Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
లెక్కల మాష్టార్ నా నడుమును ఒత్తేవాడు, వక్షోజాలను తాకేవాడు, తొడను గిల్లేవాడు #mystory268
బాగా కఠినంగా ఉండే లెక్క ఇచ్చి దాన్ని చెయ్యమనేవాడు. నేను దాన్ని చెయ్యలేక ఇబ్బందిపడే సందర్భంలో వచ్చి నా పక్కనే కూర్చొనేవాడు. నా నడుమును గట్టిగా ఒత్తేవాడు. వక్షోజాలను తాకేవాడు. తొడను గిల్లేవాడు. అవన్నీ ప
ఇప్పుడు సెలబ్రెటీలంతా మీటూ అంటూ ఉద్యమాన్ని తీసుకొచ్చారు. కేవలం సినిమా ఫీల్డ్ లో ఉండే అమ్మాయిలే కాదు నాలాంటి చాలా సాధరణమైన అమ్మాయిలు కూడా అలాంటి లైంగిక వేధింపులు చాలా సార్లే ఎదుర్కొని ఉంటారు.
నేను స్కూల్లో చదువుతున్నప్పుడు మా లెక్కల మాష్టార్ఎక్కడంటే అక్కడ తాకేవాడు. మా తరగతిలో అబ్బాయిలు అమ్మాయిలు కలిపి వంద మందికి పైగా ఉండేవారు. అప్పుడు నేను పదో తరగతి. క్వాటర్లీ మ్యాథ్స్ ఎగ్జామ్ లో నాకు తక్కువ మార్కులు వచ్చాయని అందరి ముందే నాకు తొడపాశం పెట్టాడు.

నా నడుముని గట్టిగా ఒత్తాడు
మరుసటి రోజు క్లాస్ లో బోర్డ్ పై లెక్క రాసి అందరినీ దాన్ని నోట్ బుక్ లోకి ఎక్కించుకోమన్నాడు. ఆ సమయంలో నా పక్కనే వచ్చి కూర్చొన్నాడు. ఏంటీ అదోలా ఉన్నావ్ అంటూ నా మెడపై చెయ్యి వేశాడు. తర్వాత ఆ చెయ్యి నా నడుముపైకి వెళ్లింది. అక్కడ గట్టిగా ఒత్తాడు. మరోసారి మార్కులు తక్కువ వస్తే బాగుండదు అంటూ చివరకు ఏదో హెచ్చిరించినట్లు కవర్ చేసుకున్నాడు.

ఒక గంట ముందే ట్యూషన్ కు రా
ఇక రోజూ సాయంత్రం తను ట్యూషన్ కు వెళ్లేదాన్ని. ట్యూషన్ కు వెళ్లకుంటే మాష్టార్ నాపై పగ పెంచుకుంటాడని నాకు తెలుసు. అందుకే ఇష్టం లేకున్నా వెళ్లేదాన్ని. నువ్వు మ్యాథ్స్ లో బాగా వీక్ ఒక గంట ముందే ట్యూషన్ కు రా అని అనేవాడు.
తప్పనిపరిస్థితుల్లో వెళ్లేదాన్ని.

వక్షోజాలను తాకేవాడు
బాగా కఠినంగా ఉండే లెక్క ఇచ్చి దాన్ని చెయ్యమనేవాడు. నేను దాన్ని చెయ్యలేక ఇబ్బందిపడే సందర్భంలో వచ్చి నా పక్కనే కూర్చొనేవాడు. నా నడుమును గట్టిగా ఒత్తేవాడు. వక్షోజాలను తాకేవాడు. తొడను గిల్లేవాడు. అవన్నీ పనిష్ మెంట్స్ లో భాగం అన్నట్లు ప్రవర్తించేవాడు.

చాలా మంది అమ్మాయిలు అనుభవించారు
కానీ అతని ఉద్దేశం మాత్రం నాకు అర్థమయ్యేది. తరగతిలో వందమంది విద్యార్థుల ఎదుటే ఇలాంటి అవమానాన్ని నేను చాలాసార్లు భరించాను. నేనే కాదు చాలా మంది అమ్మాయిలు చాలా మంది మాష్టార్ల చేతిలో ఇలాంటి నరకం అనుభవించడం నేను కళ్లారా చూశాను.

ఇప్పటికీ ఆ సంఘటనలు గుర్తొస్తే
ఏ విద్యార్థి కూడా దీని గురించి నోరెత్తి మాట్లాడే ధైర్యం చేయలేరు. ఎందుకంటే మాష్టార్ ఉద్దేశపూర్వకంగా చెయ్యడంలేదు కేవలం పనిష్మెంట్ లో భాగంగానే అలా చేస్తున్నాడని అంటారు. పనిష్మెంట్ కు లైంగిక వేధింపులకు ఆ వయస్సులో తేడా తెలియదేమోగానీ నాకు ఇప్పటికీ ఆ సంఘటనలు గుర్తొస్తే వెళ్లి వాణ్ని కొట్టి వద్దామన్నంత కోపం వస్తూ ఉంటుంది.

ఆ విషయాలు గుర్తున్నాయంటే
నాకు ఇప్పుడు పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారు. ఇవన్నీ నేను చదువుకుంటున్న రోజుల్లో జరిగిన సంఘటనలు. ఇప్పటికీ నాకు విషయాలు గుర్తున్నాయంటే వాడు నన్ను ఎంత లైంగిక వేధింపులకు గురి చేశాడో మీరే అర్థం చేసుకోవాలి. విద్యార్థినులను అనుభవించాలనుకునే ఇలాంటి డ్యాష్ గానోళ్లు చాలా మందే ఈ సమాజంలో ఉన్నారు.

గిల్లితే గిల్లించుకోవాలి
కేవలం విద్యార్థినులే కాదు.. మగాడికి దగ్గరకు మగాడి కింద పని చేసే ప్రతి అమ్మాయిని, మగాడి సాయం కోరే ప్రతి అమ్మాయిని ఎలాగైనా సరే అనుభవించాలని, ఆమెను ఏదో ఒకటి చెయ్యాలని భావించే మగాళ్లు చాలా మందే ఈ సొసైటీలో ఉన్నారు. చాలా మంది మగాళ్లు తమ దగ్గర పని చేయాలంటే తాము గిల్లితే గిల్లించుకోవాలి.. ఇంకేదైనా చేస్తే చేయించుకోవాలి అనే రకంగా ఉన్నారు. లేదంటే మరో జాబ్ చూసుకో అనే రీతిలో ప్రవర్తిస్తుంటారు.

నిజాయితీ గల మగాడు ఇలా చెయ్యడు
తమ సమస్యను బయటకు చెప్పుకుంటే అసలుకే అవకాశాలు రావని, చులకన అయిపోతామని చాలా మంది అమ్మాయిలు బలవంతంగా వీటన్నింటినీ భరిస్తూ ఉంటారు. అందరూ మగాళ్లు ఇలాగే ఉంటారని నేను అనడం లేదు. మగాళ్లుగా చెప్పుకునే కొందరు అటుఇటుకానీ తేడాగానోళ్లే ఇలా ప్రవర్తిస్తారు. నిజాయితీ గల మగాడు ఇలా చెయ్యడు.



Click it and Unblock the Notifications
