For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రాణాలు నిలుపుకునేందుకు ప్రతి క్షణం విధితో పోరాడుతున్న నలుగురు చిన్నారుల దీనగాథ, సాయం చేయండి

ఆ నలుగురు చిన్నారుల పరిస్థితి దారుణంగా ఉంది. మానవత హృదయం ఉన్న ప్రతి ఒక్కరూ వారి కష్టాలు చూస్తే కరిగిపోతారు. కళ్లు చెమ్మగిల్లుతాయి. ఏ పాపం తెలియని ఆ అమాయకులు అష్ట కష్టాలుపడుతున్నారు.

|

ఆ నలుగురు చిన్నారుల పరిస్థితి దారుణంగా ఉంది. మానవత హృదయం ఉన్న ప్రతి ఒక్కరూ వారి కష్టాలు చూస్తే కరిగిపోతారు. కళ్లు చెమ్మగిల్లుతాయి. ఏ పాపం తెలియని ఆ అమాయకులు అష్ట కష్టాలుపడుతున్నారు. జీవితానికి ఎదురోడి నిలుస్తున్నారు. ధనశ్రీ,, విశాఖ, సామ్రాట్, వీర్ అనే నలుగురు చిన్నారులు ప్రాణాలు నిలుపుకునేందుకు ప్రతి క్షణం విధితో పోరాడుతున్నారు. వారి కన్నీటీ గాథలే ఈ కథనం.

హాస్పిటల్ బెడ్ కే పరిమితమైన ధనశ్రీ

హాస్పిటల్ బెడ్ కే పరిమితమైన ధనశ్రీ

ఆ చిన్నారి పేరు ధనశ్రీ. ఆ చిట్టి తల్లి రోజూ తల్లిదండ్రులతో ఆడుతూ పాడుతూ ఉండేది. అలాంటి పాపం ఒక్కసారిగా హాస్పిటల్ బెడ్ పై ఒళ్లంతా ఏవేవో పైప్ లు మధ్య ఉక్కిరిబిక్కిరి అవుతూ గడుపుతోంది. తనకు ఏమైందో కూడా తెలియని వయస్సు ఆ చిన్నారిది. ఆ బోసినవ్వుల చిన్నారి అలా ఆసుపత్రిలో ఉంటే ఆమె తల్లిదండ్రులు పడే ఆవేదన అంతా ఇంతా కాదు. తన పాప త్వరగా కోలుకోవాలని, మళ్లీ తమ ఇంట్లో నవ్వులు పూయించాలని ఆశగా ఎదురు చూస్తోంది ధనశ్రీ తల్లి విశ్వప్రియ. ధనశ్రీ తల్లిదండ్రులు హాస్పిటల్లో నే దాదాపు ఆరు నెలలుగా ఉంటున్నారు.

మా పసిపాప శ్వాస ఆగకుండా ఉండేందుకు సాయం చేయండి: ఓ తల్లి కన్నీటి వేదన

వాల్వ్ కొలాప్స్ స్థితితో బాధపడుతున్న ధనశ్రీ

వాల్వ్ కొలాప్స్ స్థితితో బాధపడుతున్న ధనశ్రీ

పెళ్లయిన తర్వాత చాలా ఏళ్ల కు విశ్వప్రియ దంపతులకు పుట్టిన పాప ధనశ్రీ. తనను రక్షించుకునేందుకు అష్టకష్టాలుపడుతున్నారు. ధనశ్రీ ట్రాకియల్ వాల్వ్ కొలాప్స్ స్థితితో బాధపడుతోంది. పాపని రెండునెలల పాటు ఐసీయూలోనే ఉంచారు. తర్వాత రెండు సర్జరీలు చేశారు. ఆ పేద దంపతులు రెక్కలు ముక్కలు చేసుకున్న డబ్బంతా పాప కోసమే ఖర్చు చేశారు. అప్పులు కూడా చేశారు. కానీ ఆ పాప కోలుకునేందుకు ఇంకా చాలా డబ్బు అవసరం. దయగల వారు సాయం చేసి తమ బిడ్డ ప్రాణాలు కాపాడుతారని ధనశ్రీ తల్లిదండ్రులు వెయ్యి కళ్లతో వేచిచూస్తున్నారు.

ధనశ్రీకి సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ప్రాణపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న విశాఖ

ప్రాణపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న విశాఖ

ఎప్పుడూ చేతిలో పుస్తకం పట్టుకుని చదువుకునే విశాఖ ఇప్పుడు హాస్పిటల్ బెడ్ కే పరిమితం అయ్యింది. డెంగ్యూ వల్ల విశాఖ కిడ్నీలు,కాలేయం, ఊపిరితిత్తులు బలహీనంగా మారిపోయాయి. ఆమె కోలుకోవాలంటే చాలా చికిత్సలు అవసరం. ఆమె తల్లిదండ్రులు తమ దగ్గరున్న డబ్బు మొత్తాన్ని కూడా విశాఖ ప్రాణాల్ని రక్షించుకునేందుకు కేటాయించారు. ఇప్పుడు వారి చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. అయినా తమ కూతురు విశాఖను కాపాడుకునేందుకు వారు చేయని ప్రయత్నం అంటూ లేదు.

