డేటింగ్ లో ఉన్నప్పుడు అది తప్ప అన్నీ అయిపోయాయి, డబ్బు కోసం ఆశపడ్డా,నరకం అనుభవిస్తున్నా#mystory303

ఇద్దరం కొన్నాళ్లు డేటింగ్ చేశాం. మా ఇంట్లో వాళ్లని ఎదురించి తనని పెళ్లి చేసుకోవాలంటే నాకు భయం వేసేది. కానీ తను మాత్రం ఏమీ కాదులే అని నాకు ధైర్యం ఇచ్చేది. అది తప్ప అన్నీ అయిపోయాయి.

By Arjun Reddy

తను నా కోలిగ్. మేమిద్దరం ఒకే రోజు ఆఫీస్ లో జాయినయ్యాం. హెచ్ ఆర్ క్యాబిన్ లో కూర్చొని పీఎఫ్ తదితర జాయినింగ్ ఫామ్స్ ఫిల్ చేసే సమయంలో తనతో నాకు పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో తనకొచ్చిన డౌట్స్ ని నేను క్లారిఫై చేశాను.

మా ఇద్దరి డిపార్ట్ మెంట్స్ వేరు. నేను ఐటీ వింగ్ లో ఉంటాను. తను వేరే డిపార్ట్ మెంట్ లో పని చేస్తుంది. అయినా ఇద్దరం లంచ్ టైమ్ లో కలిసేవాళ్లం.

మెసేజ్ పంపేది

మెసేజ్ పంపేది

క్యాంటిన్ లో సరదాగా రోజూ కాఫీ తాగేవాళ్లం. ఆఫీస్ లో రోజూ ఎప్పుడెప్పుడు సాయంత్రం నాలుగు అవుతుందా.. తనతో కలిసి కాఫీ తాగుదామా అనే ధ్యాసలో ఉండేవాణ్ని. తను బయటకు వెళ్లేటప్పుడు నాకు వాట్సాప్ లో మెసేజ్ పంపేది.

నా బిల్లు కూడా..

నా బిల్లు కూడా..

తన మెసేజ్ రాగానే వెంటనే నేను వెళ్లిపోయేవాణ్ని. వీకెండ్స్ లో ఇద్దరం షాపింగ్ చేసేవాళ్లం. నా బిల్లు కూడా చాలాసార్లు తనే పే చేసింది. చాలా కొద్ది రోజుల్లోనే తను నాకు బాగా క్లోజ్ అయిపోయింది.

ఇద్దరం ఒకే రూమ్ లో

ఇద్దరం ఒకే రూమ్ లో

తనపై నాకున్న ఇష్టాన్ని తనతో చెప్పాను. పెళ్లి చేసుకుంటానన్నాను. తను ఒకే అంది. అంత వరకు తను ఉమెన్స్ హాస్టల్ లో ఉండేది. ఆ తర్వాత తను కలిసి రూమ్ తీసుకునే అందులో ఉండేవాళ్లం.

డేటింగ్ చేశాం

డేటింగ్ చేశాం

ఇద్దరం కొన్నాళ్లు డేటింగ్ చేశాం. మా ఇంట్లో వాళ్లని ఎదురించి తనని పెళ్లి చేసుకోవాలంటే నాకు భయం వేసేది. కానీ తను మాత్రం ఏమీ కాదులే అని నాకు ధైర్యం ఇచ్చేది.

అది తప్ప అన్నీ అయిపోయాయి

అది తప్ప అన్నీ అయిపోయాయి

డేటింగ్ లో ఉన్నప్పుడు సెక్స్ తప్ప అన్ని పనులు అయిపోయాయి. దాదాపు ఏడాది పాటు ఇద్దరం డేటింగ్ లో ఉన్నాం. మా నాన్నకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో నేను జాబ్ మానేసి ఊరికి వెళ్లాల్సి వచ్చింది. ఊర్లోనే మా పొలం పనులను చూసుకుంటూ ఉండేవాణ్ని.

ఆస్తి వస్తుందని

ఆస్తి వస్తుందని

ఊరికి వెళ్లాక తనతో మాట్లాడడం తగ్గించేశాను. మా మేనత్త తన కూతురిని నాకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంది. మేనత్త కూతుర్ని చేసుకుంటే ఆస్తితో పాటు ఊరిలో గౌరవం కూడా ఉంటుందనిపించింది.

