For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాశి చక్రాల ప్రకారం, ఎవరెవరు ఎలా ప్రేమను వ్యక్తపరుస్తారో తెలుసా?

|

మీతో ప్రేమలో పడినప్పుడు, వారి ప్రవర్తనలలో మార్పులను ఎప్పుడైనా గమనించారా?

గమనించినా కూడా, ఆ సమాధానాలను, వారి భావాలను కనుక్కోవడం కష్టం. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొంతమేర అంచనా వేయవచ్చని జ్యోతిష్యుల మాట. కొందరు ప్రేమలో పీకల్లోతులో ఉండగా, కొందరు మాత్రం మీకు స్వేచ్చ కోసం రెక్కలు ఇచ్చిన వారిలా కనిపిస్తుంటారు. కానీ కొందరు కఠినమైన నిబంధనలతో కూడుకుని వ్యక్తపరచుటకు కూడా కష్టపడుతుంటారు. కావున ఇక్కడ వారి ప్రేమను వ్యక్తపరచే విధానాల గురించిన పూర్తి వివరాలను పొందుపరచడం జరిగినది. ఒకసారి చూడండి.

Here Is How Every Zodiac Sign Expresses Love
మేష రాశి: మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి: మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి వారు బలమైన ఆటగాళ్ళ వలె ఉంటారు. వారు యుద్ధంలో ఉన్నా, లేదా ప్రేమలో ఉన్నా, అంకితభావంతో మరియు న్యాయమైన నియమాలతోనే నడుపుటకు సుముఖంగా ఉంటారు. ఏ విషయాన్నైనా తమ మనసు పొరల్లోనే దాచుకుంటూ ప్రియమైన వారితో సైతం తమ భావాలను పంచుకొనేందుకు సిద్దంగా ఉండరు. కానీ ఎక్కువగా స్నేహితులతో సన్నిహితులతో గడపాలని ఆలోచనలు చేస్తుంటారు. వీరిని అర్ధం చేసుకోగలిగితే, చాలు వీరి కళ్ళే భావాలని పలికించేస్తాయి.

వృషభ రాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభ రాశి : ఏప్రిల్ 20 - మే 20

అంకితభావం గల భాగస్వాములుగా పేరు కలిగిన వారిగా ఉంటారు, వృషభ రాశి వారు ప్రేమలో పడడం సులభమైన విషయం. ప్రేమ వారి జీవితంలోకి ప్రవేశించినట్లు అంగీకరించడానికి కొంచం ఆలస్యం చేసినప్పటికీ, నిర్ధారణకు వచ్చాక నిబద్దతను కలిగి ప్రవర్తిస్తారు. అత్యంత నమ్మకమైన వ్యక్తులుగా ఉంటారు. వారు శృంగారభరితమైన వ్యక్తులుగా మరియు తీవ్రమైన ప్రేమలను కలిగి ఉండేలా ఉంటారు. ఎవరితో అయినా హాంగ్ఔట్స్ వెళ్ళాలన్న ఆలోచనలను వ్యక్తపరిస్తే, ఖచ్చితంగా ప్రియమైన వారితోనే అయ్యుంటుంది.

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

అందరికీ తెలుసు, మిధున రాశి వారు దేనినీ బాహాటంగా వ్యక్తపరచలేరని. దీనికి అదనంగా, వారి భావోద్వేగాలపై తగినంత నియంత్రణ ఉంటుంది. వారు వారి ప్రియమైనవారి భావాలను గురించి ఖచ్చితంగా ఉన్నప్పుడు మాత్రమే, వారి ప్రేమను అంగీకరిస్తారు. ఎందుకంటే వారు నిరాశను కలిగి ఉండుటకు ఇష్టపడరు. వారు వారి భాగస్వామి కోసం వంట చేయడానికి, లేదా వారితో సినిమా లేదా ఇతర ప్రదేశాలకు వెళ్ళడానికి ఇష్టాన్ని ప్రదర్శిస్తుంటారు. వారు వారి ప్రేమను వ్యక్తపరచటానికి మీతో ఉన్న కొద్దిపాటి ఒంటరి సమయాన్ని కూడా ఎంచుకోవచ్చు.

