Latest Updates
-
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
సింహరాశి మే 2018 హోరోస్కోప్ ప్రెడిక్షన్స్
సింహరాశి మే 2018 హోరోస్కోప్ ప్రెడిక్షన్స్
వీరిలో నాయకత్వ లక్షణాలు మెండు. వీరు ఇతరులకు దారి చూపే విధంగా ప్రవర్తిస్తారు. వీరు ఆత్మవిశ్వాసం కలిగినవారు. ఆధిపత్య శైలిని వీరిలో గమనించవచ్చు. జీవితంలోని తన లక్ష్యాన్ని చేరుకునే దారిలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా వాటిని ఎదిరించి లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు.
వీరి విధేయత అలాగే ఔదార్య స్వభావము వలన ఎక్కువ మంది స్నేహితులను పొందగలుగుతారు. వీరు ఇతరులకు సులభంగా స్ఫూర్తినివ్వగలుగుతారు. వీరు ఆకర్షణీయంగా అలాగే గంభీరంగా ఉంటారు.
అయితే, సింహరాశికి చెందిన వారు తమ అహాన్ని సంతృప్తిపరచడానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. అహం సంతృప్తిపడేవరకు వీరు ప్రశాంతపడరు. మే నెలలో స్టార్స్ వీరి కోసం ఏమేమి సిద్ధం చేశాయో ఇప్పుడు తెలుసుకుందాం. తద్వారా, బెస్ట్ కి అలాగే వరస్ట్ కి వీరు ముందుగానే సిద్ధంగా ఉండవచ్చు.

ఈ ఆర్టికల్ లో ఆస్ట్రాలజీ నిపుణులు అందించిన మే 2018 ప్రెడిక్షన్స్ ని ఇప్పుడు మనం గమనించవచ్చు. సింహరాశికి సంబంధించిన ఈ ప్రెడిక్షన్స్ ను చదివి రాబోయే ఈవెంట్స్ కు సంసిద్ధులవ్వండి.

ఆరోగ్యం
ఆరోగ్యానికి సంబంధించి ఈ నెలలో రెండవ భాగంలో సింహరాశి వారు గమనించదగిన మెరుగుదలకు గుర్తిస్తారు. అంటే, 21 వ తారీఖు తరువాత వీరి ఆరోగ్యం మెరుగవుతుంది. అప్పటినుంచి వీరు ఫిట్ గా ఉంటారు. పని ఒత్తిడి తక్కువగా ఉండటంతో ఎక్కువ రిలాక్స్ అవుతున్న భావన కలుగుతుంది. శక్తి వృధా కాదు. అందువలన మీరు ఆరోగ్యంగా ఉంటారు.

ఉద్యోగం
మీ స్టార్స్ ప్రకారం ఈ సమయం వృత్తిపరమైన అభివృద్ధికి అనుకూలంగా లేనట్లు తెలుస్తోంది. మరోవైపు, మీరు ఎక్కువగా ప్రయాణిస్తారు. అయినా, ఆశించిన ఫలితాలు లభించవు. తూర్పు వైపు ప్రయాణం సిఫార్సు చేయదగినది. మీ పరిచయస్తులు అలాగే మిమ్మల్ని ప్రభావితం చేయగలిగిన స్నేహితులు మిమ్మల్ని మోసం చేసే సూచనలు కలవు. అందువలన, ఇతరులపై ఆధారపడటాన్ని తగ్గించుకోండి.

ఆర్ధిక లావాదేవీలు:
మీ ఆర్ధిక విషయాలు ఈ నెలలో ఆశించినట్టుగా అనుకూలంగా ఉండవు. కొత్త వెంచర్స్ ని ప్రారంభం చేయాలనుకునే వారు తమ ప్రణాళికలను పోస్ట్ పోన్ చేయటం మంచిది. ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించి ఈ సమయం అనుకూలం కాదు. కాబట్టి, కాస్త వేచి ఉండటం మంచిది. అలాగే ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీలో ఉండేవారు కూడా ఇబ్బందులు పడే అవకాశం కలదు. పరిస్థితులు నియంత్రణలోకి వచ్చేవరకు లో ప్రొఫైల్ ని మెయింటెయిన్ చేయడం మంచిది.

లవ్ లైఫ్
ఈ సమయంలో మీ భాగస్వామితో రిలేషన్ కాస్తంత అస్తవ్యస్తంగా ఉండవచ్చు. మీ భాగస్వామి తనకంటూ వ్యక్తిగత స్వేచ్ఛను కోరుకుంటూ ఉండవచ్చు. మీకు నచ్చని పనులు చేయవచ్చు. అయినా, ప్రశాంతత కోసం మీరు సంయమనం పాటించడం అవసరం. మీకీ సమయంలో ఓర్పు అవసరం. మరోవైపు, ఒంటరివాళ్లకు ఈ సమయం బాగా అనుకూలమైనది. ఆన్లైన్ డేటింగ్ లో భాగస్వాములను పొందే ఆస్కారం ఉంది. ఈ నెల పెళ్లిళ్లకు గానీ బ్రేకప్స్ కి కానీ అనుకూలంగా లేదు.

అదృష్ట తేదీలు అలాగే రంగులు
ఈ రాశికి మే నెలలో 6, 24, 39, 59 మరియు 83 సంఖ్యలు కలిసి వస్తాయి.
అదృష్ట తేదీలు: 2, 3, 12, 13, 21, 22, 29, 30.
తెలుపు మరియు బంగారు వర్ణం, కాపర్ మరియు తేలికపాటి ఆకుపచ్చ కలిసి వచ్చే రంగులు.



Click it and Unblock the Notifications