించడం మరియు నమ్మకంగా ఉండటం మంచి విషయమే అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో ఇతరులు దీనినే అవకాశంగా తీసుకొని వాళ్లకు అనుకూలంగా మార్చుకొనే అవకాశం ఉంది. ఇంత జాలి, దయ మరియు సున్నితమైన స్వభావంతో వ్యవహరిస్తే అది కూడా ఆపదలను తెచ్చి పెట్టే అవకాశం ఉంది.

మీరు చిత్రంలో మీరు ఏమి చూసారు అనే విషయాన్నీ మాకు తెలియజేయాన్ని మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి.

English summary

What Is The First Thing That You Notice In The Picture

Do you know that the first thing that we notice in a picture is related to our subconscious mind? According to studies, researchers use various pictures to analyse and understand our personality and our way of thought process. Personality analysis is usually done with the way of showing images as well.
Story first published:Friday, December 22, 2017, 11:01 [IST]
Desktop Bottom Promotion