హానికరమైన రాశుల గురించి భయంకర నిజాలు బయటపెట్టిన ఎఫ్.బి.ఐ

By R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

రాశిచక్రంలో అత్యంత ప్రమాదకరమైన రాశి ఏదైనా ఉంది అని మీరు ఎప్పుడైనా ఊహించారా ? ఏ వ్యక్తులు అత్యధిక నేరాలు చేయడానికి పూనుకుంటున్నారు అనే విషయం గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా ?

ఈ విషయాలన్నింటిని మరింత బాగా అర్ధం చేసుకోవడం కోసం రాశిచక్రంలో ఏ రాశి వారు అత్యంత ప్రమాదకరమైనవారు అనే విషయం గురించి ఎఫ్.బి.ఐ ఒక పట్టికను విడుదల చేసింది.

Most Dangerous Zodiac Signs: Which Zodiac Tops aThe List?

నేరస్థుల సమాచారాన్ని ఆధారంగా చేసుకొని ఈ రాశుల గురించి చెప్పడం జరిగింది. వారి దగ్గర ఈ నేరస్థులు చేసిన నేరాల రికార్డు లను పరిశీలించి ఈ వివరాలను పొందుపరిచారు.

ఏ రాశి అత్యంత ప్రమాదకరమైనది ? అందులో మీ రాశి ఎక్కడ ఉంది అనే విషయాన్ని ఇప్ప్పుడు ఈ వ్యాసం ద్వారా తెలుసుకోవచ్చు.

కర్కాటకరాశి జూన్ 21 నుండి జులై 22 వరకు :

కర్కాటకరాశి జూన్ 21 నుండి జులై 22 వరకు :

ఎఫ్.బి.ఐ రికార్డుల ప్రకారం అత్యంత ప్రమాదకరమైన రాశి ఇదే. ఈ రాశికి సంబంధించిన వారినే అత్యధికంగా అరెస్ట్ చేయడం జరిగింది. వీరిలో మానసిక అస్థిరత ఎక్కువ. ఈ కారణాల వల్లనే వీరు తరచూ నేరాలకు పాల్పడుతూ ఉంటారు. ఎఫ్.బి.ఐ అధ్యయనాల ప్రకారం ఈ రాశివారు నేరాలను అభిరుచిగా ఎంచుకొని చేస్తారట. ఈ వ్యక్తులు ఎప్పుడైతే ఎవరినైనా చంపుతారో అప్పుడు ఆ భాదితుల శరీరం పై ఒక విభిన్నమైన గుర్తుని వేస్తారట.

వృషభం ఏప్రిల్ 20 నుండి మే 20 వరకు :

వృషభం ఏప్రిల్ 20 నుండి మే 20 వరకు :

ఈ రాశివారు ఎంతో ప్రత్యేక గుణాన్ని కలిగి ఉంటారు. స్వాధీనత తో పాటు మోడీ పట్టుదల గల వ్యక్తిత్వాన్ని కలిగి ఉండటం వల్ల ఈ రాశి వారిని ప్రమాదకారులుగా గుర్తించడం జరిగింది. మరో వైపు వీరు చాలా తెలివైనవారు. అదే సమయంలో ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. సహజంగానే వీరిలో నాయకత్వ లక్షణాలు ఉంటాయి. కానీ, ఒకవేళ వీరు గనుక చెడు మార్గంలో పయనించినట్లైతే, వీరిని ఎవ్వరు ఆపలేరు. అప్పుడు వీరు భయంకరమైన నియంతలుగా మారిపోతారు. ఎవ్వరికీ తలవంచకుండా ప్రపంచం పై ఆధిపత్యం ప్రదర్శించాలని చూస్తారు. దీని ఫలితంగా వారి పనులు చేయించుకోవడానికి వీరు ఎంతటికైనా తెగిస్తారు.

ధనుస్సు నవంబర్ 23 నుండి డిసెంబర్ 22 వరకు :

ధనుస్సు నవంబర్ 23 నుండి డిసెంబర్ 22 వరకు :

వీరు అస్థిర మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కోపంతో ఉన్నప్పుడు వీరిలో క్షమించే గుణం అస్సలు కనపడదు. చాలా కఠినంగా వ్యవహరిస్తారు. ఇతరులను గాయపరిచే విషయంలో అసంతృప్తిగా ఉంటారు. కానీ, దొంగతనాల విషయంలో వీరు ఎక్కువగా అరెస్ట్ అవుతుంటారు. అత్యంత క్రూరమైన నేరస్థులుగా కూడా వీరిని గుర్తించడం జరుగుతుంది. ఎందుకంటే చట్టాల కళ్ళు కప్పి ఎలా తెప్పించుకోవాలా అని ఆలోచిస్తుంటారు. మరోవైపు వారి జీవితం ప్రమాదంలో పడింది అనేంతవరకు రక్తాన్ని కళ్ల చూడరు.

