For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తనమీద తనకే నమ్మకం లేని రాశి చక్రాల వారు వీరే..!

|

విజ్ఞాన శాస్త్రం ప్రకారం, ప్రపంచంలో తమని తాము తక్కువ చేసుకునే వారు కూడా ఉన్నారు. ఇది "ఇమ్పోస్టర్ సిండ్రోమ్" అని పిలిచే మానసిక దృగ్విషయానికి సంబంధించినది.

ఇది మానసిక రుగ్మతల గురించిన డయాగ్నొస్టిక్ స్టాటిస్టికల్ మాన్యువల్ (డి.ఎస్.ఎం) లో కూడా ఇంకా గుర్తించబడలేదు లేదా నిర్వచించబడని స్థితిలో ఉంది. అయినా, మానసిక ఆరోగ్య నిపుణులు మాత్రం ఈ పరిస్థితిని అనేకులు ఎదుర్కొంటున్నట్లు అంగీకరించారు.

Self-Doubting Zodiac Signs Who Think That They Do Not Deserve Anything In Life

వ్యక్తి తనకుతాను విలువలేని విధంగా, ఇతరులతో సరిపోని విధంగా పోల్చుకోవడం, మరియు స్వీయ అగౌరవాన్ని కలిగి ఉన్న ఒక పరిస్థితిగా దీనిని మానసిక వైద్యులు గుర్తిస్తున్నారు.

ఇక్కడ ఈవ్యాసంలో, రాశిచక్ర సంకేతాలు ఈ స్థితికి ఎలా అనుసంధానించబడి ఉన్నాయో తెలియజేయడమైనది.

జ్యోతిషశాస్త్ర ప్రకారం, కొన్ని రాశిచక్ర సంకేతాలు స్వీయ-సందేహాస్పద మరియు స్వీయ అగౌరవాన్ని కలిగి ఉంటాయని చెప్పబడింది. క్రమంగా డిప్రెషన్ వంటి సమస్యలకు కూడా గురవుతూ ఉంటారు.

తనమీద తనకే నమ్మకం లేని రాశిచక్రాల వారు వీరే..!

తులా రాశి : సెప్టెంబర్ 24-అక్టోబర్ 23

తులా రాశి : సెప్టెంబర్ 24-అక్టోబర్ 23

తులా రాశి వ్యక్తులు, వారి విజయాన్ని సొంతం చేసుకునే విషయంలో మరియు ప్రశంసలను అంగీకరించడాన్ని ఒక సవాలుగా భావిస్తుంటారు. ఈ వ్యక్తులు ఎల్లవేళలా అభినందనలకు దూరంగా ఉంటారు.

వారు తమకు తక్కువ ప్రాముఖ్యతను ఇవ్వాలని భావిస్తారు, దీనికి కారణం వారి సామర్థ్యాల్లో, నైపుణ్యాలలో మరియు వారి కష్టాన్ని సైతం నమ్మడంలో ఇబ్బందులను కలిగి ఉండడమే. మరో వైపు ఎంత కష్టం చేసి ఫలితాలను రాబట్టినా, ఇతరులు తమ కష్టాన్ని వాళ్ళ లాభాలుగా మార్చుకుంటారన్న నమ్మకాన్ని బలంగా కలిగి ఉంటారు. వీరి ప్రతి ఆలోచనలోనూ తమ కుటుంబ సభ్యుల జోక్యం ఉండాలన్న బావన కలిగి ఉంటారు. కానీ, వీరు అనుకున్న విధంగా జరగని పక్షంలో తాము కుటుంబం నుండి వేరైన భావనలను కూడా ప్రదర్శిస్తుంటారు. కుటుంబానికి, భాగస్వామికి అధికంగా విలువనిచ్చే వీరు, వారి నిర్ణయాలకు కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తుంటారు.

మకర రాశి : డిసెంబర్ 23- జనవరి 20

మకర రాశి : డిసెంబర్ 23- జనవరి 20

వీరు ప్రతి విషయంలోనూ తీవ్రమైన ఆలోచనలను కలిగి ఉంటారు మరియు వారు చేసే ప్రతి పనీ కష్టంతో కూడుకుని ఉంటుంది. ఎటువంటి పనిలో అయినా తమ కష్టాన్నంతా ఖర్చుపెట్టి మరీ ఫలితాలను రాబట్టాలని చూసే అంకితభావం కలవారిగా ఉంటారు. ఇచ్చిన ఎటువంటి పనైనా సమయానుసారం పూర్తి చేసేలా వీరి ఆలోచనలు ఉంటాయి. కానీ ఫలితం విషయంలో మాత్రం, సమిష్టి కృషి ఉన్నదన్న భావన కలిగి ఉంటారు. క్రమంగా తామొక్కరికే ఫలితాన్ని అంకితం చేయడాన్ని అంగీకరించలేరు.

