Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
దిన ఫలాలు: 19 జనవరి 2018
భారతదేశం లేదా పాశ్చాత్య జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం మన జీవిత గమనాలు అంతరిక్షంలోని నక్షత్ర సమూహాలతో ఏర్పడ్డ వివిధ జన్మరాశుల స్థితి, గమనం పై ఆధారపడి ఉంటాయి. మొత్తం పన్నెండు రాశులు ఉంటాయి
భారతదేశం లేదా పాశ్చాత్య జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం మన జీవిత గమనాలు అంతరిక్షంలోని నక్షత్ర సమూహాలతో ఏర్పడ్డ వివిధ జన్మరాశుల స్థితి, గమనం పై ఆధారపడి ఉంటాయి. మొత్తం పన్నెండు రాశులు ఉంటాయి. ఈ పన్నెండు రాశుల జ్యోతిష్య ఫలితాలు ఆయా సమయాల్లో గోచార స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని ఇవ్వటం జరుగుతుంది. ఈ ఫలితాలు సామాన్యంగా అన్ని వర్గాలకు కలిపి చెప్తారు. వ్యక్తిగతంగా మీ భవిష్యత్తు తెలుసుకోవాలనే ఆసక్తి వుంటే దగ్గరలో ఉన్న జ్యోతిష్య నిపుణుడి వద్ద సంప్రదించి , మీ జన్మ వివరాలను తీసుకువెళ్ళి జాతకాలను, వాటిలో దోషాలు, దానికి పరిష్కారాలు వివరంగా తెలుసుకోవచ్చు.
ఈ నాటి దినఫలాలు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయానికి చెందిన పెద్దలు బ్రహ్మశ్రీ శ్రీ నలమాటి కొండలరావు గారి నోటి మాటల్లోనే..
ఓం శ్రీ గురుభ్యోనమః
అఖిల భారత తెలుగు ప్రేక్షకులందరికీ అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమఃస్సుమాంజలి.
ది. 19-1-2018 తారీఖు,శుక్రవారం నాటి దినఫలాలను ఒకసారి పరిశీలిద్దాం. హేమలంబి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర రుతువు, శీతాకాలం, మాఘ శుద్ధ విదియ, శుక్రవారం ఉదయం 10 గంటల 45 నిమిషాల వరకూ ఉంది. ధనిష్ట నక్షత్రం రాత్రి 2 గంటల 7 నిమిషాల వరకూ ఉంది. అమృత సమయం మధ్యాహ్నం 2 గంటల 52 నిమిషాల నుండి 4 గంటల 35 నిమిషాల వరకూ ఉంది. దుర్ముహర్తం ఉదయం 8 గంటల 15 నిమిషాల నుండి 9 గంటల 30 నిమిషాల వరకు ఉంది. దుర్ముహర్తం మరలా మధ్యాహ్నం 12 గంటల 31 నిమిషం నుండి 1 గంట 18 నిమిషాల వరకూ ఉంది. సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 35 నిమిషాలకు. సూర్యాస్తమయ సమయం సాయంత్రం 5 గంటల 38 నిమిషాల వరకు.

మేష రాశి: 21 మార్చి-20 ఏప్రిల్
అనుకున్న పనులు ఆటంకాలతో పూర్తి చేస్తారు. వ్యాపార అభివృద్ధికై చేయు ప్రణాళికలు అనుకూలిస్తాయి. తండ్రి గారి ఆశీర్వాదంతో పనులన్నీ విజయవంతం అవుతాయి. అధికారులు ప్రసన్నం అవుతారు. వృత్తి వ్యాపారాలు ధనాన్ని కలుగచేస్తాయి.

