Latest Updates
-
Weight loss Soup Recipe: కొవ్వును కరిగించి, యవ్వనంగా మార్చే అద్భుతమైన సూప్ ఇదే.. -
Viral Video: 22 ఏళ్ల కుర్రాడితో 40 ఏళ్ల మహిళ ఎఫైర్.. లేచిపోతుండగా ఏమైందంటే? -
ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండానే పరమ రుచిగా.. టెంపుల్ స్టైల్ సాంబార్ అన్నం చేసుకోండిలా! -
అద్దెకు దిగిన ఆంటీతో ఎఫైర్.. హెచ్ఐవీ సోకి ఇద్దరు అన్నదమ్ముల మృతి!..ఆమెతో పరిచయం ఉన్నవాళ్లంతా.. -
Guru nakshatra gochar: అక్టోబర్ 8న ఆశ్లేష నక్షత్రం నాల్గవ పాదంలోకి గురువు..నక్క తోక తొక్కే రాశులివే! -
రెగ్యులర్ కుర్మాకి గుడ్ బై.. పూరీలోకి కొత్త రుచులతో 'తీపి గుమ్మడికాయ కుర్మా'! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ శనగల పరాటా..రోజంతా ఎనర్జీ,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ -
ముంబై స్ట్రీట్ స్టైల్ చీజ్ పావ్ భాజీ.. ఉల్లి, వెల్లుల్లి లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నిజంగా నేరమా.. మన భారతీయ చట్టాలు ఏం చెబుతున్నాయంటే.! -
పైన క్రిస్పీగా.. లోపల సాఫ్ట్ గా.. సాయంత్రం పూట వేడివేడి పనీర్ ఫింగర్స్ చేసుకోండిలా..
దిన ఫలాలు: మంగళవారం 19 డిసెంబర్ 2017
భారతదేశం లేదా పాశ్చాత్య జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం మన జీవిత గమనాలు అంతరిక్షంలోని నక్షత్ర సమూహాలతో ఏర్పడ్డ వివిధ జన్మరాశుల స్థితి, గమనం పై ఆధారపడి ఉంటాయి. మొత్తం పన్నెండు రాశులు ఉంటాయి.

భారతదేశం లేదా పాశ్చాత్య జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం మన జీవిత గమనాలు అంతరిక్షంలోని నక్షత్ర సమూహాలతో ఏర్పడ్డ వివిధ జన్మరాశుల స్థితి, గమనం పై ఆధారపడి ఉంటాయి. మొత్తం పన్నెండు రాశులు ఉంటాయి. ఈ పన్నెండు రాశుల జ్యోతిష్య ఫలితాలు ఆయా సమయాల్లో గోచార స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని ఇవ్వటం జరుగుతుంది. ఈ ఫలితాలు సామాన్యంగా అన్ని వర్గాలకు కలిపి చెప్తారు. వ్యక్తిగతంగా మీ భవిష్యత్తు తెలుసుకోవాలనే ఆసక్తి వుంటే దగ్గరలో ఉన్న జ్యోతిష్య నిపుణుడి వద్ద సంప్రదించి , మీ జన్మ వివరాలను తీసుకువెళ్ళి జాతకాలను, వాటిలో దోషాలు, దానికి పరిష్కారాలు వివరంగా తెలుసుకోవచ్చు.

ఈ నాటి దినఫలాలు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయానికి చెందిన పెద్దలు బ్రహ్మశ్రీ శ్రీ నలమాటి కొండలరావు గారి నోటి మాటల్లోనే..
ఓం శ్రీ గురుభ్యోనమః
అఖిల భారత తెలుగు ప్రేక్షకులందరికీ అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమఃస్సుమాంజలి.
ది. 19-12-2017 తారీఖు, మంగళవారం నాటి దిన ఫలాలను ఒకసారి పరిశీలిద్దాం. హేమలంబి నామ సంవత్సరం, దక్షియాణనం, హేమంత రుతువు, శీతాకాలం, పుష్య మాసం, శుద్ధ పాడ్యమి మధ్యాహ్నం ఒంటి గంట 3 నిమిషాల వరకూ ఉంది. మూలా నక్షత్రం ఉదయం 9 గంటల 22 నిమిషాల వరకూ ఉంది. వర్జ్యం ఉదయం 7 గంటల 36 నిమిషాల నుంచి 9 గంటల 25 నిమిషాల వరకూ ఉంది. మరలా వర్జ్యం రాత్రి 8 గంటల 3 నిమిషాల నుండి 9 గంటల 40 నిమిషాల వరకూ ఉంది. దుర్ముహర్తం ఉదయం 8 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల 23 నిమిషాల వరకూ ఉంది. మరలా దుర్ముహర్తం రాత్రి 10 గంటల 36 నిమిషాల లగాయతు 11.20 నిమిషాల వరకూ ఉంది. సూర్యోదయ సమయం 6 గంటల 20 నిమిషాలకు, సూర్యాస్తమయ సమయం 5 గంటల 23 నిమిషాలకు.

