Latest Updates
-
ఎండలను ఎదిరించే కమ్మని పానీయం..మసాలా మజ్జిగ తయారీ విధానం ఇదే! -
మద్యం తాగకపోయినా లివర్ డ్యామేజ్? కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తినండి, వాటికి దూరంగా ఉండండి! -
అక్షయ తృతీయ వేళ పెళ్లిళ్ల సందడి.. కోర్టు మ్యారేజీల వైపు జంటల మొగ్గు! -
చూస్తే కలర్ ఫుల్, తింటే క్రంచీ..ఈ ఎండాకాలంలో టమాటా వడియాలు రుచి చూడాల్సిందే! -
బంధం నిలబడాలంటే... భాగస్వామితో అప్పుడప్పుడు ఈ అబద్ధాలు చెప్పాల్సిందే! -
ఎండల తీవ్రతతో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో శరీరాన్ని చల్లబరచండి -
ఇంట్లోనే ఫైవ్ స్టార్ హోటల్ రుచి.. ఘుమఘుమలాడే కొబ్బరి కొత్తిమీర చికెన్ రోస్ట్ -
బంగాళదుంపలు, గుడ్లు ఉడకబెట్టేటప్పుడు ఈ తప్పు చేస్తున్నారా? పర్ఫెక్ట్ గా ఉడికే ట్రిక్ చెప్పిన చెఫ్! -
కాలేయ ఆరోగ్యం కోసం చాణక్యుడు చెప్పిన ఈ రహస్యాలు పాటిస్తున్నారా? -
బరువు తగ్గడానికి బ్రహ్మాస్త్రం.. పరగడుపున అవిసె గింజల నీళ్లు తాగితే పొట్ట మాయం!
Valentine's Day 2024 Wishes : మీ మనసుకు నచ్చిన వారితో ఈ ప్రేమ సందేశాలను షేర్ చేసుకోండి...
Happy Valentine's Day 2024: Wishes, Messages, Quotes, Images in Telugu: ప్రేమ, ఇష్క్, ప్యార్, ప్రీతి అనే ఈ రెండు అక్షరాలు మానవుల మదిలో ఎంతో అలజడిని రేపుతుంది. మనం చరిత్రను చూస్తే..మనకు లైలా, మజ్ను, దేవదాసు, పార్వతీ, సలీమ్ అనార్కలి, రోమియో, జూలియట్ వంటి గొప్ప ప్రేమికులు కనిపిస్తారు. దీనికి కారణం ప్రేమకు ఉన్న బలం. ప్రేమలో విజయం సాధిస్తే పెళ్లిగా మారి అందరిలాగా సాధారణంగా మారుతుంది.

కానీ ప్రేమలో ఓడిపోతే అది చరిత్రగా నిలుస్తుంది. ఈ ప్రపంచంలో మనిషి యొక్క జీవితానికి సంబంధించి ప్రేమ అనేది ఉంటే అది పరిపూర్ణమవుతుంది. అయితే ప్రతి సంవత్సరం ప్రేమ గురించి ఆలోచించే జంటలు ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు.
ఈరోజున వారి భాగస్వాములకు అద్భుతమైన, మనసును హత్తుకునే సందేశాలను పంచుకుంటూ ఉంటారు. అలాంటి వాటిలో వాలెంటైన్స్ వీక్ సందర్భంగా టాప్ లవ్ కోట్స్ ను, వాట్సాప్ సందేశాలను మీ కోసం తీసుకొచ్చాం. వీటిలో మీకు నచ్చిన వాటిని ఎంపిక చేసుకుని మీకు ఎంతో ఇష్టమైన వారితో పంచుకోండి. వారిని మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో తెలియజేయండి...

తొలిసారిగా కలిశాను
‘‘దయ కలిగిన దేవుడే.. మనలను కలిపాడులే.. వరమొసిగే దేవుడికే నేనేం తిరిగివ్వాలే..
ఏదో ఇవ్వాలి కానుక.. ఎంతో వెతికాను ఆశగా..ఏది నీ సాటి రాదికా.. అంటూ కలిశాను పూర్తిగా..
కనుకే మళ్లీ మళ్లీ జన్మనెత్తి నిన్ను చేరనా..‘‘

నీ లోకంలోకి లాగావు..
‘‘ఎవ్వరి నువ్వు నన్ను కదిపావు.. నీ లోకంలోకి లాగావు..
కన్నులు మూసి తెరిచేలోగా నా ప్రాణం నువ్వు అయిపోయావు‘‘..

