For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  నెలవారీ రాశి ఫలాలు: మేష రాశి – జూన్

  |

  మేష రాశి వారు అంటేనే పోటీతత్వ స్ఫూర్తికి మరియు ఎటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో అయినా ఎగిరి దూకే లక్షణాలకు ప్రసిద్ది. ఆవిధంగా నాయకత్వపు లక్షణాలకు కేంద్ర బిందువుగా ఉంటారు. మీరు ఇలాంటి లక్షణాలు కలిగిన మేష రాశి వారేనా? మీ జీవితంలో ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునే ముందైనా మీ జ్యోతిష్కుడిని సంప్రదించడం లేదా దిన, వార, నెల వారి రాశి ఫలాలని అనుసరిస్తూ ఉంటారా? ఈ రెండు ప్రశ్నలకు సమాధానం అవును అయితే, మీ జాతకం ఈ 2018 జూన్ మాసంలో ఎలా ఉండబోనుందో, ఆర్ధిక సామాజిక వ్యవహారాలూ, కుటుంబ పరిస్థితుల గురించిన సమగ్ర విచారణకై ఈ వ్యాసం నిర్దేశిoచబడినది.

  జూన్, 2018 మేష రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉండనుంది. తద్వారా ఎటువంటి ఆందోళనలు లేకుండా, మేష రాశి స్వభావాల ప్రకారం దూకుడుతో పని లేకుండా విశ్రాంతిగా ఉండవచ్చు. పొరపాటున దూకుడుతో తీసుకునే నిర్ణయాలు మీకు వ్యతిరేకమై, సమాజంలో మీ పేరుకు మచ్చను తీసుకుని వచ్చే ప్రమాదం ఉంది. కావున ఎటువంటి సమస్యలలోనికి వెళ్ళకుండా, అలలన్నీ వెళ్ళిపోయే దాకా ప్రశాంతంగా గడపవలసి ఉంటుంది. ఈ జూన్ నెల మీరు స్వేచ్చా వాయువులను పీల్చుకునే సమయం., తిరిగే ప్రపంచాన్ని తిరగనివ్వండి, దానితో ప్రస్తుతానికి మీకు పని లేదు.

  మీ కెరీర్ సంబంధించిన లేదా ఆర్ధిక మరియు వివాహ సంబంధిత విషయాల్లో మీరు తొందరపడి తీసుకునే నిర్ణయాలు మీకు వ్యతిరేకంగా దెబ్బకొట్టగలిగే అవకాశాలు ఉన్నాయి. మీ ఆరోగ్యం, కెరీర్, ఆర్ధిక మరియు ప్రేమ సంబంధిత జీవన విధానం ఈ జూన్ మాసంలో ఎలా ఉండనుందో, మరింత సమాచారం కోసం చదవండి. అలాగే, మీ అదృష్ట తేదీలు, రత్నాలు మరియు రంగుల గురించిన మరింత సమాచారం తెలుసుకోండి.

  ఆరోగ్యం:

  ఆరోగ్యం:

  మేష రాశి వారికి ఆరోగ్యo పరంగా జూన్ మాసం ఎంతో బాగుంది. ఈ నెలలో మీరు ఆరోగ్యకరమైన జీవనశైలిని ఆనందిస్తారని సూచిస్తుంది. గ్రహాల అనుకూలత స్పష్టంగా ఉంది. మీరు దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే, ఈ నెల గణనీయమైన ఉపశమనం లభిస్తుంది అనడంలో ఏ మాత్రం ఆశ్చర్యం లేదు. ఏది ఏమైనప్పటికీ, ఆరోగ్యం పట్ల జాగ్రత్తగానే ఉండాలి, మీ నిర్ణయాలు భవిష్యత్తులో ప్రభావితం కాగలవు. ఎంత ఆరోగ్యంగా ఉన్నా, ఎంత ఉపశమనాన్ని పొందినా ప్రాధమిక జాగ్రత్తలు మాత్రo తప్పని సరి.

