For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  చిన్న చిన్న విషయాలకే సంతృప్తి చెందే రాశిచక్రాలు ఉన్నాయని తెలుసా?

  |

  చిన్న చిన్న సర్ప్రైజ్లను, సంతోషాలను ఉన్నతమైన బహుమతులుగా ఆలోచించే రాశి చక్రాలు కూడా ఉన్నాయి. వీరు గడిపే ప్రతి నిమిషాన్ని ఒక విలువైన బహుమతిగా భావిస్తారు అంటే అతిశయోక్తి కాదు. తమకు ఉన్నదాంతో సంతృప్తి చెందే కొన్ని రాశి చక్రాలు కూడా ఉన్నాయని తెలుసా?

  జ్యోతిష్య శాస్త్ర నిపుణులను అనుసరించి, ఆ రాశిచక్ర వివరాలను మీ ముందుకు తీసుకుని వస్తున్నాం.

  మీ రాశిచక్రం ఇక్కడ పొందుపరచబడి ఉంటే, కృతజ్ఞతా భావాలతో ఉన్నతమైన దృక్కోణంలో పరిస్థితులను, సమయాన్ని చూసే ఉన్నతమైన వ్యక్తులు మీరే అనడంలో ఆశ్చర్యం లేదు.

  ఆ రాశి చక్రాల వివరాలను తెలుసుకుందామా.. !

  వృషభ రాశి : ఏప్రిల్ 20 - మే 20

  వృషభ రాశి : ఏప్రిల్ 20 - మే 20

  వృషభరాశికి చెందినవారు, ఎక్కువగా చిన్ని చిన్ని అంశాల మీదనే ఎక్కువ దృష్టిని కేంద్రీకరిస్తారు. కోట్లు పెట్టి తెచ్చిన వజ్రం కన్నా, మనసుకు నచ్చిన వస్తువుమీదనే వీరు ఎక్కువ దృష్టిని కేంద్రీకరిస్తారు. వీరు ప్రతికూల అంశాలను దరికి చేరడాన్ని అంగీకరించలేరు. తద్వారా అటువంటి పరిస్థితులు ఎదురవకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. మరియు ఊహాజనిత విషయాల కన్నా, వాస్తవ ప్రపంచంలో ఉండేలా వీరి చర్యలు ఉంటాయి. వీరు వాస్తవికవాదులుగా ఉండడమే కాదు, అనాలోచిత ఆశలు చెడు ప్రభావాలను తెస్తాయన్న అవగాహన మెండుగా కలిగిన వారు. తద్వారా చిన్ని చిన్ని కోరికల మీదనే వీరి దృష్టి ఉంటుంది. కానీ వీరి ఆలోచనా సరళి ప్రకారం వీరికి చెందాల్సిన అంశాల పట్ల ఎటువంటి ప్రతికూల ప్రభావాలు ఎదురైనా, ఎదుర్కొని నిలబడడం వీరి ప్రధాన లక్షణంగా ఉంటుంది. వీరి ప్రతి ఆలోచన కూడా తమ ప్రియమైన మరియు సన్నిహితుల గురించే ఉంటుంది. కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు అధిక విలువని ఇచ్చే వారిలో ముందుగా ఉండే వృషభ రాశి వారు, వారి సంతోషాలలోనే తమ సంతోషాన్ని వెతుక్కునే వారిలా ఉంటారు.

  తులా రాశి : సెప్టెంబర్ 24-అక్టోబర్ 23

  తులా రాశి : సెప్టెంబర్ 24-అక్టోబర్ 23

  తులా రాశికి చెందిన వ్యక్తులు ప్రతిక్షణం, ప్రతి నిమిషం ప్రతి రోజు తమకు అనువుగా ఉండేలా ఆలోచన చేస్తుంటారు. ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ సంతోషంగా ఉండడానికి మార్గాలను అన్వేషిస్తూ ఉంటారు. చిన్న చిన్న సమస్యలు ఎక్కడ పెద్దవుతాయేమో అన్న భయం వీరిది. ప్రతికూల ప్రభావాలు ఎదురైనప్ప్పుడు, ఎంతో అప్రమత్తంగా వ్యవహరించడం వీరి సహజ గుణం. క్రమంగా వీరి ఆలోచనలు కూడా చిన్న అంశాల మీదనే ఎక్కువగా కేంద్రీకృతమై ఉంటాయి. ఈ చిన్న అంశాలే రేపు ఉత్తమమైన ఫలితాలను ఇస్తాయని వీరి ప్రఘాడ నమ్మకం. వీరి ముందు ఎంత ఖరీదైన వస్తువుని ఉంచినా, మనసుకు నచ్చని పక్షంలో పక్కన పెట్టేసే స్వభావాన్ని కనపరుస్తూ ఉంటారు. తద్వారా వీరి పట్ల కొందరు హేయభావాన్ని ప్రదర్శించినా తమ విలువలను ఎప్పటికీ విస్మరించరు.

