Latest Updates
-
ఇడ్లీ, దోసె పిండి బాగా పులిసిపోయిందా? పారేయకుండా ఈ చిట్కాలతో ఫ్రెష్ గా మార్చేయండి! -
కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు, జలదరింపుని లైట్ తీసుకుంటున్నారా? పక్షవాతానికి ముందస్తు హెచ్చరిక? -
ఆరోగ్యానికి మహా బలం అందించే నువ్వుల బాదం లడ్డు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే -
ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన ప్రోటీన్ చిక్కి..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
Chanakya Niti: మహిళలు ఈ 5 విషయాలను రహస్యంగా ఉంచితేనే జీవితంలో తిరుగుండదు! -
ఫ్రెంచ్ ఫ్రైస్ కాదు..ఇది కాకరకాయ ఫ్రైస్..ఒక్కసారి టేస్ట్ చేశారంటే అస్సలు వదిలిపెట్టరు.. -
కీళ్ల నొప్పులు, జలుబును మాయం చేసే మునగాకు ఉలవల సూప్..ఎలా చేసుకోవాలంటే.. -
ఈ పచ్చడి చేస్తే ఇంట్లో అందరూ ప్లేట్లు నాకేస్తారు.. బెండకాయ వంకాయ కాంబినేషన్ అదుర్స్! -
నల్ల దోసె.. చూస్తే షాక్, తింటే ఫిదా అవ్వాల్సిందే..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే దూదిలాంటి సగ్గుబియ్యం దోశ.. ఎలా చేయాలో తెలుసా?
జీవితాంతం కలిసి ఉండాలనుకున్నాం, ఆ కారణంతో ఆమెను పెళ్లి చేసుకోలేకపోయాను #mystory298
అప్పటికే నేను వాణి మాయలో పడ్డాను. తనను కాకుండా ఇంకెవ్వరినీ చేసుకోకూడదనుకున్నాను. వాణి కూడా నన్ను తప్ప ఇంకెవ్వరినీ చేసుకోను అని చెప్పింది. వాణి నాన్నకు తెలియకుండా మేమిద్దరం రెగ్యులర్ గా ఫోన్ లో..
ఆమె పేరు వాణి. ఒక్క మాటలో తన గురించి చెప్పాలంటే తను నా ప్రాణం అనుకున్నాను. నా ఊపిరి ఆగినా సరే తన చెయ్యి వదలకూడదనుకున్నాను. తన పరిచయం నాకు చాలా ప్రత్యేకం. నాకు తెలిసిన ఒక వ్యక్తి ద్వారా ఆమె ప్రొఫైల్ నాకు వచ్చింది.
బాబు నీకు ఒక అమ్మాయి డిటేల్స్, ఫొటోస్ పంపించాను. ఆ అమ్మాయి నచ్చితే నాకు చెప్పు. నీకు పర్ఫెక్ట్ జోడి అని చెప్పారాయన. ఆమె ఫొటో చూడగానే ఒకే చెప్పేశాను. పెళ్లంటు చేసుకుంటే వాణినే చేసుకోవాలనుకున్నాను.

జాతకాలు కలవడం లేదని
తర్వాత వాణి నాన్న ఫోన్ చేశారు. నా డిటేల్స్ తెలుసుకున్నారు. మీ ఇంటికి ఎప్పుడు రమ్మంటారో చెప్పండి.. వచ్చి అన్ని వివరాలు మాట్లాడుకుందాం అన్నాడు. ఆయన మా జాతకాలను ఒక వేదపండితుడికి చూపించారు. అమ్మాయి, అబ్బాయి జాతకాలు కలవడం లేదని పండితుడు చెప్పాడట.

పెళ్లికి నిరాకరించాడు
దీంతో వాణి నాన్న మా పెళ్లికి నిరాకరించాడు. కానీ అప్పటికే నేను వాణితో ఫోన్ లో మాట్లాడడం మొదలుపెట్టాను. జాతకాలు కలవకపోయేసరికి వాణి నాన్న మా పెళ్లికి నిరాకరించాడు. మా అమ్మాయితో మీకు పెళ్లి జరిగితే చాలా ఇబ్బందులుంటాయండీ.. మీరు ఈ పెళ్లి చేసుకోకపోవడమే బెస్ట్ అని సూచించాడు.

