నాన్న చనిపోయాక అమ్మ అతనితో కులికేది, ఎందుకలా చేశావంటే అంతా చెప్పేసింది #mystory349

Subscribe to Boldsky

మా అమ్మ నాకు చాలా ఇష్టం. నేను ఎంత తనను ఇబ్బందిపెట్టినా సరే తను మాత్రం ఒక్క మాట అనేది కాదు. నేను ఒక్కదాన్నే కూతురిని కాబట్టి నన్ను చాలా గారబంగా పెంచింది. మా నాన్న నా చిన్నతనంలోనే చనిపోయాడు. కానీ నాన్నతో నాకు చాలా జ్ఞాపకాలున్నాయి.

ఇప్పటికీ రోజూ నాన్న ఏదో ఒక సందర్భంలో గుర్తొస్తుంటాడు. నాన్నలేని లోటు లేకుండా అమ్మ పెంచింది. నాన్న పోయాక అమ్మే నాకు అన్నీ అయ్యింది. నాకు తను తప్ప మరో ప్రపంచం తెలిసేది కాదు.

అంకుల్ ని నాన్న అనమనేది

అంకుల్ ని నాన్న అనమనేది

కానీ సడెన్ గా మా జీవితాల్లోకి మరో మనిషి వచ్చాడు. అమ్మ ఆఫీస్ లో పని చేసే అంకుల్ మా ఇంట్లో ఉండేవాడు. మొదట్లో నాకు అతను ఎందుకు మా ఇంట్లో ఉంటున్నాడో అర్థమయ్యేది కాదు. నేను తనని అంకుల్ అంటూ ఉంటే అమ్మ నాన్న అని అనమనేది.

నచ్చేవాడు కాదు

నచ్చేవాడు కాదు

తనని నాన్న అని ఎందుకనాలో కూడా నాకు తెలియదు.

అతని మీద నాకు చాలా కోపం వచ్చేది. తను మా నాన్నలా లాలించడు... నాకు కబుర్లు చెప్పడు.. కానీ తనని నాన్న అని పిలవమని చెప్పేవాడు. తనకు నాకు చిన్నప్పటి నుంచి నచ్చేవాడు కాదు.

అంకుల్ తో అమ్మ హ్యాపీగా ఉండేది

అంకుల్ తో అమ్మ హ్యాపీగా ఉండేది

నాకు అతనిపై వచ్చే కోపాన్ని ఎవరిపై చూపాలో కూడా అర్థమయ్యేది కాదు. అందుకే పిచ్చిదానిలో ఒక గదిలో కూర్చొని ఏడ్చేదాన్ని. కానీ అమ్మ ఆ అంకుల్ మాత్రం చాలా హ్యాపీగా ఉండేవారు. ఇద్దరూ సంతోషంగా మాట్లాడుతుండేవారు.

Most Read :తాళి కట్టేటప్పుడు ఒక్కరూపాయి తక్కువైనా కట్టలేదు, శోభనం రోజు కక్కుర్తిపడుతూ నా మీదపడ్డాడు #mystory346

తనతో కులికేది

తనతో కులికేది

ఇద్దరూ సరసాలాడేవారు. అమ్మ తన భర్తలేడనే విషయాన్ని కూడా మరిచిపోయి తనతో కులికేది. వాళ్ల సరసాలను నా కళ్లతో చూసినప్పుడల్లా నాకు మండిపోయేది. మా నాన్న ప్లేస్ లో ఉన్న ఆ వ్యక్తిని చూసినప్పుడల్లా నాకు కోపం కట్టలు తెంచుకోని వచ్చేది. కానీ ఏమీ చేయలేకపోయేదాన్ని. తనపై ఉన్న కోపన్నంతా వేరే వాళ్లపై చూపేదాన్ని.

అమ్మను నిలదీశాను

అమ్మను నిలదీశాను

కాస్త నాకు వయసొచ్చాక మా అమ్మను నిలదీశాను. అతన్ని ఎందుకు ఇంట్లో పెట్టావని కోప్పడ్డాను. నా ప్రశ్నలకు అమ్మ ఇలా సమాధానం ఇచ్చింది....

"మీ నాన్న మరణించాక అన్ని విషయాల్లో నాకు కష్టంగా అనిపించింది. అందుకే తనని నా జీవితంలోకి ఆహ్వానించాను అంది."

నీతో నిత్యం నరకం చూస్తున్నా

నీతో నిత్యం నరకం చూస్తున్నా

తను నా జీవితంలోకి వస్తే ఎలాంటి సమస్య ఉండదనుకున్నాను. కానీ ఆయన విషయంలో నీతో నిత్యం నరకం చూస్తున్నాను. మీ నాన్న చనిపోయాక ఆయనే నాపై ఎక్కువగా ఆసక్తి చూపారు. ఆయనకు అప్పటికీ పెళ్లి కాలేదు. చాలా మంచి వ్యక్తి.

