For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సీమ పౌరుషానికి చెరగని గుర్తు.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి

|

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఇప్పుడు తెలుగు గడ్డపై మోగుతున్న పేరు. ఈయన మీద సినిమా వస్తున్నందుకు ఇప్పుడు ఈ పేరు మోగుతుందేమో కానీ కొన్ని వందల ఏళ్ల కింద బ్రిటీష్ వారికి ఈయన చూపించిన సినిమాకు అప్పుడు వచ్చిన ప్రతిస్పందనే వేరు.

uyyalawada narasimha reddy real life

నేటి తరానికి ఈయన గురించి పెద్దగా తెలియకపోవొచ్చేమో గానీ ఒకప్పుడు ఈయనంటే ఉడుకురక్తానికి ఒకరకమైన పిచ్చి. రాయలసీమ గడ్డపై పౌరుషానికి చెరగని గుర్తుగా నిలిచాడు. ఉరికొయ్య ఎక్కేముందు తొడగొట్టి మీసం తిప్పిన మొనగాడు ఈ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.

1. ఎవరీ నరసింహారెడ్డి ?

1. ఎవరీ నరసింహారెడ్డి ?

నరసింహారెడ్డి సొంత గ్రామం కర్నూలు జిల్లాలోని ఉయ్యాలవాడ. ఇప్పటికీ ఎప్పటికీ సీమలోని కొన్ని పల్లెల దేవుడు ఈయన. ఓ మనిషి దూరమై కొన్ని వందల ఏళ్లు గడుస్తున్నా ఇంకా అక్కడి జనం ఎందుకు గుర్తుకుపెట్టుకున్నారంటే అతడి పోరాట పటిమ. ప్రజలపై చూపించిన ప్రేమే కారణం. ఇంకా వందేళ్లయినా.. ఎన్ని తరాలు మారిన ఈయనను మాత్రం ఈ గడ్డ మరువదు.

అసలు ఎవరు ఈయన.. ఎందుకంత ఆప్యాయత చూపిస్తున్నారు ఈ జనాలు. బ్రిటీష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన జయరామిరెడ్డి మనవడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. చిన్నతనం నుంచే ప్రతి విద్యలో ఆరితేరాడు. జనాల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. 18వ శతాబ్దంలో కడప, కర్నూలు, అనంతపురం, బళ్లారిలోని కొన్ని గ్రామాలకు ఈయన పాలేగార్‌.

MOST READ: సెక్స్ లో పాల్గొనకుండానే గర్భం ఎలా వస్తుందో తెలుసా?

2. పాలేగార్లు ఇలా చేసేవారు

2. పాలేగార్లు ఇలా చేసేవారు

ఆ కాలంలో చాలా దక్షిణ భారత రాజ్యాల్లో పాలేగార్‌ వ్యవస్ధ ఉండేది. ప్రజలకు రక్షణ కల్పించడం, పన్నులు వసూలు చేయడం, శాంతి భద్రతలను కాపాడటం, స్ధానిక న్యాయపాలన తదితర అధికారాలు కలిగివుండేవారు. అంతేకాకుండా ప్రాంతాల వారీగా అభివృద్ధి కార్యక్రమాలను(డ్యామ్‌ల నిర్మాణం, వ్యవసాయంలో సాయం తదితరాలు) కూడా చేపట్టేవారు.

1857 సిపాయిల తిరుగుబాటుకు భారతదేశ మధ్యయుగ చరిత్రలో ఎంతో కీలకపాత్ర ఉంది. సిపాయిల తిరుగుబాటు ఉత్తర భారతదేశంలో జరిగింది. సిపాయిల తిరుగుబాటు కంటే ముందుగా ఆంగ్లేయులపై తిరుబాటు చేసిన పాలేగార్లకు గురించి చరిత్రకారులు అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు. అందుకే ఉయ్యాలవాడ గురించి పూర్తిగా తెలిసిన వారు అతి కొద్దిమందే ఉన్నారు.