వెంటిలేటర్ సాయంతో మృత్యువుతో పోరాడుతున్న చిన్నారి విశాఖకి మన సాయం అవసరం

విశాఖకి సాయం అందించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

గుండెలో రంధ్రంతో బాధపడుతున్న సామ్రాట్

గుండెలో రంధ్రంతో బాధపడుతున్న సామ్రాట్

సరిగ్గా ఏడాది వయస్సు లేని ఆ చిన్నారి గుండెలో రంధ్రంతో బాధపడుతున్నాడు. ఆ చిన్నారి పేరు సామ్రాట్. వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్ అంటే గుండెలో చిన్న రంధ్రం వల్ల ఆ బోసినవ్వుల చిన్నారి బాధపడుతున్నాడు. రోజూ ఇంట్లో ఆడుతూ పాడుతూ తిరిగిన తమ బిడ్డ.. ఇప్పుడు అనుక్షనం శ్వాస కోసం ఇబ్బందిపడుతుంటూ సామ్రాట్ తల్లిదండ్రుల గుండె ఆగినంద పనవుతుంది.

ఈ నిర్మాణ కూలీ తన ఏడాది వయస్సున్న కొడుకును కాపాడటానికి పోరాడుతున్నాడు

ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టాడు

ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టాడు

సామ్రాట్ తండ్రి మనోజ్ ఒక భవన నిర్మాణ కూలీ. సామ్రాట్ ను కాపాడుకునేందుకు ఇప్పటికే తాను రెక్కలు ముక్కలు చేసి సంపాదించిన డబ్బంతా ఖర్చు పెట్టాడు. ఆ చిన్నారి సామ్రాట్ ను కాపాడుకునేందుకు ఇంకా ఆ తల్లిదండ్రులు డబ్బు కోసం కొట్టుమిట్టాడుతున్నారు. దయగల వారి నుంచి సాయం కోసం ఎదురు చూస్తున్నారు.

సామ్రాట్ కు సాయం అందించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

వీర్ తల్లిదండ్రులు ఇప్పటికే ఒక కొడుకును కోల్పొయారు

వీర్ తల్లిదండ్రులు ఇప్పటికే ఒక కొడుకును కోల్పొయారు

ఏడాది క్రితం వారి పెద్ద కొడుకును కోల్పొయిన ఆ తల్లిదండ్రులకు ఇప్పుడు మరో కష్టం వచ్చింది. ఆ పిల్లాడి పేరు వీర్. తన ఆరు నెలల వయస్సు నుంచే థలసేమియాతో బాధపడుతున్నాడు వీర్. ఆరునెలలుగా హాస్పిటల్ బెడ్ కే పరిమితం అయ్యాడు. గతంలో వీర్ అన్నయ్య ఇలాగే బాధపడుతూ చనిపోయాడు. కూలీనాలీ చేసుకుని బతికే ఆ తల్లిదండ్రులు తమ రెండో బిడ్డ వీర్ ను ఎలాగైనా బతికించుకోవాలని తపిస్తున్నారు.

రెండో కొడుకునైనా బతికించుకుందామని శాయశక్తులా పోరాడుతున్న వీర్ తల్లిదండ్రులు

వీర్ కు ఎముక మజ్జ మార్పిడి చికిత్స చేస్తేనే బతుకుతాడు

వీర్ కు ఎముక మజ్జ మార్పిడి చికిత్స చేస్తేనే బతుకుతాడు

వీర్ కు ఇప్పుడు ఎముక మజ్జ మార్పిడి చికిత్స చేయాల్సి ఉంది. దాదాపు పదిహేను లక్షలకు పైగా ఆ చికిత్సకు ఖర్చుకానుంది. అందుకోసం వీర్ తల్లిదండ్రులు వారికున్న అరకొర భూమిని కూడా అమ్మేశారు. పెద్ద కుమారుడి పరిస్థితి తన చిన్న కుమారుడికి రాకూడదని ఆ తల్లిదండ్రులు ఆరాటపడుతున్నారు. వీర్ ప్రాణాల్ని కాపాడడం కోసం దయగల హృదయులు తమకు పాయం చేస్తారని ఆశతో ఎదురు చూస్తున్నారు ఆ తల్లిదండ్రులు.

వీర్ కు సాయం అందించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

తోచినంత సాయం చేయండి

తోచినంత సాయం చేయండి

మనందరం చేతులు కలిపి మనవంతుగా ఎంత వీలైతే అంత ఈ నలుగురు చిన్నారుల కోసం డబ్బు పోగేద్దాం. ఫండ్ రైజర్ ద్వారా ఈ నలుగురు చిన్నారులకు భవిష్యత్తును ఇద్దాం. దయగల హృదయం ఉన్నవారంతా కూడా ఈ చిన్నారులను రక్షించేందుకు తోచినంత సాయం చేయండి.

English summary

these four kids need immediate donations for their survival

these four kids need immediate donations for their survival
Desktop Bottom Promotion