For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కన్న కూతురు అంటే కంటి పాప.. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సింది కన్నవారే..

పురుషాధిక్య ప్రపంచం, అసమానత, బాలికలంటే చిన్నచూపు, వేధింపులు ఇక్కడ ఉండే వాటిలో కౌమర దశలో ఉండే ఆడపిల్లలు ఏదో ఒకటి ఎదుర్కొనే ఉంటారు.

|

ఆడపిల్ల అంటే అడవి మాను కాదు.. ఆడపిల్ల అంటే ఓ అద్వితీయమైన శక్తి అన్నారు ఓ మహా రచయిత. అయితే నేడు బాలలతో పాటు బాలికలకూ సమానత్వం దొరుకుతుందా అంటే మన దేశంలో ఇప్పటికీ దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Girl Child in India

వారి హక్కుల ఉల్లంఘన జరుగుతున్నప్పుడు, వారి హక్కులను ప్రశ్నించడానికి నేటి సమాజంలో బాలికలు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రపంచానికి తెలియజేయడానికి, అందరికీ లింగ అసమానతపై అవగాహన పెంచే ఉద్దేశ్యంతోనే ఐక్య రాజ్య సమితి ప్రతి ఏడాది అక్టోబర్ 11వ తేదీన ''అంతర్జాతీయ బాలికల దినోత్సవం''గా ప్రకటించింది.

బాలికలంటే చిన్నచూపు..

బాలికలంటే చిన్నచూపు..

పురుషాధిక్య ప్రపంచం, అసమానత, బాలికలంటే చిన్నచూపు, వేధింపులు ఇక్కడ ఉండే వాటిలో కౌమర దశలో ఉండే ఆడపిల్లలు ఏదో ఒకటి ఎదుర్కొనే ఉంటారు. ఎదుర్కొంటూనే ఉంటారు, ఇప్పటికీ ఇలా చాలా మంది బాలికలు చీకటి జీవితాన్ని అనుభవిస్తున్నారు. మన దేశంలో చాలా గ్రామాల్లో ఆడపిల్లలు అధమురాలే అని వందకు వంద శాతం భావించే కొందరు పురుషఉల అభిప్రాయాల వల్లనే ఇలాంటి దుర్భర పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

ఆడపిల్లల అకాంక్షలకు అడ్డంకులు..

ఆడపిల్లల అకాంక్షలకు అడ్డంకులు..

మరో దౌర్భాగ్య విషయమేమిటంటే ఇప్పటికీ చాలా గ్రామాలు, పట్టణాల్లో ఆడపిల్ల అంటే ఎప్పటికైనా తమను విడిచి అత్తారింటికి వెళ్లిపోయేదే అని ఆలోచించే తల్లిదండ్రుల మనస్తత్వం, వారిపై అభ్రదతా భావాన్ని కలిగిస్తుంది. దీంతో వారికి తమ కుమార్తె పైనున్న ప్రేమను, అభిమానాన్ని దూరం చేస్తుంది. తమ కూతురికి వేగంగా వివాహం చేసి ఒక బాధ్యతను తీర్చుకోవాలనుకునే తల్లిదండ్రుల ఆలోచన తీరు వల్ల అదే ఆడపిల్లలు తమ కలలకు, అకాంక్షలకు దూరమవుతున్నారు.

కొంత చైతన్యం..

కొంత చైతన్యం..

అయితే గత రోజులతో పోల్చి చూస్తే నేడు మార్పు అనేది అనివార్యమైంది. ఈ మార్పే జనాల్లో కూడా కొంత చైతన్యం తెస్తోంది. బాలికలకు కూడా ఉన్నత చదువులు చదివించేందుకు అనేకమంది తల్లిదండ్రులు తమదైన పాత్ర పోషిస్తున్నారు. అయితే సమానత్వం విషయంలో వారు తమ కుమారులతో పోల్చి చూస్తే కూతుళ్లకు ఎంత స్వాతంత్య్రం ఇస్తున్నారనేది ఇప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్నే.

సినిమాల ప్రభావం!

సినిమాల ప్రభావం!

ఇక కౌమర దశలో ఉన్న బాలికలపై సినిమాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటోంది. దీంతో బాలికల భద్రత మీద కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా యువత మీద పడుతున్న సినిమాల ప్రభావంతో ఆడపిల్లలను అధములుగా చూస్తూ.. వారిని వేధిస్తూ అప్పుడప్పుడు మానసికంగా, శారీరకంగా కూడా హింసించడానికి సిద్ధమవుతున్నారు. సినిమాల్లో లాగా హీరోయిజం చూపిస్తూ తాము కూడా ప్రేమలో పడాలని భావిస్తూ.. అందుకు కూడా ఆడపిల్లలను బలిపశువులను చేస్తున్నారు.

బాల్య వివాహం నుండి రక్షణ లేకపోవడం..

బాల్య వివాహం నుండి రక్షణ లేకపోవడం..

