Latest Updates
-
ఆలూ పరోటాకి మించిన రుచితో ఉల్లి పరోటా.. బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ డైట్ ఫుడ్ ! -
భోజనం చేసిన వెంటనే కడుపు నొప్పిగా ఉంటుందా.?.. ఈ వ్యాధులకు సంకేతం కావచ్చు.! -
ఆషాఢం బల్కంపేటలో వైభవం.. నేడు ఘనంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం.. ‘జలదుర్గ’ విశేషాలివే.! -
వక్ర గతిలోకి శని గ్రహం.. ఈ నెల 28 వరకు ఈ 3 రాశుల వారికి కష్టాలు తప్పవు.! -
అద్భుతమైన విందు భోజనం కావాలా? అయితే ఈ కోకనట్ మిల్క్ మటన్ పులావ్ ట్రై చేయాల్సిందే -
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల -
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.? -
తెలంగాణలో ఘనంగా బోనాల వేడుకలు.. ఆధ్యాత్మిక రహస్యం, చరిత్ర ఇదే.! -
మదురై స్పెషల్ మటన్ దోశ.. ఇలా చేస్తే జన్మలో ఆ రుచిని మర్చిపోలేరు!
International Day of the Midwife: ప్రసూతి సహాయకుల సేవలు ఎంత విలువైనవో తెలుసా...
ఈరోజు ప్రపంచ ప్రసూతి సహాయకుల దినోత్సవం సందర్భంగా వారి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...
ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా ప్రతి ఒక్కరూ ఎంతగా ఆందోళన చెందుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మహమ్మారి దెబ్బకు ఇప్పటికే దాదాపు వెయ్యి మందికి పైగా మన దేశంలో మరణాలు సంభవించాయని గణాంకాలు చెబుతున్నాయి. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. తల్లి కడుపులోనే బిడ్డ చనిపోవడం.. ఒకవేళ పుట్టినా కూడా కేవలం కొన్ని రోజుల్లోనే శిశువు మరణించడం లేదా నెలలు నిండకుండానే శిశువు జన్మించడం వంటి వాటి గురించి మనం నిత్యం ఎక్కడో ఒక చోట వింటూనే ఉంటాం. దీనంతటికీ కారణమేంటో తెలుసా. గర్భం వచ్చిన మహిళకు సరైన సమయంలో సరైన చికిత్స అందకపోవడం.

అయితే మన దేశంలో ఎన్ని ఆసుప్రతులు ఉన్నా.. ఎంతమంది డాక్టర్లు ఉన్నా చాలా మంది గర్భిణులకు సరైన సమయానికి చికిత్సను అందించలేకపోతున్నారు. దీని వల్ల తల్లీబిడ్డల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోంది.

అయితే ఇలాంటి సమయంలో ప్రసూతి సహాయకులు అన్ని చోట్లా అందరికీ అందుబాటులో ఉంటే మాత్రం మనం ఎందరో ప్రాణాలను కాపాడొచ్చు అంటున్నారు నిపుణులు. ఇంతకీ వీరి గురించి ఈరోజు ప్రస్తావన ఎందుకొచ్చిందంటే... ఈరోజు ప్రసూతి సహాయకుల దినోత్సవం(మే 5వ తేదీ). ఈ సందర్భంగా వీరి సేవల గురించి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...

ఓ అధ్యయనం ప్రకారం..
మన దేశంలో ఓ అధ్యయనం ప్రకారం ప్రతి తొమ్మిది నిమిషాలకు ఓ గర్భిణి మహిళ మరణిస్తోందట. అంతేకాదు ప్రతి ముప్పై సెకన్లకు ఒక శిశువు కూడా తల్లి కడుపులో చనిపోవడమో లేదా పుట్టిన వెంటనే చనిపోవడమో జరుగుతుందట.

ఇతర కారణాలు కూడా..
ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 27 లక్షల మందికి పైగా గర్భవతులు మరియు నవజాత శిశువులు ఇతర కారణాల వల్ల మరణిస్తున్నారని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా కొందరు శిశువులు పుట్టిన నెలరోజుల్లోపై చనిపోతున్నారట. అయితే మన దేశంలో కూడా ఈ సంఖ్య దాదాపు లక్షల వరకు ఉండటం విచారకరం.

ప్రసూతి సహాయకులుంటే..
ఇలాంటి మరణాలు సంభవించకుండా ఉండాలంటే మనం ప్రతిచోటా ప్రసూతి సహాయకులను అందుబాటులో ఉంచితే వీరిలో చాలా వరకు మరణాలను తగ్గించవచ్చని.. తల్లీబిడ్డలు సురక్షితంగా ఉండేందుకు ఎక్కువ అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

పిల్లలు పుట్టే సమయంలో..
గర్భిణులకు పిల్లలు పుట్టే సమయంలో ప్రసూతి సహాయకులు గనుక అందుబాటులో ఉంటే ఒక్క మన దేశంలోనే దాదాపు 56 శాతం మంది గర్భిణులు మరియు నవజాత శిశువుల మరణాలను తగ్గించే అవకాశం ఉందట. అంతేకాదు వారికి మెరుగైన వైద్యం అందించేందుకు వారే చర్యలు తీసుకుంటారట.

ఒక్కో గర్భిణి బాధ్యతను..
ప్రసూతి సహాయకులు ఉన్న చోట ఒక్కో గర్భిణి బాధ్యతను వారు గనుక తీసుకుంటే తల్లీకి, బిడ్డకు ఇద్దరికీ చాలా మంచిగా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. డాక్టర్లు ఒక్కరే కాదు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO)వారు కూడా ఇదే విషయమే చెబుతున్నారు.

మంచి నైపుణ్యం ఉన్న వారిని...
అందుకే మనం ఇప్పటినుంచి మంచి నైపుణ్యం ఉన్న ప్రసూతి సహాయకులను తయారు చేసుకోవాలి. అలాంటి సమయంలోనే తల్లులకు, నవజాతశిశువులకు పూర్తి సంరక్షణ ఉంటుంది.

అందరికీ అవగాహన...
ఈ విషయాల గురించి ప్రపంచంలో ప్రతి ఒక్కరికి వీరి సేవల గురించి తెలియజేసేందుకు.. ప్రసూతి సహాయకులపై అవగాహన కల్పించేందుకే మే 5వ తేదీన ప్రసూతి సహాయకుల దినోత్సవంగా పాటిస్తున్నారు.



Click it and Unblock the Notifications