Latest Updates
-
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు! -
ఈ చిట్కాలు తెలిస్తే..కొబ్బరి బూరెలు పర్ఫెక్ట్ గా పొంగుతూ, మృదువుగా,రుచిగా వస్తాయి
నమ్మకంగా ఉండే అబ్బాయిలను నాలాంటి పిచ్చి అమ్మాయిలు చాలా మంది నమ్మరు #mystory360
"దాన్ని ఒక్కసారి అనుభవిస్తే చాలు జన్మ ధన్యం అంటూ చాలా అసభ్యంగా మాట్లాడాడు. నేనైతే ఒక రాత్రి గడిపితే చాలు ప్రపంచాన్నే జయించాను అనుకుంటాను అని అవతలి వ్యక్తి అన్నాడు. దాని ఫిగర్ చూస్తే మతిపోతది.. అవకాశం
ఆ అబ్బాయి నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. మా ఆఫీస్ లో కోలీగ్. నాకు అన్నాదమ్ములూ ఎవరూ లేకపోవడంతో తననే బ్రదర్ గా భావించేదాన్ని. తను ఎంత సంప్రదాయంగా ఉంటాడో. అస్సలు ఒక్క బూతు మాట కూడా మాట్లాడడు.
రోజూ పూజ చేసి నుదుటిపై బొట్టు పెట్టుకుని ఆఫీస్ కు వస్తాడు. తన బాహ్యరూపం చూసి నేను చాలా మంచోడనుకున్నాను. నాకంటే చాలా చిన్నోడు. నన్ను అక్కాఅక్కా అంటూ ఉంటాడు. అందుకే అతనిపై నాకు చాలా గౌరవం.

నా పక్కనే ఉన్నాడు
ఒక రోజు లంచ్ టైమ్ లో ఇద్దరం క్యాంటిన్ కు వెళ్లాం. అంతలో మా ఆఫీస్ నుంచి ఒక అబ్బాయి నాకు ఫోన్ చేసి.. మీ తమ్ముడు ఎక్కడెళ్లాడండీ.. అతని ఫోన్ కలవట్లేదు... కాస్త అర్జెంట్ పని ఉంది అన్నాడు. ఇదిగో నా పక్కనే ఉన్నాడు.. మాట్లాడు అని తనకు ఫోన్ ఇచ్చాను.

ఆ మాటలు విని
అతని ఫోన్ అక్కడే టేబుల్ పై పెట్టి నా ఫోన్లో మాట్లాడుతూ బయటకు వెళ్లిపోయాడు. అక్కడే ఇయర్ ఫోన్స్ కూడా ఉండడంతో నేను తన ఫోన్ తీసుకుని మ్యూజిక్ ప్లేయర్ ఆన్ చేశాను. ఆ మాటలు విని షాక్ అయ్యాను.

అమ్మాయి గురించి
అది నేను తమ్ముడిలా భావించే అతని వాయిసే. అది ఫోన్ రికార్డింగ్ వాయిస్ అనుకుంటాను. అందులో తను మా ఆఫీస్ లోని అమ్మాయిల గురించి చాలా దారుణంగా మాట్లాడాడు.

చాలా అమాయకురాలు
అమ్మాయిల ఎదుట అమాయకంగా నటించే అతను అమ్మాయిల గురించి అలా అసభ్యకరంగా మాట్లాడుతాడని నేను అస్సలు అనుకోలేదు. ఆఫీస్ లో ఒక అమ్మాయి ఉంటుంది. తను చాలా మంచి పిల్ల. చాలా అందంగా ఉంటుంది. కానీ చాలా అమాయకురాలు. అలాంటి పిల్ల గురించి తను అసభ్యంగా మరో వ్యక్తితో తను మాట్లాడాడు.

ఒక రాత్రి గడిపితే చాలు
"దాన్ని ఒక్కసారి అనుభవిస్తే చాలు జన్మ ధన్యం అంటూ చాలా అసభ్యంగా మాట్లాడాడు. నేనైతే ఒక రాత్రి గడిపితే చాలు ప్రపంచాన్నే జయించాను అనుకుంటాను అని అవతలి వ్యక్తి అన్నాడు. దాని ఫిగర్ చూస్తే మతిపోతది.. అవకాశం వస్తే స్వర్గమే అంటూ నేను తమ్ముడిగా భావించే అతను మాట్లాడాడు"

వినలేనంత అశ్లీలంగా
ఇక ఆ ఇద్దరి ఫోన్ సంభాషణ మొత్తం కూడా వినలేనంత అశ్లీలంగా ఉంది. అమ్మాయిలను అంత తక్కువ చేసి మాట్లాడతారా అనిపించింది. కానీ ఆఫీస్ లో మాత్రం ఆ అమ్మాయి ఎదుట మాత్రం చాలా గౌరవంగా ప్రవర్తిస్తాడు.

అక్కాఅక్కా అంటూ
అది విన్న తర్వాత అతన్ని దూరంగా పెట్టాను. ఎందుకంటే నాతో పాటే ఉంటూ అక్కాఅక్కా అంటూ నన్ను ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడో అని అనిపించింది. కోపంలో మగవారు మగవారు బూతులు మాట్లాడుకుంటే అంత అసభ్యంగా ఉండదేమోకానీ ఒక అమ్మాయి గురించి టాఫిక్ తీసుకొచ్చి ఆమెను నానా రకంగా మాట్లాడడం సరికాదని నా అభిప్రాయం.

మనస్సులో నీచంగా ఆలోచించే
దీని బట్టి నాకు తెలిసిందేమంటే..చాలామంది అబ్బాయిల వీడిలాగే పైకి సంసారిలా బిల్డప్ ఇస్తారనుకుంటాను. కానీ లోపల మరో మనిషి ఉంటాడు. నీతులు చెబుతూ, అమాయకంగా నటించే ప్రతి వాడు మంచోడు కాదు.

అమాయకంగా నటిస్తూ
పక్కవారి ఎదుట అమాయకంగా నటిస్తూ మనస్సులో నీచంగా ఆలోచించే అబ్బాయిలను ఏ అమ్మాయి కనిపెట్టలేదు.

ఈజీగా నమ్ముతారు
కానీ అమ్మాయిలు అలాంటి అబ్బాయిలనే ఈజీగా నమ్ముతారు. నమ్మకంగా ఉండే అబ్బాయిలను నాలాంటి పిచ్చి అమ్మాయిలు చాలా మంది నమ్మరు. అది అమ్మాయిల తప్పే.

పైకి కోపంగా కనిపించినా
నిజాయితీ గల అబ్బాయిలు పైకి కోపంగా కనిపించినా లోపల మాత్రం స్వచ్ఛమైన మనస్సుతో ఉంటారు. అలాంటి అబ్బాయిలతో స్నేహం చేయండని నా సలహా. నటించే మగవాణ్ని ఎప్పటికీ నమ్మకు సోదరి.



Click it and Unblock the Notifications