మేష రాశి : 21 మార్చి-20 ఏప్రిల్
అనుకున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. తండ్రి గారి ఆశీర్వాదం పొందుతారు. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు భాగ్యాన్ని కలుగచేస్తాయి. భార్య సహకారం కూడా ఉంటుంది.

వృషభ రాశి : 21 ఏప్రిల్-21 మే
తలచిన పనులందు ఆటంకాలు ఉంటాయి. కొత్త అవకాశాలు చేతికి వచ్చి జారిపోయే అవకాశం కూడా ఉంది. పని వారి సహాయ సహకారాలు ఉంటాయి. పిల్లలతో కలిసి విందు భోజనం చేస్తారు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

మిథున రాశి : 22 మే-21 జూన్
తలచిన పనులు ఆటంకాలతో ముగుస్తాయి. ధనానికి ఇబ్బంది ఉంటుంది. పిల్లలు తమ పనిని పట్టుదలగా పూర్తి చేస్తారు. భార్య సహకారం మెండుగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

కర్కాటక రాశి : 22 జూన్-22 జూలై
తలచిన పనులు ఆటంకాలతో ఉంటాయి. ధన ఇబ్బందులు కలవు. ఇంటి పనులందు శ్రద్ధ వహిస్తారు. పిల్లలతో అనుకూలంగా మసలుకుంటారు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

సింహ రాశి : 23 జూలై-21 ఆగష్ట్
పిల్లలతో ఆనందాన్ని పంచుకుంటారు. దగ్గరి ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సోదరుల సహకారం కూడా ఉంటుంది. దైవ దర్శన ప్రాప్తి కూడా కలదు. భార్య సహకారం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

కన్యా రాశి : 22 ఆగష్ట్-23 సెప్టెంబర్
ధన ప్రణాళికలు వేస్తారు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని చూస్తారు. పనివారి సహకారం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు ఒక మాదిరిగా ఉంటాయి.

తులా రాశి : 24 సెప్టెంబర్-23 అక్టోబర్
అనుకున్న పనులు పూర్తి చేస్తారు. భార్య అనుకూలంగా ఉండగలదు. దగ్గరి ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సోదరుల రాకపోకలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

వృశ్చిక రాశి : 24 అక్టోబర్-22 నవంబర్
కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ధన ప్రణాళికలు అనుకూలిస్తాయి. రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. దైవ దర్శన ప్రాప్తి ఉంటుంది. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

ధనూ రాశి : 23 నవంబర్-22 డిసెంబర్
తలచిన పనులు పూర్తి చేస్తారు. మనస్సు శాంతిగా ఉన్నప్పటికీ కొంచెం అశాంతి కూడా ఏర్పడుతుంది. ధనానికి ఇబ్బందులు ఉంటాయి. సోదర, మిత్రుల సహకారం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

మకర రాశి : 23 డిసెంబర్-20 జనవరి
భక్తి ప్రవచనాలు వింటారు. చేయు పనులలో ఆటంకాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. బంధు మిత్రుల కలయిక కూడా ఉంటుంది.

కుంభ రాశి : 21 జనవరి-19 ఫిబ్రవరి
బంధు మిత్రుల కలయికలు ఉంటాయి. పని వారి సహకారం కూడా ఉంటుంది. తండ్రి గారి ఆశీర్వాదం పొందండి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. భార్య సహకారం ఉండగలదు.

మీన రాశి : 20 ఫిబ్రవరి-20 మార్చి
అనుకున్న పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. దైవ దర్శన ప్రాప్తి కలదు. వృత్తి వ్యాపారాలు ఆనందాన్ని ఇస్తాయి. భార్యతో అనుకూల దాంపత్యం కలదు. పిల్లలు ఆనందాన్ని కలుగచేస్తారు.
ఇప్పటి వరకూ ఈ నాటి దిన ఫలితాలను చూసారు కదా ! మీకేమైనా సందేహాలు ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. అది కూడా ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు.
సర్వేజనా సుఖినోఃభవంతు
సమస్త సన్మంగళానిభవంతు
అందరికీ నా నమస్కారం.



Click it and Unblock the Notifications
