For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

HBDay NTR 2020 : తాతకు తగ్గ మనవడే... మల్టీ టాలెంట్ ఆ మనవడి సొంతం...

|

తాత పేరు పెట్టుకున్న నాటి నుంచి.. సినిమా రంగంలో ఆ తాతను ప్రతి ఒక్క కోణంలో ఆవహించుకుని.. అదే ఊపులో తెలుగు సినిమాల్లో తిరుగులేని ఈ తరం హీరోగా ఎదిగిన ఓ మనవడి కథ ఇది. ఒకప్పుడు ఎన్టీఆర్ వైభవాన్ని చూస్తూ పెరిగిన ప్రేక్షకుల నుండి నేటి తరం సినీ అభిమానుల వరకూ ఎన్టీఆర్ అనే మూడక్షరాల గురించి తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదేమో.

తెలుగు సినీ పరిశ్రమ ఉన్నంతవరకూ ఈ మూడక్షరాల విలువ అద్భుతం.. అమూల్యం.. అమోఘం.. ఆనాటి సీనియర్ నటనా వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ 'కూచిపూడి అయినా.. కుంగ్ ఫూ అయినా'', క్లాస్ అయినా.. మాస్ అయినా.. పాత్ర ఏదైనా.. ఘట్టం ఏదైనా తాను దిగనంత వరకే. తను ఒకసారి పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడంటే వెండితెరపై ఈలల మోత మోగాల్సిందే.. అలాంటి ఎన్టీఆర్ పుట్టినరోజు ఈరోజు(మే20) ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...

ఎన్టీఆర్ జననం..

ఎన్టీఆర్ జననం..

జూనియర్ ఎన్టీఆర్ నందమూరి హరిక్రిష్ణ, షాలిని దంపతులకు 1983 సంవత్సరం మే 20వ తేదీన హైదరాబాద్ లోని మెహదీపట్నం ప్రాంతంలో జన్మించారు. విద్యారణ్య హైస్కూల్ లో చదువుకున్నారు. ఇంటర్మీడియట్ సెయింట్ మెరీ కాలేజీలో పూర్తి చేశారు.

మల్టీ టాలెంట్..

మల్టీ టాలెంట్..

ఎన్టీఆర్ కేవలం నటనలోనే కాదు కూచిపూడి డ్యాన్స్ లో కూడా మంచి ప్రావీణ్యుడే. అంతేకాదు టివి షోలలో హోస్ట్ గా, నేపథ్య గాయకుడిగా తనకు అభిరుచి ఉన్న అన్ని రంగాలలో మల్టీ టాలెంట్ ను ప్రదర్శిస్తాడు.

సినిమాల్లోకి రాకముందు..

సినిమాల్లోకి రాకముందు..

ఎన్టీఆర్ చిన్నతనంలోనే కూచిపూడి నాట్యంలో శిక్షణ పొందాడు. అదే ఆయన నట జీవితానికి ఎంతగానో ఉపయోగపడింది. దాని ప్రభావం కారణంగానే సినిమాల్లో కూడా తన శరీర బరువు ఎంత ఉన్నా.. తాను ఎంత లావుగా ఉన్నప్పటికీ మంచి డ్యాన్స్ చేసేవాడు. అలా మంచి పేరును కూడా సంపాదించాడు.

11 ఏళ్ల వరకు...

11 ఏళ్ల వరకు...

తన చిన్ననాటి నుండి వారి కుటుంబంలో ఏర్పడిన కొన్ని అనివార్య కారణాల వల్ల సుమారు 11 ఏళ్ల వరకూ తన తాతను కలుసుకునే అవకాశం జూనియర్ ఎన్టీఆర్ కు రాలేదు.

ఓ రోజు..

ఓ రోజు..

అయితే ఒకరోజు తన మనవడిని చూడాలని ఉందంటూ స్వర్గీయ నందమూరి తారక రామారావు కబురు పంపడంతో జూనియర్ ఎన్టీఆర్, హరిక్రిష్ణ, తల్లి షాలిని ఎంతగానో సంతోషించారు. వెంటనే తాత దగ్గరికి మనవడిని తీసుకెళ్లారు.. అచ్చం తన పోలికలతో ఉన్న తన మనవడిని చూసి ఉబ్బితబ్బిబ్బయిన సీనియర్ ఎన్టీఆర్ తన మనవడినే అదే పేరునే నామకరణం చేశారు. అప్పటి నుండి జూనియర్ నందమూరి తారక రామారావుగా ప్రాచుర్యంలోకి వచ్చారు. అంతేకాదు తన నట వారసుడిగా కూడి గుర్తింపు లభించేందుకు ఎన్టీఆర్ అవకాశం కల్పించాడు.

జూనియర్ తెరంగేట్రం..

జూనియర్ తెరంగేట్రం..

1991లో ఎన్టీఆర్ బ్రహ్మర్షి విశ్వా మిత్ర సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కు భరతుడి వేషం ఇచ్చి ప్రోత్సహించారు. స్వయంగా తానే మేకప్ వేసి ఎలా నటించాలో మెళకువలు కూడా నేర్పారు. అప్పుడే జూనియర్ తెరంగేట్రం చేశారు.