Most Read :పక్కింటి ఆయన ఫోన్లో మాట్లాడుతున్నట్లు నటిస్తూ అసభ్యకరంగా, అలా చేసే సరికి దారికి #mystory345

అసహ్యించుకుంటున్నావు

అసహ్యించుకుంటున్నావు

అలాంటి వ్యక్తిని రిజెక్ట్ చేయడానికి నాకు ఎలాంటి కారణాలు కూడా కనపించలేదు. అందుకే ఆయన్ని నా జీవితంలోకి ఆహ్వానించాను. కానీ సేమ్ మీ డ్యాడీలాగా తను నీపై ప్రేమ చూపకపోయేసరికి ఆయన్ని అసహ్యించుకుంటున్నావు.

అరిచేదానివి

అరిచేదానివి

నీకు చిన్నప్పుడే ఆయనపై విరక్తి కలిగింది. చిన్నప్పుడు నువ్వు ఆయనకు మీ నాన్నకు అస్సలుపోలిక లేదని గుర్తించావు. అందుకే రోజూ నాపై అరిచేదానివి. నేను నీకు ఏ రోజు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా అనలేదు.

అయిష్టత చూపించినా

అయిష్టత చూపించినా

ఆయన నాతో పాటు నిన్ను కూడా బాగా చూసుకుంటానని నాకు మాటిచ్చాడు. అందుకే నువ్వు ఆయనపై ఎంత అయిష్టత చూపించినా తను మాత్రం ఎప్పుడూ నిన్ను ఏమీ అనలేదు. మేమిద్దరం నీ గురించి ఆలోచించే కలిసి ఉండాలని నిర్ణయం తీసుకున్నాం.

Most Read :నా కూతురు అలా చేస్తుందని ఊహించలేదు, చిత్ర హింసలు పెట్టింది, ఆస్తులన్నీ అమ్మించింది #mystory344

సరసాలాడుతూ, కులుకుతూ

సరసాలాడుతూ, కులుకుతూ

నేను ఏనాడు ఆయనతో సరసాలాడుతూ, కులుకుతూ ఉండాలనుకోలేదు. నా కూతురికి తండ్రి లేడు అని లోటు ఉండకూడదనే భావించా. తండ్రిలేని అమ్మాయంటే సమాజంలో చాలా చిన్న చూపు ఉంటుంది.. ప్రతి ఒక్కరి కన్ను నీపైనే పడుతుంది.

సుఖపడడానికి కాదు

సుఖపడడానికి కాదు

ఆ ఇబ్బందులు నీకు రాకుండా ఉండాలనే ఆయన్ని నేను పెళ్లి చేసుకున్నాను. కానీ నువ్వు ఆ విషయం గ్రహించలేక నేనేదో సుఖ పడడానికి మళ్లీ పెళ్లి చేసుకున్నానని అనుకున్నావు. నీకంటే ఎక్కువగా నాకు మీ నాన్న గుర్తొస్తాడు. నా జీవితంలో ఇప్పటి వరకు నేను ఆయన్ని తలుచుకోని క్షణాలే చాలా తక్కువ.

Most Read :బాయ్ ఫ్రెండ్ ను నా ఆఫీస్ లో జాయిన్ చేసుకున్నా, అబ్బా.. ఆ నరకం భరించలేకపోయాను #mystory347

అనుభవించాలని తనకు లేదు

అనుభవించాలని తనకు లేదు

మీ నాన్న లేడనే బాధ నుంచి బయటపడేయాలని ఆయన ప్రయత్నించేవాడు.. అంతేకానీ నా బాధలను పట్టించుకోకుండా నన్ను అనుభవించాలని తనకు లేదు. మీ నాన్న పోయిన తర్వాత మనకు అండగా నిలిచిన వ్యక్తి తనే. మగాడు లేని కుటుంబం అంటే అందరికీ చులకనే.. ఆయన లేకుంటే సమాజంలో మనం ఇంత దర్జాగా బతకలేం.

అర్థం చేసుకో

అర్థం చేసుకో

నేను ఎందుకు ఆయన్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది.. ఎలాంటి పరిస్థితుల్లో చేసుకోవాల్సి వచ్చిందో నా అంతరాత్మకు తెలుసు. ఇప్పటికైనా మీ తండ్రి స్థానంలో ఉన్నఆయన్ని అర్థం చేసుకో.

Most Read :నా స్నేహితురాళ్లు రోజూ కుల్లుకోని చస్తారు, ఆ విషయాల్లో మరీ దారుణంగా ప్రవర్తిస్తారు #mystory348

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    My mom hurts my feelings

    My mom hurts my feelings
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more