For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  మీకు పుట్టబోయే బిడ్డ కై ఎదురు చూస్తున్నారా, పుట్టకముందే వారి వ్యక్తిత్వం గురించి తెలుసుకోండి .

  |

  మీరు మీకు పుట్టబోయే బిడ్డ కోసం ఎదురు చూస్తున్నారా, అయితే పుట్టకముందే వారి వ్యక్తిత్వం గురించి తెలుసుకోండి.

  మీకు తెలుసా మీ లేబర్ డేట్ లేదా డెలివరీ తేది అంచనా ప్రకారం మీకు పుట్టబోయే బిడ్డ వ్యక్తిత్వ లక్షణాల గురించిన అంచనా వేయవచ్చని?

  Pregnancy Due Date Predictions Based On Your Zodiac Sign

  జ్యోతిష్య శాస్త్రం ప్రకారం , మీకు పుట్టబోయే బిడ్డతో భవిష్యత్తులో ఎలాంటి జీవనం కలిగి ఉంటారో తెలుసుకునే సౌలభ్యం ఉన్నది. ఇక్కడ మీకు తెలియాల్సినదల్లా మీరు అంచనా వేసిన లేబర్ డేట్ (లేదా డెలివరీ డేట్) . ఇంకెందుకు ఆలస్యం మీ బిడ్డ ఎలా ఉండబోతున్నారో తెలుసుకోండి మరి.

  మేషం మార్చి 21-ఏప్రిల్ 19

  మేషం మార్చి 21-ఏప్రిల్ 19

  ఈ రాశిచక్రంలో పుట్టిన పిల్లలు ఎక్కువ పోటీతత్వం కనపరుస్తూ ఉంటారు. అన్నిటా తమదే పై చేయి కావాలన్న దృఢ సంకల్పం వీరి సహజ లక్షణంగా ఉంటుంది. ఆటలలో ఎక్కువగా రాణిస్తారు. మీకు ఆశ్చర్యంగా అనిపించినా భాధగా అనిపించినా సరే , ఈ పిల్లలు నిద్రపోవడానికి ఎక్కువ సమయమే తీసుకుంటారు. ఎన్నో ప్రయత్నాలు చేస్తే కానీ ఎప్పటికో కానీ నిద్ర పట్టదు. ఈ రాశి వారికి ఇది సహజ లక్షణమే.

  వృషభం ఏప్రిల్ 20 – మే 20

  వృషభం ఏప్రిల్ 20 – మే 20

  వీరికి కాస్త మొండిపట్టుదల ఎక్కువగా ఉంటుంది. వీరు ఎక్కువగా జీవితంలో మార్పులను కోరుకోరు. నిత్యకృత్యం ఒకేలా ఉండుటకు ఇష్టం చూపుతుంటారు. కుటుంబంపట్ల అధికమైన ప్రేమలను కలిగి ఉంటారు . వీరికి ఎక్కువ సౌకర్యం ఉండేలా, రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవలసి ఉంటుంది . కాస్త దూకుడు స్వభావం కలిగి ఉండడం సహజం. ముఖ్యంగా వీరికి కావలసినది అందనప్పుడు వీరు పట్టుదలను ప్రదర్శిస్తుంటారు.

  మిధునం మే21-జూన్ 20

  మిధునం మే21-జూన్ 20

  ఈ రాశిచక్రంలో పిల్లలు పుట్టడం మీకు కాస్త భాద్యతలను పెంచుతుంది అనడంలో ఆశ్చర్యం లేదు. వీరు సమయానుసారం ఏదీ చేయరు, నిద్రైనా ఆకలైనా ఎప్పుడు వీరికి కలుగుతుందో అంచనా వేయడం కష్టం. ఒక ప్రణాళిక బద్దంగా అని మాత్రం ఆలోచించడం జరగని పనే.

