For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నోబెల్ బహుమతి పొందిన అభిజిత్ బెనర్జీ గురించి ఆసక్తికరమైన వాస్తవాలు..

ఆర్థిక శాస్త్రంలో ఇప్పటివరకు మొత్తం 81 మంది నోబెల్ బహుమతులను పొందారు.

|

అర్థశాస్త్రం అంటేనే ఆర్థికంగా అందరికీ అర్థం కాని వ్యవహారం. మామూలుగా ఏదైనా కుటుంబం ఆర్థికంగా స్థిరపడాలన్నా, ఎదగాలన్నా భార్యభర్తలిద్దరూ సంపాదిస్తేనే అది సాధ్యమవుతుంది. అలా ఒక జంట తాము ఆర్థికంగా స్థిరపడటమే కాదు ప్రపంచంలో పేదరికంతో పోరాడుతున్న వారి కోసం కొన్ని కొత్త విధానాలను ప్రవేశపెట్టారు.

Abhijit Banerjee

అందులో ఒక భారతీయ సంతతికి చెందిన వ్యక్తి ఉండటం మన దేశానికి గర్వకారణం. ఆయనెవరో కాదు భారతదేశంలో పుట్టి పెరిగిన అభిజిత్ బెనర్జీ. ఈయన 2019 ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గెలుచుకున్నారు. అంతే కాదు ఈయన భార్య ఎస్తర్ డుఫ్లో కూడా ఇదే బహుమతిని గెలుచుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు. సో ఈరోజు వ్యాసంలో వీరి గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

1) ప్రపంచ పేదరికంతో పోరాటం..

ప్రపంచ పేదరికంతో పోరాటానికి ఉత్తమమైన మార్గాల గురించి నమ్మకమై సమాధానాలు పొందటానికి కొత్త విధానాన్ని ప్రవేశపెట్టిన ముగ్గురు ఆర్థిక వేత్తలలో అభిజిత్ ఒకరు. ఈయన భారతీయ అమెరికన్ మసాచుసెట్స్ ఇన్సిస్టూట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) ప్రొఫెసర్ మరియు నోబెల్ బహుమతిని తన ఫ్రెంచ్ - అమెరికన్ భార్య ఎస్తేర్ డుఫ్లో మరియు మరో ఆర్థిక వేత్త మైకేల్ క్రెమెర్ తో కలిసి పంచుకున్నారు.

2) అభిజిత్ విద్యాభ్యాసం - రచనలు..

2) అభిజిత్ విద్యాభ్యాసం - రచనలు..

1961లో ముంబైలో జన్మించిన అభిజిత్ కలకత్తా విశ్వ విద్యాలయం, జవహార్ లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయంలో చదువుకున్నారు. 58 ఏళ్ల వయసులో ఆయన హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుండి పిహెచ్ డి పొందాడు. అంతే కాదు అతను 2003లో అబ్దుల్ లతీఫ్ జమీల్ పావర్టీ యాక్షన్ ల్యాబ్ (జె-పాల్)ను స్థాపించాడు. ఎంఐటి ప్రొఫెసర్ అయిన డుఫ్లో మరియు సెంధిల్ ముల్లైనాథన్ లతో కలిసి ‘‘మనం సహనంతో, వివేకంతో మన ఆయుధాలు తయారు చేసుకోవాలి. పేదలు ఏమి కోరుకుంటున్నారో వినాలి. మనలో ఉన్న అజ్ఞానం, భావజాలం మరియు జడత్వం యొక్క ఉచ్చును నివారించడానికి ఇది ఉత్తమ మార్గం‘‘ అని ఆయన తన పుస్తకంలో ‘‘పూర్ ఎకనామిక్స్‘‘లో వివరించాడు. ఈ పుస్తకం 17 భాషలలో అనువదించబడి 2011లో గోల్డ్మన్ సాచ్స్ బిజినెస్ బుక్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకుంది. అలా ఆయన అనేక వ్యాసాలను రాశాడు. అంతేకాదు రెండు డాక్యుమెంటరీ చిత్రాలకు దర్శకత్వం వహించాడు.

3) ట్విట్టర్లో అభినందనల వెల్లువ..

నోబెల్ బహుమతి ట్విట్టర్ ద్వారా ఈ వార్తను ప్రకటించిన వెంటనే విశ్వవాప్తంగా వీరికి ట్విట్టర్లో అభినందనలు వెల్లువ జడివానలో వస్తోంది. మన దేశంలోని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోడీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మాజీ నోబెల్ గ్రహీత, ప్రముఖ ఆర్థిక వేత్త అమర్థ్యసేన్ తోపాటు ఎందరో ప్రముఖులు వీరిపై ప్రశంసల వర్షం కురిపించారు. నోబెల్ బహుమతి సాధించిన వీరికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