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి వారు ఎవరినీ అంత తేలికగా విశ్వసించలేరు. మరియు వారి నిజమైన స్నేహితులు ఎప్పటికీ పరిమిత సంఖ్యలోనే ఉంటారు. వారి భావోద్వేగాలను వ్యక్తం చేసే విషయంలో మాత్రం రహస్యాన్ని పాటించే వారిగా ఉంటారు. ఎదుటివారి గురించి పూర్తి అవగాహన వచ్చేవరకు, వారితో భావోద్వేగాలను పంచుకునేందుకు సిద్దంగా ఉండరు. ప్రేమలేఖల ద్వారా లేదా కాండిల్ లైట్ డిన్నర్స్ ఆహ్వానించడం లేదా డాన్స్ చేయడానికి ఉత్సుకతను ప్రదర్శించడం ద్వారా తమ ప్రేమను వ్యక్తపరచే ప్రయత్నాలు చేస్తుంటారు.

సింహ రాశి : జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి : జులై 23 - ఆగస్టు 22

నిశ్శబ్ద విప్లవానికి పరాకాష్టగా ఉండే సింహరాశి వారు, వారి భావోద్వేగాల మీద కొంత నియంత్రణ కలిగి ఉంటారు. వారు వారి భావోద్వేగాల గురించి ఖచ్చితంగా ఉన్నప్పుడు మాత్రమే, వారి ప్రేమను అంగీకరిస్తారు. వారికి స్వతహాగా అహం సమస్యలు ఉంటాయి, క్రమంగా మీకోసం వారి భావాలను ఒప్పుకోవడం కష్టంగా ఉంటుంది. కానీ ఒకవేళ అంగీకరిస్తే, మీతో వీలైనంత ఎక్కువ సమయాన్ని వెచ్చించడానికి ఇష్టాన్ని ప్రదర్శిస్తుంటారు. వారి భాగస్వాములకు బహుమతులు ఇవ్వడం అనేది వారి ప్రేమను వ్యక్తం చేసే ప్రధానమైన పద్ధతిగా ఉంటుంది.

కన్యా రాశి : ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

కన్యా రాశి : ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

కన్యా రాశి వారు శృంగారభరితంగా మరియు అధిక ప్రేమలు కలిగినవారిగా ఉంటారు. క్రమంగా వీరు సులువుగా ప్రేమలో పడిపోతుంటారు. వారు ప్రేమిస్తున్న వ్యక్తులకోసం అనుకూల వాతావరణాన్ని నిర్వహించడం ద్వారా వారు తమ ప్రేమను ప్రదర్శిస్తుంటారు. వారి ప్రేమను వ్యక్తపరచడంలో ఎన్నటికీ విఫలంకారు, మరియు ధైర్యంగా తమ భావాలను వ్యక్తపరుస్తుంటారు. మరియు ప్రియమైన వారి పట్ల అధిక నిబద్దతను ప్రదర్శిస్తుంటారు.

తులా రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తులా రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తులా రాశి వారు మంచి స్వభావం మరియు అందరితో బాగుండాలని పరితపించేవారిగా ఉంటారు. ఎల్లప్పుడూ స్వాగతించే స్వభావాన్ని కలిగి ఉంటారు మరియు ప్రత్యేకమైన శ్రద్ధను కనపరుస్తుంటారు. వారి స్థిరమైన నవ్వు, ఇతరుల మనసును కాస్త గందరగోళానికి గురిచేయవచ్చు. ముఖ్యంగా ప్రేమలో ఉన్నారేమో అన్న ఆలోచన వచ్చేలా వీరి చర్యలు ఉంటాయి. కానీ వారి ప్రేమను వ్యక్తపరచడంలో కాస్త బిడియాన్ని కలిగి ఉన్నా, ఇతరుల మనసు నొప్పించకుండా ప్రవర్తించడంలో ముందంజలో ఉంటారు. వీరి భావవ్యక్తీకరణ కూడా ఆకట్టుకునేలా ఉంటుంది.

వృశ్చిక రాశి: అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి: అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి వారు ప్రారంభంలో, తమ ప్రేమ విషయంలో భావోద్వేగాలను దాచడానికి ప్రయత్నిస్తారు. కానీ కొద్దిగా అహం ఉన్నా కూడా, శృంగారభరితంగా ఉంటారు. వారి భావాలను ఒప్పుకున్న తర్వాత మాత్రమే, తమ భాగస్వామితో వీలైనంత సమయం వెచ్చించడానికి ప్రయత్నిస్తుంటారు. వారి ప్రేమను మోకాళ్ళమీద నిలబడి వ్యక్తపరచడానికి కూడా వెనుకాడరు.