3. ఇలా మొదలైంది రేనాటి చరిత్ర

3. ఇలా మొదలైంది రేనాటి చరిత్ర

బ్రిటీషువారు దక్షిణ భారతదేశంలో అడుపెట్టినప్పుడు ఇక్కడ నిజాం నవాబు, మైసూర్‌ ను పరిపాలించే హైదర్‌ ఆలి బలమైన నాయకులుగా ఉండేవారు. వారికి సంబంధించిన వాళ్లందినీ ఓడించి మద్రాసు ను బేస్ చేసుకుని దక్షిణాదిన బ్రిటీష్‌ వాళ్లు పాలన చేపట్టారు. బ్రిటీష్ వాళ్లకు సాయం చేయడంతో నిజాం నవాబుకు కొన్ని ప్రాంతాలు ఇచ్చారు.

ఆయన ఆధీనంలో ఉన్న కర్నూలు, కడప, అనంతపురం, బళ్లారి ప్రాంతాలను పాలెగాండ్లు చూసుకునేవారు. ఈ క్రమంలో కడప జిల్లాలోని జమ్మలమడుగు, కర్నూలు జిల్లా లోని కోయిలకుంట్ల వరకు ఉన్న భూభాగాన్ని చెంచురెడ్ల వంశానికి చెందిన నొస్సం పాలేగాండ్లు పాలించేవారు. వీరి వంశీయుల్లో ఒకరే జయరామిరెడ్డి.

4. ప్రేమ.. పెళ్లిళ్లు

4. ప్రేమ.. పెళ్లిళ్లు

నరసింహారెడ్డి శత్రువులతో ఎంత కఠినంగా ఉంటాడో.. తనను ఇష్టపడే వారిపై అంత ప్రేమగా ఉంటాడు. ఇదే సిద్ధమ్మకు నచ్చింది. నరసింహారెడ్డిని ప్రేమలోపడేలా చేసింది. తర్వాత సిద్దమ్మను పెళ్లి చేసుకున్నాడు. వీరికి దొర సుబ్బయ్య జన్మించాడు. తర్వాత ఈయన రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు పేరమ్మ. వీరిద్దరికీ ఒక కూతురు. ఇక మూడో భార్య పేరు ఓబులమ్మ. వీరిద్దరికీ ఇద్దరు కుమారులు జన్మించారు. అలాగే నరసింహారెడ్డి ప్రజలందరికీ దేవుడిలా మారాడు. వారి కోసం ఏదైనా చేసేవాడు.

5. ఆ ఘటనే కీలకం

5. ఆ ఘటనే కీలకం

నరసింహారెడ్డి చెల్లించాల్సిన భరణం విషయంలో అప్పటి కోవెలకుంట్ల తహసీల్దారు రాఘవాచారి కాస్త ఎగతాళిగా మాట్లాడారు. తర్వాత టైమ్ చెప్పి వార్నింగ్ ఇచ్చి ఆ టైమ్ కు వెళ్లి 1846 జూలై 10న మధ్యాహ్నం తహసీల్దారు రాఘవాచారి తల నరికేశాడు. ఈ ఘటనతో బ్రిటీష్ వారిని ఎదురించిన మొనగాడు అయ్యాడు.

6. కోటపై దాడి

6. కోటపై దాడి

తహసీల్దార్‌ రాఘవాచారిని నరసింహారెడ్డి చంపడంతో బ్రిటీష్ వాళ్లు సైన్యంతో నొస్సం కోటపై దాడి చేశారు. 1846 జూలై 23న బ్రిటీషు సైన్యం నొస్సం కోటపై దాడి చేసింది. అందరిని మట్టికరిపించాడు నరసింహారెడ్డి. సైన్యంతో దాడికి వచ్చిన అప్పటి బ్రిటీష్ అధికారి వాట్సన్‌ తలను నరికేశాడు.

MOST READ: త్రీడీ ప్రింటెడ్ రోబోతో ప్రేమ.. వీలైతే పెళ్లి!

