Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
ట్రైన్ లో చూసి ఫ్లాట్ అయ్యాడు, పెళ్లి చేసుకున్నాడు, బాగా సుఖ పరిచేదాన్ని, చంపబోయాడు
నా పని నన్ను చేసుకునే స్వేచ్ఛను కల్పిస్తానన్నాడు. నాపై ఎంతో గౌరవం ఉన్నట్లు మాట్లాడేవాడు. హిజ్రాలు కూడా మనుషులేనని గుర్తించిన మహానుభావుడు అనుకున్నా. నా స్నేహితురాళ్లఆధ్వర్యంలోఅతన్ని పెళ్లి చేసుకున్నా.
నా పేరు హేమిక. నేను ఒక హిజ్రాను. హిజ్రాలంటే చాలా మందికి చిన్నచూపు ఉంటుంది. అలాగే నన్ను కూడా చాలా మంది అసహ్యంగా చూసేవారు. ఎన్నో బాధలను, కష్టాలను ఎదుర్కొన్నదానికి.. సమాజం చూసే చిన్నచూపు ఒక లెక్క. అందుకే ఎవరు ఏమనుకున్నా ఫర్వాలేదు అనుకున్నా. నాకు నచ్చినట్లుగా బతుకున్నా.

అతనితో పరిచయం ఏర్పడింది
ఈ క్రమంలో నాకు ఒక అతనితో పరిచయం ఏర్పడింది. నేను రోజూ మా గ్యాంగ్ తో కలిసి ట్రైన్స్ లలో , పబ్లిక్ ప్లేస్ లలో నానా కష్టాలు పడి డబ్బులు సంపాదించుకుని వచ్చేదాన్ని. ఒకసారి నన్ను ట్రైన్ లో చూసిన ఒక అబ్బాయి నా గురించి డిటేల్స్ అడిగాడు. అన్నీ చెప్పాను.

నీకు ఫ్లాట్ కావాల్సిందే
నీ కళ్లు, నీ అందం చూస్తే నేనేమిటి ఎవరైనా సరే నీకు ఫ్లాట్ కావాల్సిందే అన్నాడు. నేను నిన్ను డబ్బు కోసం పెళ్లి చేసుకోవడం లేదన్నాడు. అయినా మన బంధం గురించి ఎవరేమనుకున్నా ఫర్వాలేదన్నాడు. నేను తనకు ఎంతో నచ్చానని చెప్పాడు. పెళ్లయిన తర్వాత కూడా నాకు బయటకు వెళ్లేందుకు అనుమతి ఇస్తానని చెప్పాడు. నా పని నన్ను చేసుకునే స్వేచ్ఛను కల్పిస్తానన్నాడు.

హిజ్రాలు కూడా మనుషులే
నాపై ఎంతో గౌరవం ఉన్నట్లు మాట్లాడేవాడు. హిజ్రాలు కూడా మనుషులేనని గుర్తించిన మహానుభావుడు అనుకున్నా. నా స్నేహితురాళ్ల ఆధ్వర్యంలో అతన్ని పెళ్లి చేసుకున్నా. ఆ రోజు నా స్నేహితురాళ్లందరినీ ఇంటికి పిలిచి పార్టీ ఇచ్చాను. నా భర్త కోరుకున్న ప్రతి సుఖాన్ని నేను అందించాను.

సుఖ పరిచేదాన్ని
కొన్నాళ్ల వరకు మా సంసారం బాగానే సాగింది. తనను నేను శారీరకంగా కూడా బాగా సుఖ పరిచేదాన్ని. ఒక అమ్మాయి ఏవిధంగా అయితే అబ్బాయిని సుఖపరుస్తుందో అంతకన్నా ఎక్కువగా అతన్ని నేను సుఖపరిచేదాన్ని. మా కాపురం రెండునెలల పాటు బాగా సాగింది.

ఖర్చు చేసేవాడు
తర్వాత తను నన్ను టార్చర్ చెయ్యడం మొదలుపెట్టాడు.
తనకు రోజూ డబ్బు కావాలని నన్ను వేధించడం మొదలుపెట్టాడు. నేను ఎన్నో కష్టాలు పడి డబ్బులు సంపాదించేదాన్ని. కానీ అతను జల్సాలకు అలవాటై.. నా డబ్బునంతా ఒక్కరోజులోనే ఖర్చు చేసేవాడు.

కత్తితో దాడి చేశాడు
నేను డబ్బులు ఇవ్వకపోతే వేధించేవాడు. చాలాసార్లు కాలితో ఎక్కడంటే అక్కడ తన్నాడు. నేను నా స్నేహితురాళ్లకు నా కష్టాలు చెప్పుకుంటే వాళ్లను కూడా నానా మాటలు అన్నాడు. వారిపై కూడా చెయ్యి చేసుకున్నాడు. ఒక రోజు నేను తిరగబడేసరికి నాపై కత్తితో దాడి చేశాడు. నన్ను చంపబోయాడు.

ఆడవారిని ఎంతలా వేధిస్తారో
నేను అతన్ని ఎంతో నమ్మాను. కానీ తను మాత్రం కేవలం నేను సంపాదించే డబ్బుపై ఆశపడి నన్ను నానా రకాలుగా టార్చర్ చేశాడు. ఇలాంటి వెదవలు కూడా కొందరు సమాజంలో ఉంటారు. మమ్మల్ని ఇంతగా వేధించే వారు ఈ సమాజంలో ఉన్నారంటే ఇక ఆడవారిని ఎంతలా వేధిస్తారో ఈ మూర్ఖులు.



Click it and Unblock the Notifications