తను నమ్మింది

తను నమ్మింది

అందుకే నేను డేటింగ్ చేసిన అమ్మాయి నంబర్ ను బ్లాక్ లో పెట్టాను. మా ఇంట్లో పరిస్థితులు బాగాలేవు. కొన్నాళ్ల పాటు నువ్వు నాకు దూరంగా ఉండు అని తనను నమ్మించాను. తను కూడా నమ్మింది.

ఫారిన్ సంబంధం వచ్చిందని

ఫారిన్ సంబంధం వచ్చిందని

ఏడాది తర్వాత మా మేనత్త మంచి ఫారిన్ సంబంధం వచ్చిందని నన్ను కాదనుకుని తన కూతురిని వేరొకరికి ఇచ్చి పెళ్లి చేసింది. అప్పుడు నా బతుకు తెగిన గాలిపటంలా మారింది.

ప్రియురాలు గుర్తొచ్చింది

ప్రియురాలు గుర్తొచ్చింది

మళ్లీ నా ప్రియురాలు గుర్తొచ్చింది. తనకు ఫోన్ చేశాను. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాను. నువ్వు చేసుకోవడానికి ఇప్పుడు రెడీగా ఉన్నా నేను లేను అంది. నేను షాక్ అయ్యాను.

ఫ్రెండ్స్ చెప్పారు

ఫ్రెండ్స్ చెప్పారు

నీ గురించి నీ ఫ్రెండ్స్ మొత్తం చెప్పారు. నువ్వు నీ మేనత్త కూతుర్ని చేసుకోవడం కోసం నన్ను ఇన్నాళ్లు దూరంగా పెట్టావని తెలుసు. ఇప్పుడు ఆమెకు పెళ్లికాగానే మళ్లీ నావైపు వచ్చావంది.

నీ స్వార్థం కోసం వస్తే

నీ స్వార్థం కోసం వస్తే

తనను ఎంత బతిమిలాడినా కూడా తను వినలేదు. ఏడాదిపాటు డేటింగ్ చేశాం కదా... కనీసం ఒక్కసారి నాతో మాట్లాడు అని బతిమిలాడాను. కానీ తను ఒప్పుకోలేదు. నువ్వు నన్ను ఇన్నాళ్లు దూరం పెట్టి ఇప్పుడు నీ స్వార్థం కోసం వస్తే నేను ఎలా మాట్లాడుతాను అంది.

నమ్మించి మోసం చేశావు

నమ్మించి మోసం చేశావు

ఇన్నాళ్లు నేను పడ్డ బాధ గురించి నీకేమీ తెలుసంది. నిజంగా నీకు నన్ను వివాహం చేసుకోవాలనే ఉద్దేశం ఉంటే నన్ను దూరం పెట్టేవాడివి కాదు. నీకోసం నేను ఎంతో వేచి చూశాను. నువ్వు నన్ను నమ్మించి మోసం చేశావని తెలుసుకుని ఇంకొకరిని చూసుకున్నా.

నా జీవితం నాకే అర్థం కావడం లేదు

నా జీవితం నాకే అర్థం కావడం లేదు

ఇందులో నా తప్పు ఏమీ లేదు. నువ్వే నన్ను చేసుకోకూడదనే ఉద్దేశంతో డ్రామా ఆడావు. ఇప్పుడు ఎటూ దారి లేక మళ్లీ నా దగ్గరకు వచ్చావు అంటూ నాపై మండిపడింది. ఆ అమ్మాయి మాటలు విన్నాక నిజమే అనిపించింది. కానీ ఇప్పుడు నా జీవితం నాకే అర్థం కావడం లేదు.

ఆ బాధ అనుభవిస్తున్నా

ఆ బాధ అనుభవిస్తున్నా

నేను డబ్బుకు ఆశపడి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని దూరం పెట్టాను. ఇప్పుడు ఆ బాధ అనుభవిస్తున్నాను. నాలా ఎవరూ తప్పు చేయకండి అని నా మనవి.

Desktop Bottom Promotion