TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
పుట్టిన నెల ప్రకారం, ఎటువంటి లక్షణాలు కలిగిన పురుషునితో జీవితాన్ని పంచుకోవాలి అని నిర్దారణ చేయవచ్చా?
తన పుట్టిన నెల ఆధారంగా మనిషి యొక్క పాత్రను లేదా వ్యక్తిత్వాన్ని నిర్ణయించుట అనేది సంఖ్యాశాస్త్రంలో ప్రామాణిక పద్ధతిగా ఉందన్న విషయం అందరికీ తెలిసినదే.
పరిశోధకులు మరియు విశ్లేషకుల ప్రకారం, పుట్టిన నెలలు మీ వృత్తి నుండి మీ మానసిక స్థితి వరకు ప్రతి అంశాన్ని ప్రభావితం చేయగలవని గుర్తించారు.
కాబట్టి, మీరు మీ పుట్టిన నెల ఆధారంగా మీ భాగస్వామిగా ఉండే క్రమంలో సరైన వ్యక్తిని గుర్తించడం గురించిన చిట్కాలను వెతుకుతున్నట్లైతే, ఈ వ్యాసం మీకు దోహదపడుతుంది.
మీరు పుట్టిన నెల ప్రకారం, ఎటువంటి వ్యక్తిని జీవిత భాగస్వామిగా కలిగి ఉండాలో తెలుసుకోండి.
పుట్టిన నెల ప్రకారం, ఎటువంటి పురుషునితో జీవితాన్ని పంచుకోవాలో నిర్దారణ చేయవచ్చా? అన్న ప్రశ్నకు సమాధానం ఇక్కడ.
జనవరి :
మీ భాగస్వామి మీతో కలిసి పనిచేయగల వ్యక్తిగా ఉండాలి. మీరు జీవితంలో వేగమైన ప్రణాళికలను కలిగి ఉంటారు. మీ లక్ష్య సాధనలో, మీ జీవితంలో బలహీన వ్యక్తులకు స్థానంలేదని నిర్ధారించుకోండి. క్రమంగా మీరు ఒంటరి పోరాటానికి సిద్దపడే వ్యక్తులుగా కూడా ఉంటారు. మీ జీవితంలో పూర్తిచేయవలసిన అనేక విషయాలు స్తబ్ధతకు గురికాకుండా, మీ మార్గంలో ఉన్నత శిఖరాలను అందుకోడానికి, మీ జీవన విధానాలకు అడ్డుపడని వ్యక్తులను అనగా మానసిక దృఢత్వం కలిగిన వారిని లేదా, మీలా ఆలోచించే వ్యక్తిత్వం కలిగిన వారిని భాగస్వాములుగా కలిగి ఉండేలా ప్రణాళికలు చేసుకోండి.
ఫిబ్రవరి :
ఎక్కువ నిశ్సబ్దంగా ఉండే వ్యక్తినే మీరు జీవిత భాగస్వామిగా కోరుకుంటూ ఉంటారు. ఈ విషయంలో మానసికంగా దృఢమైన నిర్ణయాన్ని కలిగిఉంటారు. మీరు నిజంగా మీ అవసరాలను అర్థం చేసుకునే వ్యక్తితోనే ఉండాలన్న ఆలోచనలను కలిగి ఉంటారు. మీ సున్నితమైన భావోద్వేగాలను అర్ధం చేసుకుంటూ, మీ మానసిక పరిస్థితికి ఎటువంటి అవాంతరాలు కలిగించని వ్యక్తి మీకు భాగస్వామిగా అర్హత కలిగిన వారిగా ఉంటారు.
మార్చి :
మీరు తీవ్రమైన ఆలోచనలు, ఆరాధన, సహాయక గుణాలు కలిగిన , మరియు తెలివైన వ్యక్తిగా ఉంటారు. మీరు నిరంతరం ఇతరుల ఉనికి మీద మీ జీవనం ఉందన్న భావనలో ఉంటారు. అనగా మీ చుట్టూ ఉన్న వారి సంతోషమే, మీ సంతోషం అన్నట్లుగా మీ ఆలోచనా విధానం ఉంటుంది. ఆర్ధిక, కుటుంబ ప్రణాళికలలో, మరియు ఏ ఇతర అంశాలలో అయినా మీతో సమానమైన చొరవ కలిగి ఉండేలా మీ భాగస్వామి కూడా ఉండాలన్న ఆలోచనలు చేస్తుంటారు. కష్టం మీదనే ఫలితం ఆదారపడి ఉందని నమ్మే మీరు, మీ భాగస్వామి కూడా మీ వలెనే ఆలోచిచే తత్వాన్ని కలిగి ఉండాలని భావిస్తుంటారు.
