Latest Updates
-
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు! -
ప్రేమంటే రొమాన్స్ మాత్రమేనా.. ఎన్ని రకాలు ఉన్నాయో తెలిస్తే ఇట్టే లవ్‌లో పడిపోతారు.! -
త్వరగా ప్రెగ్నెన్నీ రావాలంటే..భార్యాభర్తలు తప్పక తినాల్సిన ఫ్రూట్ ఏది? -
వర్షాకాలంలో ఇంట్లో ఆ వాసన పోవాలంటే.. ఈ ఐదు జాగ్రత్తలు తప్పనిసరి.! -
కేవలం 1 స్పూన్ నూనెతో కుక్కర్ లో పానీ పూరీలు..డీప్ ఫ్రై లేకుండానే బండి మీది టేస్ట్! -
అభిజిత్ ముహూర్తం: ఈ రాశుల వారికి నేడు ధనయోగం.. పట్టిందల్లా బంగారం! -
ఎదుటి వ్యక్తిని ఈ నాలుగు ప్రశ్నలు అడుగుతున్నారా.. వారి దృష్టిలో మీ విలువ తగ్గినట్లే.! -
జూన్ 22న వరీయాన్ యోగం.. ఈ రాశుల వారికి కెరీర్, వ్యాపారాల్లో తిరుగులేని అదృష్టం!
Chalapathi Rao: ప్రముఖ టాలీవుడ్ నటుడు చలపతి రావు గురించి ఆసక్తికర విషయాలు
టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతి రావు గుండెపోటుతో ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
Life
oi-Pavan Ch
By Pavan Ch
తెలుగు చిత్ర పరిశ్రమ మరో ప్రముఖ నటుడిని కోల్పోయింది. కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు జరిగిన 24 గంటలు కూడా గడవకముందే మరో సీనియర్ నటుడు కన్నుమూయడంతో సినీ పరిశ్రమ విషాదం మునిగిపోయింది. టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతి రావు గుండెపోటుతో ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయస్సు 78 సంవత్సరాలు. చలపతిరావు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అందుకే సినిమాలకూ దూరంగా ఉంటున్నారు.

ఐదున్నర దశాబ్దాల సినీ ప్రస్థానంలో 1200లకు పైగా సినిమాల్లో నటించి టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
- చలపతిరావు పూర్తి పేరు తమ్మారెడ్డి చలపతిరావు.
- కృష్ణా జిల్లా పామర్రు మండలంలోని బలిపర్రులో 1944 మే 8వ తేదీన జన్మించారు.
- 22 ఏళ్లకే 1966లో సినీ రంగంలోకి అడుగుపెట్టారు.
- సూపర్ స్టార్ కృష్ణ సూపర్‌హిట్ చిత్రం గూఢచారి 116.. చలపతిరావు మొదటి సినిమా.
- 1967 సంవత్సరంలో సాక్షి చిత్రంలో ఓ పాత్ర పోషించారు చలపతి రావు.

- 1969లో బుద్ధిమంతుడు సినిమాలో చలపతిరావు నటించారు.
- సీనియర్ నటులు ఎన్టీఆర్, కృష్ణ, అక్కినేని నాగార్జున, చిరంజీవి, వెంకటేష్‌ల చిత్రాల్లో సహాయ నటుడిగా, పలు సినిమాల్లో విలన్‌గా నటించారు.
- కలియుగ కృష్ణుడు, కడప రెడ్డమ్మ, జగన్నాటకం, పెళ్లంటే నూరెళ్ల పంట, ప్రెసిగెంట్ గారి అల్లుడు, అర్ధరాత్రి హత్యలు, రక్తం చిందిన రాత్రి వంటి చిత్రాలను ప్రొడ్యూస్ చేశారు.
- సీనియర్ ఎన్టీఆర్‌తో చలపతిరావుకు ప్రత్యేక అనుబంధం ఉంది. మూడు తరాల నటులతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. యమగోల, యుగపురుషుడు, డ్రైవర్ రామ, అక్బర్ సలీమ్ అనార్కలి, భలే కృష్ణ, శారదా రామ, జస్టిస్ చౌదరి, బొబ్బిలి పులి, వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
- చట్టంతో పోరాటం, దొంగ రాముడు, అల్లరి అల్లుడు, అల్లరి, నిన్నే పెళ్లాడతా, నువ్వే కావాలి, సింహాద్రి, బన్నీ, బొమ్మరిల్లు, అరుంధతి, సింహా, దమ్ము సినిమాల్లోనూ నటించారు.
- గతేడాది విడుదలైన బంగార్రాజు తర్వాత వెండితెరపై చలపతిరావు కనిపించలేదు.

- చలపతిరావు తండ్రిపేరు మణియ్య. తల్లిపేరు వియ్యమ్మ. భార్య పేరు ఇందుమతి. వీరికి ముగ్గురు సంతానం. కుమారుడు రవిబాబు టాలీవుడ్‌లో నటుడిగా, దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇద్దరు కుమార్తెలు అమెరికాలో స్థిరపడ్డారు.
- ముగ్గురు పిల్లలు పుట్టిన కొన్నేళ్లకే చలపతిరావు సతీమణి ఇందుమతి అగ్నిప్రమాదంలో చనిపోయారు. వేకువజాుమ మంచి నీళ్లు పెట్టేందుకు వెళ్లగా చీరకు నిప్పు అంటుకుని ప్రమాదం సంభవించింది. ఆమె కేకలు వేయగా చలపతిరావు వెళ్లి మంటలు ఆర్పివేశారు. మూడ్రోజులు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాటి ప్రాణాలు కోల్పోయారు. తర్వాత చలపతిరావు రెండో పెళ్లి చేసుకోలేదు.
Comments
English summary
Chalapathi rao death news interesting facts about Chalapathi rao in telugu
Story first published: Sunday, December 25, 2022, 14:20 [IST]
Other articles published on Dec 25, 2022



Click it and Unblock the Notifications