నన్ను వీడొద్దే..
‘‘చంపొద్దే ప్రేమా.. గుండె లోపల గాయమయ్యేలా..
నన్ను వీడొద్దే ప్రేమా నన్ను నేనులా మరచిపోయేలా..‘‘

ప్రేమే పెరుగును..
‘‘కన్నీళ్ల తీరంలో పడవల్లే నిలుచున్నా..
సుడిగుండాల శ్రుతి లయలో పిలుపే ఇస్తున్నా..
మంటలు తగిలిన పుత్తడిలో మెరుపే కలుగునులే..
ఒంటిగా తగిలిన ఇద్దరిలో ప్రేమే పెరుగునులే‘‘

ఆ నిమిషాలన్నీ..
‘‘నీతో గడిపిన ఆ నిమిషాలన్నీ నాలో పొంగిన గుండెల సవ్వడులే..
అవి చెరిగాయంటేనే నమ్మేదెట్టాగ.. నువ్వు లేకుంటే నేనంటూ ఉండనుగా‘‘

నా జీవితం నువ్వే..
‘‘మరచిపోవడానికి నువ్వు జ్ఞాపకం కాదు నా జీవితం
వదిలేయడానికి నువ్వు వస్తువు కాదు నా ప్రాణం..
పక్కన పెట్టడానికి నువ్వు పరాయి దానివి కాదు నా ఆత్మవి..
నువ్వు గుర్తు రాకుండా ఉండటానికి బొమ్మవి కాదు నా ప్రేమవి..‘‘

ప్రేమనీ ఏదీ ఆపలేదు..
‘‘ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు అమ్మో..
ఈ లవ్ అనేది బబుల్ గమ్మో.. అంటుకున్నాదంటే పోదు నమ్ము..
ముందునుంచి అందరన్న మాటే అమ్ము.. ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము.. ప్రేమనాపలేవు నన్ను నమ్ము..‘‘

మనస్ఫూర్తిగా ప్రేమిస్తే..
‘‘ఒకరిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే..
దానికి అంతరం మరణం మాత్రమే..
మనిషికి చావు తప్ప ప్రేమకు చావు లేదు‘‘

జీవితాంతం నాతోనే ఉంటే..
‘‘బంగారం నువ్వు నాతో ఒక్కసారి మాట్లాడినందుకే నాకు ఇలా ఉంటే..
నువ్వు జీవితాంతం నాతోనే ఉంటే ఇంకెంత సంతోషమో బంగారం‘‘

ప్రేమను కోల్పేతే..
‘‘శ్వాసను కోల్పోయిన వారు ఒక్కసారే చనిపోతారు. కానీ
ప్రేమను కోల్పోయిన వారు అనుక్షణం చస్తారు‘‘

నీకోసమే నిరీక్షిస్తున్నా..
‘‘నేను అనే నిజాన్ని మరిచి నువ్వు అనే అబద్ధంలో జీవిస్తున్నా..
ఇది తప్పు అని తెలిసి కూడా నీకై నే నిరీక్షిస్తున్నా..‘‘

నిన్ను ఇబ్బంది పెట్టకూడదని..
‘‘నాకు ఇష్టమైన నిన్ను కష్టపెట్టకూడదు అనుకున్నా..
అందుకే నాకు కష్టమైన నీతో మాట్లాడకుండా ఉంటున్నా‘‘

ప్రేమతో పొందేది ఏదైనా..
‘‘ప్రేమ ద్వారా పొందే ఆనందం శాశ్వతమో కాదో తెలియదు కానీ..
ప్రేమ ద్వారా పొందే దు:ఖం మాత్రం శాశ్వతం..‘‘

ప్రేమ అనేది ఏదో ఒక రోజు..
‘‘కనులు దాటిన కన్నీరు కాసేపటికి ఆగుతుంది..
నన్ను దాటిన ప్రేమ ఏదో ఒక రోజు నిన్ను చేరుతుంది‘‘

నిన్నే నిన్నే..
‘‘నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం..
నిన్నే నిన్నే వెంటాడుతుంది ప్రతి క్షణం నా మౌనం..‘‘

నిజమైన ప్రేమ అంటే..
‘‘మనం వెతికేది నిజమైన ప్రేమ కాదు..
మనల్ని వెతుక్కుంటూ వచ్చేది నిజమైన ప్రేమ‘‘

ప్రేమలో ఎలాంటి అనుభూతి అంటే..
‘‘ప్రేమలో ఓటమి, గెలుపు ఉండవు..
ఎందుకంటే అది ఆట కాదు మంచి అనుభూతి‘‘

ప్రేమ ఎక్కడుంటుందంటే..
‘‘మాట మీద లేమంటే ప్రేమలో ఉన్నామని అర్థం..
ప్రేమ ఉండేది గుండె చాటున..‘‘

ప్రేమకే సమస్తం అంకితం..
‘‘వరించే ప్రేమా నీకో వందనం..
సమస్తం నీకే చేశా అంకితం..‘‘

ప్రేమలో బంధి అయితే..
‘‘బంధించడమే ప్రేమైతే జీవితమంతా నీ ఖైదీగా ఉండిపోతా‘‘
ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 14వ తేదీన వాలెంటైన్స్ డే జరుపుకుంటారు. వాలెంటైన్ అనే వ్యక్తి తన ప్రేమ కోసం ప్రాణ త్యాగం చేశాడు. తనను స్మరించుకుంటూ ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. మన దేశంలో 1990వ దశకం నుండి వాలెంటైన్స్ డే బాగా పాపులర్ అవుతూ వస్తోంది.



Click it and Unblock the Notifications