విద్య, పోషణ, చట్టపరమైన హక్కులు, వైద్య సంరక్షణ, వివక్ష, హింస మరియు బాల్య వివాహాల నుండి ఆడపిల్లలకు చాలా వరకు ఈరోజు రక్షణ అనేది కరువయ్యింది. ఇప్పటికీ అనేక గ్రామాల్లో మహిళల దుస్థితి దుర్భరంగానే ఉంది. ఆడపిల్లలను విద్యావంతులను చేయడం విద్యలో సమానత్వం అనే అంశం యుగాల నుండి చర్చనీయాంశమైంది. దానియొక్క అస్పష్టమైన వాస్తవికతను చూపుతోంది. ఒకప్పుడు భారతదేశంల స్త్రీ భ్రూణ హత్యతో పాటు స్త్రీ లింగం పట్ల తీవ్రమైన అసమానతలకు ప్రసిద్ధి చెందింది.

విద్య అనేది విలువైనది..

విద్య అనేది విలువైనది..

భారతదేశంతో పాటు ప్రపంచంలోని బాలికలందరికీ విద్య అనేది నిజంగా అవసరం. మన దేశంలో ఉన్న జనాభాలో ఇప్పటికీ 65 శాతం మందికి మాత్రమే విద్య అందుబాటులో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇది ప్రపంచ సగటు 79.7 శాతం కంటే చాలా తక్కువగా ఉంది. పట్టణ భారతంతో పోల్చితే, గ్రామీణ భారతంలో బాలికలు పాఠశాలకు వెళ్లే రేటు చాలా తక్కువగా ఉంది. ఎంతసేపు వంటగదిలో లేదా ఇంటి నాలుగు గోడల లోపల బాలికలు మంచివారనే మనస్తత్వంతో ఉంటున్నారు. కాని అంతరించిపోయి ఆడపిల్లలకు విద్యను అందిస్తే నిజంగా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. దీని వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మన దేశ అభివృద్ధికి నేరుగా ముడిపడి ఉంది. బాలికలకు విద్య దేశాన్ని సానుకూలంగా ప్రభావితం చేసే మార్గాలను పరిశీలిద్దాం.

అక్షరాస్యత రేటు మెరుగవుతుంది..

అక్షరాస్యత రేటు మెరుగవుతుంది..

మన దేశంలో అక్షరాస్యత రేటు ప్రపంచ సగటు రేటు కంటే చాలా తక్కువగా ఉంది. అందుకే విద్య అనేది చాలా కీలకం. ముఖ్యంగా బాలికలకు విద్య అనేది సరైన అక్షరాస్యత రేటును సాధించే సాధనం. బాలికలు చదువుకుంటున్నప్పుడు, వారి హక్కులతో పాటు స్వేచ్ఛ గురించి తెలుసుకుంటే వారి ఇంటి పట్టానే ఉండే కట్టుబాట్లు తగ్గిపోతాయి. అంతేకాదు సమాజంలో ముఖ్యమైన పాత్ర పోషించేందుకు సహాయపడతాయి.

ఆర్థిక సాధికారతకు ప్రోత్సాహం..

ఆర్థిక సాధికారతకు ప్రోత్సాహం..

ఏదైనా దేశానికి ఆర్థికాభివృద్ధి సాధించేందుకు సమతుల్యత అనేది ఉండాలి. చదువు రాని మహిళల వల్ల దేశానికి ప్రయోజనం తక్కువగా ఉంటుంది. అందుకే ఆడపిల్లలకు విద్యను అందిస్తే ఆర్థిక స్వాతంత్య్రం మరియు సాధికారత వస్తుందని స్పష్టంగా తెలుస్తోంది. అందుకే ఆడపిల్లలకు విద్యను అందించడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థికాభివృద్ధితో పాటు మెరుగైన జీవన నాణ్యత ఆరోగ్యం మరియు పరిశుభ్రతపై అవగాహన కారణంగా మెరుగైన ఆరోగ్యం, సమాజంలో గౌరవం లభిస్తుంది. మన సమాజంలో ఆడపిల్లల తిరోగమన స్వభావాన్ని సంపూర్ణంగా మారుస్తుంది.

ఆడపిల్లల కోసం పలు పథకాలు..

ఆడపిల్లల కోసం పలు పథకాలు..

భారతదేశం ఒక దేశంగా వెనుకబడి ఉన్నప్పటికీ పలు ఎన్జీఓలు మరియు ప్రభుత్వ విధానాలు ప్రస్తుత దుస్థితిని మెరుగుపరచడంపై శ్రద్ధ వహిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం బాలికల కోసం ‘బేటి బచావో.. బేటీ పడావో, సుకన్య సుకన్య సమృద్ది యోజన, బాలికా సమిద్ధి యోజన, సిబిఎస్‌ఇ ఉడాన్ పథకం, మాధ్యమిక విద్య కోసం బాలికలకు జాతీయ ప్రోత్సాహక పథకం మరియు ధనలక్ష్మి పథకం తదితర పథకాలను ప్రవేశపెట్టింది. ఆడపిల్లల కోసం కొన్ని కార్యక్రమాలను సైతం చేపడుతుంది.

English summary

Government Schemes for Girl Child in India

International Day of the Girl Child is observed on 11 October every year. Declared by the United Nations (UN), the day is also termed as Day of Girls and the International Day of the Girl. The first Day of the Girl Child was observed in 2012.
Story first published:Thursday, October 10, 2019, 18:52 [IST]
Desktop Bottom Promotion