For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అరుణ్ జైట్లీ సేవలు చిరస్మరణీయం..

1999లో వాజ్ పేయి హయాంలో తొలిసారిగా పెట్టుబడుల ఉపసంహరణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రత్యేక ఆర్థిక మండళ్ల చట్టం రూపకల్పనలో అరుణ్ జైట్లీ చురుకుగా వ్యవహరించారు.

|

దేశ రాజధాని ఢిల్లీలోని ప్రముఖ న్యాయవాదుల్లో అరుణ్ జైట్లీ ఒకరు. తొలుత న్యాయవాదిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సింధియా, శరద్ యాదవ్, అద్వానీ వంటి అగ్రనాయకుల తరపున ఆయన కోర్టులో వాదించారు. మనీ లాండరింగ్ పైనా ఐక్యరాజ్య సమితిలో చర్చించేందుకు భారత్ తరపునే ఆయనే ప్రాతినిథ్యం వహించారు. కొకోకోలాకు వ్యతిరేకంగా పెస్పీకో దాఖలు చేసిన కేసులతో పాటు ఇంకా ఎన్నో కీలకమైన కేసులను ఆయన వాదించారు. అలా న్యాయవాదిగా ఉంటూనే రాజ్యసభలో బిజెపికి నాయకత్వం వహించే వరకు న్యాయవాదిగా ప్రాక్టీస్ ను కొనసాగించారు.

అనంతరం 1999లో వాజ్ పేయి హయాంలో తొలిసారిగా పెట్టుబడుల ఉపసంహరణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రత్యేక ఆర్థిక మండళ్ల చట్టం రూపకల్పనలో అరుణ్ జైట్లీ చురుకుగా వ్యవహరించారు. ఆ తర్వాత పార్టీ బాధ్యతల కోసం కేబినేట్ నుంచి వైదొలిగారు. 2003లో మళ్లీ కామర్స్ అండ్ లా మినిస్టర్ గా సేవలందించారు. ఇక 2009లో అయితే అరుణ్ జైట్లీని అద్వానీ ఏకంగా రాజ్యసభలో పార్టీ నాయకుడిగా నియమించి ఆయనను గౌరవించారు.

Arun Jaitely

ఎందరినో తీర్చిదిద్దిన మహనీయుడు..

మన దేశంలో చాలా మంది డాక్టర్లు, ఇంజినీర్లను తీర్చిదిద్దడంలో, వారంతా చదువుకునేందుకు ఎంతగానో సహాయపడ్డ మహనీయుడని ఆయన సన్నిహితులు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. ఇప్పటికీ వారంతా గర్వంగా చెబుతారు. ఆయన చలవే వల్ల మేమంతా ఈ స్థాయిలో ఉన్నామని కూడా చెబుతున్నారు.

ఎమర్జెన్సీ సమయంలో తొలిసారి అరుణ్ అరెస్ట్..

ఇంధిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో తొలిసారిగా అరుణ్ జైట్లీ అరెస్టు అయ్యారు. అప్పటికి ఆయన న్యాయ విద్యను కొనసాగించేవారు. అప్పటి విద్యార్థి నాయకుడిగా జైట్లీ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అంతేకాదు ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా ఉద్యమించారు. దీంతో ఆయన్ను మీసా చట్టం కింద అరెస్టు చేసి జైల్లో పెట్టారు. అలా తొలిసారి ఆయన 19 నెలలు జైలులోనే గడిపారు. అపుడే ఒక విద్యాసంవత్సరాన్ని సైతం పూర్తిగా కోల్పోయారు. అనంతరం అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఎబివిపి)లో చేరారు. అందులో ఆలిండియా విభాగానికి జనరల్ సెక్రటరీగా మారారు. సరిగ్గా ఆ సమయంలోనే ఢిల్లీలో ఉన్న ఇండియన్ ఎక్స్ ప్రెస్ భవనాన్ని కూల్చేయాలని ఇందిరా గాంధీ సర్కార్ నిర్ణయించినట్లు తెలుసుకున్న ఆయన అందుకు వ్యతిరేకంగా పోరాడారు.

1987లో ఢిల్లీలో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించిన జైట్లీని తర్వాత రెండేళ్లకే అంటే 1989లో వీపీ సింగ్ సర్కార్ అరుణ్ జైట్లీని అదనపు సోలిసిటర్ జనరల్ గా 1989లో నియమించింది. అప్పుడే ఆయన బోఫోర్స్ కేసుకు సంబంధించిన పేపర్ వర్క్ మొత్తం చేశారు. అంతకుముందే ఢిల్లీలో ప్రముఖ న్యాయవాదులు కోవిదులు ఫాలీనారిమన్, ఎస్.గురుమూర్తి, ఇండియన్ ఎక్స్ ప్రెస్ అధిపతి రామ్ నాథ్ గోయంకాలతో పరిచయం కూడా ఏర్పడింది.

నోట్ల రద్దు, జిఎస్ టిలో కీలకంగా వ్యవహరించిన జైట్లీ..

ప్రధాని మోడీ హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన అరుణ్ జైట్లీ నోట్ల రద్దు, జిఎస్ టి వంటి సంచలన నిర్ణయాలు తీసుకోవడమే కాక, వాటిని సమర్థవంతంగా అమలు చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఆయన తీసుకున్న నిర్ణయాల వల్లే ఇపుడు నోట్ల ఇబ్బంది లేకుండా.. ఎలక్ట్రానిక్ లావాదేవీలకు ప్రజలు ఇప్పుడిప్పుడే ఇష్టపడుతున్నారు. నిజాయితీపరులైన వ్యాపారులు సైతం జిఎస్ టి తమకెంతో మేలు చేసిందని చెబుతున్నారు.

English summary

Arun Jaitely Unforgettable Social Services

Arun Jaitley was arrested for the first time while Indira Gandhi was prime minister. He was still pursuing legal education. As a student leader, Jaitley opposed the decision. He also campaigned against Indira Gandhi. As a result, Aayan was arrested under the MISA Act and jailed. This was the first time he spent 19 months in prison.He also missed an entire academic year. He then joined the All-India Student Parishad (ABVP). He became the General Secretary of the Allindia Division.
Desktop Bottom Promotion