Latest Updates
-
సలాడ్, జ్యూస్ లేదా స్టీమింగ్.. బీట్రూట్ను ఎలా తింటే ఎక్కువ లాభాలో తెలుసా.? -
వెల్లుల్లి ఘాటు,టమాటా పులుపు,గుడ్డు కమ్మదనం.. నోరూరించే టమాటా గార్లిక్ ఎగ్ రైస్! -
రోజువారీ ఆహారంలో వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారా.?.. మీ కిడ్నీలు రిస్క్‌లో పడినట్లే.! -
ప్రేమకు, పెళ్లికి జెన్ జీ యువత ఎందుకు దూరమవుతోంది? -
భాగస్వామి ఎంపిక విషయంలో పదే పదే తప్పు చేస్తున్నారా.. మిమ్మల్ని ఇరకాటంలో పెట్టే విషయాలివే.! -
మధ్యాహ్నం 12 లేదా 2 గంటలకే చెక్ ఇన్..హోటల్స్ ఫాలో అయ్యే రూల్ వెనుక అసలు కథ! -
బఠానీ, పెసరపప్పు కాంబినేషన్... ఈ సమోసా రుచి చూస్తే మళ్లీ మళ్లీ తింటారు! -
వ్యాయామం చేసటప్పుడు విపరీతంగా చెమట.. కొవ్వు కరిగిపోతుందని అస్సలు సంబరపడొద్దు.! -
ఉదయం లేవగానే ఒళ్లు నొప్పులు, జాయింట్స్ పట్టేస్తున్నాయా? -
పప్పులు నానబెట్టే పనిలేదు,రుబ్బే శ్రమలేదు..అటుకులు,బంగాళదుంపలతో క్షణాల్లో కరకరలాడే అప్పడాలు..
దిన ఫలాలు: బుదవారం 13 డిసెంబర్ 2017
భారతదేశం లేదా పాశ్చాత్య జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం మన జీవిత గమనాలు అంతరిక్షంలోని నక్షత్ర సమూహాలతో ఏర్పడ్డ వివిధ జన్మరాశుల స్థితి, గమనం పై ఆధారపడి ఉంటాయి. మొత్తం పన్నెండు రాశులు ఉంటాయి.

భారతదేశం లేదా పాశ్చాత్య జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం మన జీవిత గమనాలు అంతరిక్షంలోని నక్షత్ర సమూహాలతో ఏర్పడ్డ వివిధ జన్మరాశుల స్థితి, గమనం పై ఆధారపడి ఉంటాయి. మొత్తం పన్నెండు రాశులు ఉంటాయి. ఈ పన్నెండు రాశుల జ్యోతిష్య ఫలితాలు ఆయా సమయాల్లో గోచార స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని ఇవ్వటం జరుగుతుంది. ఈ ఫలితాలు సామాన్యంగా అన్ని వర్గాలకు కలిపి చెప్తారు. వ్యక్తిగతంగా మీ భవిష్యత్తు తెలుసుకోవాలనే ఆసక్తి వుంటే దగ్గరలో ఉన్న జ్యోతిష్య నిపుణుడి వద్ద సంప్రదించి , మీ జన్మ వివరాలను తీసుకువెళ్ళి జాతకాలను, వాటిలో దోషాలు, దానికి పరిష్కారాలు వివరంగా తెలుసుకోవచ్చు.
ఈ నాటి దినఫలాలు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయానికి చెందిన పెద్దలు బ్రహ్మశ్రీ శ్రీ నలమాటి కొండలరావు గారి నోటి మాటల్లోనే..

ఓం శ్రీ గురుభ్యోనమః
అఖిల భారత తెలుగు ప్రేక్షకులందరికీ అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమఃస్సుమాంజలి.
ది.13-12-2017 తారీఖు, బుధవారం నాటి దినఫలాలను ఒకసారి పరిశీలిద్దాం. హేమలంబి నామ సంవత్సరం, దక్షియాణనం, హేమంత రుతువు, మార్గశిర మాసం, బహుళ ఏకాదశి రాత్రి, తెల్లవారితే 5 గంటల 5 నిమిషాల వరకూ ఉన్నది. చిత్తా నక్షత్రం రాత్రి 11 గంటల 20 నిమిషాల వరకూ ఉంది. అమృత సమయం సాయంత్రం 4 గంటల 29 నిమిషాల నుంచి 6 గంటల 25 నిమిషాల వరకూ ఉంది. వర్జ్యం ఉదయం 7 గంటల 3 నిమిషాల నుండి 8 గంటల 41 నిమిషాల వరకూ ఉంది. మరలా వర్జ్యం రాత్రి తెల్లవారితే 5 గంటల 15 నిమిషాల నుండి ఉంది. దుర్ముహర్తం ఉదయం 11 గంటల 32 నిమిషాల నుండి 12 గంటల 16 నిమిషాల వరకూ ఉంది. సూర్యోదయ సమయం 6 గంటల 24 నిమిషాలకు, సూర్యాస్తమయ సమయం 5 గంటల 23 నిమిషాలకు.

