For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎక్కడో టచ్ చేసి వెళ్లిపోతాడు, అతని చూపులకు వెంటనే చీర మార్చుకోవాలనిపిస్తుంది, దూల లేదు #mystory270

సోమవారం ఆఫీస్ కు రాగానే హేయ్ నిన్న, మొన్న వీకెండ్ లో ఫుల్ ఎంజాయ్ చేశావా అంటూ ఎక్కడో టచ్ చేసి వెళ్లిపోతాడు. ఆ క్షణంలో నేను అతణ్ని అక్కడే అందరి ముందు నిలదీయాలనిపిస్తుంది కానీ ఎవ్వరూ నా మాటకు విలువ ఇవ్వర

By
|

రోజుకొక సెలబ్రెటీ మరో పెద్ద మగ సెలబ్రెటీ లేదంటే తనతో పాటు పని చేసిన పురుషుడి అరాచకాలను బయటపెడుతూనే ఉంది. ఆ విషయానికొస్తే నేను కూడా చాలా మంది అబ్బాయిలతో ఇబ్బందిపడ్డాను. నేను ప్రేమించే అబ్బాయిని, నేను ఇష్టపడే అబ్బాయిని మాత్రమే నన్ను టచ్ చెయ్యాలని భావించేదాన్ని.

కానీ నా ప్రమేయం లేకుండానే చాలా సందర్భాల్లో చాలా మంది అబ్బాయిలు నన్ను ఎక్కడంటే అక్కడ టచ్ చేసేవాడు. మా ఆఫీస్ లో ఒకడుంటాడు. వాళ్లు నల్ల తుమ్మ మొద్దులా మొఖం వేసుకుని ఉంటాడు. అలాంటోడు కూడా నన్ను వచ్చి రోజూ టచ్ చేస్తాడు.

ఎక్కడో టచ్ చేసి వెళ్లిపోతాడు

ఎక్కడో టచ్ చేసి వెళ్లిపోతాడు

సోమవారం ఆఫీస్ కు రాగానే హేయ్ నిన్న, మొన్న వీకెండ్ లో ఫుల్ ఎంజాయ్ చేశావా అంటూ ఎక్కడో టచ్ చేసి వెళ్లిపోతాడు. ఆ క్షణంలో నేను అతణ్ని అక్కడే అందరి ముందు నిలదీయాలనిపిస్తుంది కానీ ఎవ్వరూ నా మాటకు విలువ ఇవ్వరు. ఏదో ఆ అబ్బాయి జస్ట్ క్యాజ్ వల్ గా నిన్ను ఎంజాయ్ చేశావా అని అడిగినంత మాత్రానా నువ్వు అతన్ని తప్పుగా అర్థం చేసుకుంటే ఎలా అని అందరూ నన్నే తప్పుపడతారని నాకు తెలుసు.

నీకంటే దూల ఉందేమో

నీకంటే దూల ఉందేమో

ఈ సమస్యను నాతో పాటు పని చేసే మరో ఆమెకు చెప్పాను. హేయ్ అతను అంతేనే చాలా కలపుగోలు మనిషి. ఎవరినైనా సరే అలా టచ్ చేసి మాట్లాడడం అతని హాబీ. దాన్ని నువ్వు తప్పుగా భావించకు. నన్ను కూడా అలాగే టచ్ చేసి పలకరిస్తాడు. అతనికి అలాంటి ఉద్దేశం ఉండదులే అని అంది. నీకంటే దూల ఉందేమో అతనితో టచ్ చేయించుకోవడానికి, నాకు అంత దూల లేదు అని ఆమెతో గట్టిగానే చెప్పాను.

నన్ను బ్లేమ్ చేశారు

నన్ను బ్లేమ్ చేశారు

అప్పటి నుంచి ఆమె నాతో మాట్లాడడం లేదు. ఇక నా గురించి ఆఫీస్ లో అందరికీ చెప్పింది. తప్పు చేసింది ఇంకొకతను అయితే అనవసరంగా నన్ను బ్లేమ్ చేశారు. అందుకే ఏ అమ్మాయి కూడా ఇలాంటి విషయాలు బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడదు.

Most Read :నాతో ఒక్కసారి సెక్స్ లో పాల్గొను, ఒక్కరోజు రూమ్ కు వస్తావా నేను హెల్ప్ చేస్తానుMost Read :నాతో ఒక్కసారి సెక్స్ లో పాల్గొను, ఒక్కరోజు రూమ్ కు వస్తావా నేను హెల్ప్ చేస్తాను

వాడి అసలు స్వరూపం

వాడి అసలు స్వరూపం

ఎందుకంటే ఈ తప్పు చేసేవాడు ముందుగానే కొందరు అమ్మాయిల దగ్గర ఒక క్రెడిట్ సాధించుకుని ఉంటాడు. వాడు ఎలాంటి తప్పు చేయని వాడిలా సమాజంలో కూడా పేరు తెచ్చుకుని ఉంటాడు. కానీ వాడి అసలు స్వరూపం కేవలం వాడి చేతిలో లైంగిక వేధింపులకు గురయ్యే అమ్మాయిలకు మాత్రమే తెలుస్తుంది.