వృషభ రాశి: 21 ఏప్రిల్-21 మే
దూరపు బంధువుల వార్తలు వింటారు. పని వారి సహకారంతో పనులన్నీ పూర్తి చేస్తారు. భార్య సహకారం కోసం ఆవిడతో మెలకువగా ఉండవలసి ఉంటుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

మిథున రాశి: 22 మే-21 జూన్
అనుకున్న పనులు నెమ్మదిగా సాగుతాయి. ధనానికి ఇబ్బందులు ఉన్నాయి. కొన్ని అవకాశాలు చేజారే ప్రమాదం కూడా ఉంది. ఆరోగ్య విషయంలో సూత్రాలు పాటించవలసి ఉంది. సోదరుల సహకారం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు ఒక మాదిరిగా ఉంటాయి.

కర్కాటక రాశి: 22 జూన్-22 జూలై
అనుకున్న పనులు ఆటంకాలు ఉన్నప్పటికీ విజయవంతమవుతాయి. భార్యతో అనుకూల దాంపత్యం కలదు. ఇంటి విషయాలన్నీ శ్రద్ధగా పూర్తి చేస్తారు. పిల్లల విషయంలో బాధ్యతగా మెలగవలసి ఉంటుంది. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

సింహ రాశి: 23 జూలై-21 ఆగష్ట్
దగ్గరి ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కొత్త అవకాశాలు చేజారకుండా ఉండటం కోసం ప్రశాంతంగా ఉండాలి. అధికారులు ప్రసన్నం అవుతారు. పిల్లల విషయంలో బాధ్యతగా చేయవలసి ఉంటుంది.

కన్యా రాశి : 22 ఆగష్ట్-23 సెప్టెంబర్
ధన ప్రణాళికలు అనుకూలిస్తాయి. సోదరుల సహకారం పూర్తిగా ఉంటుంది. పిల్లలతో కలిసి ఆనందంగా తిరుగుతారు. సంతోషంగా గడుపుతారు. సహచరుల సహకారం కూడా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు కూడా భాధ్యతగా చేయవలసి ఉంటుంది.

తులా రాశి: 24 సెప్టెంబర్-23 అక్టోబర్
అనుకున్న పనులు జాగ్రత్తగా చేస్తారు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఇంటికి సంబంధించిన పనులు చక్కగా చేస్తారు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

వృశ్చిక రాశి: 24 అక్టోబర్-22 నవంబర్
అనుకున్న పనులు పట్టుదలగా పూర్తి చేస్తారు. దగ్గరి ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దూరపు బంధువుల సమాచారం వింటారు. పిల్లల మూలకంగా ఖర్చులు ఏర్పడతాయి.

ధనూ రాశి: 23 నవంబర్-22 డిసెంబర్
ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించవలసి ఉంటుంది. అనుకున్న పనులు నెమ్మదిగా సాగుతాయి. ధన ప్రణాళికలు అనుకూలిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు కూడా కలవు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

మకర రాశి: 23 డిసెంబర్-20 జనవరి
అనుకున్న పనులు క్షణాల్లో పూర్తవుతాయి. విందు భోజన సౌకర్యం ఉంది. అన్ని విషయాలు ఆనందంగా గడుస్తాయి. బంధు మిత్రులతో కాలక్షేపం చేస్తారు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

కుంభ రాశి: 21 జనవరి-20 ఫిబ్రవరి
ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక ప్రసంగాలు వింటారు. పని వారి సహచరుల సహకారం ఉంటుంది. పాత మిత్రుల కలయికలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

మీన రాశి: 20 ఫిబ్రవరి-20 మార్చి
బంధు మిత్రుల కలయికలు ఉన్నాయి. వారితో ఆనందంగా గడుపుతారు. పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. వృత్తి వ్యాపారాల విషయంలో బాధ్యతగా ఉండవలసి ఉంటుంది.
ఇప్పటి వరకూ ఈ నాటి దిన ఫలితాలను చూసారు కదా ! మీకేమైనా సందేహాలు ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. అది కూడా ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు.
సర్వేజనా సుఖినోఃభవంతు
సమస్త సన్మంగళానిభవంతు
అందరికీ నా నమస్కారం.



Click it and Unblock the Notifications