ఏప్రిల్ :
మీరు నమ్మకానికి మారుపేరుగా, మరియు స్వతంత్రభావాలు కలిగిన మహిళగా ఉంటారు. మీ పనిని, కష్టాన్ని గుర్తించని చోట మీ ఉనికి లేదని భావిస్తుంటారు. మీ కఠినమైన నిర్ణయాలు, ఆలోచనా విధానాలు వ్యక్తులను భాధపెట్టేవిలా కూడా ఉంటాయి. కానీ మీ ఆలోచనావిధానాల మార్పులకు, చుట్టూ ఉండే పరిసరాలు, పెరిగిన వాతావరణ స్థితులు ప్రధాన కారణమని మరువకండి. కానీ భావజాలాలను అర్ధం చేసుకుని, ప్రవర్తించే వ్యక్తి మీ జీవితంలో అవసరమని భావిస్తూ ఉంటారు. మిమ్మల్ని నియంత్రించడం లేదా ప్రతిఘటించడం వంటివి మీ భాగస్వామిలో ఉండుటకు మీరు అంగీకరించరు.
మే :
మీరు ఫాస్ట్ ట్రాక్ జీవన విధానానికి అలవాటుపడి నివసిస్తుంటారని తెలిసిన విషయమే. జీవితంలో నిరంతరం ఒత్తిళ్ళతో కాలక్షేపం చేసేలా ఉండే మీ జీవన విధానం, రోజుకో సమస్యతో సరికొత్త ప్రశ్నని మీ మెదడులో ఉంచుతుంటుంది. నిరంతరం వివిధ రకాలైన కార్యాచరణలతో సతమతమవుతుంటారు. మరియు మీరు వ్యవహరించే అంశాలకన్నా, పాటించవలసిన విషయాలే ఎక్కువగా ఉంటాయి. అలా లేకపోయినా, తీవ్రమైన ఆలోచనలు కలిగిన కారణంగా, చిన్న అంశాలను కూడా పెద్దగా ఆలోచిస్తూ ఒత్తిళ్లకు లోనవుతూ ఉంటారు. కావున మీ మానసిక స్థితిగతులను సమన్వయపరచే భాగస్వామి మీ జీవితంలో ఉండడం అవసరం.
జూన్ :
మీరు నిరంతరం నిరాశావాద దృక్పధంతో బ్రతుకుబండిని ఈడుస్తుంటారు. భూతకాలంలో జరిగిపోయిన విషయాలను ఆలోచిస్తూ, సమస్యల సుడిగుండాలలో నడుస్తున్న అనుభూతికి లోనవుతూ ఉంటారు. క్రమంగా మానసిక స్థితిగతులు అస్తవ్యస్తంగా తయారవుతూ, ఒత్తిడి, ఆందోళన లేదా డిప్రెషన్ వంటి సమస్యలకు గురవుతూ ఉంటారు. హాని చేసిన, లేదా మోసగించిన వ్యక్తుల పట్ల తీవ్రమైన హేయభావాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. మీ మానసిక సమస్యలు తగ్గుముఖం పట్టేలా, మీ ఆలోచనలను పంచుకునే వ్యక్తి మీ జీవిత భాగస్వామిగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే మీకు నమ్మదగిన వ్యక్తి మీ జీవిత భాగస్వామిగా ఉంటారో, సమస్యల నుండి బయటపడిన అనుభూతికి లోనవుతూ ఉంటారు.
జూలై :
జీవితంలో అన్నీ సహజ సిద్దంగా ఉండాలని ఆలోచించే మీరు, యాంత్రిక జీవనానికి మరియు నాటకీయత జోడించిన సంబంధాల పట్ల అనాసక్తిని కనబరుస్తుంటారు. మీ ఆలోచనా విధానాలకు సరైన వ్యక్తి దొరికితే, జీవితం సంతోషమయంగా ఉంటుంది. వ్యక్తుల మీద ఆధారపడి, నెత్తిన చేయి పెట్టి బ్రతికేసే వారిని మీ జీవితంలో ఉంచుటకు సిద్దంగా ఉండరు. జీవితంలో ప్రతి అంశంలోనూ సంపూర్ణత ఉండేలా ఆలోచనలు చేస్తుంటారు. క్రమంగా తమ ప్రణాళికలలో సహాయపడే వ్యక్తులు, కుటుంబ అభివృద్దిలో సహాయపడగలరన్న ఆలోచన వీరిది.
