For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇలాంటి ఆలోచనలుంటే మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా..

|

ఒక్క ఆలోచన.. ఒక్క మంచి నిర్ణయం వల్ల మన జీవితాలే అద్భుతంగా మారిపోతాయి. మన స్థాయిని సైతం అమాంతం పెంచుతాయి. కానీ అదే సమయంలో అహేతుకమైన ఆలోచనలు మన జీవితంపై చాలా ప్రభావితం చూపుతాయి. మన జీవితాలను చిన్నాభిన్నం చేస్తాయి. అందుకే అహేతుకమైన ఆలోచనలకు చాలా దూరంగా ఉండాలి. మీరు పెరిగిన లేదా పెరిగే వాతావరణం మరియు మీ చుట్టుపక్కల ప్రజలను బట్టి మీ ఆలోచనలు ఉంటాయి. అది కూడా మీ మీద చాలా ప్రభావం చూపుతుంది. అందువల్ల కొన్నిసార్లు మీరు అహేతుక ఆలోచనలను కలిగి ఉంటారు. ఇది చాలా ఒత్తిడికి దారి తీస్తుంది. అంతేకాదు అభద్రతకు సైతం దారి తీస్తుంది. ఇలాంటి సందర్భాలలో మీరు అహేతుకమైన ఆలోచనలను ఎలా అధిగమించాలో తెలుసుకునేందుకు కిందకు స్క్రోల్ చేయండి.. పూర్తి వివరాలు తెలుసుకోండి..

1) మీలో ఏముందో గ్రహించాలి..

1) మీలో ఏముందో గ్రహించాలి..

ప్రజలు చెప్పే విషయాల పట్ల వారి అవగాహన మరియు దృక్పథం అని అర్థం చేసుకోవాలి. అదంతా నూటికి నూరుపాళ్లు సత్యం కాదు. ప్రజలు మీ గురించి తమ అభిప్రాయాన్ని పంచుకున్నప్పుడు, మిమ్మల్ని ‘మంచి‘ లేదా ‘చెడు‘ లేదా అద్వానంగా తీర్పు చెప్పారనుకొండి. ఉదాహరణకు ‘మీరు దేనికీ పనికిరారు‘ అని అన్నారనుకోండి ఇది ఆ వ్యక్తి యొక్క మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. అప్పటి నుండి తమను తాము తక్కువ అంచనా వేయడం ప్రారంభిస్తారు. కానీ ఇలాంటి సమయాల్లోనే మీ చుట్టూ ఏమి జరిగినా, తప్పులు చేయడం సరైందేనని మీరు భావించాలి. మిమ్మల్ని మీరు పనికిరాని వారుగా భావించడం వంటివి మానేయాలి. ‘మీ వెనుక ఏముంది.. మీ ముందు ఏముంది అనేది వదిలేసి మీలో ఏముంది‘ అనే దానిని గ్రహించాలి.

2. ఎటువంటి రిస్క్ తీసుకోకపోవడం..

2. ఎటువంటి రిస్క్ తీసుకోకపోవడం..

చాలా మంది వారి జీవితంలో ఎలాంటి రిస్క్ తీసుకోకూడదని ఆలోచిస్తుంటారు. ఇలా చాలా ప్రమాదకరం. అలా అని మీరు అన్నింటికీ రిస్క్ చేయాల్సిన అవసరం లేదు. కానీ మీరు భయపడే వాటికి లేదా సవాలు చేసే విషయాలను అయినా కనీసం ప్రయత్నించడం అత్యంత అవసరం. కొన్ని విషయాల్లో మీరు రెండు ఎంపికల మధ్య ఎన్నుకోవాలి. మీరు ఎప్పుడు కంఫర్ట్ జోన్ నే కోరుకుంటే మీరు ఆశించిన ఫలితాలను ఎప్పటికీ పొందలేకపోవచ్చు. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు వీలైనంత ఎక్కువగా నేర్చుకోవడం మరియు ముందుకు సాగడం వంటివి చేయాలి.

3. మీరు తప్పులు చేసి ఉండొచ్చు..

3. మీరు తప్పులు చేసి ఉండొచ్చు..

మానవ జీవితంలో ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు తప్పులు చేస్తుంటారు. తప్పులు చేయడం మానవ సహజం. అలా అని చేసిన తప్పును మరోసారి రిపీట్ కాకుండా చూసుకోవాలి. అంతేకానీ తప్పు చేశామని దాని గురించే ఆలోచించుకుంటూ టైం వేస్ట్ చెయ్యకూడదు. అది మీ జీవితంపై చాలా ప్రభావం చూపుతుంది.

4) ప్రతికూల ఆలోచనలు చేయొద్దు..

4) ప్రతికూల ఆలోచనలు చేయొద్దు..

