For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాశిచక్రాల ప్రకారం, మనసును విచ్చిన్నం చేసే లక్షణాలు మీలో ఎంతవరకు ఉన్నాయో తెలుసుకోండి.

|

ప్రతి రాశిచక్ర సంకేతం విభిన్న సంభావ్యతలతో కూడుకుని ఉంటుంది. ఇది వ్యక్తిగతంగా, వృత్తి, ప్రేమ, మొదలైన అంశాలుగా ఉండవచ్చు. మనం ఇదివరకే రాశిచక్ర సంకేతాల గురించిన అనేక వివరాలను తెలుసుకున్నాము, ఇప్పుడు జ్యోతిషశాస్త్ర అంచనాల ప్రకారం శృంగారానికి వ్యతిరేక దృక్పధంతో కూడిన రాశిచక్రాల గురించిన వివరాలను కూడా చూద్దాం. ఇది నాణేనికి మరో కోణం అన్నమాట. మీ వ్యక్తిత్వం అనుసరించి, ఎంతమేర మీరు ఇతరుల మనసును గాయపరచే లక్షణాలను కలిగి ఉన్నారో ఇప్పుడు చూద్దాం.

మేషం:

మేషం:

ఒక మేషరాశికి చెందిన వ్యక్తిగా, మీకు ఓపిక, సహనం అత్యల్పంగా ఉంటాయి. మరియు సుదీర్ఘకాలం ఒకే అంశానికి లేదా ఒకే వ్యక్తికి మీరు కట్టుబడి ఉండలేరు. ఒకవేళ మీరు ఒక వ్యక్తిపట్ల ఆకర్షితులైనప్పటికీ, కొద్దివారాల వ్యవధిలోనే, సంబంధానికి దూరంగా ఉండాలన్న ఆలోచనలు చేస్తుంటారు. ప్రేమలో, సంబంధంలో సులువుగా పడిపోయేలా చేయగలిగే సామర్ధ్యాలను కలిగి ఉన్న మీరు, బంధాలకు బంధుత్వాలకు అంత తేలిగ్గా కట్టుబడి ఉండలేరు. మీ ఆలోచనాస్థాయిలను అందుకునే వ్యక్తులు మాత్రమే ఎన్నటికీ మీ సన్నిహితులుగా ఉండగలరు.

వృషభం:

వృషభం:

ఒక వృషభరాశికి చెందిన వ్యక్తిగా, సంబంధంలో మీ నిబద్దతకు భిన్న కోణంగా, ఇతరుల హృదయాన్ని విచ్ఛిన్నంచేసే సామర్ధ్యాన్ని కూడా కలిగి ఉంటారు. దీర్ఘకాలంగా మీతో సంబంధంలో ఉంచేందుకు మీమనసు అంగీకరించని పక్షంలో వారి మనసును గాయపరచి, దూరం చేసేందుకు కూడా వెనుకాడరు. కానీ ఇరుపక్కల క్షేమాన్ని మనసులో ఉంచుకునే నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. ఒకరి పట్ల ప్రేమను కలిగి ఉండి, అంతే ప్రేమను తిరిగి పొందుతున్న ఎడల, ఎటువంటి సమస్యలు లేకుండా సంబంధాన్ని కొనసాగిస్తారు. కానీ, భాగస్వామి ప్రకారం ప్రేమ సంబంధిత అంశాలలో ఎటువంటి అసౌకర్యం కలిగినా వివాహానికి ముందే దూరంచేసేలా ప్రణాళికలు చేస్తుంటారు.

మిధునం:

మిధునం:

ఇతరుల మనసును గాయపరచడం, మీ మానసిక అస్థిరత కారణంగా ఉంటుంది. మీతో సన్నిహితంగా ఉండడం, ఇతరులకు ఒక రోలర్-కాస్టర్ రైడ్ తో సమానం. ఎందుకంటే, ఏదో ఒకరోజు మీరు ఖచ్చితంగా మీ కోపతాపాలను భిన్న కోణాలలో ప్రదర్శించి, అవసరం లేకపోయినా, పాత విషయాలను జ్ఞప్తికి తెచ్చుకుని మరీ ఇతరుల మనసును గాయపెడుతుంటారు. కానీ కోపం హరించుకుపోయి, శాంతమూర్తిగా మారిన తర్వాత జరిగిన సన్నివేశాన్ని తలచుకుని భాదపడుతుంటారు కూడా.

