Latest Updates
-
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే..
దిన ఫలాలు: మంగళవారం 12 డిసెంబర్ 2017
భారతదేశం లేదా పాశ్చాత్య జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం మన జీవిత గమనాలు అంతరిక్షంలోని నక్షత్ర సమూహాలతో ఏర్పడ్డ వివిధ జన్మరాశుల స్థితి, గమనం పై ఆధారపడి ఉంటాయి. మొత్తం పన్నెండు రాశులు ఉంటాయి.

భారతదేశం లేదా పాశ్చాత్య జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం మన జీవిత గమనాలు అంతరిక్షంలోని నక్షత్ర సమూహాలతో ఏర్పడ్డ వివిధ జన్మరాశుల స్థితి, గమనం పై ఆధారపడి ఉంటాయి. మొత్తం పన్నెండు రాశులు ఉంటాయి. ఈ పన్నెండు రాశుల జ్యోతిష్య ఫలితాలు ఆయా సమయాల్లో గోచార స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని ఇవ్వటం జరుగుతుంది. ఈ ఫలితాలు సామాన్యంగా అన్ని వర్గాలకు కలిపి చెప్తారు. వ్యక్తిగతంగా మీ భవిష్యత్తు తెలుసుకోవాలనే ఆసక్తి వుంటే దగ్గరలో ఉన్న జ్యోతిష్య నిపుణుడి వద్ద సంప్రదించి , మీ జన్మ వివరాలను తీసుకువెళ్ళి జాతకాలను, వాటిలో దోషాలు, దానికి పరిష్కారాలు వివరంగా తెలుసుకోవచ్చు.
ఈ నాటి దినఫలాలు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయానికి చెందిన పెద్దలు బ్రహ్మశ్రీ శ్రీ నలమాటి కొండలరావు గారి నోటి మాటల్లోనే..
ఓం శ్రీ గురుభ్యోనమః
అఖిల భారత తెలుగు ప్రేక్షకులందరికీ అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమఃస్సుమాంజలి.
ది.12-12-2017 తారీఖు, మంగళవారం నాటి దినఫలాలను ఒకసారి పరిశీలిద్దాం. హేమలంబి నామ సంవత్సరం, దక్షియాణనం, హేమంత రుతువు, మార్గశిర మాసం, బహుళ దశమి తెల్లవారితే 4 గంటల 53 నిమిషాల వరకూ ఉన్నది. హస్తా నక్షత్రం రాత్రి 10 గంటల 51 నిమిషాల వరకూ ఉన్నది. అమృత సమయం సాయంత్రం 4.45 నుంచి 6.35 వరకూ ఉన్నది. వర్జ్యం 7 గంటల 7 నిమిషాల నుండి 8 గంటల 23 నిమిషాల వరకూ ఉన్నది. దుర్ముహర్తం ఉదయం ఎనిమిదింపావు నుంచి తొమ్మిదిన్నర వరకూ ఉంది. దుర్ముహర్తం మరలా రాత్రి పదిన్నర నుంచి పదకొండు గంటల 24 నిమిషాల వరకు ఉంది. సూర్యోదయ సమయం 6.25 , సూర్యాస్తమయం 5.22 నిమిషాలు.

మేష రాశి వారికి ;
తలచిన పనులు మనఃస్ఫూర్తిగా చేస్తారు. పిల్లల వలన కాస్త ఇబ్బంది ఎదుర్కోవాలసి వస్తుంది. జీవిత భాగస్వామితో అనుకూలంగా ఉండవలసి ఉంటుంది. కొన్ని అవకాశాలు చేజారే అవకాశం ఉంది. బాధ్యతగా వ్యవహరించవలసి ఉంటుంది. వృత్తి వ్యాపారాలు ఆనందాన్నిస్తాయి.

వృషభ రాశి వారికి ;
ఇంటికి సంబంధించిన పనులు బాధ్యతగా పూర్తి చేస్తారు. భార్య సహకారం పూర్తిగా ఉంటుంది. పనివారి సహాయ సహకారాలు పూర్తిగా ఉంటాయి. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

మిథున రాశి వారికి ;
చేయు పనులలో ఆటంకాలు ఉన్నాయి. ధనం కోసం ఇబ్బంది కూడా ఉంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. పిల్లలు బాధ్యతగా వ్యవహరిస్తారు.

కర్కాటక రాశి వారికి ;
ఈ రోజు ఆనందంగా గడుపుతారు. దగ్గరి ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సోదరుల రాకపోకలు ఉంటాయి. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి.

సింహ రాశి వారికి ;
ఇంటి పనులన్నీ పూర్తి చేస్తారు. ధన ప్రణాళికలు అనుకూలిస్తాయి. దగ్గరి ప్రయాణాలు కూడా చేస్తారు. పిల్లల పట్ల వ్యక్తిగత శ్రద్ధ అవసరం. దైవ దర్శన ప్రాప్తి కలదు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

కన్యా రాశి వారికి ;
విందు భోజనాలు చేస్తారు. మనస్సు ఆనందంగా ఉంటుంది. ధన ప్రణాళికలు అనుకూలిస్తాయి. అధికారుల మెప్పు పొందుతారు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

తులా రాశి వారికి ;
కోప తాపాలకి దారి ఇవ్వకండి. అవసరమైన సొమ్ము చేతికి వస్తుంది. సోదరుల సహకారం ఉంటుంది. భార్య సహకారం పొందుతారు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

వృశ్చిక రాశి వారికి ;
అనుకున్న పనులు పూర్తి చేస్తారు. భార్యతో అనుకూల దాంపత్యం చేస్తారు. దైవ దర్శనం ప్రాప్తి కలదు. దూరపు బంధువుల వార్తలు వింటారు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

ధనూ రాశి వారికి ;
తలచిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. ధన ఇబ్బందులు కలవు. సోదరుల, పనివారి సహకారం ఉంటుంది. బంధువుల సహకారం కూడా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు రాణిస్తారు.

మకర రాశి వారికి ;
చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి. దూరపు బంధువుల వార్తలు వింటారు. తండ్రిగారి ఆశీర్వాదం కూడా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు పట్టుదలగా పూర్తిచేస్తారు. అధికారులు ప్రసన్నం అవుతారు.

కుంభ రాశి వారికి ;
పనులు బాధ్యతాయుతంగా పూర్తి చేయవలసి ఉంటుంది. ధన ప్రణాళికలు రూపొందిస్తారు. కొన్ని అవకాశాలు చేజారకుండా చూసుకోవాలి. పనివారి సహకారం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

మీన రాశి వారికి ;
చేయవలసిన పనులలో ఆటంకాలు ఉంటాయి. రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. భార్య సహకారం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు భాధ్యతతో చేయవలసి ఉంటుంది.
ఇప్పటివరకూ ఈ నాటి దినఫలితాలను చూసారు కదా ! మీకేమైనా సందేహాలు ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. అది కూడా ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు.
సర్వేజనా సుఖినోఃభవంతు
సమస్త సన్మంగళానిభవంతు
అందరికీ నా నమస్కారం.



Click it and Unblock the Notifications