  కర్కాటకం జూన్21-జూలై 22

  కర్కాటకం జూన్21-జూలై 22

  ఈ రాశిచక్రంలో పుట్టిన వీరికి కాస్త త్వరగానే కోపాలు వస్తుంటాయి. కానీ పెద్ద సమస్య కాజాలదు. వీరు పెద్దయ్యే కొద్దీ సున్నిత మానస్కులుగా తయారవుతుంటారు. వీరు కుటుంబం పట్ల అధిక ప్రేమను కలిగి ఉంటారు. చిన్నప్పుడు వీరి కోపాలకు, పెద్దయ్యాక వీరి సున్నిత మనసుకు కాస్త పొంతన కష్టంగానే ఉంటుంది. కానీ వీరిని ఒక కంట కనిపెట్టుకునే ఉండాల్సి వస్తుంది .

  సింహం జూలై 23 – ఆగస్ట్ 23

  సింహం జూలై 23 – ఆగస్ట్ 23

  ఈ రాశి చక్రంలో పుట్టిన వారు అందరూ తమవద్దనే ఉండాలన్న ఆలోచనను కలిగి ఉంటారు. ఒక్కసారి బిడ్డ పుట్టాక, విశ్రాంతి అంటే హాస్యాస్పదమే అవుతుంది. వీరు అంత తేలికగా నిద్రపోరు, మరొకరిని నిద్రపోనివ్వరు. వీరిని నిద్రపోయేలా చెయ్యాలి అంటే అదొక ప్రక్రియ కిందనే లెక్క. కానీ ఈ రాశి వారు ఎక్కువ ప్రేమను కోరుకుంటారు. మరియు వీరు నాటకరాయుళ్ళు గా ఉంటారు , ఎప్పుడూ మీ దృష్టిని తమ మీదే ఉండేలా చూసుకుంటూ ఉంటారు.

  కన్య ఆగస్ట్24 – సెప్టెంబర్ 23

  కన్య ఆగస్ట్24 – సెప్టెంబర్ 23

  సింహ రాశి వాళ్ళతో పోలిస్తే కాస్త ఊరట అనే చెప్పవచ్చు. వీరు ప్రతి విషయం క్రమశిక్షణ తో ఒక ప్రణాళికతో ఉండునట్లు కోరుకుంటారు. తద్వారా తల్లిదండ్రులకు కాస్త విశ్రాంతి కూడా లభిస్తుంది. మరో పక్క వీరు మొండి పట్టుదల కలిగిన వారుగా ఉంటారు. మరియు తమకు నచ్చని ఆటవస్తువులను ముట్టుకోవడానికి కూడా ఇష్టపడరు. వీరు తల్లిదండ్రులతో కన్నా outdoor గేమ్స్ ఎక్కువగా ఆడడానికి మొగ్గు చూపుతుంటారు. కాస్త అల్లరి ఎక్కువ చేసినా, పెద్దయ్యాక వీరిలో కనిపించే భాద్యత మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అంతా ఉన్నతమైన వారు ఈ కన్యారాశి వారు.

  తుల సెప్టెంబర్ 24 – అక్టోబర్ 23

  తుల సెప్టెంబర్ 24 – అక్టోబర్ 23

  ఈ రాశిచక్రం లో పిల్లలు పుట్టడాన్ని అదృష్టంగా భావిస్తారు. వీరికి అర్ధం చేసుకునే భావాలు అధికంగా ఉంటాయి. కుటుంబాన్ని అధికంగా ప్రేమిస్తుంటారు. ఎంత అల్లరి చేస్తారో అంత ఆలోచన కూడా చేయగలరు. వీరు అన్నీ వేళలా తల్లిదండ్రుల మాట వినకపోవచ్చు, కానీ చేసే ప్రతిపనిలోనూ కుటుంబానికై ఒక ఆలోచన చేయగలిగిన తెలివి వీరి సొంతం. చిన్నతనంలోనే తెలివితేటలను ప్రదర్శిస్తుంటారు. ఏపని మొదలుపెట్టినా దాని వెనుక వంద ఆలోచనలు చేస్తుంటారు. చిన్న వయసులోనే ప్రయోగాలు చేస్తూ కనిపిస్తుంటారు. తులారాశి వారిని ఈ సమాజం కూడా ప్రత్యేకంగా చూస్తుంటుంది. దీనికి కారణం వీరికి సామాజిక స్పృహ కూడా ఎక్కువగా ఉండడమే.