4) 5 మిలియన్ల పిల్లలకు విద్య మరియు శిక్షణ

4) 5 మిలియన్ల పిల్లలకు విద్య మరియు శిక్షణ

"2019 ఎకనామిక్ సైన్సెస్ గ్రహీతలు నిర్వహించిన పరిశోధన ప్రపంచ పేదరికంతో పోరాడగల మన సామర్థ్యాన్ని గణనీయంగా మెరుగుపరిచింది. కేవలం రెండు దశాబ్దాలలో, వారి కొత్త ప్రయోగ-ఆధారిత విధానం అభివృద్ధి ఆర్థిక శాస్త్రాన్ని మార్చింది, ఇది ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న పరిశోధనా రంగం. " మరొక ట్వీట్‌లో, ప్రతి సంవత్సరం, ఐదు మిలియన్ల పిల్లలు తమ ఐదవ పుట్టినరోజుకు ముందే చనిపోతున్నారని, తరచుగా తక్కువ మరియు సరళమైన చికిత్సలతో నివారించగల లేదా నయం చేయగల వ్యాధుల నుండి. అలాగే, 700 మిలియన్లకు పైగా ప్రజలు ఇప్పటికీ చాలా తక్కువ ఆదాయంలో ఉన్నారు. ఇంకో ట్వీట్ లో "2019 ఎకనామిక్ సైన్సెస్ గ్రహీతల పరిశోధన ఫలితాలు ఆచరణలో పేదరికంతో పోరాడగల మన సామర్థ్యాన్ని నాటకీయంగా మెరుగుపర్చాయి. వారి అధ్యయనాల ఫలితంగా, 5 మిలియన్లకు పైగా భారతీయ పిల్లలు పాఠశాలల్లో పరిష్కార శిక్షణా కార్యక్రమాల నుండి లబ్ది పొందారు. "

5) గణనీయంగా మెరుగైన విద్యా ఫలితాలు..

"2019 గ్రహీతల ప్రారంభ క్షేత్ర ప్రయోగాలలో, ఎక్కువ పాఠ్యపుస్తకాలు మరియు ఉచిత పాఠశాల భోజనం చిన్న ప్రభావాలను కలిగి ఉన్నాయి, అయితే బలహీనమైన విద్యార్థులకు లక్ష్యంగా ఉన్న సహాయం విద్యా ఫలితాలను గణనీయంగా మెరుగుపరిచింది. బలహీనమైన విద్యార్థులను లక్ష్యంగా చేసుకోవడంలో సహాయపడటం సమర్థవంతమైందని ఇది చూపించింది" అని చివరి ట్వీట్ పేర్కొంది.

6) ఇప్పటివరకు నోబెల్స్ పొందిన భారతీయులెవరంటే..

నోబెల్ బహుమతి భారతీయుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తొలుత 1913లో రవీంద్ర నాథ్ ఠాగూర్ సాహిత్య రంగంలో చేసిన కృషికి గాను ఈ అవార్డు లభించింది. తర్వాత 1930లో సర్ సి.వి.రామన్ కు భౌతిక శాస్త్రం, 1968లో హరగోబింద్ ఖొరానా వైద్య శాస్త్రం, 1979లో శాంతికి సంబంధించి మదర్ థెరిసా, 1983లో మళ్లీ భౌతిక శాస్త్రంలో సుబ్రమణ్యన్ చంద్రశేఖర్, 1998లో ఆర్థిక శాస్త్రానికి సంబంధించి తొలిసారిగా అమర్థ్య సేన్ కు, 2009లో రసాయక శాస్త్రానికి సంబంధించి వెంకటరామన్ రామకృష్ణన్, 2014లో శాంతికి సంబంధించి కైలాష్ సత్యార్థికి, తాజాగా 2019లో అభిజిత్ బెనర్జీకి ఆర్థిక శాస్త్రంలో చేసిన కృషికి ఈ అవార్డు లభించింది.

7) ఇప్పటివరకు ఆర్థిక శాస్త్రంలో ఎన్ని నోబెల్స్ అంటే..

7) ఇప్పటివరకు ఆర్థిక శాస్త్రంలో ఎన్ని నోబెల్స్ అంటే..

ఆర్థిక శాస్త్రంలో ఇప్పటివరకు మొత్తం 81 మంది నోబెల్ బహుమతులను పొందారు. నోబెల్ బహుమతి బంగారు పతకం, డిప్లోమా మరియు నగదు పురస్కారంతో (సుమారు1.1 మిలియన్లు) వస్తుంది. నోబెల్ శాంతి మినహా, ఇతర నోబెల్ బహుమతులు డిసెంబర్ 10, నోబెల్ మరణించిన వార్షికోత్సవం సందర్భంగా ఇవ్వబడతాయి.

English summary

Abhijit Banerjee Wins 2019 Nobel Prize In Economics, Facts About Him

Abhijeet is an Indian American Massachusetts Institute of Technology (MIT) professor and is sharing the Nobel prize with his French-American wife Esther Duflo and another economist Michael Kremer.
Desktop Bottom Promotion