For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మహాత్మ గాంధీ బోధనల గురించి, అతను చివరి క్రియాశీలక శిష్యుడు ఏమంటున్నారంటే..

గాంధీజీ తరచూ సార్వత్రిక కుటుంబం గురించి మాట్లాడేవాడు. అందరి పట్ల కనికరం కలిగి ఉండేవాడు.

|

''మేము గాంధీజీ బోధనలను పాటించకపోతే లేదా ఆచరించకపోతే, ఆయన పుట్టినరోజును జరుపుకోవడానికి అర్థం అనేదే ఉండదు. గాందీజీ నమ్మిన మరియు బోధించిన దాని యొక్క లోతైన సంస్కరణలను విశ్వసించాలని నేను భావిస్తున్నాను'' అని గాంధీజీ చివరి క్రియాశీల శిష్యుడు 97 ఏళ్ల ద్వారకో సుంద్రాణి అన్నారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 2న జరుపుకునే గాంధీ జయంతి సందర్భంగా బోల్డ్ స్కై కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో

Gandhi Jayanti

మహాత్మా గాంధీ ఒకసారి "నా జీవితం నా సందేశం" అని అన్నారు. అందువల్ల, అతని పుట్టినరోజును జరుపుకోవడం మరియు అతని తర్వాతి పుట్టినరోజు వరకు అతన్ని మరచిపోవడం ఆయన పట్ల మన కృతజ్ఞతను మరియు గౌరవాన్ని తెలియజేసే మార్గం కాదు. 'బాపు' అని పిలవబడే మహాత్మా గాంధీకి 'సత్యం' మరియు 'అహింస' పట్ల దృఢమైన నమ్మకం. అదే అతన్ని ప్రపంచ వ్యక్తిగా మార్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు గాంధీజీకి, ఆయన బోధనలకు, సూత్రాలకు ఇప్పటికీ అభిమానులు ఉన్నారు.

''మేము ఈ సంవత్సరం గాంధీ జయంతి సందర్భంగా ఎలాంటి కార్యక్రమం నిర్వహించదలచుకోలేదు. ఇందుకు బదులుగా బీహార్ లో వరదలతో బాధపడుతూ నిస్సహాయ స్థితిలో ఉన్న పేద ప్రజలకు సేవ చేస్తాం. ఎందుకంటే గాంధీజీ జీవించి ఉంటే ఇలాగే ఉండేది అని సుంద్రాణి జీ అన్నారు. గాంధీజీ పుట్టినరోజు జరుపుకునే బదులు ప్రజలకు సేవ చేస్తాం. నా గురువు (గాంధీజీ) నుండి నేను నేర్చుకున్నది అని సుంద్రాణి జీ గర్వంగా చెప్పారు.

Gandhi Jayanti

గాంధీజీ తరచూ సార్వత్రిక కుటుంబం గురించి మాట్లాడేవాడు. అందరి పట్ల కనికరం కలిగి ఉండేవాడు. గాంధీజీ ప్రకారం మానవాళికి సేవ చేయడం మరియు అహింసా మార్గాన్ని ఎంచుకోవడం ప్రతి మానవుడు చేయవలసింది. గాంధీజీ బోధనలను అమలు చేయడం అతని పుట్టినరోజున ఆయనను స్మరించుకునే ఉత్తమమార్గం అని చెప్పారు. మీరు అతని బోధనల కోసం ఎక్కడో వెతకాల్సిన పని లేదు. నిజం, అహింస మరియు మానవాళికి సేవ చేసే వైఖరిని అనుసరించండి అని ద్వారకో చెప్పారు.

ప్రజలు తమ జీవితంలో గాంధీజీ ఆలోచనలను, సూత్రాలను అమలు చేయడంలో విఫలమయ్యారా అని ప్రశ్నించగా సుంద్రాణి జీ ఇలా అన్నారు. ''ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మహాత్మగాంధీ మార్గంలో నడుస్తూ బిజీగా ఉన్నారు. అతని సూత్రాలను అనుసరిస్తున్నారు. కానీ భారతదేశంలో ప్రజలు దీనిని విస్మరించడంలో బిజీగా ఉన్నారు. క్షణం యొక్క వేడి, ప్రజలు హింసలోకి దూకుతారు. సోదరభావం మరచిపోతారు. దీనిపై నేను తీవ్రనిరాశ చెందుతున్నాను'' అని సమాధానమిచ్చారు.

Gandhi Jayanti

ప్రపంచంలోని యువతకు గాంధీజీ ఇచ్చిన సందేశం గురించి బెబుతూ.. ప్రపంచంలో సానుకూల మార్పులను తీసుకురావడానికి మరియు దానిని మంచి ప్రదేశంగా మార్చడానికి యువతకు సంభావ్య మరియు అపరిమిత అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అదే ద్వారకో సుంద్రాణి కూడా నమ్ముతారు. నేటి యువత పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ''మానవ సంక్షేమం మరియు వారి అంతర్గత అర్హతను ప్రోత్సహించడంలో యువత మరింత ఎక్కువ ప్రయత్నాలు చేయాలి. త్వరలో లేదా తర్వాత భారత యువకులు గాంధీజీ మార్గంలో నడుస్తారు'' అన్నారు.

English summary

Gandhi Jayanti, His 97-Year-Old Disciple Speaks About Mahatma Gandhi's Teachings

I feel one should believe in the deeper version of what Gandhiji believed in and taught," said 97-year old Dwarko Sundrani, who is Gandhiji's last active disciple in an exclusive interview to Boldsky on the occasion of Gandhi Jayati, which is celebrated on 2 October every year.
Story first published:Tuesday, October 1, 2019, 20:10 [IST]
Desktop Bottom Promotion