Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయా? పీరియడ్స్ సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
మే 2026 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం.. మీ అదృష్టం ఎలా ఉందంటే! -
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రిసెప్షన్: తారల సందడితో హోరెత్తుతున్న వేదిక.. ఫోటోలు వైరల్! -
వైశాఖ పౌర్ణమి వేళ సిద్ధి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
కరకరలాడే క్యాబేజీ టిక్కీలు..క్యాబేజీ వద్దు అన్నవాళ్లే ప్లేట్లు ఖాళీ చేస్తారు -
ఇంట్లో బ్రెడ్ మిగిలిపోయిందా? అయితే పడేయకుండా ఇలా రుచికరమైన బ్రెడ్ ఉప్మా చేసేయండి! -
ఎండల దెబ్బకు మారుతున్న పెళ్లిళ్ల ముహూర్తాలు.. అసలు ఏం జరుగుతోంది? -
చంద్రుని రాశి మార్పు: వృశ్చికంలోకి చంద్రుడు.. ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం! -
బుద్ధ పూర్ణిమ రోజున ఈ పనులు చేస్తున్నారా? మీ ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరియాలంటే ఇవి తప్పనిసరి! -
వృషభం, తుల, కుంభ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. భారీ లాభాలు! - శుక్రవారం, 01 మే 2026
Shradda Kapoor: సాహో భామ ‘శ్రద్ధా‘ కపూర్ గురించి ఈ సీక్రెట్స్ తెలిస్తే మీరు షాకైపోతారు...!
సాహో హీరోయిన్ శ్రద్ధా కపూర్ పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలసుకుందాం.
మీ అందరికీ సాహో భామ శ్రద్ధా కపూర్ గుర్తుంది కదా... అదేనండి తెలుగులో మన రెబల్ స్టార్ ప్రభాస్ తో తొలిసారిగా నటించింది కదా.. ఆ అందాల ముద్దుగుమ్మ పుట్టినరోజు ఈరోజు. తన అందం... అభినయంతో అందరినీ ఆకట్టుకున్న ఈ భామ మల్టీ టాలెంటెడ్ అని అతి కొద్ది మందికే తెలుసు.

బాలీవుడ్ లో అతి తక్కువ కాలంలోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించిన హీరోయిన్లలో శ్రద్ధా కపూర్ ఒకరు. సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాటి నుండి సింగర్, యాక్టర్, డ్యాన్సర్ గా ఈమె మల్టీ రోల్స్ ప్లే చేస్తోంది. అందుకే బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఈమె ఒక వెలుగు వెలుగుతోంది. మార్చి 3వ తేదీ ఈ బాలీవుడ్ హీరోయిన్ పుట్టినరోజు సందర్భంగా ఈమె గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...

ముంబైలో జననం..
శ్రద్ధా కపూర్ 1987 సంవత్సరం మార్చి 3వ తేదీన ముంబైలో జన్మించింది. శక్తి కపూర్, శివాంగి కొల్లాపూరి దంపతులకు శ్రద్ధా దాస్ జన్మించారు. తన తండ్రి కూడా ఓ నటుడే. శ్రద్ధా కపూర్ కు ఓ అన్నయ్య ఉన్నాడు.

రెండు భాషలు
తల్లిదండ్రులు రెండు వేర్వేరు రాష్ట్రాలకు చెందిన వారు. ఒకరు మహారాష్ట్రకు చెందిన వారైతే.. మరొకరు పంజాబీకి చెందిన వారు. అంతేకాదు ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కూడా శ్రద్ధా కపూర్ బంధువు అవుతారంట.

లతా మంగేష్కర్ మనవరాలు..
శ్రద్ధా కపూర్ తాతయ్య.. లతా మంగేష్కర్ కజిన్ అవుతారంట. కాబట్టి లతా మంగేష్కర్ కు శ్రద్ధా కపూర్ మనవరాలు వరస అవుతుంది.

ఎనిమిదో ఏట నుండే..
సినిమా నేపథ్యం ఉన్న శ్రద్ధా కపూర్ తను ఎనిమిదో ఏట నుండే సినిమా షూటింగులకు వెళ్తుండేదట. అక్కడ డైరెక్టర్ డేవిడ్ ధావన్ అబ్బాయి వరుణ్ ధావన్ తో కలిసి ఆడుకునేదట.

వరుణ్, శ్రద్ధా ఒకే స్కూల్లో..
అంతే కాదు శ్రద్ధా కపూర్, హీరో వరుణ్ ధావన్ లు ఇద్దరూ కలిసి చిన్నప్పుడే ఒకే పాఠశాలలో చదువుకున్నారట. అలా ఓ రోజు కలిసి బయటకు వెళ్తారట.

చదువులో ఫస్ట్..
శ్రద్ధా కపూర్ తన ప్రాథమిక విద్యను జర్మా బాయి పాఠఃశాలలో పూర్తి చేసింది. ఆ తర్వాత అమెరికన్ స్కూల్ ఆఫ్ ముంబైలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. తను చదువులో కూడా చాలా మంచి టాపరే. ఇంటర్ లో తనకు ఏకంగా 95 శాతం మార్కులు వచ్చాయంటే తన టాలెంట్ ఏంటో తెలుస్తుంది.

స్పోర్ట్స్ లోనూ..
శ్రద్ధా కపూర్ చదువుతో పాటు క్రీడలపైనే ఎక్కువ శ్రద్ధ చూపేదట. హ్యాండ్ బాల్, ఫుట్ బాల్ వంటి ఆటలను ఎక్కువగా ఆడేదట.