  కానీ, శ్వాస కోశ సంబంధిత మరియు గొంతు సమస్యలు ఉన్నవారు మాత్రం సమస్యలను తేలికగా తీసుకోకండి, ఇవి పూర్తిగా నివారించబడాలని గుర్తుంచుకోండి. మరియు మీ ఆరోగ్యం పట్ల ఒక అవగాహన కలిగి ఉండాలి. వైద్యుడిని కలిసి, సమస్యలు పరిష్కారమవుతాయో లేదో నిర్ధారించుకోండి. దీనితో పాటుగా, గౌట్, రుమటిజం మరియు జీర్ణవ్యవస్థలో గాలి బుడగలు అధికంగా కలిగి ఉన్నవారికి కూడా ఈ నెల కాస్త ఉపశమనoగానే ఉంటుంది. కానీ కొన్ని ప్రాధమిక జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా వైద్యుల సలహా మేరకు పాటించవలసి ఉంటుంది.

  ఉద్యోగం:

  ఉద్యోగం:

  మీరు మేష రాశి వారైతే, జూన్ నెలలో మీ వృత్తిపరంగా విజయానికి గొప్ప నెలగా చెప్పబడింది. మీ ఉద్యోగ వ్యాపార విషయాలలో నక్షత్రాలు, గ్రహాలూ ఎంతో అనుకూలంగా ఉన్నాయి. మీ ఎదుగుదలకు సరైన నెలగా చెప్పబడింది. మరియు అధిక ప్రయాణాలకు, ట్రాన్స్ఫర్లకు కూడా ఈ నెల అనుకూలంగా ఉంది. ఎటువంటి ఆర్దికసమస్యలు కూడా ఎదురుకావు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలనందు ఆహ్లాదకరమైన వాతావరణం తోడై, ఎంతో ప్రశాంతతకు లోనవుతారు. మీ కుటుంబ సభ్యులు, కార్యాలయ సహోద్యోగులు, స్నేహితులు లేదా కొత్త పరిచయాలతో సంబంధాలు ఆశాజనకమైన ఫలితాలను తీసుకుని రావొచ్చు.

  ఆర్దిక వ్యవహారాలు:

  ఆర్దిక వ్యవహారాలు:

  ఈ నెలలో ఎటువంటి ఆర్ధిక సమస్యలు లేకుండా ప్రశాంతంగా ఉండేలా అనువుగా ఉంది. అంతేకాకుండా, ఆశించిన విషయాలనందు ప్రత్యేక లాభాలు పొందగలరు. రవాణా, మరియు ట్రేడింగ్ , స్పెక్యులేషన్స్ సంబంధిత వ్యవహారాల్లో మీరు ఆశించిన ఫలితాన్ని పొందగలరు. ఈ నెలలో మీకు పెద్ద లాభాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. దీనితో పాటు, మీరు ఏ ఇతర వ్యాపార రంగానికి చెందినవారైనా, లాభాలను మాత్రం ఖచ్చితంగా ఆశించవచ్చు.

  మీరు చిన్న పాటి వ్యాపారాలలో ఉంటూ స్వల్ప లాభాలను కలిగిన వారైనా కూడా, మీకు ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉండనుంది. త్వరలోనే దీర్ఘకాలిక సమస్యలకు చెక్ పెట్టి, కొత్త జీవితానికి నాంది పలుకవచ్చు. కొన్ని ఆర్ధిక సంబంధిత కోర్టు వ్యవహారాలలో కూడా తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే సూచనలు ఉన్నాయి. మరియు అధిక లాభాలను ఆర్జించే అవకాశాలు కూడా ఉన్నాయి. అదృష్టవ శాత్తూ పెద్ద పెట్టుబడులనందు ఆసక్తిని కలిగి ఉండరు. అయితే చిన్న పెట్టుబడులు మాత్రం మీకు అత్యంత లాభదాయకంగా మారవచ్చు. ఆర్థిక లాభాల యొక్క ఇతర రూపాలైన బోనస్, ఇన్సెంటివ్స్ వంటివి మీకు సంతృప్తిని ఇచ్చే అంశాలుగా ఉంటాయి.