దుర్మార్గుల బారి నుంచి

దుర్మార్గుల బారి నుంచి

అలా నన్ను రోజూ వేధించే ఆ నీచుడి నుంచి తప్పించుకోవాలని చాలా ట్రై చేశాను. కానీ వాడు వదిలేవాడు కాదు. ప్రతి క్షణం ఏవేవో మాటలతో నన్ను ఇబ్బందిపెట్టేవాడు. అలాంటి దుర్మార్గుల బారి నుంచి ప్రతి అమ్మాయికి మీటూ ఉద్యమం ద్వారానైనా రక్షణ కలగాలని కోరుకుంటున్నాను.

అసహ్యం పుట్టినా సరే

అసహ్యం పుట్టినా సరే

ఆ తుమ్మమొద్దుగాడు నా డెస్క్ దగ్గరకు వచ్చి నాకు ఇష్టం లేకున్నా కూడా ఏవేవో జోక్స్ చెబుతూ ఉంటాడు. అతను జోక్స్ చెప్పేటప్పుడు విని నవ్వకుంటే మళ్లీ వర్క్ లో టార్చర్ చేస్తాడు అందుకే ఎంత అసహ్యం పుట్టినా సరే నవ్వు ముఖంతో కనపడుతూ ఉంటాను.

Most Read :అక్క ప్రియుడిని రూమ్ కు పిలిపించుకుని ఎంజాయ్ చేసేదాన్ని, మందులోకి ఆమ్లెట్, తర్వాత సెక్స్Most Read :అక్క ప్రియుడిని రూమ్ కు పిలిపించుకుని ఎంజాయ్ చేసేదాన్ని, మందులోకి ఆమ్లెట్, తర్వాత సెక్స్

అబ్బాయిలు ఎవ్వరులేని ఆ ట్రిప్ లో

అబ్బాయిలు ఎవ్వరులేని ఆ ట్రిప్ లో

ఇక అప్పుడప్పుడు మొత్తం టీమ్ తో ట్రిప్స్ ప్లాన్ చేస్తుంటాడు. వాడి ట్రిప్ కు అబ్బాయిలను పిలుస్తాడో పిలవడోగానీ ప్రతి అమ్మాయిని పది సార్లు పిలిచి రప్పించేటట్లు చేస్తాడు. అబ్బాయిలు ఎవ్వరులేని ఆ ట్రిప్ లో వాడు ఏం చేసినా కూడా ఎవ్వరూ ఏమీ అనేవారు ఉండరు.

చీర కట్టుకుని వెళ్దామంటే

చీర కట్టుకుని వెళ్దామంటే

జర్నీలో భాగంగా వాడు నా పక్కన కూర్చొంటే నాకు ఒంటిపై పాములు పాకినట్లు అనిపిస్తూ ఉంటుంది. నేను ఎప్పుడైనా ఆఫీస్ కు చీర కట్టుకుని వెళ్దామంటే వాడిని చూస్తేనే భయం అవుతుంది. వాడు చూసే చూపులకు నాకు వెంటనే చీర మార్చుకోవాలనిపిస్తూ ఉంటుంది.

అర్ధరాత్రి హాయ్ అని

అర్ధరాత్రి హాయ్ అని

ఇక వాడు అర్ధరాత్రి హాయ్ అని వాట్సాప్ లో మెసేజ్ పంపుతాడు. ఆ సమయంలో వాడితో నేను చాటింగ్ చేయాలా? వాడికి ఏ ఉద్దేశం లేకుంటే అలా మెసేజ్ లు పంపడు. నీ డ్రెస్ బాగుంది, నీ లిప్ స్టిక్ బాగుంది అంటూ ఏవేవో వెదవ కాంప్లిమెంట్స్ ఇస్తుంటాడు.