16వ ఏట నాటకం..
శ్రద్ధా కపూర్ తన పదహారేళ్ల వయసులో ఓ నాటకం వేసిందట. ఆ సమయంలో ఆమె నటనను చూసిన సల్మాన్ ఖాన్ ఆమెకు సినిమాల్లో అవకాశం ఇస్తానంటే సున్నితంగా దాన్ని తిరస్కరించిందట. తన చదువు పూర్తయిన తర్వాతే సినిమాల్లో ఎంట్రీ ఇస్తానని చెప్పిందట.

తీన్ పతితో ఎంట్రీ...
అమెరికాలోని ఓ యూనివర్సిటీలో ఫిజియాలజీ చేస్తున్న ఆమె 2010లో సెలవుల సందర్భంగా ఇండియాకు వచ్చిందట. అయితే ఆమె ఫేస్ బుక్ ప్రొఫైల్ ను చూసిన తీన్ పతి డైరెక్టర్ ఆమెను షూటింగ్ నిమిత్తం సంప్రదించారట. హాలీడేస్ కావడంతో నటించేందుకు శ్రద్ధ ఒప్పుకుందట. అలా తీన్ పతి సినిమాతో తెరంగేట్రం చేసింది ఈ భామ

నటనకు మంచి మార్కులు..
ఆ సినిమా అంతగా ఆడకపోయినప్పటికీ శ్రద్ధా కపూర్ నటనకు మంచి మార్కులే వచ్చాయి. అప్పటి నుండి బాలీవుడ్ లో ఆమెకు అవకాశాలు అనేకంగా వచ్చాయి.

ఆషికీ-2
తన రెండో సినిమా ఆషికీ-2లో ఆదిత్య రాయ్ తో కలిసి నటించిన శ్రద్ధా కపూర్ ఆ తర్వాత అస్సలు వెనుదిరిగి చూసుకోలేదు. ఈ సినిమాలో ఆమె నటనకు అద్భుతమైన స్పందన వచ్చింది. దీంతో ఈమె భారీగా గుర్తింపు వచ్చింది.

తొలిసారిగా ప్రభాస్ తో..
అలా స్టార్ డమ్ సంపాదించుకున్న ఈ భామ తొలిసారిగా సాహోలో ప్రభాస్ సరసన తెలుగులో సందడి చేసింది. ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించింది.

శ్రద్ధాకు ఇష్టమైనవి..
శ్రద్ధా కపూర్ కు షూస్ అంటే చాలా ఇష్టమట. ఈ ముద్దుగుమ్మ ఎక్కడికి వెళ్లినా షూస్ తప్పనిసరిగా ఉండాల్సిందేనట. అలాగే తను ఖాళీ సమయాల్లో పుస్తకాలను చదువుతుందట.

ఫిష్ కర్రీ ఎక్కువగా..
శ్రద్ధా కపూర్ కు ఫిష్ క్రరీ ఎంతగానో ఇష్టమట. అందులో రవ్వ ఫిష్ అంటే చాలా ఇష్టమట.

ఇష్టమైన ప్రదేశం..
శ్రద్ధా కపూర్ కు అత్యంత ఇష్టమైన ప్రదేశం ప్యారిస్ అంట.

పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్..
శ్రద్ధా కపూర్ లాక్మే, వీట్ తో మరి కొన్ని సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతోంది. బాలీవుడ్ ప్రకటనలకు సంబంధించి ఈ భామ మంచి ఆదాయాన్నే అర్జిస్తోందట.

హాట్ నటిగా...
శ్రద్ధా కపూర్ భారతదేశంలోనే అత్యంత ప్రముఖులలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎఫ్ హెచ్ ఎం ఇంటర్ ఎడిషన్ నిర్వహించిన సర్వేలో ప్రపంచంలోనే అత్యంత హాట్ నటీమణుల్లో శ్రద్ధా టాప్-5లో నిలిచారట. అంతేకాదు గూగుల్ సెర్చ్ ప్రముఖుల పోల్ లోనూ టాప్ 2 గా కొన్నిరోజులు కొనసాగారట.

పది మిలియన్లకు పైగా ఫాలోయర్స్..
శ్రద్ధా కపూర్ తన ఇన్ స్టాగ్రామ్ లో పది మిలియన్లకు పైగా ఫాలోయర్లతో టాప్-3లో నిలిచింది.

రోహన్ తో పెళ్లి?
తన చిన్ననాటి స్నేహితుడు రోహన్ తో 2020 అంటే ఈ ఏడాదిలోనే పెళ్లి చేసుకోనున్నట్లు సమాచారం. వీరిద్దరి పెళ్లికి వీరి కుటుంబం కూడా ఒకే చెప్పినట్లు తెలిసింది.
శ్రద్ధా కపూర్ 1987 సంవత్సరం మార్చి 3వ తేదీన ముంబైలో జన్మించింది. శక్తి కపూర్, శివాంగి కొల్లాపూరి దంపతులకు శ్రద్ధా దాస్ జన్మించారు. తన తండ్రి కూడా ఓ నటుడే. శ్రద్ధా కపూర్ కు ఓ అన్నయ్య ఉన్నాడు. అంతేకాదు తను ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కు మనవరాలు అవుతారట.



Click it and Unblock the Notifications