Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
ఉమెన్స్ డే 2023: ఈ భూమి మీద అత్యంత శక్తిమంతురాలు ‘ఆమె‘నే.. ఆమె తర్వాతే ఎవరైనా...
నేటి సమాజంలో అంతా ఆధునికమని చెబుతున్నప్పటికీ, ఒక మహిళ తన లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఏటికీ ఎదురీదాల్సిందే. ఆమె ప్రయాణంలో శారీరకంగా, మానసికంగా, లైంగికంగా ఎదురయ్యే వేధింపులు మానసికంగా మహిళలను కుంగిపోయేలా చ
మహిళల్లో ఎంతో శక్తి దాగి ఉంది. వారు ఎంతటి శక్తిమంతులో తెలుసుకోవడానికి చరిత్రను ఓసారి తిరగేసి చూడండి. ఎంతో మంది మహిళలు ధైర్యసాహసాలకు ప్రతిరూపాలుగా కూడా నిలిచారు. రాణి రుద్రమదేవి నుండి కిరణ్ బేడీ వరకు ఎందరో శక్తిమంతమైన మహిళలు మనకు నాటి నుండి నేటి వరకు చాలా మందే కనిపిస్తారు.

అంతవరకు ఎందుకు మహిళల శక్తి గురించి తెలుసుకోవాలంటే చరిత్రనే తిరగేసి చూడాల్సిన అవసరం లేదు. మన చుట్టూ ఉన్న ఆడవాళ్లని చూస్తే చాలు. అటు ఇంటిని.. ఇటు ఆఫీసుని.. పిల్లల బాధ్యతను ఒంటిచేత్తో మ్యానేజ్ చేస్తుంటారు. అసలు ఇన్ని పనులు చేయాలంటే చాలా సామర్థ్యం ఉండాలి. ఎంతో శక్తిమంతులై ఉండాలి. అలాంటి మహిళలందరికీ మనం ఒక్కసారైనా అభినందించాల్సిందే. అందుకోసమే వారికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనే ఒక ప్రత్యేక రోజు కూడా ఉంది. మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 'ఆమె'కు మనసారా శుభాకాంక్షలు తెలపండి...

ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని..
మన దేశంలోనూ ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. వారు చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తున్నారు. అయితే ఇప్పటికీ మహిళలు ప్రయాణం విషయంలో మాత్రం చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు. స్వతంత్య్రంగా వ్యవహరిస్తోన్న మహిళలను చూసి అపహాస్యం చేస్తున్నారు. అవహేళన కూడా చేస్తున్నారు. అలాంటి అవాంతరాలన్నింటినీ ఎదుర్కొని తన గమ్యాన్ని చేరుకుంటోంది మహిళ.

ఏదైనా సాధించగలరు...
మహిళలు తలచుకుంటే ఏ పని అయినా అవలీలగా సాధించగలరు. ఎందుకంటే వారికి ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎంతటి క్లిష్టమైన పరిస్థితి ఎదురైనా వారి గుండె చాలా నిబ్బరంతో ఉంటారు. అయితే వారు సున్నితమైన మనసు కలవారు అని కూడా మనం గుర్తించాలి. ఎందుకంటే ఆమె లేనిదే ఈ జీవితమే లేదు.

మహిళ శక్తిని తెలుసుకోవాలంటే..
మహిళల శక్తిని తెలుసుకోవాలంటే మనం ఎక్కడెక్కడో పరిశోధన చేయాల్సిన అవసరం లేదు. పుస్తకాలు చదవాల్సిన అవసరం అసలే రాదు. మీరు మీ ఇంట్లో అమ్మను గమనిస్తే చాలు. ఉదయం నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఇంటిని ఎలా చక్కబెట్టుకోవాలో ఆమెకు బాగా తెలుస్తుంది.

ఇంటిల్లిపాదికి అవసరమైనవన్నీ...
ఆమె ఏ సమయానికి ఏ పని చేయాలో అదే చేస్తుంది. ఎవరికి ఏమి అందించాలో అదే అందిస్తుంది. ఇంటిల్లిపాదికీ అవసరమైనవన్నీ తనే దగ్గరుండి చూసుకుంటుంది. ఇంట్లో ఏమున్నాయో.. ఏమి లేవో ఆమెకు తెలిసినంతలా ఇంకెవరికీ తెలియదంటే ఎలాంటి అతిశయోక్తి కాదు. అయినా కూడా చాలా మంది ఆమెను ఇప్పటికీ కొంతమంది చులకనగా చూస్తారు. ఆమె శ్రమను తక్కువ చేసి మాట్లాడతారు.

నేటి తరం మహిళలు..
ఇక నేటి తరం మహిళలైతే ఇటు ఇంటిని.. అటు ఆఫీసు బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తున్నారు. ఎందుకంటే వారు ప్రతి పనినీ చాలా బాధ్యతాయుతంగా పూర్తి చేస్తారు. ప్రతి పనిని ప్రేమగా చేస్తారు. వీరు ఆర్థిక పరంగా కూడా ముందుచూపుతో ఉంటారు.

ఇప్పటికి చిన్నచూపే..!
21వ శతాబ్దంలోనూ కొన్నిచోట్ల ప్రతి విషయంలోనూ మహిళలను చిన్నచూపు చూస్తున్నారు. మహిళలకు సరైన ప్రోత్సాహం లేక వారి శక్తి సామర్థ్యాలు నిరుపయోగంగా మారిపోతున్నాయి. ఇప్పటికైనా వారి ప్రతిభను గుర్తించి వారికి అనువైన వాతావరణాన్ని కల్పిస్తే.. మరింత ప్రగతిని సాధిస్తారు. సాధికారత దిశగా వడివడిగా అడుగులేస్తారు.

ఉప్పెనలా దూసుకెళ్తూ..
నేటి సమాజంలో అంతా ఆధునికమని చెబుతున్నప్పటికీ, ఒక మహిళ తన లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఏటికీ ఎదురీదాల్సిందే. ఆమె ప్రయాణంలో శారీరకంగా, మానసికంగా, లైంగికంగా ఎదురయ్యే వేధింపులు మానసికంగా మహిళలను కుంగిపోయేలా చేస్తాయి. అయితే వాటన్నింటినీ ఎదుర్కోవడానికి ఎప్పటికప్పుడు ధైర్యాన్ని, శక్తిని కూడదీసుకొని ముందుకు దూసుకెళ్తూ ఉంటారు.

తన రక్తమాంసాలతోనే..
ఆమె రక్తమాంసాలతోనే ఈ ప్రపంచం అంతా నడుస్తోంది. ఇక ముందు కూడా నడుస్తుంది. అలాంటి ఆడవారిని అవమానించడం అంటే మిమ్మల్ని మీరు అవమానించుకోవడమే. మీకు జన్మనిచ్చిన తల్లిని కూడా అవమానించేనట్లే అని గ్రహించాలి.



Click it and Unblock the Notifications