మేషం మార్చి 21 నుండి ఏప్రిల్ 19 వరకు :

మేషం మార్చి 21 నుండి ఏప్రిల్ 19 వరకు :

ఈ రాశి వ్యక్తులు మొండి పట్టుదల కలిగి ఉంటారు. అత్యంత క్రూరమైన నేరాలు చేసే నేరస్థులుగా వీరికి 4 వ స్థానం ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏమి చేయాలి అనే విషయం చెబితే వారికి అస్సలు నచ్చదు. పోటీలో పాల్గొని జీవితంలో గెలవాలంటే అస్సలు ఇష్టపడరు. అక్రమ మార్గాన్ని వృత్తిగా ఎంచుకొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వారిపై అధికారం ప్రదర్శించడాన్ని ద్వేషిస్తారు. ఒకవేళ మీరు గనుక ఈ రాశి వారికి యజమానులుగా లేదా అధికారిగా వ్యవహరించాలని చుస్తే వారు మీకు ఎదో విధంగా బుద్ధిచెప్పాలని ప్రయత్నించే అవకాశాలు ఎక్కువ. అక్రమ పనుల్లో అద్దెకు పనిచేసే గన్ మ్యాన్ లుగా ఎక్కువగా పనులను స్వీకరిస్తారు. వీరు ఎప్పుడూ విపరీతమైన ఆయుధాలను కలిగి ఉంటారు.

మకరం డిసెంబర్ 23 నుండి జనవరి 20 వరకు :

మకరం డిసెంబర్ 23 నుండి జనవరి 20 వరకు :

మకరరాశి వారు అన్ని రకాల నేరాల్లో నైపుణ్యాన్ని కలిగి అంటారు. చిన్న చిన్న నేరాల దగ్గర నుండి దౌర్జన్య చర్యల్లో అన్నింటిలో పాల్గొంటుంటారు. వీరు చాలా ప్రమాదకారులు. మరో వైపు వీరు తాము చేసిన తప్పులను కప్పి పుచ్చుకోవడంతో విఫలం చెందుతుంటారు. అజాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. అందువల్లనే తప్పుచేసినా త్వరగా దొరికిపోతారు.

కన్య ఆగష్టు 24 నుండి సెప్టెంబర్ 23 వరకు :

కన్య ఆగష్టు 24 నుండి సెప్టెంబర్ 23 వరకు :

ఈ రాశివారు చాలా తెలివైన వారు. కానీ, నేరాలు చేసే ఆలోచనలు కూడా వీరిలో ఉంటాయి. హ్యకింగ్, దోపిడీ లేదా ఇతర చిన్న చిన్న దొంగతనాలు చేయడానికి మొగ్గు చూపుతుంటారు. వీరు ఏదైనా పద్దతి ప్రకారం చేస్తూ చాలా బాగా పనులను చేస్తారు. అందువల్లనే, వీరు ఎటువంటి నేరం చేసినా ఎటువంటి ఆధారం దొరకనివ్వరు. వీరు ఎక్కువగా దోపిడీలు, హ్యాకింగ్ లేదా ఇతర దొంగతనాలను చేస్తుంటారు.

తులారాశి సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 23 వరకు :

తులారాశి సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 23 వరకు :

వీరు అంత సులభంగా చట్టాలను అతిక్రమించారు. కానీ, ఒకవేళ అదే పని గనుక చేస్తే బ్యాంకు కు సంబంధించిన స్కామ్ లు లేదా ఆర్ధిక సంబంధిత విషయాల్లో ఎక్కువగా నేరాలకు లేదా మోసాలకు పాల్పడుతుంటారు. అంతేకాకుండా మాదక ద్రవ్యాలకు సంబంధించిన విషయాల్లో కూడా తలదూర్చే అవకాశం ఉంది. ఏదైనా పెద్ద సంస్థ వెనుక ఉండి ఇలాంటి నేరాలకు పాల్పడుతుంటారు.

మీనం ఫిబ్రవరి 19 నుండి మర్చి 20 వరకు :

మీనం ఫిబ్రవరి 19 నుండి మర్చి 20 వరకు :

ఈ రాశి వ్యక్తులు రహస్య చీకటి కోణాలను బయటపడకుండా దాచిపెడుతుంటారు. తమ శరీరం పై మాదక ద్రవ్యాలను ఉపయోగించి బానిసలుగా మార్చుకొనే పనుల వంటి నేరాలకు పాల్పడుతుంటారు. సీరియల్ కిల్లర్స్ ఎక్కువగా ఈ రాశికి చెందిన వారై ఉంటారు. ఈ రాశి వ్యక్తులు ఎప్పుడైతే నిగ్రహాన్ని కోల్పోతారో అప్పుడు కట్టెలు తెంచుకున్న కోపంతో వ్యవహరించి అత్యంత ప్రమాదకారులుగా మారుతారు.

