For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ఈ జూన్ లో గడ్డు పరిస్థితులను ఎదుర్కోబోయే రాశులవారు ఎవరో తెలుసుకోవాలని ఉందా?

  |

  జూన్ నెల మొదలవటంతోనే, కొన్ని రాశుల వారికి కష్టకాలం ప్రారంభమయినట్లే! మరి ముఖ్యంగా వారి ప్రేమ వ్యవహారాల విషయంలో, ఈ దశ చాలా కఠినంగా మారుతుంది.

  జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, జూన్ నుండి జూలై వరకు, సామరస్యం మరియు సంబంధాలకు సంబంధించిన గ్రహాలు, స్థిర అగ్ని సంకేతంలో ఉన్నందున, ఈ నెల మధ్య కాలంలో కొంతమంది వ్యక్తుల ప్రేమ సంబంధాలలో ఉద్రిక్తతలు చోటు చేసుకోవచ్చు.

  ఈ వ్యాసం ద్వారా జూలై మాసంలో, ఏ ఏ జన్మరాశులవారు గడ్డుకాలాన్ని ఎదుర్కోబోతున్నారో తెలియజేస్తున్నాం.

  మీ జన్మరాశి ఈ జాబితాలో ఉందో లేదో చూసుకోండి....

  వృషభం: ఏప్రిల్ 20-మే 20

  వృషభం: ఏప్రిల్ 20-మే 20

  వృషభ రాశివారికి , సెప్టెంబర్ వరకు శని గ్రహం నిబద్ధతకు సంబంధించిన ఇంటిలో సంచరిస్తుంది. వారు ఎవరితో కలసి తమ భవిషత్తును గడపాలనుకుంటున్నారో, వారు తమకు తగినవారు కాకపోవచ్చు. మే,2018 నుండి ఏప్రిల్, 2026 వరకు, వారి రాశిలో కుజగ్రహ సంచారం ఉన్నందున, అసాధారణ సంబంధాలు వీరి అనుభవం లోనికి వస్తాయి. రానున్న కాలం క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కనుక, ఈ రాశివారు తమను ఆకర్షించినవారి విషయంలో మరియు వారి జీవిత ఆకాంక్షల విషయంలో జరిగే మార్పులను అంగీకరించగలగాలి.

  కర్కాటకం: జూన్ 21-జులై 22

  కర్కాటకం: జూన్ 21-జులై 22

  కర్కాటక రాశివారికి జూన్ నుండి సెప్టెంబర్ వరకు, శని ప్రేమకు సంబంధించిన ఇంటిలో సంచరిస్తుంటాడు. ఈ మార్పు వలన వారి ప్రేమ జీవితంలో అడ్డంకులు ఎదురవుతాయి. వీరి భాగస్వాములు తమతో సమయం గడపమని ఒత్తిడి చేస్తుంటారు. కానీ వీరికి వీలు కుదరదు. ఇంకొకవైపు, వీరు తమని తాము అణచివేసుకున్నట్లు, తమ భాగస్వామ్యంలో ముడుచుకుపోతున్నట్లు భావిస్తారు.

  ఇటువంటప్పుడు, వీరు తమకి తాము కొంత సమయం వెచ్చించుకోవలసిన అవసరం ఉంది.

  కన్య: ఆగస్టు 24-సెప్టెంబర్ 23

  కన్య: ఆగస్టు 24-సెప్టెంబర్ 23

  కన్యరాశి వారికి ఈ నెలలో వివిధ రకాల భావోద్వేగాలతో కూడిన అనుభవాలు ఎదురవుతాయి. నెల ప్రారంభంలో వీరి అంచనాలకు తగినట్లుగా, అంతగా రొమాంటిక్ అనుభవాలు ఉండవు. సరైన భాగస్వామి తోడు లేదని వ్యాకుల పడకుండా,తమను తాము ప్రేమించుకోవడం ఉత్తమం. జూన్ నెల చివర్లో, ప్రేమ ను ప్రేరేపించే శుక్రుని సంచారం వీరి రాశిలో ఉంది. వీరు చేయవలసినదల్లా, పునరుత్తేజం చెందడానికి అవసరమయ్యే వాతావరణం కల్పించుకోవడమే!

  తుల : సెప్టెంబర్ 24-అక్టోబర్ 23

  తుల : సెప్టెంబర్ 24-అక్టోబర్ 23

  జూన్ నెలలో తుల రాశివారికి, శుక్రుని ప్రభావం చేత ప్రేమ మరియు శృంగారానికి సంబంధించిన భావనలు సాధారణంగా ఉంటాయి. వీరు స్నేహానికి ఇవ్వాల్సిన విలువ ఇవ్వకపోవడం మరియు ఒకే సమయంలో ఎక్కువమందిపై ప్రేమకు సంబంధించిన భావనలు కలగడం వలన, ఎటు తేల్చుకోలేని పతిస్థితికి లోనయ్యి గందరగోళంలో ఉంటారు. వీరు స్నేహితుల ద్వారా లభించే ప్రేమను తక్కువగా అంచనా వేయరాదు.

  వృశ్చికం: అక్టోబర్ 24-నవంబర్ 22

  వృశ్చికం: అక్టోబర్ 24-నవంబర్ 22

  వృశ్చిక రాశివారు గడచిన నెలలో అనేక స్వయంవర ప్రతిపాదనలతో ఉక్కిరిబిక్కిరి అయ్యి వుంటారు. కనుక జూన్ నెలలో పూర్తిగా వీరికై వీరు గడపడం ఆశ్చర్యానికి లోనుచేస్తుంది. ఈ నెలలో వీరి ధ్యాస, సృజనాత్మక ప్రాజెక్టులు మరియు లక్ష్య సాధనలో పెట్టడం ముఖ్యం.

  ధనుస్సు: నవంబర్ 23-డిసెంబర్ 22

  ధనుస్సు: నవంబర్ 23-డిసెంబర్ 22

  చాలామంది ధనురాశి వారు ఒంటరిగా ఉండాలనే నిర్ణయం తీసుకోవడం కనిపిస్తుంది. కొంచెం వ్యత్యాసాలు కలిగివున్న భాగస్వాములతో సరసాలాడే ఆలోచన ఉన్నప్పటికీ, వాళ్లు ఆశించే ప్రమాణాలు ఉన్నవారు ఆగస్టు ఆఖరి వరకు లభించరు.కనుక వీరు ఈ మధ్య కాలంలో జాగ్రత్తగా మసలుకోవాలి.

  English summary

  Love Predictions Of Zodiacs Who Are Going To Have A Bad Time This June

  Love Predictions Of Zodiacs Who Are Going To Have A Bad Time This June, With the June month's start, there are those zodiac signs that are known to have a tough time all through the month and there are those too that will have a tough phase, especially in their love life. According to astrology, the planet of harmony
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more