Latest Updates
-
కండలను ఉక్కును మార్చే రాగితో హెల్తీ బన్ దోశ.. బరువు తగ్గాలంటే పక్కా తినాల్సిందే.! -
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.!
మీటూ, నగ్నంగా నిలబెట్టేవాడు, తొడలపై చెయ్యి వేసేవాడు, ఆ కోరికలు కలిగితే ఏం చేస్తావనేవాడు #mystory272
ఒకసారి తన క్యాబిన్ లోకి పిలిపించకుని నీ డ్రెస్ తీసేసి జస్ట్ బ్రా, ప్యాంటీపై నిలబడి చూపించు అన్నాడు. ఎందుకు సర్ అంటే ఫస్ట్ నీ బాడీ చూసి నువ్వు ఫ్యాషన్ డిజైనర్ గా పనికొస్తావా లేదా అని చెబుతా అన్నాడు.
నేను ఒక ఫ్యాషన్ డిజైనర్ ని. అందరిలాగే నేను కూడా చాలాసార్లు లైంగిక వేధింపులకు గురయ్యాను. నేను ఒక సీనియర్ దగ్గర కొన్ని రోజులు పని నేర్చుకుందామని వెళ్లాను. ఆయన సమాజంలో మంచి పేరుంది. చాలా మంచి వ్యక్తి అని కూడా విన్నాను. అందుకే అతని దగ్గర చేరాను.
అయితే నాకు పని నేర్పించే క్రమంలో తను నాతో ఎలా అంటే అలా ప్రవర్తించేవాడు. రోజూ పొట్టి డ్రస్ లతో ఆఫీస్ కు రమ్మనేవాడు. ఆఫీస్ కు అందరి కంటే ముందు నన్నే పిలిపించేవాడు.
షార్ట్ స్కర్ట్స్, వక్షోజాలకు బాగా అతుక్కుని పోయే టాప్స్ వేసుకో అని చెప్పేవాడు. అవి నాకు ఇష్టం ఉండదు అంటే ఫ్యాషన్ డిజైనర్ గా ఎదగాలంటే ఫస్ట్ నీకు డ్రెస్ సెన్స్ ఉండాలనేవాడు.

నీ బాడీ కూడా..
నువ్వు మోడల్ కు మంచి డ్రెస్ డిజైన్ చేయాలంటే ఫస్ట్ నీ బాడీ కూడా అలా మోడల్ మాదిరి తయారు చేసుకోవాలి. నిన్ను నువ్వు ఒక మోడల్ కు ఇమాజిన్ చేసుకో. నువ్వు బాగా స్లిమ్ గా మోడల్ మాదిరిగా తయారవ్వు. అప్పుడే ఈ రంగంలో బాగా రాణిస్తావు అనేవాడు.

బ్రా, ప్యాంటీపై నిలబడి చూపించు
ఒకసారి తన క్యాబిన్ లోకి పిలిపించకుని నీ డ్రెస్ తీసేసి జస్ట్ బ్రా, ప్యాంటీపై నిలబడి చూపించు అన్నాడు. ఎందుకు సర్ అంటే ఫస్ట్ నీ బాడీ చూసి నువ్వు ఫ్యాషన్ డిజైనర్ గా పనికొస్తావా లేదా అని చెబుతా అన్నాడు. నేను అలా చేయననే సరికి చాలా దారుణంగా మాట్లాడాడు. ఎందుకొస్తారు ఈ ఫీల్డ్ లోకి ఫ్యాషన్ ఫీల్డ్ అంటే చాలా బోల్డ్ గా ఉండాలి. అన్ని కప్పుకుని కూర్చొంటామంటే ఈ రంగంలో పనికిరారు అనేవాడు.

బ్రా, ప్యాంటీతో నిలబడ్డాను
దాంతో నేను డ్రెస్ తీసేసి కేవంల బ్రా, ప్యాంటీతో నిలబడ్డాను. సరే కాస్త ఫ్యాట్ ఉంది తగ్గించుకో అనేవాడు. నీ ఒంటికి డ్రెస్ బాగా సూట్ అయితే నీకు కూడా మంచి పేరు వస్తుంది అనేవాడు. అతను మాట్లాడేమాటలు ఒక్కటీ అర్థం అయ్యేవి కావు. అయినా మోడల్ కు డ్రెస్ ఎలా డిజైన్ చేయాలనే విషయంలో నాకు మంచి అవగాహన ఉంది. నేను అందులో పర్పెక్ట్. కానీ అతను మాత్రం నాకు స్కిల్స్ నేర్పిస్తున్నాని చెప్పి నా అందాలన్నీ చూసేవాడు.

చాలా మంది మగవారు టార్చర్ చేస్తారు
అయితే నేను ఎంచుకున్న ఫీల్డ్ అలాంటిది కాబట్టి నేను కూడా ఏమీ అనేదాన్ని కాదు. నేను ఎవరికైనా చెబితే మరి నువ్వు ఉండే రంగం అలాంటిది అని నన్నే తప్పుపడతారు. ఫ్యాషన్ ఫీల్డ్ లో కూడా చాలా మంది మగవారు మహిళలను టార్చర్ చేస్తూ ఉంటారు. బయటకు అందంగా నవ్వుతూ కనిపించినా లోపల మాత్రం చాలా బాధతో ఉంటారు ఫ్యాషన్ ఫీల్డ్ లోని అమ్మాయిలు.

సెక్స్ కోరికలు కలిగితే ఏం చేస్తావు
అంతేకాదు ఆ సీనియర్ నా పర్సనల్ విషయాలు చాలా అడిగేవాడు.నీకు సెక్స్ కోరికలు కలిగితే ఏం చేస్తావు.. మాస్టర్బేషన్ చేసుకుంటావా అని అడిగేవాడు. నాకు ఈ విషయంలో చాలా రోజుల నుంచి డౌట్ ఉంది. నీకు అసలు అలాంటి కోరికలు కలుగుతాయా అని అనేవాడు. ఒకవేళ కలిగితే ఏం చేస్తావు అని అడిగేవాడు.

తొడలపై చేయి వేసి మాట్లాడేవాడు
ఎప్పుడూ నా తొడలపై చేయి వేసి మాట్లాడేవాడు. నిన్న ఒక మోడల్ డ్రెస్ డిజైన్ చేయమంది. తన బ్రెస్ట్ సైజ్ నీది ఒక్కటే.. నేను మెజర్ మెంట్స్ తీసుకోవడం మరిచిపోయాను. ఒక్కసారి నీ బ్రెస్ట్ సైజ్ తీసుకుంటా అంటూ తీసుకునేవాడు. అప్పుడు నా బ్రెస్ట్ ఎలా అంటే అలా టచ్ చేసేవాడు. ఎవరో మోడల్ పేరిట నన్ను లైంగికంగా వేధించేవాడు.

మార్కెట్లో పేరు మొత్తం పోతుంది
అతని దగ్గర నుంచి పని మానేసి బయటకు వస్తే నాకు మార్కెట్లో ఉన్న పేరు మొత్తం పోతుంది. ఎక్కడా అవకాశాలు రావు. అందుకే మౌనంగా భరిస్తూ ఉండేదాన్ని. నేను అలా కొన్ని వందల సార్లు కొన్ని వందల రకాలుగా అతనితో ఇబ్బందులుపడ్డాను. నాలాగే చాలా మంది అమ్మాయిలు కెరీర్ కోసం అలా వేదన పడుతూ ఉంటారు. కానీ ఎవ్వరూ పైకి చెప్పుకోలేరు.



Click it and Unblock the Notifications