మీ పేరు N అక్ష‌రంతో మొద‌ల‌వుతుందా? మీ వ్య‌క్తిత్వ విశేషాలు ఇవే!

By: sujeeth kumar
Subscribe to Boldsky

మీకు తెలుసా? ఒక వ్య‌క్తి పేరును బ‌ట్టే తాను రోజు చేసి ప‌నులు, తీసుకునే నిర్ణ‌యాలు ప్ర‌భావితం అవుతాయి. వ్య‌క్తి పేరు స్వ‌తంత్ర‌త‌ను, ప‌ర్స‌నాలిటీని, గ‌మ్యాన్ని నిర్దేశిస్తుంద‌ని అంటారు. న్యూమ‌రాల‌జీ ప్ర‌కారం వ్య‌క్తి పేరు భూత‌, వ‌ర్ద‌మాన‌, భ‌విష్య‌త్ కాలాల‌కు ఉనికిలా నిలుస్తుంది.

N అనే అక్ష‌రంతో మొద‌లయ్యే వ్య‌క్తి వ్య‌క్తిత్వం ఎలా ఉంటుందో అనే వివ‌రాలు తెలుసుకుందాం.

Personality Traits Of Those Whose Name Starts With Letter N

N అక్ష‌రంలో ఉన్న శ‌క్తి.. వ్య‌క్తుల‌ను పాజిటివ్ దృక్ప‌థం క‌లిగి ఉండేలా, కార్య‌సాధ‌కంగా ఉండేలా ప్రోత్స‌హిస్తుంది. వారికి ఇత‌రుల‌ను ఒప్పించే గుణం బాగుంటుంది.

మీ పేరు క‌నుక ఎన్ అక్ష‌రంతో మొద‌ల‌వుతుందంటే.. మీలో దాగి ఉన్న వ్య‌క్తిగ‌త ల‌క్ష‌ణాల గురించి తెలుసుకోండి!

స్ప‌ష్ట‌మైన ఆలోచ‌న‌లుంటాయి

స్ప‌ష్ట‌మైన ఆలోచ‌న‌లుంటాయి

వీళ్లు స్ప‌ష్ట‌మైన ఆలోచ‌న‌లు క‌లిగి ఉంటారు. సాదాసీదాగా, విన‌యంగా ఉండ‌డం వీరి స్వ‌భావం. ఇత‌రుల‌ను ప్ర‌భావం చేయ‌గ‌లిగే వ్య‌క్తిత్వం వీరికుంటుంద‌ని అంటారు.

జీవిత‌కాల‌పు స్నేహితులు

జీవిత‌కాల‌పు స్నేహితులు

వీరికి ప్ర‌తి అంశంపై సొంత ఆలోచ‌న‌లు, స్వ‌తంత్ర భావాలు ఉంటాయి. ఇతరుల మాట విన‌కుండా త‌మదైన శైలిలో రాణిస్తారు. అమ్మాయిలు తొంద‌ర‌గా ఎవ్వ‌రితో స్నేహం చేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. చేస్తే మాత్రం జీవితాంతం వ‌ర‌కు స్నేహం నిల‌బెట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తారు.

శ‌క్తిమంతులు

శ‌క్తిమంతులు

జీవితంలో ఎదుర్కొనే ఒడిదొడుకుల మూలంగా వీళ్లు బాగా బ‌ల‌వంతులుగా, శ‌క్తిమంతులుగా మారిపోతారు. మంచి మైండ్ ప్లేయ‌ర్స్‌గా మారిపోగ‌లరు.

మిత‌భాషులు

మిత‌భాషులు

చాలా మితంగా మాట్లాడినా లోప‌ల రౌద్రం అలానే తొణిక‌స‌లాడుతుంది. మ‌రో వైపు నిదానంగా ప‌నిచేస్తారు, త‌మ పై విమ‌ర్శ‌ల‌ను అస్స‌లు స‌హించ‌రు.

ప్ర‌తీకారం తీర్చుకోగ‌ల‌రు

ప్ర‌తీకారం తీర్చుకోగ‌ల‌రు

వీళ్లు రౌద్రులు. వీళ్ల‌ను అర్థం చేసుకోవ‌డం క‌ష్టం. అంత తొంద‌ర‌గా బ‌య‌ట‌ప‌డ‌రు. ఎవ‌రిపైన అయినా సులభంగా ప్ర‌తీకారం తీర్చుకోగ‌ల‌గుతారు.

ఆక‌ర్ష‌ణీయంగా..

ఆక‌ర్ష‌ణీయంగా..

వీళ్లు ఆక‌ర్ష‌ణీయంగా ఉంటారు. ఇది వారి వ్య‌క్తిత్వానికి ప్ల‌స్ పాయింట్‌లా నిలుస్తుంది. మ‌రో వైపు త‌మ భాగ‌స్వామి వ్య‌క్తిత్వంపై ఎవ‌రైనా కామెంట్ చేస్తే స‌హించ‌లేరు.!

మీ పేరు మొద‌టి అక్ష‌రం వేరేదా? దానిని బ‌ట్టి దాగి ఉన్న మీ వ్య‌క్తిత్వాన్ని తెలుసుకోవాల‌నుకుంటున్నారా? ఐతే మా క‌థ‌నాల‌ను చ‌ద‌వుతూనే ఉండండి. మీ పేరు త్వ‌రలోనే వ‌స్తుంది.

English summary

Personality Traits Of Those Whose Name Starts With Letter N

Personality Traits Of Those Whose Name Starts With Letter N,If your name starts with the letter N, then there is a lot that you need to know about your personality! So, check out on the hidden personality traits of yours.
Story first published: Wednesday, January 24, 2018, 17:00 [IST]
Subscribe Newsletter