  మిధున రాశి : మే 21-జూన్ 20

  మిధున రాశి : మే 21-జూన్ 20

  మిధున రాశి వ్యక్తులు అత్యంత దయగలవారిగా ఉంటారు. వారి కుటుంబం, స్నేహితులు మాత్రమే కాకుండా వారి సహోద్యోగులు లేదా రోజులో యాదృచ్చికంగా కలిసిన వ్యక్తుల పట్ల కూడా జాలిని కలిగి ఉంటారు. అంతటి ఉదార స్వరూపులైన మిధున రాశి వారిని ఎవ్వరూ దూరం చేసుకోవాలని అనుకోరు. క్రమంగా వీరి సంబంధాలు కూడా బలంగా ఉంటాయి. వీరు వేటి మీదా ఎక్కువ ఆశలు ఉంచుకోరు. తమ స్థోమత, కుటుంబ పరిస్థితులు, భావాలు వంటి వాటికే అధిక ప్రాధాన్యతను ఇస్తుంటారు.

  కర్కాటక రాశి : జూన్ 21- జూలై 22

  కర్కాటక రాశి : జూన్ 21- జూలై 22

  తమకు సంబంధించిన చిన్న విషయాల పట్ల ఎక్కువ శ్రద్ద కనపరచే వారిలో ఉత్తములు ఈ కర్కాటక రాశి వారు. చుట్టూతా కుటుంబ సభ్యులు, ప్రియమైన వారు, స్నేహితులు ఉండడo మీదనే వీరి ఆలోచనలు ఉంటాయి. తమ ప్రియమైన వారి ఇష్టాలను కనుగొని వారి పట్ల విధేయతను చూపించే ఉన్నత మనస్కులుగా ఉంటారు. భావోద్వేగాలకు అధిక ప్రాధాన్యతని ఇచ్చే వీరు, ప్రతి చిన్న విషయాన్ని తీక్షణంగా ఆలోచిస్తూ ఉంటారు. తాము ప్రేమించే వారి నుండి వచ్చే చిన్ని బహుమతిని కూడా కోట్ల రూపాయలు ఖరీదు చేసే వజ్రంలా భావించే సున్నిత మనస్కులు కర్కాటక రాశి వారు.

  కన్యా రాశి : ఆగస్టు 24-సెప్టెంబర్ 23

  కన్యా రాశి : ఆగస్టు 24-సెప్టెంబర్ 23

  కన్యా రాశికి చెందిన వ్యక్తులు జీవితంలో చిన్న, పెద్ద విషయాలు ఏదైనా సముపాళ్ళలో చూస్తుంటారు. ప్రణాళికా బద్దమైన నిర్ణయాలతో ఉన్నతమైన ఫలితాలకై ఆలోచనలు చేస్తుంటారు. ఎంతో మందికి ఆదర్శ ప్రాయంగా కనిపించే ఈ వ్యక్తులు, సమాజంలో ఉన్నతమైన పేరు ప్రఖ్యాతలను కలిగి ఉంటారు. ఎక్కువగా పెద్ద విషయాల కన్నా చిన్న విషయాల మీదనే ఎక్కువ దృష్టిని కేంద్రీకరించే వీరు నిరంతర విద్యార్ధిగా ఉండేలా వ్యక్తిత్వాన్ని కనపరుస్తుంటారు.

  మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

  మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

  జీవితంలో జరిగే ప్రతి విషయంలోనూ ఒక పాఠాన్ని నేర్చుకునే తత్వం కలిగిన వ్యక్తులుగా మీన రాశి వారు ఉంటారు అనడంలో ఆశ్చర్యం లేదు. వీరు ప్రతి అంశంనందు అత్యధిక శ్రద్దను కనపరుస్తూ, జీవితాన్ని ఉన్నతంగా మలచుకునేలా ఆలోచనలు చేస్తుంటారు. ఈ తత్వం నలుగురికీ ప్రేరణ కలిగించేదిగా ఉంటుంది. కష్టం అనేది దరి చేరనీయకుండా వీరి ఆలోచనలు ఉంటాయి. ఎక్కువగా పరిస్థితుల పట్ల ఆలోచనలు చేసే వీరు, తమ చుట్టూ పరిసరాలను తమకు అనుగుణంగా మార్చుకోవాలన్న ఆలోచనలు చేస్తుంటారు. ఆ ఆలోచనలకు ఖరీదుకు ఎటువంటి సంబంధం ఉండదు. తమ ఆలోచనా ధోరణికి తగ్గట్లు మాత్రమే పరిసరాలు ఉండాలన్న ఆలోచనలో ఉంటారు. ప్రతి చెడ్డపనితో పాటు అనేక మంచిపనులు కూడా జరుగుతాయన్న నమ్మకం వీరిది. బాహ్య సౌందర్యం కన్నా అంతఃసౌoదర్యానికే విలువని ఇచ్చే వ్యక్తిత్వం వీరి సొంతం.

  ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే, మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి రాశి చక్రాలు, మరియు అనేకములైన ఆద్యాత్మిక వివరాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి

  English summary

  Zodiac Signs That Love Little Things In Life

  There are certain zodiac sign individuals who are known to be grateful for everything in their lives. From the little surprises to simple gestures, these zodiac signs are known to be thankful at every given point of time. With the help of Astro experts, we reveal to you the details of some of the most grateful zodiac signs.
  Story first published: Monday, June 18, 2018, 11:30 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more