International Daughters day 2023:డాటర్స్ డేను ఎందుకు జరుపుకుంటారో తెలుసా...

International Daughters day 2023 మన దేశంలో ఆడపిల్లలను ధనలక్ష్మీగా భావిస్తారు. కూతురు(Daughter) పుట్టిందంటే చాలు సాక్షాత్తూ లక్ష్మీ దేవి తమ ఇంట అడుగుపెట్టిందని ఆనందంగా ఫీలవుతుంటారు.

International Daughters day 2021 Date, History, Why we celebrate and Significance in Telugu

అంతేకాదు వారి ఇంటికి ఎంతో వెలుగొచ్చినట్టు చాలా మంది భావిస్తారు. అయితే ఒకప్పుడు మాత్రం ఆడపిల్ల పుట్టిందంటే చాలా భారంగా భావించేవారు. ఇప్పటికీ కొన్నిచోట్ల ఇలాంటి భావనలో కొందరు ఉండటం బాధాకరం. అయితే ఎవరైనా పొరపాటున ఆడపిల్ల భారమని భావిస్తే మాత్రం ఈ ప్రపంచమే ఉండదు. ఎందుకంటే 'వినాస్త్రీయ జననం నాస్తి, వినాస్త్రీయ గమనం నాస్తి, వినాస్త్రీయ జీవం నాస్తి, వినాస్త్రీయ సృష్టి ఏవన్నాస్తి' అంటే స్త్రీ లేకపోతే జననం లేదు.. స్త్రీ లేకపోతే గమనం లేదు.. స్త్రీ లేకపోతే జీవం లేదు.. స్త్రీ లేకపోతే అసలు ఈ సృష్టే లేదు. అలాంటి ఈ సృష్టికి మూలం స్త్రీ.

International Daughters day 2021 Date, History, Why we celebrate and Significance in Telugu

ఏ ఇంట్లో అయినా కూతురంటే తల్లికి ప్రతిరూపం. ప్రతి ఒక్క తల్లి మనల్ని కంటికి రెప్పలా ఎలా కాపాడుతుందో.. కూతుర్ని కూడా అంతే ప్రేమతో చూసుకోవాలి. మన ఇళ్లలో ఎంత మంది మగపిల్లలు ఉన్నప్పటికీ.. ఒక్క కూతురు ఉంటే చాలు.. ఆ కళే వేరుగా ఉంటుంది. సాధారణంగా అమ్మాయిల కోసం.. ప్రత్యేకంగా ఓ రోజంటూ ఏర్పాటు చేసుకుని, దాన్ని వేడుకగా జరుపుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే ప్రతిరోజూ ఆడవారిదే.. వారితో ఆనందం... ఇంటిల్లిపాది సంతోషం.

International Daughters day 2021 Date, History, Why we celebrate and Significance in Telugu

అయితే అమ్మాయిల ప్రాధాన్యాన్ని వివరించే ఈ రోజును సెలబ్రేట్ చేసుకోవడం.. వారి స్థాయిని మరింత పెంచడమే అవుతుంది. కాబట్టి వారికి తగిన గౌరవాన్ని అందించడంతో పాటు తనకు అందించాల్సిన ప్రేమను అందిస్తామని ప్రమాణం చేస్తూ ఈ డాటర్స్ డేను జరుపుకుంటారు. ఈ సందర్భంగా డాటర్స్ డే ఎప్పుడొచ్చింది? కూతుళ్ల దినోత్సవాన్ని ఎందుకని ప్రత్యేకంగా జరుపుకుంటారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

సమానమైన సంతోషం..

సమానమైన సంతోషం..

మన దేశంలో ఒకప్పుడు కూతుళ్ల కంటే కొడుకులకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. అలాంటి పరిస్థితులు మారాలని.. ఆడపిల్లలకు సైతం సమానమైన ప్రేమ, సంతోషం పంచాలని కోరకుంటూ జరుపుకునే రోజే ఇంటర్నేషనల్ డాటర్స్ డే. మీ కూతురు ఎంత విలువైన వ్యక్తో తెలియజేసే ప్రత్యేకమైన రోజు ఇది. ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ మాసంలో చివరి ఆదివారం రోజున ఇంటర్నేషనల్ డాటర్స్ డే జరుపుకుంటారు. ఈ నెల 26వ తేదీన కూతుళ్ల దినోత్సవ వేడుకలు జరగనున్నాయి.

మగాళ్లను కనే యంత్రాల్లా..