ఆగస్టు :
నీతి, నిజాయితీ, నిబద్దతలకు మారుపేరుగా ఉండే మీ ఆలోచనా విధానం, నలుగురికీ ఆదర్శప్రాయంగా ఉంటుంది, ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా, బెదరక అడుగులేసే మీ వెనుక మద్దతు ఉండాలని భావిస్తూ ఉంటారు. క్రమంగా సంఘంలో గౌరవప్రతిష్టలు నెలకొంటాయి. మీరు సహజసిద్దంగా నాయకత్వపు లక్షణాలను కలిగి ఉంటారు. ఇతరులను ఆకర్షించే భావాలు, నైపుణ్యాలు మీసొంతం. మీ విధానాలను క్రమబద్దీకరించే తెలివైన వారు మీ భాగస్వామిగా ఉండేలా చూసుకోవలసి ఉంటుంది.
సెప్టెంబర్ :
మీ తెలివితేటలను, అభ్యాసాలను పంచుకోవడానికి భాగస్వామిగా, సమాన మనస్కులు ఉండవలసిన అవసరం ఉంది. మీ భావోద్వేగాలతో ఆడుకునే వ్యక్తులు మీకు ఎన్నటికీ సరితూగరు. అంతర్దృష్టి అధికంగా కలిగిన మీరు ఇతరుల ఆలోచన విధానాలను సైతం అంచనా వేయగలిగిన వారై ఉంటారు. మరియు లక్ష్యసాధనలో సమయాన్ని వృధా చేసే వ్యక్తులను మీ జీవితంలో ఉండేందుకు అసౌకర్యాన్ని కలిగి ఉంటారు. కావున మిమ్ములను మీ ఆలోచనా విధానాలను బలపరిచే విధంగా భద్రత కల్పించే వ్యక్తి మీ భాగస్వామిగా ఉండవలసిన అవసరం ఉన్నది.
అక్టోబర్ :
అత్యధిక కృతజ్ఞత భావాలు మరియు సంబంధాల పట్ల నిబద్ధతను ప్రదర్శించే వ్యక్తిగా ఉండే మీరు, మోసాన్ని మరియు ద్వంద్వార్థ పోకడలను ఎన్నటికీ క్షమించలేని వ్యక్తులుగా ఉంటారు. కావున మిమ్ములను తక్కువ అంచనా వేయకుండా మీకంటూ తన మనసులో స్థానాన్ని నిస్వార్ధంగా ఇచ్చేవారు ఉన్న ఎడల మీ జీవితం ఎంతో సంతోషంగా ముందుకు సాగుతుంది.
నవంబర్ :
మీ ఆలోచనా విధానాలు ఇతరులతో పోల్చినప్పుడు అర్థం చేసుకోవడానికి క్లిష్టతరంగా ఉంటాయి. లక్ష్య సాధనలో చివరి అంకాన్ని ముందుగానే గ్రహించగల ఆలోచనపరులుగా ఉన్న మీకు, తోడ్పాటును అందించే వ్యక్తి భాగస్వామిగా ఉండవలసిన అవసరం ఉన్నది. మరియు మీ మాటలను గౌరవిస్తూ మీ ఆలోచనా విధానాలను క్రమబద్ధీకరిస్తూ సమస్యాత్మక ధోరణులు లేదా ప్రతికూల పరిస్థితులు ఎదురైన సమయంలో భద్రతను, వెన్నుదన్నును కలిగించే భాగస్వామి మీ జీవితంలో ఉండవలసిన అవసరం ఉన్నది.
డిసెంబర్ :
ఎక్కువగా కుటుంబ సభ్యులకు ప్రియమైన వారికి విలువనిచ్చే మీరు, వారితో సమయాన్ని కేటాయించడానికి ఎక్కువ ఆసక్తిని కనబరుస్తుంటారు. మరియు మానసిక ప్రశాంతత కోసం పరిసరాలను తరచుగా మార్చే మీకు మీ మనస్థితిని అర్థం చేసుకునే వ్యక్తి భాగస్వామిగా ఉండవలసిన అవసరం ఉన్నది. ముఖ్యంగా మీరు మీ మనసులో స్థానం సంపాదించుకున్న వ్యక్తి, మీవలనే నిబద్దతను ప్రదర్సిచాలని కోరుకుంటూ ఉంటారు, మరియు మీ కుటుంబ సభ్యులను కూడా తన వారిలా భావించాలనే ఆలోచనలను కలిగి ఉంటారు.
ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆహార, ఆరోగ్య, జీవన శైలి, ఆద్యాత్మిక, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.