Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
దమ్ము కొడతా, మద్యం తాగుతా, తాగే ప్రతి అమ్మాయి చెడ్డది కాదు, చెడమడా తిట్టాలనిపిస్తుంది #mystory290
నేను దురలవాట్లకు బానిసై వాటి ద్వారా నా జీవితాన్ని నాశనం చేసుకునేంత మూర్ఖురాలని కాదు. అలా ఏ అమ్మాయి కూడా ఉండదు. మగాళ్ల మాదిరిగానే అమ్మాయిలకు కూడా వంద రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి..
నేను మోడలింగ్ రంగంలో పని చేస్తాను. నేను ఒక మెట్రో సిటీలో ఉంటాను. నా ఫీల్డ్ ని బట్టి నా అలవాట్లు, నా వేషధారణ అంతా డిఫరెంట్ గా ఉంటుంది. అయితే నాతో పాటు పని చేసే చాలా మంది అబ్బాయిలు నా గురించి తప్పుగా మాట్లాడుకునేవారు.
కెమెరా మెన్ దగ్గర నుంచి మేకప్ మన్ వరకు ప్రతి ఒక్కరూ నా గురించే ఆడిపోసుకునేవారు. నేను వర్క్ ప్రెజర్ తట్టుకోలేక అప్పుడప్పుడు స్మోక్ చేస్తాను. అలాగే డ్రింక్ చేస్తాను.

ఆడవారు తాగకూడదా
ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం మగవారు మాత్రమే వాటిని తాగాలా? ఆడవారు తాగకూడదా? అనేది నా ప్రశ్న. నేను తాగుతాను, స్మోక్ చేస్తానని నాతో పాటు పని చేసే వాళ్లకు చాలా మందికి తెలుసు. ఎందుకంటే నేను వాళ్లకు తెలిసేలా ఆ పనులు చేస్తాను.

నన్ను దారుణంగా తిట్టారు
రహస్యంగా చేయాల్సిన ఖర్మ నాకేమీ పట్టిందని నా ఉద్దేశం. నేనేమీ తప్పు చేయడం లేదు కదా. అయితే కొందరు నన్ను దారుణంగా తిట్టుకుంటూ ఉంటారు. ఆమె ఇంతకు అమ్మాయేనా చూస్తే అంత అందంగా ఉంది ఆ పాడు అలవాట్లు ఎలా అలవాటయ్యాయి ఆమెకు అంటూ కొందరు కామెంట్స్ చేశారు.

తాగే రైట్
కొందరు నా మేలు కోరి చెబుతున్నట్లుగా నాతో చెప్పారు. వారితో నేను ఏకీభవిస్తాను. అయితే నాకు అసలు తాగే రైట్ లేనట్లుగా ఇంకొందరు కామెంట్స్ చేస్తారు. తాగే అమ్మాయిలంతా చెడ్డవారని భావించే అబ్బాయిలు చాలా మందే ఉంటారు.

చెడమడా తిట్టాలని అనిపిస్తుంటుంది
అవును నేను డ్రింక్ చేస్తాను. స్మోక్ చేస్తాను. ఇది నా జీవితం నాకు నచ్చినట్లుగా ఉంటా, మీరు ఎవరు నన్ను ప్రశ్నించడానికి అని అందరినీ చెడమడా తిట్టాలని అనిపిస్తుంటుంది. కానీ నా మనస్సులోని మాటలను బయటకు చెబితే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు. నాపై శత్రుత్వం పెంచుకుంటారని తెలుసు.

నా జీవితాన్ని నాశనం చేసుకోను
నేను దురలవాట్లకు బానిసై వాటి ద్వారా నా జీవితాన్ని నాశనం చేసుకునేంత మూర్ఖురాలని కాదు. అలా ఏ అమ్మాయి కూడా ఉండదు. మగాళ్ల మాదిరిగానే అమ్మాయిలకు కూడా వంద రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి.. మగాళ్ల మాదిరిగానే అమ్మాయిలు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటారు. అలా ఫ్రీడమ్ కోరుకునే అమ్మాయిలు ఎవరికీ తెలియకుండా అప్పుడప్పుడు తాగుతుంటారు.

బ్యాడ్ గర్ల్ అనుకుంటే
ఆ అలవాట్లు ఉన్న ప్రతి అమ్మాయిని అబ్బాయిలు బ్యాడ్ గర్ల్ అనుకుంటే అది వారి పొరపాటే. తాగే అమ్మాయిల్లో కూడా చాలా
నిజాయితీగా ఉండేవారు ఉంటారు. అయినా అమ్మాయిలు దమ్ము కొట్టకూడదు, మద్యం తాగకూడదని రాజ్యాంగంలో ఏమైనా రాశారా ఏంది?

తాగే ప్రతి అమ్మాయి చెడ్డది కాదు
చాలా మంది అబ్బాయిల అమ్మాయిల పర్సనల్ లైఫ్స్ పై కామెంట్ చేస్తూ ఉంటారు. అలా చేయడం మానుకోండి. భూమిపై ఉండే కొన్ని రోజులు ఎవరికి నచ్చినట్లుగా వారిని బతకనివ్వండి. తాగే ప్రతి అమ్మాయి చెడ్డది కాదు... తాగని ప్రతి అమ్మాయి మంచిది కాదని గుర్తించుకోండి. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ చాలా స్వేచ్ఛగా జీవించాలనే కోరుకుంటారు. నేను అలాగే కోరుకుంటున్నాను.



Click it and Unblock the Notifications