  ప్రేమ జీవితం గురించి:

  ప్రేమ జీవితం గురించి:

  జూన్ మాసం మీ ప్రేమ జీవితానికి అనుకూలమైన నెలగా ఉంది మరియు మీరు ప్రేమలో నిలదొక్కుకోడానికి ప్రయత్నిస్తున్నవారైతే, మీకొక అవకాశంగా ఈ నెల ఉంటుంది. మీ ప్రవృత్తులు, మీ ఆర్థిక మరియు సాంఘిక పరిస్థితితో నిమిత్తం లేకుండా, ఎటువంటి విషయాలకు బెదరకుండా మీ ప్రేమను వ్యక్తపరిచే పరిస్థితులు నెలకొంటాయి. మీరు ఇప్పటికీ ఆ ప్రత్యేకమైన వ్యక్తిని జీవితంలోకి ఆహ్వానించాలని భావిస్తుంటే, ఈ జూన్ నెల ఖచ్చితంగా మీకు సహాయం చేయగలదు.

  మీరు పెళ్లి అయిన వారే అయితే, మీరు మీ భాగస్వామిని అర్ధం చేసుకునే అవకాశం ఈ జూన్ మాసం కల్పిస్తుంది. మీ కోపాలు, భాధలు, మీ సంతోషాలు ఏవైనా మీ భాగస్వామిపై ఎటువంటి ప్రభావాలు చూపుతుందో మీకoటూ ఒక అవగాహన రావడానికి ఈ జూన్ నెల కీలకంగా ఉండనుంది. మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య కొద్దిపాటి అపార్థం ఉండవచ్చు. ఏది ఏమయినప్పటికీ, వెంటనే నిర్ణయం తీసుకునే బదులు,కూర్చుని మాట్లాడడమే, సమస్యల పరిష్కారానికి అత్యుత్తమమైన చర్యగా భావిస్తారు. ఎటువంటి అపార్దాలైనా తొలగిపోయి నూతన జీవితానికి నాంది పలుకుతుంది.

  మీ అదృష్ట రంగులు, అంకెలు మరియు రత్నాలు :

  మీ అదృష్ట రంగులు, అంకెలు మరియు రత్నాలు :

  ఈ జూన్ నెలలో మీ అదృష్ట రంగులు ఎరుపు మరియు సింధూర వర్ణంగా ఉన్నాయి. ఈ నెలలో మీ లక్కీ నంబర్లు 9, 6, 24, 33, 36, మరియు 36. ఏదైనా అదృష్ట రత్నాన్ని కొనాలని భావిస్తున్న ఎడల పగడము లేదా నీలం సూచించబడినది. ఏది ఏమైనా మీ జాతకoలో గ్రహాల స్థితిగతులను పరిశీలించి, జ్యోతిష్య నిపుణుల సూచనల మేరకు రత్నాన్ని ధరించడం ఉత్తమంగా చెప్పబడుతుంది. ఒక్కోసారి గ్రహాలతో పొంతనలేకుండా తీసుకున్న ఎడల కొన్ని ప్రతికూల ప్రభావాలు కూడా తలెత్తవచ్చు.

  ఈ నెలలో మీకు సింహ రాశి , ధనుస్సు రాశి మరియు కుంభ రాశుల వారు అనుకూలంగా ఉండే రాశులుగా చెప్పబడినవి.

  ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే, మీ ప్రియమైన వారితో పంచుకోండి. రాశి చక్రాల గురించి మరిన్ని వివరాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శిస్తూ ఉండండి.

  English summary

  Monthy Prediction - June- Aries

  Monthy Prediction - June- Aries. Pisces are among the friendliest and calmest people you will come across. They have a kind and friendly nature, which encourages people around them to open up to them and seek their advice. They handle patches of roughness that come their way with ease. They also have a soft corner which makes them the ultimate forgivers. People belonging to the sun sign Pisces never abstain from showing their emotions and love. These characteristics make them very transparent people.
  Story first published: Friday, June 1, 2018, 10:45 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more