Latest Updates
-
కరకరలాడే బెండకాయ భుజియా.. జిగురు లేకుండా ఈ స్నాక్ చేస్తే పిల్లలు కూడా వదిలిపెట్టరు! -
షుగర్ కంట్రోల్ కావాలంటే డైలీ ఎంత సేపు నడవాలి.. భోజనం తర్వాత ఇలా చేయాల్సిందే.! -
ఒకే ప్లేట్లో ఉగాది షడ్రుచులు.. గుమ్మడికాయ ఉల్లి కారం టేస్ట్‌కి లొట్టలేయాల్సిందే.! -
హ్యాపీ గాంధీ జయంతి 2026.. మీ బంధుమిత్రులకు పంపేందుకు బెస్ట్ శుభాకాంక్షలు, కోట్స్, వాట్సాప్ స్టేటస్ లు -
ఫ్లై దుబాయ్ ఘటన.. కాక్‌పిట్‌లో గొడ్డలి ఎందుకు ఉంటుంది, ఇద్దరు పైలట్ల నియమమేంటి.? -
కడుపులో చెత్తను తొలగించి హెల్తీగా ఉంచే కొత్తిమీర పొంగలి.. ఇడ్లీ కంటే ఈజీగా చేసేయండి.! -
సూర్య, శుక్ర, బుధ గ్రహాల కలయికతో త్రిగ్రాహి యోగం.. ఈ రాశుల వారికి లాభాల పంట పండినట్లే.! -
మైదా లేకుండా హెల్తీగా..సూపర్ టేస్టీ చీజ్ పరాఠా..ఎలా చేసుకోవాలంటే.. -
Viral Video: ఒక్క షాట్ కి ఎంత?..విదేశీ మహిళా టూరిస్ట్ ని వేధించిన కుర్రాళ్లు..వీడియో చూడండి -
శరీరంలో విటమిన్ల లోపాన్ని పోగొట్టే పచ్చి అరటికాయ పూరీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
యూఎన్ మిషన్‌కు అతిపెద్ద భారత మహిళా పీస్‌కీపర్స్ దళం, శాంతి స్థాపనకు కృషి చేయనున్న వీర వనితలు
భారత్‌కు చెందిన అతిపెద్ద మహిళా బెటాలియన్ యునైటెడ్ నేషన్స్ మిషన్‌లో భాగం కానుంది. యూనైటెడ్ నేషన్స్ ఇంటీరియమ్ సెక్యూరిటీ ఫోర్స్(UNISFA)లో భాగమైన భారత మహిళా పీస్‌కీపర్స్ ప్లాటూన్ సుడాన్‌లోని అబేయ్ ప్రాంతంలో విధులు నిర్వర్తి
భారత్‌కు చెందిన అతిపెద్ద మహిళా బెటాలియన్ యునైటెడ్ నేషన్స్ మిషన్‌లో భాగం కానుంది. యూనైటెడ్ నేషన్స్ ఇంటీరియమ్ సెక్యూరిటీ ఫోర్స్(UNISFA)లో భాగమైన భారత మహిళా పీస్‌కీపర్స్ ప్లాటూన్ సుడాన్‌లోని అబేయ్ ప్రాంతంలో విధులు నిర్వర్తించనుంది. ఇప్పటి వరకు యునైటెడ్ నేషన్స్ మిషన్స్‌లో పాల్గొన్న భారత దళాలు అన్నింటికంటే ఈ మహిళా దళమే పెద్దది కావడం విశేషం.

సుడాన్‌లోని అబేయ్ ప్రావిన్స్‌లో విధులు నిర్వర్తించడం సవాలుతో కూడుకుని ఉంటుంది. అబేయ్ ప్రావిన్స్‌లో ఈ మధ్యే హింస చెలరేగింది. దీని వల్ల వేలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం ఏదో ఒక దుశ్చర్య అక్కడ జరుగుతూనే ఉంది. అలాంటి ప్రాంతంలో ఇప్పుడు భారత మహిళా దళాలు విధులు నిర్వర్తించనున్నాయి. అక్కడ శాంతి స్థాపనకు కృషి చేయనున్నారు మన ధీర వనితలు. ప్రస్తుతం యూఎన్ మిషన్‌లో పాల్గొంటున్న భారత మహిళా దళనంలో ఇద్దరు ఆఫీసర్లు ఉంటారు. మరో 25 మంది ఇతర ర్యాంక్‌ల వాళ్లు ఉంటారు.
గతంలో 2007లో లిబేరియాలో భారత మహిళా దళం పని చేసింది. లిబేరియాలో ఆ మహిళా దళం 24 గంటల పాటు గార్డు డ్యూటీ చేసింది. లిబేరియా రాజధాని మోన్‌రోవియాలో రాత్రి పూట పెట్రోలింగ్ విధులు నిర్వర్తించారు మన సైనికులు.
ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ ఈ మేరకు ట్వీట్ చేశారు. యూఎన్ మిషన్‌లో పాల్గొననున్న బెటాలియన్ చిత్రాన్ని ఆమె పోస్టు చేశారు. యూఎన్ మిషన్‌కు మా బెటాలియన్‌లో భాగంగా భారత్ మహిళా దళాన్ని పంపుతోంది. ఇటీవలి సంవత్సరాల్లో మొత్తం మహిళలతో కూడిన అతిపెద్ద పీస్‌కీపర్స్ దళం ఇదేనంటూ ఆమె ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక మిషన్‌కు రెండో అతిపెద్ద సైన్యాన్ని పంపింది భారతే. 1948 నుండి ఇప్పటి వరకు యునైటెడ్ నేషన్స్ 71 పీస్‌కీపింగ్ మిషన్లు నిర్వహించింది. అందులో 49 మిషన్లలో భారత్ పాల్గొంది. మొత్తం 2 లక్షలకు పైగా సైనికుల్ని భారత్ యూఎన్‌లో మిషన్‌లో భాగం చేసింది. యూఎన్ పీస్‌కీపింగ్ ప్రోగ్రామ్‌కు భారతీయ మహిళల్ని పంపే సాంప్రదాయం 1960 నుండి ఉంది. పీస్‌కీపింగ్ మిషన్‌లో భారతీయ మహిళలకు ప్రత్యేక స్థానం ఉంది. డాక్టర్ కిరణ్ బేడీ, మేజర్ సుమన్ గవాని, శక్తి దేవి లాంటి వాళ్లు యూఎన్ పీస్‌కీపింగ్‌లో పని చేశారు.
కాంగో, సౌత్ సుడాన్‌లోని భారత బృందాలు అట్టడుగు స్థాయికి వెళ్లి మహిళలను, పిల్లలను సామాజిక అభివృద్ధి ప్రాజెక్టులలోకి తీసుకురావడంలో అద్భుతంగా పనిచేశాయి. పీస్‌కీపర్స్‌గా వెళ్తున్న భారత సైనికులు అన్ని రకాల పనులు చేస్తారు. పౌరులను రక్షించడం, శాంతి స్థాపనకు కృషిచేయడం సహా ఇతర పనులు కూడా నిర్వహిస్తారు. భారతీయ ఇంజినీర్లు ఎరిట్రియా, ఇథియోపియాలో యూఎన్ మిషన్‌లో భాగంగా రోడ్లను పునరుద్ధరించే పనులు చేశారు. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో సహా ప్రపంచవ్యాప్తంగా జరిగిన మిషన్లలో భారతీయ వైద్యులు స్థానికులకు వైద్య సాయం అందించారు.



Click it and Unblock the Notifications