వృశ్చికం అక్టోబర్ 24 నుండి నవంబర్ 22 వరకు :

వృశ్చికం అక్టోబర్ 24 నుండి నవంబర్ 22 వరకు :

ఈ రాశివారు ఈర్ష్య , అసూయతో పాటు దూకుడుగా వ్యవహరిస్తారు. తప్పుడు పరిస్థితుల్లో ఇవి చాలా తీవ్రమైన పరిణామాలు కలిగిస్తాయి. పనిచేయడం అనేది ఒక నేరంగా భావిస్తారు. మరోవైపు అత్యంత వక్రబుద్ధిగల రాశిగా వీరు పేరుగడించారు. ఈ రాశివారు చాలా మోసపూరిత లక్షణాలను కలిగి ఉంటారు. వీరంతట వీరే చెడు చర్యలు చేపట్టకపోవచ్చు. కానీ, అలా చేసి అక్కడ ఎటువంటి ఆధారం లేకుండా తప్పించుకొని అందర్నీ ఆశ్చర్యపరచగలరు.

సింహరాశి జులై 23 నుండి ఆగష్టు 23 వరకు :

సింహరాశి జులై 23 నుండి ఆగష్టు 23 వరకు :

ఈ రాశివారు సంచలనాత్మకమైన అభిరుచిని, ఉద్వేగపూర్వక స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇది చాలా సానుకూలమైన అంశమే కానీ, ఒకవేళ వారు గనుక తప్పు దోవ పట్టినట్లైయితే, అప్పుడు విపరీతమైన స్వభావాలతో మతిభ్రమిబించిన పనులను చేస్తారు. నిగ్రహాన్ని కోల్పోయినప్పుడు పరిస్థితులు మరింత దిగజారిపోతాయి. ముఖ్యంగా వీరు కోరుకున్న దృష్టి వీరి పై పడినప్పుడు ఇలాంటి విపరీతమైన పనులు చేస్తుంటారు. వీరిలో తీవ్రంగా స్పందించే స్వభావం ఎక్కువగా ఉంటుంది. అటువంటి సమయంలో దుర్మార్గపు ఆలోచనలు కలిగి ఉంటారు. పేరు ప్రఖ్యాతలు కోసం నేరాలను చేయడానికి కూడా వెనకాడరు.

కుంభం జనవరి 21 నుండి ఫిబ్రవరి 18 వరకు :

కుంభం జనవరి 21 నుండి ఫిబ్రవరి 18 వరకు :

చెడు పనులకు బాధితులుగా మారనంత వరకు వీరు చాలా మంచి ఉత్తమమైన స్వభావం కలిగి ఉంటారు. కానీ, ఎప్పుడైతే పగ ప్రతీకారం తీర్చుకోవాల్సి వస్తుందో, అటువంటప్పుడు వీరు ముందు వరసలో నిలుస్తారు. మరోవైపు వీరు చాలా తెలివిగా వ్యవహరిస్తారు. ఆకర్షణీయమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరు చాలా మంచి హ్యకర్లుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించగలరు. తారుమారు చేయడంలో సిద్ద హస్తులు.

మిథునం మే 21 నుండి జూన్ 20 వరకు :

మిథునం మే 21 నుండి జూన్ 20 వరకు :

అన్ని రాశుల్లో కెల్లా అత్యంత తక్కువ ప్రమాదకరమైన రాశి వ్యక్తులు వీరు. ఒకవేళ ఈ వ్యక్తులు గనుక ఏవైనా నేరాలు చేయాలని భావించినట్లైతే , అటువంటి సమయంలో దొంగతనం, మోసం లాంటి పనులు చేస్తుంటారు. ఈ రాశి వ్యక్తుల్లో ఆందోళన, నిస్సారంగా వ్యవహరించడం, స్థిరత్వం లేకపోవడం లాంటి ప్రతికూల లక్షణాలు కలిగి ఉంటారు. మొత్తంగా చూసినట్లైతే ఈ రాశివారు పెద్దగా ప్రమాదకారులు కారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Most Dangerous Zodiac Signs: Which Zodiac Tops aThe List?

    Most Dangerous Zodiac Signs: Which Zodiac Tops The List,These zodiac signs are listed as the most dangerous zodiac signs. This list has been released by the FBI after they checked in the prisoners' zodiac signs on their records. Check out on which level does your zodiac sign stand.
    Story first published: Wednesday, March 21, 2018, 7:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more