7. నరసింహారెడ్డి తల తీసుకొస్తే డబ్బులు ఇస్తాం

7. నరసింహారెడ్డి తల తీసుకొస్తే డబ్బులు ఇస్తాం

అప్పటి కడప కలెక్టర్‌ కాక్రేన్‌ నరసింహారెడ్డిని పట్టుకున్నవారికి లేదా అతని తలను తీసుకొచ్చిన వారికి రూ. పదివేలు బహుమతి ప్రకటించాడు. ఈ విషయాన్ని అన్ని గ్రామాల్లో ప్రకటించారు. తర్వాత బ్రిటీష్ వారు నొస్సం కోటను ఫిరంగులతో కూల్చేశారు.

8. అన్ననే సమాచారం ఇచ్చాడు

8. అన్ననే సమాచారం ఇచ్చాడు

ఉయ్యాలవాడ జాగీర్దార్‌ పెద్దమల్లారెడ్డి కుటుంబాని కి బ్రిటీషు ప్రభుత్వం భరణం ఇచ్చేది. అందులో సగం సోదరుడు చిన్న మల్లారెడ్డికి పోయేది. పెద్ద మల్లారెడ్డి ముగ్గురు కుమారుల్లో చివరి వాడు నరసింహారెడ్డి. ప్రజల్లో తమ్ముడికి ఉన్న అభిమానాన్ని చూసి ద్వేషంపెంచుకున్నాడు అతని దయాది... అతని అన్న మల్లా రెడ్డి.

తమ్ముడిపై కక్ష సాధించాలనకున్నాడు. కడప కలెక్టర్‌ కాక్రేన్‌ ప్రకటించిన బహుమానం గురించి తెలుసుకున్నాడు. బ్రిటీష్ వారికి నరసింహారెడ్డి కుటుంబ సభ్యుల సమాచారం అందించాడు ఈ నీచుడు. నరసింహారెడ్డి భార్యా పిల్లల్ని బందించి కడపలోని లాల్‌ బంగ్లాలో పెట్టారు. అయితే బ్రిటీష్ వారిని ఎదురించి తన భార్యాపిల్లల్ని సురక్షితంగా తెచ్చుకున్నాడు నరసింహారెడ్డి. తర్వాత బ్రిటీష్ వారు ఆయన్ని అభిమానించే ప్రజల్ని హింసించడం మొదలుపెట్టారు.

9. కోట గుమ్మానికి తల వేలాడదీశారు

9. కోట గుమ్మానికి తల వేలాడదీశారు

1856 అక్టోబర్‌ 6న నరసింహారెడ్డిపై బ్రిటీస్ సైన్యం దాడి చేసింది. సైనికులు నరసింహారెడ్డిని బాగా గాయపరిచారు. తర్వాత అతన్ని బందీగా తీసుకెళ్లారు. బ్రిటీష్‌ ప్రభుత్వం ఆయనకు ఉరిశిక్ష విధించింది. జుర్రెటి ఒడ్డున ఉరి తీస్తామని ప్రకటించారు. రాయలసీమ వాసులంతా కన్నీళ్లతో చివరిసారిగా తమ దేవున్ని చూసుకునేందుకు అక్కడికి వెళ్లారు. అక్కడ ఉరి తీశాక ఆయన తలను కోయిలకుంట్ల కోట గుమ్మానికి వేలాడదీశాడు బ్రిటీష్‌ వారు. మూడు దశాబ్దాల పాటు నరసింహారెడ్డి తల అలాగే వేలాడింది.

10. చరిత్రలో నిలిచిపోతాడు

10. చరిత్రలో నిలిచిపోతాడు

ఉయ్యాలవాడ మరణించి ఉండొచ్చు కానీ అక్కడి ప్రజల గుండెల్లో, అక్కడ ప్రజలు పాడుకునే వీరగాథల్లో తాను ఎప్పుడు బతికే ఉంటాడు. ఉయ్యాలవాడ ప్రజలకు అందించిన పోరాటం మరణం లేనిది. ఎంతో మందికి స్ఫూర్తినిచ్చిన ఆ విప్లవయోధుడు భారతీయుల సత్తా ఎలా ఉంటుందో బ్రిటీష్ వారికి చూపించాడు.

English summary

true story of uyyalawada narasimha reddy

One such brave heart who was one of the early freedom fighters was the fierce Uyyalawada Narasimha Reddy. In the early colonial rule, British rulers oppressed the Indian rulers in their expansion mode.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more