మన అంచనాలకు అనుగుణంగా పరిస్థితులు ఉన్నప్పుడు, మనకు సుఖంగా మరియు సంతోషంగా అనిపిస్తుంది. కానీ ప్రస్తుతానికి సమస్యలేమీ రావడం లేదు. అదే సమయంలో కొంతమంది తమ ఆనందాన్ని కోల్పోవడానికి చలా భయపడతారు. వారు సంతోషంగా ఉన్న సమయాన్ని సరిగ్గా ఆనందించలేరు. అందుకే భవిష్యత్తు గురించి ఎక్కువగా చింతించకుండా మరియు ప్రతికూలమైన ఆలోచనలు చేయకుండా, అనుకూలమైన ఆలోచనలు చేసే అటువంటి క్షణాల్లోనే గడపాలి.

5) అంతులేని ఒడిదుడుకులు..

5) అంతులేని ఒడిదుడుకులు..

మీరు మీ జీవితం గురించి ఏమి అనుకుంటూ ఉంటారో అది వాస్తవానికి చాలా భిన్నంగా ఉండొచ్చు. అప్పుడు నిజంగా చాలా కష్టమైన పరిస్థితులుగా అనిపిస్తాయి. అంతులేని ఒడిదుడుకులు ఏర్పడతాయి. కానీ అలాంటి సమయంలో ఏడుస్తూ కూర్చుంటే మీ పనులు ముందుకు సాగవు. అందుకే మీరు కూడా విభిన్నంగా ఆలోచించాలి. అప్పుడే మీ జీవితం ముందుకు సాగుతుంది.

6) ధ్రువీకరణ కోరడం..

6) ధ్రువీకరణ కోరడం..

మనం చేసే కొన్ని పనుల్లో కొన్నిసార్లు ప్రజల ధ్రువీకరణ కోసం ప్రయత్నించాలి. వారి ధ్రువీకరణ కోరడం కేవలం కొన్ని సమయాల్లో మాత్రమే మంచిగా ఉంటుంది. ప్రతిసారీ అదే పనిగా వారి ధ్రువీకరణ కోసం ప్రయత్నించడం మంచిది కాదు. ఇది మీపై మీకు నమ్మకాన్ని తగ్గిస్తుంది. మీరు నిర్ణయం తీసుకోవడానికి అసమర్థులు అని మీకు తెలియజేస్తుంది.

7) నేర్చుకునేందుకు ప్రయత్నించాలి..

7) నేర్చుకునేందుకు ప్రయత్నించాలి..

మనం ఏదైనా తప్పు చేస్తే దాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అలా ఎందుకు జరిగిందని ముందు ఆలోచించాలి. ఏదైనా పొరపాటు చేసినప్పుడు, దాని నుండి కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి. ఈ రకంగా మెరుగుపడేందుకు మీకు అవకాశం లభిస్తుంది. అలా కాకుండా మీరు మీ తప్పుల నుండి ఏమి నేర్చుకోకపోతే అవివేకిగా మిగిలిపోతారు.

8) సెల్ఫ్ కేర్..

8) సెల్ఫ్ కేర్..

సెల్ఫ్ కేర్ అనేది ఎప్పుడూ స్వార్థం కాదు. ఇతరుల నుండి మీకు ఎలాంటి ముప్పు లేదా ఆపద కలగకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం అన్నమాట. అప్పుడు మాత్రమే మీరు మీ చుట్టూ ప్రేమ మరియు ఆనందాన్ని అందరికీ పంచగలరు. మీరు ఏమి కోరుకుంటున్నారో ప్రజలకు ముఖ్యం కాదు. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అనేది మీకు ముఖ్యం.

9) నేను విజయవంతం కావాలి..

9) నేను విజయవంతం కావాలి..

నేను విజయవంతం కావాలి అనుకున్నప్పుడే ప్రజలు మిమ్మల్ని ఇష్టపడతారు. మీ విజయాన్ని ఇష్టపడని వ్యక్తుల నుండి మీరు దూరంగా ఉండండి. ఎందుకంటే ప్రతి ఒక్కరినీ మెప్పించడం అసాధ్యం. అందువల్ల, మీ వైఫల్యం మరియు విజయం ఏది ఉన్నా మీ స్వభావానికి అనుగుణంగా ఉండండి. అన్ని సమయాల్లో అందరినీ సంతోషపెట్టడానికి మనం ఉత్తమ వ్యక్తులమే అని మీకు మీరే అనుకోవాలి.

అహేతుక ఆలోచనలతో కాకుండా మంచి జ్ఞాపకాలతో, ఆనందమైన జీవితాన్ని గడపడానికి ఈ చిట్కాలు మీకు సహాయపడతాయని మేము ఆశిస్తున్నాము!

Read more about: insync life
English summary

Irrational Thoughts You Need To Get Rid Off Immediately

One of the biggest risk that a person can take in their life is by not taking any risk at all. It is not that you have to risk everything, but essential that you try things that you are scared of or are challenging. At times, you have to choose between two options and maybe you have to step out of your comfort zone.Always you might not get the desired result, but the important thing is to learn and move forward.
Story first published: Monday, September 23, 2019, 15:49 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more