మగాళ్లను కనే యంత్రాల్లా..

ఒకప్పుడు అమ్మాయిలు అంటే కేవలం మగపిల్లలకు కనే యంత్రాల్లాగా భావించేవారు. ఇది అమ్మాయిల్లో ఆత్మన్యూనతను పెరిగేలా చేస్తుంది. అంతేకాదు మగాళ్లు చేసే పనులను వారు చేయలేరని.. వారిని చిన్నచూపు చూసేలా చేస్తుంది. అంతేకాదు.. అమ్మాయిల జనాభాను తగ్గించడంతో పాటు లింగ వివక్షకూ, భ్రూణ హత్యలకు కారణమైంది.

ఆడపిల్లల్లో ధైర్యం..

ఆడపిల్లల్లో ధైర్యం..

అయితే ఈ సమస్య కేవలం ఒక్క భారతదేశంలోనే కాదు.. ప్రపంచంలోని అనేక దేశాల్లో కూడా ఉండేది. అందుకే ఆడపిల్లల్లో ఇలాంటి వాటికి వ్యతిరేకంగా ఆత్మస్థైర్యాన్ని పెంచేందుకు.. అమ్మాయిలు అబ్బాయిల కంటే ఏ మాత్రం తక్కువ కాదని తెలిపేందుకు.. కూతుళ్లు కూడా కుమారుల కంటే ఏ మాత్రం తక్కువ కాదని తెలిపేందుకు.. మగవారితో సమానమని అందరూ గుర్తించేలా చేయాలని చెబుతూ కొన్ని దేశాలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

వరంలా భావించి..

వరంలా భావించి..

ఏది ఏమైనప్పటికీ... మీ జీవితంలోకి అడుగుపెట్టిన మీ చిట్టి తల్లిని.. మీరు ఓ వరంలా భావిస్తే.. మీరు కూడా డాటర్స్ డేని సెలబ్రేట్ చేసుకోవచ్చు. సాధారణంగా ఆడపిల్లల కోసం.. ఓ రోజంటూ ఏర్పాటు చేసుకుని దాన్ని సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతిరోజూ ఆడపిల్లలదే. వాళ్లతోనే ఆనందం.. వారి వల్లే ఇళ్లలో సంతోషం ఉంటుందని ప్రతి ఒక్కరూ గుర్తించాలి.

వారి స్థాయిని పెంచడం..

వారి స్థాయిని పెంచడం..

అమ్మాయిల ప్రాధాన్యాన్ని వివరించే ఈరోజును సెలబ్రేట్ చేసుకోవడం.. వారి స్థాయిని మరింత పెంచడమే అవుతుంది. వారికి తగిన గౌరవాన్ని ఇవ్వడంతో పాటు వారికి అందించాల్సిన ప్రేమను అందిస్తామని ప్రమాణ చేస్తూ డాటర్స్ డే(సెప్టెంబర్ 67వ తేదీన) సెలబ్రేషన్స్ ను ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఆడపిల్ల గురించి ప్రపంచానికి చాటి చెప్పే ప్రత్యేకమైన రోజు కూతుళ్ల దినోత్సవం (Daughters Day). ఒక కొడుకు తల్లిలాగా.. ఓ సోదరిలాగా.. తండ్రికి నీడలా.. తల్లికి తోడుగా.. అన్నదమ్ములకు అండగా ఉండే చిన్నారి తల్లికి ప్రేమను పంచడంతో పాటు.. పురిట్లోనే ఆ పిల్లను చిదిమేసే కొందరికి.. ఆమె లేకుంటే లోకమే లేదని చెప్పడమే ఈరోజు యొక్క ప్రత్యేకం. ఇలాంటి గొప్పదనం ఉన్న రోజును ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నాలుగో ఆదివారం నాడు 'డాటర్స్ డే'గా జరుపుకుంటున్నారు.

ఈ సందర్భంగా బోల్డ్ స్కై తెలుగు తరపున ఆడపిల్లలందరికీ 'డాటర్స్ డే శుభాకాంక్షలు'...

FAQs
ఇంటర్నేషనల్ డాటర్స్ డే ను ఎప్పుడు జరుపుకుంటారు?

ప్రతి సంవత్సరం సెప్టెంబర్ మాసంలో నాలుగో ఆదివారం అంటే 2021లో సెప్టెంబర్ 26వ తేదీన ఇంటర్నేషనల్ డాటర్స్ డే జరుపుకోనున్నారు.

BoldSky Lifestyle

Desktop Bottom Promotion