న‌ల్ల‌గా ఉన్న త‌ల్లికి తెల్ల‌ని పాప పుట్టింది. ల‌క్ష‌ల్లో ఒకరికి ఇలా జ‌రుగుతుంద‌ట‌!

Posted By: sujeeth kumar
Subscribe to Boldsky

ఎవ‌రైనా జంటకు రెండు ర‌కాల వ‌ర్ణాలు క‌ల‌గ‌లిసి ఉంటే పిల్ల‌లూ అలాగే పుట్ట‌డం స‌హ‌జం. త‌ల్లిదండ్రులిద్ద‌రి పోలిక‌ల‌తో పిల్ల‌లు పుట్ట‌డం తెలిసిన సంగ‌తే. అయితే పిల్ల‌లు ఒక్క‌రి పోలిక‌తోనే పుడితే? ఇదేమంత వింత అనుకుంటున్నారా? న‌లుపు వ‌ర్ణంలో ఉన్న ఒక మ‌హిళ అచ్చంగా తెల్ల‌గా ఉండే అమ్మాయికి జ‌న్మ‌నిచ్చింది.

ఇక్కడేదో మేము ఒక వ‌ర్ణాన్ని గొప్ప‌గా చెప్పాల‌నో, మ‌రోదాన్ని కించ‌ప‌ర్చాల‌ని మా ఉద్దేశం కాదు. ఈ అంద‌మైన కుటుంబ క‌థ‌ను మీకు తెల‌పాల‌ని చూస్తున్నాం. ఇలాంటి సంఘ‌ట‌న ల‌క్ష‌ల్లో ఒక‌రికి జ‌రుగుతుంద‌ట‌! ఈ క‌థ సోఫీ బ్లేక్ అనే మ‌హిళ‌, ఆమె కూతురు టియారాల‌ది. మ‌రి ఆ సంగ‌తులేమిటో చూద్దామా...

కుటుంబం గురించి...

కుటుంబం గురించి...

క్రిస్టొఫ‌ర్ పెర్కిన్స్ అనే వ్య‌క్తికి 60ఏళ్లు. అత‌డు సేల్స్ మేనేజ‌ర్‌గా చేసి రిటైర‌య్యాడు. ఇత‌డే టియారా తండ్రి. తెలుపు వ‌ర్ణంలో ఉంటాడు. అత‌డి భార్య సోఫీ గ‌ర్భ‌వ‌తిగా ఉన్న‌ప్పుడు పుట్ట‌బోయే పాప మిశ్ర‌మ వ‌ర్ణంలో ఉంటుంద‌ని భావించారు.

6 kg ల బరువుతో పుట్టి అందరిని ఆశ్చర్యానికి గురిచేసిన బేబీ

ల‌క్ష‌ల్లో ఒక‌రు..

ల‌క్ష‌ల్లో ఒక‌రు..

టియారా పుట్టాక‌, సోఫియా ఒక్క‌సారిగా ఖంగుతింది. న‌ర్సును అడిగింది ఆమె త‌న బిడ్డేనా అని. ఇలాంటిది ల‌క్ష‌ల్లో ఒక‌రికి జ‌రుగుతుంద‌ని డాక్ట‌ర్లు తేల్చారు. పూర్తిగా తండ్రి పోలిక‌లు రావ‌డ‌మ‌న్న‌ది చాలా అరుదు.

బ‌య‌ట‌కు వెళ్లాలంటే భ‌యం..

బ‌య‌ట‌కు వెళ్లాలంటే భ‌యం..

అప‌రిచిత వ్య‌క్తుల అనుమానానికి సోఫియా గురికావాల్సి వ‌చ్చింది. ఆమె కూతురితో బ‌య‌ట‌కు వ‌చ్చిన ప్ర‌తిసారీ ర‌క‌ర‌కాల కామెంట్లు వినాల్సి వ‌చ్చేది. ఆమె 17ఏళ్ల పెద్ద కూతురుంది. ఇద్ద‌రినీ వెంట తీసుకెళ్లిన‌ప్పుడు మ‌రింత క‌ష్టంగా ఉండేది.

సాగ‌ర‌క‌న్య‌(శిశువు)కు జ‌న్మ‌నిచ్చిన మ‌హిళ‌!

పెరిగే కొద్దీ మ‌రిన్ని స‌మ‌స్య‌లు

పెరిగే కొద్దీ మ‌రిన్ని స‌మ‌స్య‌లు

చిన్న‌గా ఉన్న‌ప్పుడు పెద్ద‌గా స‌మ‌స్య‌లేమీ ఉండ‌క‌పోయేవి. ఆమె పెరిగే కొద్దీ స‌మ‌స్య‌లు మొద‌ల‌య్యాయి. త‌ర‌చూ కూతురు.. అమ్మా నేను నీ పోలిక లేనెందుకు అని అడిగిన‌ప్పుడ‌ల్లా ఆమె మ‌న‌సు చివుక్కుమ‌నేది. అయినా త‌మాయించుకొని మ‌న‌ది అంద‌మైన కుటుంబం. దీంట్లో తెలుపు-న‌లుపు అనేవి పైకి మాత్ర‌మే అని స‌ముదాయించేది.

అవ‌గాహ‌న తెస్తోంది.

అవ‌గాహ‌న తెస్తోంది.

ఎన్నో ర‌కాలుగా వ‌ర్ణ వివ‌క్ష‌ను ఎదుర్కొన్నాక‌.. సోఫియా ఇప్పుడు ఆమె ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న తీసుకొస్తుంది. మిశ్ర‌మ వ‌ర్ణ పిల్ల‌లు కూడా మ‌రీ తెల్ల‌గాను, మ‌రీ న‌ల్ల‌గాను ఉండే అవ‌కాశాలున్నాయి. మొద‌ట మ‌నమంతా మాన‌వులం అని ఆమె త‌న గ‌ళాన్ని వినిపించేది.

ఈ అంద‌మైన కుటుంబం గురించి మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ సెక్ష‌న్ ద్వారా తెలుప‌గ‌ల‌రు.

English summary

This Black Woman Gave Birth To A White Daughter!

Sophia Blake, 45, is a black woman while her daughter Tiara was born white just like her dad. Doctors explain that there was a million-to-one chance that this could happen.