Latest Updates
-
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే!
దిన ఫలాలు: గురువారం 21 డిసెంబర్ 2017
భారతదేశం లేదా పాశ్చాత్య జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం మన జీవిత గమనాలు అంతరిక్షంలోని నక్షత్ర సమూహాలతో ఏర్పడ్డ వివిధ జన్మరాశుల స్థితి, గమనం పై ఆధారపడి ఉంటాయి. మొత్తం పన్నెండు రాశులు ఉంటాయి.

భారతదేశం లేదా పాశ్చాత్య జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం మన జీవిత గమనాలు అంతరిక్షంలోని నక్షత్ర సమూహాలతో ఏర్పడ్డ వివిధ జన్మరాశుల స్థితి, గమనం పై ఆధారపడి ఉంటాయి. మొత్తం పన్నెండు రాశులు ఉంటాయి. ఈ పన్నెండు రాశుల జ్యోతిష్య ఫలితాలు ఆయా సమయాల్లో గోచార స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని ఇవ్వటం జరుగుతుంది. ఈ ఫలితాలు సామాన్యంగా అన్ని వర్గాలకు కలిపి చెప్తారు. వ్యక్తిగతంగా మీ భవిష్యత్తు తెలుసుకోవాలనే ఆసక్తి వుంటే దగ్గరలో ఉన్న జ్యోతిష్య నిపుణుడి వద్ద సంప్రదించి , మీ జన్మ వివరాలను తీసుకువెళ్ళి జాతకాలను, వాటిలో దోషాలు, దానికి పరిష్కారాలు వివరంగా తెలుసుకోవచ్చు.
ఈ నాటి దినఫలాలు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయానికి చెందిన పెద్దలు బ్రహ్మశ్రీ శ్రీ నలమాటి కొండలరావు గారి నోటి మాటల్లోనే..
ఓం శ్రీ గురుభ్యోనమః
అఖిల భారత తెలుగు ప్రేక్షకులందరికీ అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమఃస్సుమాంజలి.
ది. 21-12-2017 తారీఖు, గురువారం నాటి దిన ఫలాలను ఒకసారి పరిశీలిద్దాం. హేమలంబి నామ సంవత్సరం, దక్షియాణనం, హేమంత రుతువు, శీతాకాలం, పుష్య మాసం, శుద్ధ తదియ సాయంత్రం 5 గంటల 14 నిమిషాల వరకూ ఉంది. ఉత్తరాషాఢ నక్షత్రం మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల వరకూ ఉంది. అమృత సమయం ఉదయం 7 గంటల 20 నిమిషాల నుండి 9 గంటల 15 నిమిషాల వరకూ ఉంది. మరలా అమృత సమయం తెల్లవారితే ఉదయం 5 గంటల 22 నిమిషాల నుండి ప్రారంభం అవుతుంది. వర్జ్యం ఉదయం 6 గంటల 59 నిమిషాల నుండి 8 గంటల 38 నిమిషాల వరకూ ఉంది. దుర్ముహర్తం ఉదయం 10 గంటల 8 నిమిషాల నుండి 52 నిమిషాల వరకూ ఉంది. మరలా దుర్ముహర్తం మధ్యాహ్నం 2 గంటల 32 నిమిషాల నుండి 3 గంటల 16 నిమిషాల వరకూ ఉంది. సూర్యోదయ సమయం 6 గంటల 28 నిమిషాలకు, సూర్యాస్తమయ సమయం 5 గంటల 23 నిమిషాలకు

మేష రాశి: 21 మార్చి-20 ఏప్రిల్
వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి కొరకు ప్రణాళికలు వేస్తారు. భార్య సహకారంతో ప్రణాళికలు పూర్తి చేస్తారు. తండ్రి గారి ఆశీర్వాదం పొందండి. పిల్లలు పెద్దల మాట మేరకు నడుస్తారు. భూ సంబంధ కార్యక్రమాలు అనుకూలిస్తాయి.