Most Read :లెక్కల మాష్టార్ నా నడుమును ఒత్తేవాడు, వక్షోజాలను తాకేవాడు, తొడను గిల్లేవాడుMost Read :లెక్కల మాష్టార్ నా నడుమును ఒత్తేవాడు, వక్షోజాలను తాకేవాడు, తొడను గిల్లేవాడు

నా కోరిక తీరుస్తావా

నా కోరిక తీరుస్తావా

కోలీగే కదా అని సర్దుకునిపోతే చివరకు నా కోరిక తీరుస్తావా అని అడిగే దగ్గరకు వస్తారు. అయినా వాడి వేధింపులన్ని ఎన్నాళ్లు మౌనంగా భరిస్తాం చెప్పండి. మీటూ ఉద్యమానికి అందరూ భరోసాగా నిలవాలని నేను కోరుకుంటున్నా. అయినా ఒక ఆఫీస్ లో కలిసి పని చేసినంత మాత్రానా సహద్యోగిని ఎలా అంటే అలా చూస్తారా? అమ్మాయి అనే ఒక కారణంతో అలుసుగా ప్రవర్తిస్తారా? ఎలా అంటే అలా వేధిస్తారా?

తన వాళ్లు అనుకునే వారి ద్వారా

తన వాళ్లు అనుకునే వారి ద్వారా

ఎప్పుడో జరిగిన సంఘటనలు ఇప్పుడు సెలబ్రెటీలు ఎందుకు బయటకు తెస్తున్నారు అని అందరూ అంటున్నారు. సాధారణంగా ఏ అమ్మాయి కూడా తనకు.. తన వాళ్లు అనుకునే వారి ద్వారా జరిగిన అవమానాన్ని బయటకు చెప్పుకోదు. కానీ అలాంటి వాళ్ల అరచకాలు రోజురోజుకు పెరిగిపోవడంతోనే ప్రతి ఒక్కరిలో చైతన్యం వస్తూ ఉంది.

ముక్కూ మొఖం తెలియని వారు

ముక్కూ మొఖం తెలియని వారు

ఇలా లైంగిక వేధింపులకు పాల్పడే వారంతా కూడా ముక్కూ మొఖం తెలియని వారు కాదు రోజూ ఆఫీస్ లో కలిసి వర్క్ చేసేవారో లేదంటే పై అధికారులో, లేదంటే అవకాశాలు ఇప్పిస్తామని చెప్పే తోటి వ్యక్తులే ఉంటారు. అలాంటి వారి గురించి బయటకు చెప్పలేం. అలా అని మనస్సులో కూడా పెట్టుకోలేం.

ధైర్యం వస్తుంది

ధైర్యం వస్తుంది

పెద్దపెద్ద సెలబ్రిటీలే బయటికి వచ్చి వారికి ఎదురైన అనుభవాల గురించి చెబుతుంటే నాలాంటి సాధారణ అమ్మాయికి కూడా ధైర్యం వస్తుంది. నాలాంటి చాలా మంది అమ్మాయిలకు వారి జీవితంలో ఎదురైన చేదు అనుభవాలు గుర్తొస్తుంటాయి.

Most Read :చలికాలంలో పురుషాంగం ముడుచుకుపోతుంది, సైజ్ బాగా తగ్గిపోతుంది, అది చేయాలని ఉన్నా చెయ్యలేరు, గట్టి పడదుMost Read :చలికాలంలో పురుషాంగం ముడుచుకుపోతుంది, సైజ్ బాగా తగ్గిపోతుంది, అది చేయాలని ఉన్నా చెయ్యలేరు, గట్టి పడదు

తుమ్మ మొద్దుగాణ్ని

తుమ్మ మొద్దుగాణ్ని

అయినా నేను కూడా ఆ తుమ్మ మొద్దుగాణ్ని ఎందుకు ఇన్ని రోజులు భరిస్తున్నానో అర్థం కావడం లేదు. ఏమైనా ఫర్వాలేదు.. మహా అంటే జాబ్ పోతుందా అంతే కదా? కేవలం జాబ్ కోసం చూసుకుంటే వాడి నుంచి నేను రోజూ మానసిక క్షోభ అనుభవించాలి.

ప్రతి అమ్మాయి వెంట కుక్కలా తిరిగితే

ప్రతి అమ్మాయి వెంట కుక్కలా తిరిగితే

ఇప్పటికైనా ధైర్యం చేసి వాడి బండారం మొత్తం బయట పెట్టు అని నా మనస్సు చెబుతుంది. అందుకే నేను కూడా మీటూ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని రేపే వాడి గురించి మొత్తం బట్టబయలు చేస్తాను. ప్రతి మగాడికి నేను చెప్పేది ఒక్కటే.. నువ్వు ఏదైనా చేసుకోవాలనుకుంటే నీ గర్ల్ ఫ్రెండ్ తో చేసుకో... నీ పెళ్లాంతో చేసుకో. అంతేగానీ కక్కుర్తిపడి ప్రతి అమ్మాయి వెంట కుక్కలా తిరిగితే చివరకు నీ పరువే పోతుంది.

English summary

my me too story one of my co working staff is torturing me

my me too story one of my co working staff is torturing me
Desktop Bottom Promotion