ధనుస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనుస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనుస్సురాశి వారు ఎల్లప్పుడూ ముందస్తు ఆలోచనలు చేస్తుంటారు, మరియు వారు ఇతరుల భావోద్వేగాల గురించిన ఎటువంటి ఆలోచనా లేకుండా, వారి మనసుకు అనిపించింది చేసుకుంటూ వెళ్లిపోయేలా ఉంటారు. కానీ వారు ఎవరినైనా ప్రేమిస్తున్నప్పుడు, వారి భాగస్వామికి హాని చేయకూడదన్న ఆలోచనలతో,వారి ప్రతి చర్యలలోనూ జాగ్రత్తను తీసుకునేవారిలా, వారి వ్యక్తిగత స్వభావానికి విరుద్దంగా కనిపిస్తుంటారు. మరియు మరింత జాగ్రత్తతో ఉంటారు. అంతేకాక, ప్రేమ వారికి ఒక సాహస యాత్రవలె ఉంటుంది. వీరు ఎవరితో అయినా విహారయాత్రలకు వెళ్ళాలన్న ఆలోచనలు చేస్తుంటే, అది ఖచ్చితంగా ప్రియమైనవారే ఉంటారు అనడంలో ఆశ్చర్యం లేదు.

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకరరాశికి చెందినవారు జీవితం గురించిన తీవ్రమైన ఆలోచనలను చేస్తుంటారు. వారు సులభంగా ఒక వ్యక్తికి ఆకర్షించబడవచ్చు, కానీ అది ప్రేమ అని తెలుసుకోవడానికి వారికి కూడా చాలా సమయం పడుతుంది. ప్రేమ వారికి ఒక ప్రణాళికాబద్దంగా జరుగుతుంటుంది. మరియు అధిక సమయం తీసుకుంటుంది. వారి భావాలను మీతో పంచుకునే ప్రయత్నంలో ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తుంటారు. బహుమతులివ్వడం, లాంగ్ డ్రైవ్ లేదా సుదీర్ఘమైన నడక మొదలైన వాటి ద్వారా తమ ప్రేమను వ్యక్తపరచే ప్రయత్నాలు చేస్తుంటారు.

కుంభ రాశి: జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి: జనవరి 20 - ఫిబ్రవరి 18

వారు మీపట్ల శ్రద్ధను కలిగి ఉంటే, మీ జాగ్రత్త దృష్ట్యా అనేక రకాల సూచనలను ఇచ్చే ప్రయత్నాన్ని చేస్తుంటారు. మిమ్ములను ఇష్టపడిన ఎడల, మీ బట్టల మీద, ఆభరణాల మీద వ్యాఖ్యానిస్తూ, మీపై ఉన్న ప్రేమను వ్యక్తపరచే ప్రయత్నాలు చేస్తుంటారు.ఏదైనా పార్టీకి మిమ్ములను ఆహ్వానించునప్పుడు, మీకోసం స్వయంగా మీకు ఇష్టమైన వాటిని షాపింగ్ చేసి వాటిని ధరించవలసినదిగా సిఫార్సు చేస్తుంటారు. వీరి జాగ్రత్తే మీకు ఒక అవగాహనను ఇచ్చేస్తుంది.

కానీ సాధారణంగా, వారు ప్రేమ మరియు నిబద్ధతల విషయంలో వీలైనంత దూరంగా ఉంటారు. వారి ప్రవర్తనలలో భిన్నమార్పులు ప్రస్ఫుటించిన ఎడల, ప్రేమలో పడ్డారనే అర్ధం.

మీన రాశి: ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి: ఫిబ్రవరి 19 - మార్చి 20

మీనరాశి వ్యక్తులు కొన్ని ప్రత్యేక సందర్భాలలో తమ నిస్సహాయతలను కలిగి ఉంటారు. ప్రేమిస్తున్నా కూడా, సంబంధాలను దూరం చేసుకోకూడదు అన్న భావనతో లోలోపలే మదన పడుతుంటారు. కానీ మీ పట్ల తమకు ఆలోచన ఉంది అని తెలియజేసే ప్రయత్నాలు మాత్రం చేస్తుంటారు. ఉదాహరణకు అర్ధరాత్రి 3 సమయంలో మెసేజులు పెట్టడం, లేదా మీ ఫోకస్ తమ మీద ఉండేలా హాస్య చతురతలను ప్రదర్శించడం మొదలైనవి.

English summary

Here Is How Every Zodiac Sign Expresses Love

Ever wondered how your crush will behave if they fall in love with you? Well, astrology has an answer for that as well. While some might become intense and deep, others might love to give you wings and yet, some might put you on fire and become over possessive. Here is an analysis on how every zodiac sign expresses love. Take a look.
Story first published: Sunday, August 26, 2018, 19:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more