బాల రాముడిగా..

బాల రాముడిగా..

ఆ తర్వాత 1996వ సంవత్సరంలో బాల రామాయణం సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ శ్రీరాముడిగా నటించారు. ఈ సినిమా ఉత్తమ బాలల చిత్రంగా బాల రామాయణం జాతీయ పురస్కారాన్నిక కూడా అందుకుంది.

యంగ్ హీరోగా..

యంగ్ హీరోగా..

ఆ తర్వాత ‘నిన్ను చూడాలని‘ సినిమాతో యంగ్ హీరోగా వెండి తెరపై తన టాలెంట్ చూపించేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఆ చిత్రం అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది.

స్టూడెంట్ లీడర్ గా..

స్టూడెంట్ లీడర్ గా..

ఆ తర్వాత 2001లో ‘స్టూడెంట్ నెంబర్-1‘గా ఎన్టీఆర్ ను తీసుకువాలని రాఘవేంద్రరావు చెప్పినప్పుడు రాజమౌళిక కాస్త నిరుత్సాహపడ్డాడట. ఎందుకంటే అప్పుడు ఎన్టీఆర్ కాస్త లావుగా ఉండేవాడు. తను తీయబోయే సినిమాకు హీరో సన్నగా, స్మార్ట్ గా ఉండాలని రాజమౌళి భావించాడట. అయితే సర్దుకుని ఆ సినిమాను తీయగా.. ఆ సినిమా వారిద్దరికీ చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవటానికి ఎంతగానో దోహదపడింది.

జక్కన్నతో హ్యట్రిక్..

జక్కన్నతో హ్యట్రిక్..

2001లో ఎన్టీఆర్ జర్నీ మొదలుపెట్టిన జక్కన్న అదే హీరోతో మరో రెండు సినిమాలను తీసి మొత్తం మూడు సినిమాలు ‘స్టూడెంట్ నెంబర్-1, సింహద్రి, యమదొంగ‘ వంటి బ్లాక్ బాస్టర్లు తీశారు.

ఇప్పుడు ఆర్ఆర్ఆర్..

ఇప్పుడు ఆర్ఆర్ఆర్..

ప్రస్తుతం మరోసారి ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా మరో ప్రతిష్టాత్మక చిత్రం ‘రౌద్రం, రణం, రుథిరం‘ పేరిట మరో భారీ చిత్రాన్ని సిద్ధం చేశారు. అయితే కరోనా కారణంగా అది వాయిదా పడిన సంగతి తెలిసిందే.

రాజమౌళికిష్టమైన నటుడిగా..

రాజమౌళికిష్టమైన నటుడిగా..

సినీ పరిశ్రమలో రాజమౌళికి అత్యంత ఇష్టమైన హీరో కూడా ఎన్టీఆరే. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రకటించారు. నటుడిగా కంటే, మంచి మనసున్న ఆత్మీయుడిగా తనకెంతో దగ్గరయ్యాడని కూడా ఓ సందర్భంలో చెప్పారు. ‘యమదొంగ‘ కోసం లావు తగ్గాలని కోరిన వెంటనే, ఎన్నో వర్కౌట్లు చేసి తన శరీర బరువును చాలా వరకు తగ్గించుకున్నారు. సినిమా అంటే తనకు అంత ప్రేమ.. అందుకే పాత్రలో పరకాయ ప్రవేశం చేయడానికి ఎంత కష్టమైన ఓర్చుకుంటారని చెప్పారు.

ఎన్నో అవార్డులు..

ఎన్నో అవార్డులు..

జూనియర్ ఎన్టీఆర్ తెలుగు సినీ పరిశ్రమలో ప్రతిభకు ఆయనను ఎన్నో అవార్డులు వరించాయి. ‘యువ కళావాహిణి, ఉత్తమ కొత్త నటుడు, ఉత్తమ నటుడిగా అనేకసార్లు, ఫిలింఫేర్ అవార్డులు, తన పాడిన పాటలకు ‘చక్రవ్యూహ‘తో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నాడు. అయితే సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా కూడా బిగ్ బాస్ రియాల్టీ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడంలో విజయవంతమయ్యారు.

రాజకీయాల్లో కూడా..

రాజకీయాల్లో కూడా..

తెలుగు వారిలో నట కుటుంబంతో పాటు రాజకీయ కుటుంబంగా ఎన్టీఆర్ కుటుంబం అవతరించిన సంగతి అందరికీ తెలిసిందే. నందమూరి వారసులు చాలా మంది ఇప్పటికీ రాజకీయాల్లో పని చేస్తూనే ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా కొద్ది రోజులు రాజకీయాల్లో పని చేశారు. అయితే ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

ప్రణతీతో వివాహం..

ప్రణతీతో వివాహం..

సినిమాల్లో ఓ వైపు వరుస హిట్లతో దూసుకెళ్తున్న సమయంలోనే ఎన్టీఆర్ ప్రణతీని వివాహం చేసుకున్నాడు. వారిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. వారి పేర్లు అభిరామ్. భార్గవ్ రామ్.

English summary

HBDay NTR : Unknown facts about actor Jr.NTR

Here we talking about unknown facts about actor jr.ntr. Read on.