Latest Updates
-
అమెరికాలో బ్యాన్, భారత్ లో బెస్ట్.. ఆవ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిదేనా? -
నోరూరించే కార్న్ చిల్లీ చీజ్ టోస్ట్.. పెనం మీదే నిమిషాల్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? -
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.! -
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా! -
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
నేను నల్ల అమ్మాయిని, సెక్స్ కు పనికిరానా? మంచి మనస్సు ఉండదా? సుఖపెట్టేందుకు ప్రయత్నిస్తా #mystory275
మా ఆయనకు నేను మాత్రం అస్సలు అందంగా కనిపించను. రాత్రి పూట కూడా నాతో అస్సలు హ్యాపీగా గడపడు. నేను అతనితో ఎంత ప్రేమగా మెలిగినా సరే అతను మాత్రం నన్ను దూరంగా ఉంచుతుంటాడు. మా ఆయన్ని అన్ని రకాలుగా సుఖ పెట్టేం
భూమి మీద పుట్టిన వాళ్లంతా తెల్లగా అందంగా ఉండాలనే రూల్ ఏమీ లేదు కదా. నేను నల్లగా ఉంటాను. పొట్టిగా ఉంటాను. అయితే నా కలర్ విషయంలో నేను చాలా సార్లు అవమానాలు ఎదుర్కొన్నాను. మా అక్క నాకంటే అందంగా ఉంటుంది. బాగా తెల్లగా ఉంటుంది. తను మా అమ్మపోలిక. నేనేమో మా నాన్న పోలిక.
మా ఇంట్లో కూడా అందరూ మా అక్కనే మెచ్చుకునేవారు. నన్ను ఎవ్వరూ సరిగ్గా పట్టించుకునేవారు కాదు. అబ్బాయిలు కూడా అందరూ మా అక్కవెంటే పడేవారు. నాకు ఎవ్వరూ లైన్ వేసేవారు కాదు. కానీ తెల్లగా ఉండి అందంగా ఉన్నంత మాత్రానా వాళ్లు మంచి వాళ్లు అనుకోవడం పొరపాటు.

ఒక అమ్మాయి వెంట పడేవాడు
నల్లగా ఉన్నంత మాత్రానా చెడ్డవాళ్లు అనుకోవడం కూడా పొరపాటే. ఇక కొందరు అబ్బాయిలు తెల్లగా ఉండే అమ్మాయిలంటే పడి చస్తారు. నా ఫ్రెండ్ ఒకతను ఒక అమ్మాయి వెంట పడేవాడు. ఆమెకు ఇష్టంలేదని చెప్పినా వినకుండా ఆమెనే లవ్ చేసేవాడు. అతన్నేమో కాస్త నల్లగా ఉండే నాలాంటి అమ్మాయి బాగా లవ్ చేసేది. ఆమెను పట్టించుకునేవాడు కాదు.

అందాన్ని ఏమన్నా తింటావా
ఆ తెల్ల పిల్లలో ఏముందని అంతలా వెంటపడుతున్నావని నేను అతన్ని అడిగితే అందంగా ఉంది కదా అనేవాడు. అందాన్ని ఏమన్నా తింటావా ఏంటి.. మంచి మనస్సున్న అమ్మాయిని చేసుకో అని చెప్పాను. నల్లగా ఉండే అమ్మాయిల మనస్సు వెన్నెలలా స్వచ్ఛంగా ఉంటుంది.

దారుణంగా కామెంట్స్
నల్లగా ఉండే అమ్మాయిలకు ఒకరిని మోసం చేయాలనే ఉద్దేశం ఉండదు. ప్రేమించినవాడికే సర్వం సమర్పించి జీవితాంతం అతనితోనే ఉండాలనుకుంటారు. ఇక ఇటీవల నేను నా ఫొటోను నా ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాను. దానికి కొందరు అబ్బాయిలు దారుణంగా కామెంట్స్ పెట్టారు.

నీకెందుకే అంత బిల్డప్
నల్లదానా నీకెందుకే అంత బిల్డప్ అంటూ ఒకడు కామెంట్ చేశాడు. నాలాంటి అమ్మాయిలకు ఆ స్వేచ్ఛ లేదా? ఎందుకంత వివక్ష చూపిస్తారో అర్థం కావడం లేదు. నాకు కొన్నిరోజుల క్రితమే పెళ్లయ్యింది. ఇక మా ఆయన కూడా నాపై చాలా వివక్ష చూపిస్తాడు. మేమిద్దరం బయటకు వెళ్లినప్పుడు తన కళ్లకు ప్రతి అమ్మాయి అందంగానే కనిపిస్తుంది.

సుఖ పెట్టేందుకు ప్రయత్నిస్తాను
మా ఆయనకు నేను మాత్రం అస్సలు అందంగా కనిపించను. రాత్రి పూట కూడా నాతో అస్సలు హ్యాపీగా గడపడు. నేను అతనితో ఎంత ప్రేమగా మెలిగినా సరే అతను మాత్రం నన్ను దూరంగా ఉంచుతుంటాడు. మా ఆయన్ని అన్ని రకాలుగా సుఖ పెట్టేందుకు నేను ప్రయత్నిస్తుంటాను కానీ అర్థం చేసుకోడు.

సెక్స్ కు పనికిరారని
నల్లగా పొట్టిగా ఉండే అమ్మాయిలు సెక్స్ కు పనికిరారని చాలా మంది అబ్బాయిలు అనుకుంటారు. నిజంగా అది తప్పుడు ఆలోచన. నల్లగా ఉండే అమ్మాయిలే అబ్బాయిల్ని బాగా సుఖపెట్టగలరు. మాకే మంచి బాడీ స్ట్రక్చర్ ఉంటుంది. అంతేకాదు నల్లగా ఉండే అమ్మాయిలకే మంచి మనస్సు ఉంటుంది.

జాలి వేస్తుంది
కాబట్టి అబ్బాయిలంతా నల్లగా ఉండే అమ్మాయిలనే లవ్ చేయమని నా సూచన. నల్లగా పుట్టినందుకు నేనేమి బాధపడడం లేదు. చాలా గర్విస్తున్నా. కానీ నన్ను అర్థం చేసుకోలేని వారిని చూస్తేనే జాలి వేస్తుంది.



Click it and Unblock the Notifications