ఇంకెవ్వరినీ చేసుకోను
కానీ అప్పటికే నేను వాణి మాయలో పడ్డాను. తనను కాకుండా ఇంకెవ్వరినీ చేసుకోకూడదనుకున్నాను. వాణి కూడా నన్ను తప్ప ఇంకెవ్వరినీ చేసుకోను అని చెప్పింది. వాణి నాన్నకు తెలియకుండా మేమిద్దరం రెగ్యులర్ గా ఫోన్ లో మాట్లాడుకునేవాళ్లం.

జీవితాంతం కలిసి ఉండాలనుకున్నాం
తర్వాత వాట్సాప్ చాట్, వీడియో కాలింగ్స్ తో మేమిద్దరం బిజీబిజీగా ఉండేవాళ్లం. వీకెండ్స్ లో మేమిద్దరం కలుసుకునేవాళ్లం. ఎన్నో ఊసులు చెప్పుకునేవాళ్లం. మేమిద్దరం ఎలా అయినా సరే వాళ్ల నాన్నను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నాం. ఎన్ని కష్టాలు వచ్చినా సరే జీవితాంతం కలిసి ఉండాలనుకున్నాం.

ఇద్దరి మనసత్వాలు ఒక్కటే
ఇద్దరిదీ ఒకే ప్రొఫెషన్. ఇద్దరి మనసత్వాలు ఒక్కటే. చిన్నచిన్న గొడవలు వచ్చినా సరే సర్దుకుని పోయే మనసత్వం ఇద్దరిదీ. ఇద్దరం వివాహం చేసుకుంటే హ్యాపీగా బతకొచ్చు అన్నుకున్నాం. కానీ విధి మాతో వింతనాటకం ఆడింది.

చాలా కష్టాలు ఎదుర్కొన్నాను
చాలా రోజుల తర్వాత మళ్లీ వాళ్ల నాన్నకు ఫోన్ చేశాను. ఇప్పుడైనా ఒప్పుకుంటాడనుకున్నా. ఆయన ఎంతకూ ఒప్పుకోలేదు. అయినా సరే వాణిని రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్నాను. వాణి కూడా అందుకు సిద్ధమైంది. కానీ భవిష్యత్ పరిస్థితులు తలుచుకునేసరికి భయమైంది. అప్పటికే నేను నా జీవితంలో చాలా కష్టాలు ఎదుర్కొన్నాను.

కొత్త కష్టాలు వస్తాయనిపించింది
మళ్లీ వాణిని పెళ్లి చేసుకుంటే కొత్త కష్టాలు వస్తాయనిపించింది. ఏ సపోర్ట్ లేకపోతే జీవితాంతం ఇద్దరం కష్టాలు పడాల్సి వస్తుందనిపించింది. అప్పుడే నాకు మా బంధువుల నుంచి ఒక సంబంధం వచ్చింది. ఆ సంబంధాన్ని ఎలా అయినా నాతో ఒకే చేయించాలనుకున్నారు.బంధువులంతా కలిసి గట్టిగా అడిగేసరికి ఆ సంబంధానికి నేను ఒప్పుకోవాల్సి వచ్చింది.

వాణిని వదులుకున్నాను
ఇక నేను సిన్సియర్ గా లవ్ చేసిన వాణి వాళ్ల నాన్న పెళ్లికి ఒప్పుకోకపోవడం, ఒకవేళ వాణిని చేసుకుంటే జీవితాంతం ఇబ్బందులుపడాల్సి వస్తుందేమోననే భయంతో నేను నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే వాణిని వదులుకున్నాను. ఒకవేళ నేను పెళ్లి చేసుకున్నాక నాకేమైనా అయితే తను ఏ సపోర్ట్ లేక అన్యాయమైపోతుందనిపించింది. అందుకే నన్ను ఎంతో నమ్మిన వాణికి అన్యాయం చేశాను.

పరిస్థితుల ప్రభావం వల్ల
నేను తనకు దూరం అయినందుకు తను చాలా ఏడ్చింది. కానీ నేను అంతకంటే ఎక్కువే బాధపడ్డాను. ఒక అమ్మాయికి అన్యాయం చేశానని నాకు తెలుసు. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల అలా చేయాల్సి వచ్చింది. నాకంటే మంచి వాణ్ని తనకి వాళ్ల నాన్నతీసుకురావొచ్చు.. అప్పుడు తన జీవితం సంతోషంగా ఉంటుంది కదా. వాణి అవన్నీ ఏమీ అర్థం చేసుకోకుండా నన్ను నమ్మకద్రోహిగా భావిస్తోంది. నేను చేసింది తప్పా.. కరెక్టా? మీరే చెప్పండి.



Click it and Unblock the Notifications