Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి!
దిన ఫలాలు: శుక్రవారం 29 డిసెంబర్ 2017
భారతదేశం లేదా పాశ్చాత్య జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం మన జీవిత గమనాలు అంతరిక్షంలోని నక్షత్ర సమూహాలతో ఏర్పడ్డ వివిధ జన్మరాశుల స్థితి, గమనం పై ఆధారపడి ఉంటాయి. మొత్తం పన్నెండు రాశులు ఉంటాయి.
భారతదేశం లేదా పాశ్చాత్య జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం మన జీవిత గమనాలు అంతరిక్షంలోని నక్షత్ర సమూహాలతో ఏర్పడ్డ వివిధ జన్మరాశుల స్థితి, గమనం పై ఆధారపడి ఉంటాయి. మొత్తం పన్నెండు రాశులు ఉంటాయి. ఈ పన్నెండు రాశుల జ్యోతిష్య ఫలితాలు ఆయా సమయాల్లో గోచార స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని ఇవ్వటం జరుగుతుంది. ఈ ఫలితాలు సామాన్యంగా అన్ని వర్గాలకు కలిపి చెప్తారు. వ్యక్తిగతంగా మీ భవిష్యత్తు తెలుసుకోవాలనే ఆసక్తి వుంటే దగ్గరలో ఉన్న జ్యోతిష్య నిపుణుడి వద్ద సంప్రదించి , మీ జన్మ వివరాలను తీసుకువెళ్ళి జాతకాలను, వాటిలో దోషాలు, దానికి పరిష్కారాలు వివరంగా తెలుసుకోవచ్చు.
ఈ నాటి దినఫలాలు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయానికి చెందిన పెద్దలు బ్రహ్మశ్రీ శ్రీ నలమాటి కొండలరావు గారి నోటి మాటల్లోనే..

ఓం శ్రీ గురుభ్యోనమః
అఖిల భారత తెలుగు ప్రేక్షకులందరికీ అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమఃస్సుమాంజలి.
ది. 29-12-2017 తారీఖు, శుక్రవారం నాటి దిన ఫలాలను ఒకసారి పరిశీలిద్దాం. హేమలంబి నామ సంవత్సరం, దక్షియాణనం, హేమంత రుతువు, శీతాకాలం, పుష్య మాసం, శుద్ధ ఏకాదశి సాయంత్రం 5 గంటల 32 నిమిషాల వరకు ఉంది. భరణి నక్షత్రం సాయంత్రం 7 గంటల 27 నిమిషాల వరకూ ఉంది. అమృత సమయం 2 గంటల 52 నిమిషాల నుండి 4 గంటల 20 నిమిషాల వరకు ఉంది. వర్జ్యం ఉదయం 7 గంటల 8 నిమిషాల వరకు ఉంది. దుర్ముహర్తం ఉదయం 8 గంటల 40 నిమిషాల నుండి 9 గంటల 27 నిమిషాల వరకు ఉంది. మరలా దుర్ముహర్తం మధ్యాహ్నం 12 గంటల 43 నిమిషాల నుండి ఒంటి గంట 27 నిమిషాల వరకు ఉంది. సూర్య ఉదయ సమయం 6 గంటల 32 నిమిషాలకు, సూర్యాస్తమయ సమయం సాయంత్రం 5 గంటల 32 నిమిషాలకు.

మేష రాశి: 21 మార్చి-20 ఏప్రిల్
అనుకున్నవన్నీ సక్రమంగా జరుగుతాయి. మంచి విందు భోజనం కూడా లభిస్తుంది. భార్య సహకారంతో మరింత ముందుకి వెళ్తారు. తండ్రి గారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీతోనే ఉంటాయి. వృత్తి వ్యాపారాలు మంచి భాగ్యాన్ని కలుగచేస్తాయి.

వృషభ రాశి: 21 ఏప్రిల్-21 మే
తలచిన పనులకి ఆటంకాలు, వాయిదాలు ఎక్కువ పడతాయి. ఈ రోజు డబ్బు ఎక్కువ ఖర్చు అయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. దైవ బలం కూడా మీకు ఉంటుంది. పని వారి సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా నడుస్తాయి.