కన్యా రాశి : ఆగస్టు 24-సెప్టెంబర్ 23

కన్యా రాశి : ఆగస్టు 24-సెప్టెంబర్ 23

కన్యా రాశి వారు సాధారణంగానే తమని తాము అసాధ్యమైన ప్రమాణాలకు కట్టుబడి ఉండేవారిలా ఉంటారు. ప్రతి విషయంలోనూ ప్రణాళికా బద్దమైన నిర్ణయాలు తీసుకుంటూ, ఏ అంశాన్ని కూడా తేలికగా తీసుకోకుండా లక్ష్యసాధనలో ముందు ఉండాలనే ఆలోచన చేసే వీరు, ఫలితం పట్ల అనుమానాస్పద వైఖరిని కలిగి ఉంటారు. అనగా అదనపు ఫలితాలు ఉండొచ్చు అన్న భావన వీరిది. తమకు అప్పగించిన పనిని పూర్తి చేయలేని పక్షంలో తమనుతాము శిక్షించుకోడానికి కూడా వెనుకాడరు. మరోవైపు, సమిష్టి వైఫల్యాన్ని కూడా తమ వైఫల్యంగా భావిస్తుంటారు.

వృషభ రాశి : ఏప్రిల్ 20-మే 20

వృషభ రాశి : ఏప్రిల్ 20-మే 20

కొన్నిసార్లు వృషభ రాశి వ్యక్తులు, లక్ష్యం పట్ల నిరంతర అనుమాన వైఖరి కలిగి ఉంటూ తమ ప్రయత్నం విఫలమవుతుందేమో అన్న భావాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. ఇచ్చిన పని యందు కష్టాన్నంతా ధారపోసి, పని చేసే వీరు, ఫలితంలో ప్రతికూలతలను అంగీకరించలేని వారుగా ఉంటారు. సానుకూల ఫలితాలు వచ్చిన నేపధ్యంలో అదృష్టమని, ప్రతికూలతలు చోటు చేసుకున్న ఎడల దురదృష్టమని భావించే అలవాటును కలిగి ఉంటారు.

మిధున రాశి : మే 21- జూన్ 20

మిధున రాశి : మే 21- జూన్ 20

మిగిలిన రాశిచక్రాలతో పోల్చినప్పుడు, మిధున రాశి వారికి ఆత్మ గౌరవం మరియు ఆత్మవిశ్వాసం కాస్త తక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. మరియు ఎటువంటి ప్రశంసలు పొందినా, అవి నిజాయితీ కూడుకున్నవి కాదు అని ఎక్కువగా భావిస్తూ ఉంటారు. వీరు జీవితంలో ఎదుర్కొన్న అనేక సందర్భాలు వీరి ఆలోచనా దృక్పధంలో తీసుకొచ్చిన మార్పుల కారణంగా ఇటువంటి భావనలు సర్వసాధారణంగానే ఉంటాయి. తమ వ్యక్తిత్వం పట్ల సరైన దృక్పధాన్ని కలిగి ఉన్నాకూడా, ఇతరుల ఆలోచనలలో తాము ఉండే విధానాన్ని వీరు సంశయిస్తూ ఉంటారు. కానీ వీరు చేపట్టిన పనుల్లో ఖచ్చితంగా విజయం వీరిదే అయినా కూడా, ఫలితం దక్కదేమో అన్న భావనలో ఉంటారు. క్రమంగా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతూ ఉంటారు.

నిజానికి వీరి కుటుంబ సభ్యుల నుండి, ప్రియమైన వారినుండి ఎల్లప్పుడూ సహకారాన్ని కలిగి ఉంటారు కూడా. కానీ, తమకంటూ ఎవ్వరూ సహాయం చేయరన్న అనుమానంతో వారి పట్ల హేయభావాలను సైతం కలిగి ఉంటారు. క్రమంగా కుటుంబ కలహాలకు కూడా కారణమవుతుంటారు. దీనికి ప్రధాన కారణం భావాలను ప్రియమైన వారితో కూడా పంచుకోకపోవడమే. వీరు తమ మంచిని కోరే వారిని గుర్తించి, తమ ప్రతి అడుగులోనూ వారిని భాగస్వామ్యం చేస్తున్న ఎడల, వీరి విజయం పట్ల సానుకూల దృక్పధాన్ని ఏర్పరచుకోగలరు.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర అంశాలు, జీవన శైలి , ఆరోగ్య, ఆహార, ఆధ్యాత్మిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Self-Doubting Zodiac Signs Who Think That They Do Not Deserve Anything In Life

According to astrology, there are those zodiac signs which are known never to be sure of what they deserve in life. These individuals think that they deserve very little of everything and seem to doubt their capabilities as well. These zodiac signs are Libra, Capricorn, Virgo, Taurus, and Gemini. These individuals believe that they deserve very less in life.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more