మేష రాశి వారికి ;
అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. భార్యతో అనుకూల దాంపత్యం కలదు. తల్లి దండ్రులను ప్రేమతో చూసుకుంటారు. పిల్లల యెడల ప్రత్యేక శ్రద్ధ అవసరం. వృత్తి వ్యాపారాలు భాగ్యాన్ని కలుగచేస్తాయి.

వృషభ రాశి వారికి ;
చేయు పనులు సులువుగా సాగుతాయి. భార్య సహకారం పూర్తిగా ఉంటుంది. కొత్త అవకాశాలు చేజారిపోయే అవకాశం ఉంటుంది. పని వారి సహకారం పూర్తిగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

మిథున రాశి వారికి ;
ఈ రోజు చేయవలసిన పనులు ఆలస్యంగా అవుతూ ఉంటాయి. కష్టపడవలసిన సమయం. అప్పులు చేయవలసి వస్తుంది. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. భార్యతో భాధ్యతగా వ్యవహరించవలసి ఉంటుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి.

కర్కాటక రాశి వారికి ;
ఇంటి పనులు పూర్తి చేస్తారు. తల్లిదండ్రులను ప్రేమగా చూసుకుంటారు. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. అధికారులు ప్రసన్నం అవుతారు.

సింహ రాశి వారికి ;
స్త్రీలను గౌరవిస్తారు. ఇంటి సభ్యులను ప్రేమగా చూసుకుంటారు. దగ్గరి బంధువులు ఇంటికి వస్తారు. దగ్గరి ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దైవ దర్శన ప్రాప్తి కలదు. వృత్తి వ్యాపారాలు లాభాన్ని ఇస్తాయి.

కన్యా రాశి వారికి ;
తలచిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ధన ప్రణాళికలు అనుకూలిస్తాయి. సోదరుల సహకారం ఉంటుంది. భార్య సహకారంగా నడుచుకోగలదు. వృత్తి వ్యాపారాలు బాగానే ఉంటాయి.

తులా రాశి వారికి ;
మనస్సు ప్రశాంతంగా, సుఖంగా ఉంటుంది. ధన ప్రణాళికలు వేస్తారు. భార్య అనుకూలంగా మసులుకుంటుంది. వృత్తి వ్యాపారాలు రాణిస్తాయి. తండ్రి గారి సహకారం కూడా పొందుతారు.

వృశ్చిక రాశి వారికి ;
చేయు పనులు లాభాన్ని ఇస్తాయి. ఆధ్యాత్మిక ప్రసంగాలను వింటారు. దూరపు బంధువుల వార్తలు వింటారు. భార్య సహకారంగా ఉండగలదు. వృత్తి వ్యాపారాలు బాగానే ఉంటాయి.

ధనస్సు రాశి వారికి ;
చేయు పనులు బాధ్యతగా చేయవలసి ఉంటుంది. ధనానికి ఇబ్బందులు ఉంటాయి. ఆటంకాలు కూడా ఏర్పడతాయి. బంధువుల కలయిక కూడా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉండగలవు.

మకర రాశి వారికి ;
ఆటంకాలు ఉంటాయి. దుర్గా దేవిని ఆరాధించండి. అధికారులు ప్రసన్నం అవుతారు. తల్లి గారి ఆశీర్వాదం పొందండి. భార్య సహకారంగా ఉండగలదు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

కుంభ రాశి వారికి ;
పనులు బాధ్యతతో పూర్తి చేయవలసి ఉంటుంది. పనివారి సహకారం కూడా ఉంటుంది. తండ్రి గారిని ప్రసన్నం చేసుకోగలరు. దూరపు బంధువుల సమాచారం వింటారు. వృత్తి వ్యాపారాలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి.

మీన రాశి వారికి ;
చేయు పనులందు ఆటంకాలు ఉంటాయి. కొన్ని అవకాశాలు చేజారిపోయే అవకాశం ఉంటుంది. బాధ్యతగా ఉండాల్సి ఉంటుంది. పిల్లల యెందు ప్రత్యేక శ్రద్ధ అవసరం. వృత్తి వ్యాపారాలు కూడా శ్రద్ధగా చేయవలసి ఉంటుంది. దైవ దర్శనం చేసుకున్న యెడల అంతా మంచిగానే జరుగుతుంది.ఇప్పటివరకూ ఈ నాటి దినఫలితాలను చూసారు కదా ! మీకేమైనా సందేహాలు ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. అది కూడా ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు.
సర్వేజనా సుఖినోఃభవంతు
సమస్త సన్మంగళానిభవంతు
అందరికీ నా నమస్కారం.



Click it and Unblock the Notifications