Latest Updates
-
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి!
International Left Hander's day 2021: ఎడమ చేతివాటం వారికి ఆ లక్షణాలుంటాయా?
ఎడమ చేతి వాటం వారికి ఉండే ప్రత్యేక లక్షణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మన జీవితంలో ప్రతిరోజూ చాలా మంది ఎడమచేతి వాటం కలిగిన వ్యక్తులను కలుస్తుంటాం.. వారి చర్యలను చూసి కొన్నిసార్లు ఆశ్చర్యపోతుంటాం కూడా. ఎందుకంటే వారు తమ రోజువారీ కార్యకలాపాలన్నింటికీ చాలా వరకు ఎడమ చేతినే వాడతారు. ముఖ్యంగా కొందరు కుడి చేత్తో రాయడం.. క్రికెట్లో బౌలింగుకు మాత్రం ఎడమ చేతిని ఉపయోగిస్తుంటారు.

ఇలా ఎడమ చేతి వాటం ఉన్న వారు కుడి చేతి వాటం కలిగిన వారి కంటే భిన్నంగా ఉంటారు. మొత్తం ప్రపంచ జనాభాలో 10 శాతం మంది వరకు ఎడమ చేతి వాటం కలిగిన ప్రజలు ఉన్నారు. ఇలాంటి లక్షణాలున్న వారిపై అనేక పరిశోధనలు జరిగాయి. కొంతమంది లెఫ్ట్ హ్యాండర్స్ పుట్టిన వెంటనే వారికి వారసత్వంగా ఆ అలవాటు వచ్చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఎడమ చేతి వాటం కలిగిన ప్రజల వ్యక్తిత్వాలు అర్థం చేసుకోవడానికి కొన్ని పరిశోధనలు జరిగాయి. ఇందులో వీరు చాలా తెలివైనవారని తేలింది. వీరు కుడి చేతి వాటం కలిగిన వారి కంటే వేగంగా, సులభంగా పనులు పూర్తి చేయగలుగుతారు. అందుకే ఎడమ చేతి వాటం కలిగిన వారి కోసం ఒక ప్రత్యేక రోజును కేటాయించారు. అదే ఆగస్టు 13వ తేదీ. ప్రతి ఏటా ఈరోజు ఇంటర్నేషన్ లెఫ్ట్ హ్యాండర్స్ డే నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఎడమచేతి వాటం కలిగిన అందరికంటే తెలివిగా ఉండేందుకు కొన్ని ఆసక్తికరమైన కారణాలు అన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

ఎడమ చేతి వాటం ఎందుకంటే..
కొందరికి ఎడమచేతి వాటం అనేది జన్యువులు, పరిసరాల ప్రభావం కారణంగా వస్తుంది. LRRTM1 జన్యువు తండ్రి నుండి శిశువుకి సంక్రమిస్తే ఈ లక్షణం వచ్చేస్తుంది. శిశువు గర్భంలో ఉన్నప్పుడు తల్లి శరీరంలో ఉండే టెస్టోస్టీరాన్ అనే హార్మోన్ స్థాయిపై కూడా ఆధారపడి ఉంటుంది. ఇదే కాకుండా, శిశువు పెరుగుతున్న వాతావరణం, చుట్టుపక్కల పరిస్థితులు కూడా ఎడమ చేతి వాటాన్ని ప్రదర్శించేందుకు దోహదం చేస్తాయి.

ప్రధాని మోడీతో పాటు ఎందరో ప్రముఖులు..
మన ప్రపంచంలోని ఎందరు ప్రముఖులు ఎడమ చేతి వాటం కలిగి ఉన్నారు. ప్రస్తుత మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఎడమ చేతితోనే రాస్తారు. చరిత్రను పరిశీలిస్తే.. వీరనారీమణి ఝాన్సీ లక్ష్మీబాయి కూడా ఎడమ చేతి వాటం కలిగిన వారే. అంతేందుకు మన బాపుజీ కూడా ఎడమ చేతితోనే ఎక్కువ పనులు చేసేవారు. ఇంటర్నేషనల్ సెలబ్రెటీల్లో అమెరికా మాజీ ప్రెసిడెంట్ ఒబమా, బిల్ క్లింటన్, ఇంగ్లాండ్ రాజ వంశస్థులు ప్రిన్స్ ఛార్లెస్, క్రికెటర్ యువరాజ్ సింగ్ ఇలా ఎందరో ప్రముఖులు ఉన్నారు.