వృషభ రాశి: 21 ఏప్రిల్-21 మే
దూరపు బంధువుల వార్తలు వింటారు. పని వారి సహకారం ఉంటుంది. పిల్లలు వారి పనులను పూర్తి చేస్తారు. తండ్రి గారి ఆశీర్వాదం కూడా పొందుతారు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉండగలవు.

మిథున రాశి: 22 మే-21 జూన్
తలచిన పనులందు ఆటంకాలు ఉంటాయి. కొత్త అవకాశాలు చేజారే సమయం. ధనానికి కొంత కొరత ఉంటుంది. పిల్లలతో ప్రయాణాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

కర్కాటక రాశి: 22 జూన్-22 జూలై
అనుకున్న పనులు భార్య సహకారంతో పూర్తి చేస్తారు. ఇంటి పనులు పూర్తి చేస్తారు. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. సోదరుల సహకారం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు బావుంటాయి.

సింహ రాశి: 23 జూలై-21 ఆగష్ట్
దైవ దర్శన ప్రాప్తి కలదు. దగ్గరి ప్రయాణాలు చేస్తారు. పిల్లల విషయంలో బాధ్యతగా వ్యవహరిస్తారు. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి.

కన్యా రాశి : 22 ఆగష్ట్-23 సెప్టెంబర్
పిల్లలు అభివృద్ధికి ప్రణాళికలు వేస్తారు. ధన ప్రణాళికలు పట్టుదలగా పూర్తి చేస్తారు. ప్రయాణాలలో మెలకువ అవసరం. పనివారి సహకారం ఉంటుంది. సోదరుల సహకారం, మిత్రుల సహకారంతో వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.

తులా రాశి: 24 సెప్టెంబర్-23 అక్టోబర్
చేయు పనులు శుభ ఫలితాలను ఇస్తాయి. భార్య సహకారం పూర్తిగా ఉంటుంది. సోదరులు అనుకూలిస్తారు. తల్లి గారిని ప్రేమగా చూసుకుంటారు. వారి అవసరాలను తీరుస్తారు. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతాయి.

వృశ్చిక రాశి: 24 అక్టోబర్-22 నవంబర్
దగ్గరి ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. దైవ దర్శన ప్రాప్తి ఉంటుంది. దూర వార్తలు వింటారు. వృత్తి వ్యాపారాలలో ధనం చేకూరుతుంది.

ధనూ రాశి: 23 నవంబర్-22 డిసెంబర్
అనుకున్న పనులు నెరవేరతాయి. ధన ప్రణాళికలు అనుకూలిస్తాయి. సోదరుల, మిత్రుల సహకారం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

మకర రాశి: 23 డిసెంబర్-20 జనవరి
ఈ రోజు ఆనందంగా గడుస్తుంది. అనుకున్నవి జరుగుతాయి. విందు భోజనం లభిస్తుంది. భార్యతో అనుకూల దాంపత్యం కలదు. వృత్తి వ్యాపారాలు పట్టుదలగా పూర్తి చేస్తారు.

కుంభ రాశి: 21 జనవరి-20 ఫిబ్రవరి
ఆధ్యాత్మిక ప్రసంగాలు వింటారు. బంధు మిత్రుల కలయికలు ఉంటాయి. పని వారి సహాయ సహకారాలు కూడా ఉంటాయి. భూ సంబంధ లావాదేవీలకు శుభ పరిణామం. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

మీన రాశి: 20 ఫిబ్రవరి-20 మార్చి
చేయు పనులందు ఆటంకాలు ఉంటాయి. బంధు మిత్రుల కలయికలు ఉంటాయి. దైవ దర్శన ప్రాప్తి కలదు. భార్య సహకారంగా మసులుకోగలదు. వృత్తి వ్యాపారాలను బాధ్యతతో చేయవలసి ఉంటుంది.
ఇప్పటి వరకూ ఈ నాటి దిన ఫలితాలను చూసారు కదా ! మీకేమైనా సందేహాలు ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. అది కూడా ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు.
సర్వేజనా సుఖినోఃభవంతు
సమస్త సన్మంగళానిభవంతు
అందరికీ నా నమస్కారం.



Click it and Unblock the Notifications