కర్కాటకం:

కర్కాటకం:

ప్రవర్తనా సరళి, అనూహ్యమైన ఆలోచనా విధానాలను బట్టి చూస్తే, మీరు ఖచ్చితంగా ఇతరుల మనసును భాదపెట్టే లక్షణాలను కలిగి ఉన్నారని చెప్పవచ్చు. మీరు ఎటువంటి విషయాలనైనా అధిగమించటానికి ప్రయత్నిస్తారు. ప్రతిఅంశంలో మీ అనుమానాస్పద ధోరణి, మీ ఆలోచనా వైఖరి మీ సంబంధంలో కలతలను తెచ్చే అవకాలు కూడా ఉన్నాయి. మీరు ఎక్కువగా నమ్మే కుటుంబసభ్యులు లేదా ప్రాణస్నేహితుల మాటలకు విలువిచ్చి, భాగస్వామిని సైతం ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. ఏదిఏమైనా ప్రతి విషయాన్ని మీతో కలిసి చర్చించుకునేలా మీభాగస్వామి ఉండాలని కోరుకుంటూ ఉంటారు.

సింహం:

సింహం:

మీ భాగస్వామితో అన్ని విషయాలను పంచుకొనుటకు ఎన్నటికీ సిద్దంగా ఉండరు. ఈ పరిస్థితి, కొంతకాలానికి మీభాగస్వామి ఆలోచనల్లో మార్పులను తీసుకుని రాగలదు. క్రమంగా మీ విధానాలు మనసును భాదపెట్టిన ఎడల, నెమ్మదిగా కుటుంబ కలహాలకు కారణమవుతుంది. అందరి దృష్టి మీమీదే ఉండాలని భావించే ఆలోచనలు అదుపుతప్పి, మీ భాగస్వామి మీమీద మరింత దృష్టిసారించే అవకాశాలు ఏర్పడవచ్చు. క్రమంగా అనుమానాస్పద వైఖరి తోడై సమస్యలు తీవ్రతరం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

 కన్య:

కన్య:

కన్యారాశివారు, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అయినా అధిక సమయాన్ని తీసుకుంటూ ఉంటారు. దీనికి కారణం, ఉత్తమమైన ఫలితాల సాధన కోసం. వీరు నిర్ణయం తీసుకునే అంశాలు, ఇతరులకు క్లిష్టమైన అంశాలవలె ఉంటాయి. క్రమంగా మనస్పర్ధలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఒక కొత్త సంబంధం లేదా డేటింగ్ ప్రారంభించినప్పుడు, ప్రతి అంశం గురించి మీరు తీవ్రంగా ఆలోచిస్తారు. కానీ అందరికీ సహనం, ఓర్పులు అనేవి ఒకే స్థాయిలో ఉండవని గ్రహించాలి. క్రమంగా మీ ఆలోచనా విధానం, వారి మనసు గాయపడేలా చేస్తుంది.

తుల:

తుల:

మీరు ఒక వ్యక్తిగా, గొప్ప ఆలోచనా విధానాలను కలిగి ఉంటారు. కాని తులారాశి వ్యక్తులు, ప్రజల భావాలతో ప్రయోగాలు చేస్తూ, వారి హృదయాన్ని దెబ్బతీసే తత్వాలను కూడా కలిగి ఉంటారు. ఒక వ్యక్తిగా, దీర్ఘాలోచనలు చేస్తూ ఉత్తమ ఫలితాల సాధనపై దృష్టి సారిస్తుంటారు. సామాజికంగా వ్యక్తులతో స్నేహపూర్వకంగా ఉంటారు. మరియు ఇతరులు మీతో సౌకర్యవంతంగా ఉండేలా మీ విధానాలు, అలవాట్లు ఉంటాయి. అయితే, మీరు సంతులనాన్ని పాటించవలసిన అవసరం ఉంది. మీరు ఎవరినీ గుడ్డిగా నమ్మరు. డిటెక్టివ్ ఆలోచనలు కలిగి ఉంటారు. ఇవి ఒక్కోసారి, కొందరిని బాధపెట్టవచ్చు కూడా.