మిథున రాశి: 22 మే-21 జూన్
అనుకున్న పనులు వాయిదా పడతాయి. బంధు మిత్రుల కలయికలతో ఆనందంగా గడుపుతారు. అనవసర ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. అన్ని విషయాలకు కూడా భార్య సపోర్టుగా నిలుస్తుంది. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

కర్కాటక రాశి: 22 జూన్-22 జూలై
వ్యాపార అభివృద్ధికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. తల్లి గారి ఆశీర్వాదం కూడా ఉంటుంది మీకు. ఇంటికి సంబంధించిన పనులు శ్రద్ధగా పూర్తి చేస్తారు. పిల్లల ప్రవర్తన మీకు ఆనందాన్ని కలుగచేస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలను పొందుతారు.

సింహ రాశి: 23 జూలై-21 ఆగష్ట్
దగ్గరి ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సోదరుల సహకారం లభించగలదు. పిల్లల యెందు బాధ్యతగా వ్యవహరించవలసి ఉంటుంది. దూరపు బంధువుల వార్తలు వింటారు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

కన్యా రాశి : 22 ఆగష్ట్-23 సెప్టెంబర్
ధన ప్రణాళికలు వేయవలసి ఉంటుంది. కొన్ని అవకాశాలు చేజారే ప్రమాదం ఉంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. రుణాలు కూడా చేయవలసి వస్తుంది. సహచరుల సహకారం ఉంటుంది.

తులా రాశి: 24 సెప్టెంబర్-23 అక్టోబర్
అనుకున్న పనులు పూర్తి చేస్తారు. భార్యతో అనుకూల దాంపత్యం కలదు. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతాయి. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలందు లాభం కలుగుతుంది.

వృశ్చిక రాశి: 24 అక్టోబర్-22 నవంబర్
అనుకున్న పనులు నెమ్మదిగా సాగుతాయి. దూరపు ప్రాంత వార్తలు వింటారు. కొన్ని అవకాశాలు చేజారకుండా చూసుకోవాలి. కొన్ని అనవసర ఖర్చులు కూడా ఉంటాయి. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

ధనూ రాశి: 23 నవంబర్-22 డిసెంబర్
తలచిన పనులు పూర్తి చేయాలని ప్రణాళికలు వేసుకుంటారు. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. పిల్లలు అభివృద్ధి పథంలో నడుస్తారు. బంధు మిత్రుల పరిచయాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

మకర రాశి: 23 డిసెంబర్-20 జనవరి
చేయు పనులందు అడ్డంకులున్నాయి. ఇంటికి సంబంధించిన పనులు శ్రద్ధగా పూర్తి చేస్తారు. తల్లి గారి ఆనందానికై శ్రమ పడతారు. అనవసర ఖర్చుల నుండి జాగ్రత్తపడాల్సిన సమయం. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

కుంభ రాశి: 21 జనవరి-20 ఫిబ్రవరి
దగ్గరి ప్రయాణాలు చేయవలసి వస్తుంది. బంధువుల రాకపోకలు ఉంటాయి. అధికారుల మెప్పు పొందుతారు. పని వారి సహకారం కూడా పూర్తిగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

మీన రాశి: 20 ఫిబ్రవరి-20 మార్చి
ధన ప్రణాళికలు వేస్తారు. దైవ దర్శన ప్రాప్తి కూడా ఉంది. పిల్లల గురించి ఆలోచించవలసిన సమయం. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. ఉద్యోగస్తులు గౌరవ మర్యాదలు పొందుతారు.
ఇప్పటి వరకూ ఈ నాటి దిన ఫలితాలను చూసారు కదా ! మీకేమైనా సందేహాలు ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. అది కూడా ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు.
సర్వేజనా సుఖినోఃభవంతు
సమస్త సన్మంగళానిభవంతు
అందరికీ నా నమస్కారం.



Click it and Unblock the Notifications