2009లో లెఫ్ట్ హ్యాండ్ క్లబ్..
మన దేశంలో ఎడమ చేతి వాటం వారి కోసం ఓ క్లబ్ కూడా ఏర్పాటైంది. వారి పట్ల సామాన్య ప్రజల్లో ఉండే అపొహలను తొలగించే ఉద్దేశ్యంతో సందీప్ విష్ణోయ్ 2009లో ఈ క్లబ్ ను ప్రారంభించారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ఈ క్లబ్ కి దేశవ్యాప్తంగా శాఖలు ఉన్నాయి. గత ఏడాదిలో లెఫ్ట్ హ్యాండర్స్ ఆధ్వర్యంలో లెఫ్ట్ హ్యాండర్స్ మ్యూజియం కూడా ప్రారంభించారు. గోవాలో ప్రారంభించిన ఈ మ్యూజియంలో ప్రముఖ లెఫ్ట్ హ్యాండర్స్ విగ్రహాలను తయారు చేయించి ఏర్పాటు చేశారు.

నాయకత్వ లక్షణాలు ఎక్కువ..
ఎడమచేతి వాటం ఉన్న వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇందుకు ఉదాహరణగా అమెరికా అధ్యక్షులలో మొత్తం 66 శాతం మంది ఎడమచేతి వాటం ఉన్నవారిని గమనించొచ్చు. ఇది ఆశ్చర్యకరంగా అనిపించినప్పటికీ బిల్ క్లింటన్, రోనాల్డ్ రీగన్ మరియు బుష్ వంటి వారంతా ఎడమ చేతి వాటం కలిగిన వారే. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశానికి చాలా మంది అధ్యక్షులు లెఫ్ట్ హ్యాండర్లే. దీన్ని బట్టి ఎడమ చేతి వాటం ఉన్న వారందరికీ గొప్ప నాయకత్వ స్ఫూర్తి ఉందని మనం కచ్చితంగా చెప్పొచ్చు.

మెమొరీ పవర్ ఎక్కువ..
ఎడమ చేతి వాటం ఉన్న వారిలో సాధారణం కంటే ఎక్కువ మెమొరీ పవర్ ఉంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే వీరిలో ఓ లోపం కూడా ఉంది. ఈ లక్షణాలుండే వ్యక్తులు కొన్ని చిన్న విషయాలను కూడా సులభంగా మరచిపోగలరు.

వేగంగా..సులభంగా..
ఎడమ చేతి వాటం కలిగిన వారు కుడి చేతి వాటం ఉన్న వారి కంటే వేగంగా మరియు సులభంగా పనులను పూర్తి చేస్తారు. వీరు మంచి టెక్నిక్స్ కూడా ఉపయోగిస్తారు. ఈ విషయాన్ని కూడా పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి. వీరు కష్టమైన పనిని కూడా చాలా సులభంగా చేస్తారు. చాలా తక్కువ సమయంలో అన్నింటినీ ఫినీష్ చేస్తారు.

గొప్ప మేధావులు
చరిత్రను పరిశీలిస్తే.. మనం ఇప్పటివరకు చదివిన, చదువుతున్న గొప్ప పండితులు, శాస్త్రవేత్తలు కొందరు ఎడమచేతి వాటం వారే. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, ఐజాక్ న్యూటన్, మేరీ క్యూరీ, అరిస్టాటిల్, అలాన్ ట్యూరింగ్ వీరితో పాటు ఇంకా ఎంతో మందిని ఉదాహరణలుగా చెప్పొచ్చు. అయితే, ఈ అలవాటు ఉన్న వారందరూ గొప్ప మేధావులు కాలేరు.

ఎక్కువగా సంపాదన..
ఎడమ చేతి వాటం ఉన్న ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశం కూడా ఉందని కొన్ని అధ్యయనాలు నిర్ధారించాయి. అయితే ఇది మహిళలకు వర్తించదట. వీరికి సృజనాత్మకత కూడా బోలెడంత ఉంటుందట. వీరి మెదడు ఎల్లప్పుడూ చురుకుగా ఉంటుంది.
ఇంటర్నేషనల్ లెఫ్ట్ హ్యాండర్స్ డే సందర్భంగా లైఫ్ట్ హ్యాండర్స్ అందరికీ బోల్డ్ స్కై తెలుగు తరపున శుభాకాంక్షలు..



Click it and Unblock the Notifications