వృశ్చికం:

వృశ్చికం:

మీ నిజాయితీ స్థాయిలు, ఇతరుల మనసును విచ్ఛిన్నం చేస్తుంది. ఏమాట మాట్లాడినా ముక్కుసూటి తత్వాన్ని ప్రదర్శిస్తుంటారు. మీరు ఇతర వ్యక్తులవలె సున్నితంగా విషయాలను వ్యవహరించడానికి ఇష్టపడరు. మీ నీతినిజాయితీలు ఇతరుల జీవితంలో సమస్యలను సృష్టిస్తున్నా కూడా, ఏమాత్రం ఆలోచన లేకుండా మీ వ్యవహారశైలి ఉంటుంది. ఇది ఇతరులపట్ల ఎప్పటికైనా సమస్యే.

ధనుస్సు:

ధనుస్సు:

వృత్తి జీవితం, వివాహ సంబంధాల విషయంలో వీరి నిర్ణయాలు కఠినంగా ఉంటాయి. మీ ఆలోచనా విధానాలు ఆర్ధిక సమస్యలు లేకుండా కుటుంబాన్ని నడిపేవిలా ఉంటాయి. మరియు ఎక్కువగా వృత్తిపరమైన అంశాలకు, పొదుపుకు అధిక ప్రాధాన్యతని ఇస్తుంటారు. మీ సంబంధాల కన్నా, మీవృత్తి పట్ల చూపే అంకితభావం, మీ భాగస్వామి మనసు కష్టపడేలా చేయగలదు.

మకరం:

మకరం:

ఎటువంటి క్లిష్టసమయాల్లో అయినా కూడా, సమయం దుర్వినియోగం చేస్తూ, అన్నిటా ఆలస్య ధోరణిని కలిగి ఉంటారు. క్రమంగా కొన్ని సమయాల్లో మీ భాగస్వామి మనసు భాదపడేలా చేస్తుంది. ఉదాహరణకు ఎవరైనా వ్యక్తులను గడువులోపు కలవాల్సిన పరిస్థితులు వస్తే, మీరు చేసే ఆలస్యం వారి మనసు బాధపడేలా చేసే అవకాశాలు ఉన్నాయి. వాస్తవానికి, మీరు అత్యంత అధ్బుతమైన వ్యక్తిగా ఉంటారు, మరియు ఇతరుల పట్ల అధిక అంచనాలను కలిగి ఉంటారు. అయితే సమయానుసారం ప్రణాళికలు కలిగి ఉండాలని గుర్తుంచుకోవాలి. ఒక్కోసారి ఇటువంటివే సంబంధాలలో కలతలకు, గొడవలకు దారితీస్తాయి.

కుంభం:

కుంభం:

మీరు అత్యంత తెలివైన మరియు చురుకైన మేధావి లక్షణాలను కలిగి ఉన్న కారణాన, ఇతరుల పట్ల ఎన్నడూ గెలవాలనే తపనను ప్రదర్శిస్తుంటారు. కానీ, ఎవరితో మనం ఇలా ప్రవర్తిస్తున్నాం అన్న ఆలోచన చేయరు. ఇది మీభాగస్వామి మనసూ చివుక్కుమనేలా చేస్తుంది. మీ గెలవాలన్న తపన, ప్రేమను కూడా పక్కన పెడుతుంది.

మీనం:

మీనం:

మీనరాశి, వారి కళాత్మక స్వభావాలను మరియు సామర్ధ్యాల గురించి ప్రశంసలను పొందాలని భావిస్తుంటారు. తమను విస్మరించిన వారి పట్ల కూసింత హేయభావాన్ని ప్రదర్శిస్తుంటారు. ఇది ఇతరుల మనసును విచ్చిన్నం చేసేలా చేస్తుంటుంది.

English summary

Are you a heartbreaker according to your Zodiac Sign? Read to know

Every Zodiac sign comes with a different potential, whether it be personal, professional or love life. We have talked about so many aspects of the Zodiac signs, let's delve into the other side of romance and astrological aspects of it - So what is about your personality that you hold per your zodiac sign that is heart breaking?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more