  వృశ్చికం: అక్టోబర్ 24- నవంబర్ 22

  వృశ్చికం: అక్టోబర్ 24- నవంబర్ 22

  తల్లిదండ్రులుగా మీకు కాస్త ఎక్కువ శక్తి అవసరం వీళ్ళను నియంత్రించాలంటే. కాస్త ఎక్కువ విసిగిస్తుంటారు. కానీ వీరు చూడడానికి అందంగా, వివేకంతో ఉంటారు. కాకపోతే వీళ్ళ కోపాన్ని , భావోద్వేగాలను నియంత్రించడం పుట్టుక నుండి కష్టతరమే. వీరు నాయకత్వపు లక్షణాలను కలిగి ఉంటారు. తద్వారా గొప్ప లక్ష్యాలను నిర్దేశించుకుంటూ ఉంటారు.

  ధనుస్సు నవంబర్ 23 – డిసెంబర్ 22

  ధనుస్సు నవంబర్ 23 – డిసెంబర్ 22

  వీరికి సమాజిక జీవనంతో అనుసంధానంగా చదువు ఉండేలా చూసుకోవలసి ఉంటుంది. మీరు వీరి గురించి ఎక్కువ ఆందోళన చెందవలసిన అవసరం లేదు. వీరు ఎక్కువగా outdoor గేమ్స్ ని ఇష్టపడుతూ ఉంటారు. వీరు ఎక్కువగా స్వేచ్చా స్వాతంత్ర్యాలకు విలువని ఇస్తుంటారు.

  మకరం డిసెంబర్ 23 – జనవరి 20

  మకరం డిసెంబర్ 23 – జనవరి 20

  వీరు ఎక్కువగా తెలివితేటలను ప్రదర్శిస్తూ ఉంటారు. కానీ వీరి వయసుకి వీరి ఆలోచనలకు పొంతన కుదరదు, కానీ వీరి మానసిక ఎదుగుదలను మీరు గుర్తించవలసిన అవసరం ఉన్నది. మీరు వీరికై ఏదైనా లక్ష్యాలను ఏర్పరిస్తే, అవి చెయ్యడానికి ఎల్లప్పుడు సంసిద్దత వ్యక్తం చేస్తుంటారు. అంత గొప్ప లక్షణం వీరి సొంతం.

  కుంభం జనవరి 21 – ఫిబ్రవరి 18

  కుంభం జనవరి 21 – ఫిబ్రవరి 18

  వీరు ఎప్పుడూ వర్తమానంలో జీవిస్తూ, దేనినైనా తేలికగా తీసుకునే లక్షణాన్ని కలిగి ఉంటారు. వీరు పెద్దగా విసిగించరు కూడా. వీరు ఇతరుల క్షేమానికై కూడా ఆలోచిస్తారు, కానీ పోటీతత్వాన్ని కలిగి ఉంటారు. ఆటబొమ్మల విషయంలో కూడా పెద్దల మాటకే ప్రాధాన్యతను ఇస్తుంటారు.

  మీనం ఫిబ్రవరి 19- మార్చి 20

  మీనం ఫిబ్రవరి 19- మార్చి 20

  ఈ రాశిచక్రంలో పుట్టిన వీరు ఎక్కువగా సున్నితంగా ఉంటారు , ఎక్కువ భావోద్వేగాలను ప్రదర్శిస్తూ ఉంటారు. సెంటిమెంటల్ ఆలోచనలు కలిగి ఉంటారు. ఎక్కువగా కంఫర్ట్ జోన్ లో తమ చుట్టూతా అనుకూలత ఉండేలా ఇష్టపడుతారు. వీరు తమ అభిప్రాయాలకే ఎక్కువ విలువనిస్తుంటారు . ఈ విషయంలో కాస్త కోపాన్ని కూడా ప్రదర్శిస్తుంటారు కానీ పెద్దగా ఆలోచించనవసరం లేదు. తల్లిదండ్రులుగా మీరు వీరిపట్ల జాగ్రత్తగా ఉండాల్సివస్తుంది.

  English summary

  Pregnancy Due Date Predictions Based On Your Zodiac Sign

  For couples who are expecting their babies, there's good news, as you would not have to wait much, since we've got astrology for all the predictions! For eg, Capricorn-born kids are the old souls. They are surprisingly wise beyond their young age. Handling these kids gets easy for the parents, while the Leos on the other hand are equally troublesome.
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more